Psalms - కీర్తనల గ్రంథము 110 | View All

1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
మత్తయి 22:44, మార్కు 12:36, మార్కు 16:19, లూకా 20:42-43, లూకా 22:69, అపో. కార్యములు 2:34-35, రోమీయులకు 8:34, 1 కోరింథీయులకు 15:25, ఎఫెసీయులకు 1:20, కొలొస్సయులకు 3:1, హెబ్రీయులకు 1:3-13, హెబ్రీయులకు 8:1, హెబ్రీయులకు 10:12-13, హెబ్రీయులకు 12:2, 1 పేతురు 3:22

2. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
మత్తయి 26:64, మార్కు 14:62

3. యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
యోహాను 12:34, హెబ్రీయులకు 5:6-10, హెబ్రీయులకు 6:20, హెబ్రీయులకు 7:11-15, హెబ్రీయులకు 7:17-28

5. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
ప్రకటన గ్రంథం 6:17

6. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశము మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
మత్తయి 25:31-34

7. మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-110. ఇది శాశ్వతమైన మెస్సీయ రాచరికాన్నీ, ఆయన యాజకత్వాన్నీ, దుర్మార్గులను ఆయన సంపూర్ణంగా నాశనం చేయడాన్నీ, ఈ భూమి మీద ఆయన పరిపాలననూ వర్ణించే కీర్తన. 

110:1-7 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఈ కీర్తన పదే పదే యేసుక్రీస్తును గూర్చి స్పష్టంగా ప్రవచిస్తుంది (అపొ.కా. 2:34-35; 1కొరింథీ 15:25; ఎఫెసీ 1:20; కొలస్సీ 8:1; హెబ్రీ 1:3-4; 7:17,20-22; 1పేతురు 3:22). యేసు తన దైవత్వాన్ని చెప్పడానికి వ.1 ని తనకు అన్వయించుకొన్నాడు (మత్తయి 22:44), క్రీస్తు రాచరికాన్ని నొక్కి చెప్పడానికి పేతురు వ.1 ని ప్రస్తావించాడు (అపొ.కా.2:33-35; 5:30-31; రోమా 8:34; హెబ్రీ 10:12-13లతో పోల్చండి). దేవుడు క్రీస్తును శాశ్వతమైన యాజకునిగా చేశాడని నిరూపించడానికి హెబ్రీ 5:6; 6:20-7:28లో వ.4 ఎత్తి చెప్పబడింది. ఈ కీర్తన దావీదువంశానికి వర్తించేదైనప్పటికీ, ఇది మెస్సీయలో తప్ప మరెవరిలోనూ సంపూర్ణంగా నెరవేరలేదు.

110:1 దేవుడైన యెహోవా (ప్రభువు) దావీదు వంశంలోని రాజును తాను నియమించిన తన ప్రతినిధిగా ప్రకటిస్తున్నాడు. కుడి పార్శ్వమునఅనే పదజాలం బలాన్ని, ఘనతను, ఆధికత్యను సూచిస్తుంది. (45:9). దేవుని ప్రతినిధిగా ప్రజల్ని పరిపాలించే రాజుకు ఆ అధికారం దేవుడిచ్చినదే (80:17,18 నోట్సు చూడండి; హెబ్రీ 1:2-4 తో పోల్చండి). నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు అనే భావప్రకటన రాజు విజయపరంపరను, వినయసూచకంగా అందరూ తలలు వంచి రాజుకు లోబడడాన్ని తెలియజేస్తుంది (యెహో 10:24).

110:2 పరిపాలన దండమును... సాగజేయు అంటే దేశంమీద ఒకరి అధికారాన్ని స్థాపించడమని అర్థం. యూదా యెహోవా రాజదండము అని ఆది 49:10 తెలియజేస్తున్నది. ఇది దేవుని ద్వారా పొందిన రాజ్యా ధికారానికి అలంకారిక దృష్టాంతపదం. 

10:3 కీర్తనలు గ్రంథమంతటిలో ఈ వచనం మిక్కిలి గూఢత గలిగినది. ఈ వచనంలోని మొదటి పంక్తి- యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు అక్షరాలా ఇదే అర్థాన్నిస్తున్నది. (ప్రజలు తమంతట తాముగా స్వేచ్ఛార్పణల్ని తెస్తారు). కొందరు వ్యాఖ్యానకారులు పరిశుద్దాలంకృతులై (హెబ్రీ. బెహ“ భోదేష్ ) అనే పదానికి “పరిశుద్ధ పర్వతముల మీదకు” (హెబ్రీ. బెహద్రే ఖోదేష్ ) అనే పదాన్ని సవరణగా జోడించి చెబుతుంటారు. అరుణోదయ గర్భములో నుండి అనే మాటలు యెహోవా కోసం యుద్ధం చేయడానికి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందోనని మిక్కిలి బలవంతులైన యౌవనులు ఆతృతతో ఎదురు చూడడాన్ని సూచిస్తాయి. ఈ యౌవనులు రాజు వంశం లోనివారు. కాబట్టి వారు యెహోవాకు చెందినవారు. 

110.4 మెల్కీసెదెకు ప్రస్తావన ఆది 14:17-24 లోనిది. రాజు యాజకధర్మం నిర్వర్తించడమనే భావన అసాధారణమేదైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా అసాధారణమైన పరిస్థితుల్లో రాజులు యాజకవిధులు నిర్వహించారు. దావీదు వంశం నిత్యమైన వంశంగా (శాశ్వతమైనదిగా) ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు (2 సమూ 7:14-17; కీర్తన 89:29 చూడండి), దావీదువంశజుడు, దేవుని కుమారుడునైన యేసు క్రీస్తు నిరంతరము "రాజుగా, యాజకునిగా ఉన్నాడు (హెబ్రీ 7:17,20-22).

110:5-6 కుడిపార్శ్వమందుండి అనే పదం సంరక్షణను సూచిస్తుంది. యెహోవా దుష్టులైన రాజులను శిక్షించి. (యెహె : 32:5; 35:8), అన్యజనులకు... తీర్పు తీర్చుతాడు (యెషయా 42:1-7). 

110:7 రాజును పట్టాభిషిక్తుని చేసే ప్రక్రియలో భాగంగా రాజుచేత గిహోను నీటి ఊటలోని నీటిని త్రాగించే లాంఛనాన్ని మార్గమున ఏటి నీళ్లు పానము చేసి అనే పదజాలం సూచిస్తుండవచ్చు (1రాజులు 1:38), లేక శత్రువును తరిమికొట్టి జయం పొందే ప్రయత్నంలో ఏటి దగ్గర ఆగి నీళ్లు త్రాగి సేదతీర్చుకొనడాన్ని సూచిస్తుండవచ్చు (న్యాయాధి 8:4). ఆయన తల యెత్తును - 27:6 చూడండి... 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |