Matthew - మత్తయి సువార్త 27 | View All

1. ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును,ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి

2. ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.

3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

4. నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

5. అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.

6. ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.

7. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.

8. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.

9. అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

10. వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
యిర్మియా 32:6-9, జెకర్యా 11:12-13

11. యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను

12. ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
యెషయా 53:7

13. కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను.

14. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
యెషయా 53:7

15. జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.

16. ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.

17. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

18. విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను

19. అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము

20. ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

21. అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

22. అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారినడుగగా సిలువవేయుమని అందరును చెప్పిరి.

23. అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కా ర్యము చేసెనని అడుగగా వారుసిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

24. పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనిఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 21:6-9, కీర్తనల గ్రంథము 26:6

25. అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
యెహెఙ్కేలు 33:5

26. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

27. అప్పుడు అధిపతియొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసికొనిపోయి, ఆయనయొద్ద సైనికుల నందరిని సమకూర్చిరి.

28. వారు ఆయన వస్త్రములు తీసి వేసి, ఆయనకు ఎఱ్ఱని అంగీ తొడిగించి

29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

30. ఆయన మీద ఉమ్మివేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.
యెషయా 50:6

31. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి,సిలువ వేయుటకు ఆయనను తీసికొని పోయిరి.

32. వారు వెళ్లుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువమోయుటకు అతనిని బలవంతము చేసిరి.

33. వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి

34. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
కీర్తనల గ్రంథము 69:21, కీర్తనల గ్రంథము 69:26

35. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
కీర్తనల గ్రంథము 22:18

36. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి.

37. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

38. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
యెషయా 53:12, కీర్తనల గ్రంథము 69:21

39. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
కీర్తనల గ్రంథము 22:7, కీర్తనల గ్రంథము 109:25, విలాపవాక్యములు 2:15

40. దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి

41. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు

42. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము.

43. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి.
కీర్తనల గ్రంథము 22:8

44. ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.

45. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
ఆమోసు 8:9

46. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
కీర్తనల గ్రంథము 22:1

47. అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

48. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

49. తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.

50. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను;
నిర్గమకాండము 26:31-35

52. సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
యెహెఙ్కేలు 37:12

53. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
యెహెఙ్కేలు 37:12

54. శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.

55. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.

56. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.

57. యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
ద్వితీయోపదేశకాండము 21:22-23

58. పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
ద్వితీయోపదేశకాండము 21:22-23

59. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి

60. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

61. మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.

62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధానయాజకులును పరిసయ్యులును పిలాతు నొద్దకు కూడివచ్చి

63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.

64. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి.

65. అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను.

66. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రముచేసిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
27:1-2 ఈ పెందలకడ సమయంలో మహాసభ కూడుకోవడం, గతరాత్రి జరిగిన చట్టవిరుద్ధమైన విచారణలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశించబడింది. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, న్యాయాధిపతులు పెద్ద పెద్ద విచారణలను వెలుతురు ఉండగానే ఆరంభించి, ముగించాలి. విశ్రాంతి దినమున విచారణలు నిర్వహించడాన్ని కూడా ధర్మశాస్త్రం నిషేధించింది. యూదుల నాయకులు యేసును చంపడానికి కావలసిన రోమీయుల ఆమోదాన్ని తీసుకోవ డానికి పన్నాగం చేయాల్సివుంది. పొంతి పిలాతు క్రీ.శ. 26-36 కాలంలో యూదయకు ముఖ్య పాలనాధికారి. అధిపతి అనే బిరుదు (గ్రీకు. "హెగెమోన్") లాటిన్ బిరుదైన “ముఖ్యపాలనా అధికారి" అనే పేరుకు అంగీకరింపదగిన తర్జుమా, జోసీఫస్ కూడా పిలాతు కోసం అదే మాటను వాడాడు. 

27:3-4 నిరపరాధ రక్తమును అప్పగించడం దేవుని శాపాన్ని పొందే బహు ఘోరమైన పాపం (ద్వితీ 27:25). ప్రధాన యాజకులు, పెద్దల ప్రతిస్పందన, యేసు నిరపరాధి అని వారు గుర్తించినట్లు చూపుతుంది. 

27:5 నేరస్తులు శిక్ష పొందినపుడు, దేవునినుండి ప్రాయశ్చిత్తం పొందుతారని కొందరు యూదులు నమ్మేవారు. తాను చేసిన నేరం ఎంత భయంకరమైనదో యూదా గుర్తించినప్పుడు అతడు అపరాధభావనతో, బహుశా ప్రాయశ్చిత్తం పొందుతాననే ఆశతో, తన జీవితానికి ముగింపు పలికాడు. కానీ ప్రాయశ్చిత్తం తెచ్చే ఒకే ఒక్క మరణం: యేసు క్రీస్తు మరణం.

27:6-8 మత్తయి తన సువార్తను క్రీ.శ. 70లో జరిగిన యెరూషలేము నాశనానికి ముందు రాశాడని వ.8 సూచిస్తుంది. అలా పూర్తిగా నాశనమైన యెరూషలేములో, దశాబ్దాల తర్వాత, ఒక సమాధి స్థలం ఉందని దాని పేరుతో కనుగొని, గుర్తించడానికి అవకాశమే లేదు. 

27:9-10 మత్తయి పా.ని.కు నివేదించడం, జెకర్యా 11:12-13; యిర్మీయా 32:6-9లోని అంశాలను కలగలుపుతుంది. ఇశ్రాయేలీయులు తమ ఆధ్యాత్మిక కాపరిని తృణీకరించడం, వారు ఆయనను తక్కువ అంచనా వేయడం (ముప్పది వెండి నాణములు, బానిస వెల; నిర్గమ 21:32), రోమీయులచేతిలో యెరూషలేము ధ్వంసం చేయబడడం వంటి విషయాలను మొదటి లేఖనం వివరిస్తుంది. బబులోనీయులు ఇశ్రాయేలును ధ్వంసం చేసిన తర్వాత, అది తిరిగి పునరుద్ధరించబడుతుందనే నిశ్చయతను రెండవ లేఖనం ఇస్తుంది. ఈ రెండు ప్రవచనాలు కేవలం యూదా చేసిన పనికి సంబంధమున్న సంఘటనలను మాత్రమే ప్రవచించడం లేదు. ఈ రెండు లేఖనాలను కలిపితే, మెస్సీయను యెరూషలేము తృణీకరించడంవల్ల దాని నాశనం జరుగుతుందనీ, కానీ దేవుడు తగినకాలంలో పట్టణాన్ని పునరుద్ధరిస్తాడనీ మత్తయి చూపుతున్నాడు. 

27:11-14 రోమీయుల చట్టం ప్రకారం, తనను తాను సమర్ధించుకోవడానికి మాట్లాడడానికి నిరాకరించడం అంటే, తప్పును ఒప్పుకుంటున్నట్లే. తనపై ఆరోపణలు చేసేవారి యెదుట యేసు మౌనంగా ఉండడం, యెషయా 53:7ను జ్ఞాపకం చేస్తుంది. 

27:15 పస్కా పండుగ సమయంలో ఒక ఖయిదీని విడిపించే ఆచారం ఒక యూదు ప్రాచీన గ్రంథం ద్వారా నిర్ధారించబడింది. (“చెరసాల నుండి గొట్టిపిల్లను వధింపవచ్చు").

27:16-18 బరబ్బా ఒక తిరుగుబాటుదారుడు, హంతకుడు అని మార్కు 15:7 వర్ణిస్తుంది. కొన్ని మత్తయి సువార్త ప్రాచీన ప్రతులు, ఆది సంఘంలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు, బరబ్బా పూర్తి పేరు యేసు బర్ అబ్బాస్ (అతడు ఒక పేరుపొందిన బోధకుని కుమారుడు. (“రబ్బా కుమారుడు”) అని సూచిస్తుంది) అని పేర్కొన్నారు. ఆ విధంగా, పిలాతు ఒక బోధకుని కుమారుడైన యేసు, దేవుని కుమారుడైన యేసు ల మధ్య ఒకరిని ఎంచుకోమని అవకాశమిచ్చినట్లు స్పష్టమౌతుంది. 

27:19 దేవతలు తమతో కలలలో మాట్లాడుతారని గ్రీకులు, రోమీయులు నమ్మేవారు. 

27:20-25 యూదా (వ.3-5), పిలాతు (వ.24) ఇద్దరూ యేసు మరణానికి తాము బాధ్యత వహించాలని భయపడ్డారు. కానీ ప్రజలు ఆ బాధ్యతను సంతోషంగా తీసుకున్నారు. ఇలా స్వయంగా ఒప్పుకున్న అపరాధానికి శిక్షగానే యెరూషలేము నాశనం అయిందని తరువాతి కాలంలోని అనేకమంది క్రైస్తవులు తలంచారు. పిలాతు చేసిన పని నిరపరాధియైన యేసును సిలువ వేసిన అపరాధం నుండి అతనిని విమోచించలేదు (అపొ.కా.4:27 చూడండి).

27:26 రోమీయులు కొరడా దెబ్బలకు, గ్రీకులో ఫ్లాగెల్లెం అనే హింసించే పరికరాన్ని వాడేవారు- వారులతో ఉన్న ఒక తోలు కొరడా, దాని ప్రతి వారు చివర పదునైన ఇనపముక్కలు లేక ఎముకముక్కలు అతికించబడి వుండేవి. యూదుల సమాజమందిరంలో 39 దెబ్బలకే కొరడా దెబ్బల శిక్ష పరిమితమయ్యేది. కానీ రోమీయుల కొరడాదెబ్బల శిక్షకు పరిమితి ఉండేది కాదు. ఇలా దెబ్బలు తిన్నవారు ఫ్లాగెల్లెం ద్వారా చర్మం ఒలిచివేయబడినట్లుగా లేక ఎముకలన్నీ బయటకు కనిపించేటట్లుగా అయిపోయేవారని ప్రాచీన రచయితలు వర్ణించారు.

27:27-31 నకిలీ అంగీ... కిరీటము, దండములతో సైనికులు, యేసు తాను మెస్సీయను అన్నందుకు ఎగతాళి చేశారు.

27:32 సిలువ శిక్షపొందినవారు సాధారణంగా సిలువ వేయబడే చోటికి సిలువను (గ్రీకు. "పాటిబులుం"- అడ్డుకర్ర) మోసేవారు. ఎక్కువ రక్తం కోల్పోయిన యేసు దాన్ని పట్టణపు ప్రాకారం దాటి మోయడానికి శక్తిలేనివాడ య్యాడు. సైనికులు కురేనీయుడైన సీమోను అనేవానిని (5:41 నోట్సు చూడండి) మిగిలిన దూరం సిలువను మోయడానికి బలవంతం చేశారు. సీమోను కుమారులు తరువాత సంఘ చరిత్రలో పేరుగాంచారు (మార్కు 15:21). సీమోను యేసు శిష్యుడుగా మారాడని ఇది సూచిస్తుంది. కురేనే ఉత్తర ఆఫ్రికాలోని మధ్యధరా తీరప్రాంత సమీపంలో ఉంది. సీమోను బహుశా యూదుడు కావడం వలన పస్కా పండుగకోసం యెరూషలేమును దర్శించడానికి వచ్చివుంటాడు (అపొ.కా. 6:9). 

27:33-34 ఈ ద్రాక్షారసము సిలువవేయబడే బాధను తగ్గించడానికో లేక మరణం త్వరగా వచ్చేటట్లుగానో ఉద్దేశించబడింది. దానిని యేసు త్రాగనొల్లకపోవడం, సిలువ వేదనను ఆయన పూర్తిగా భరించడానికి నిశ్చయించుకున్నాడని చూపుతుంది.


27:35-36 సిలువవేయబడడం అనేది చాలా భయంకరమైన, హింసాత్మ, కంగా జరిగే శిక్ష. బాధితులను దిగంబరులుగా చేసి, వారిని సిలువకు తాళ్ళతో లేక మేకులతో కొట్టి బంధించేవారు (యోహాను 20:25). బాధితులు కొన్ని రోజులపాటు సజీవులుగా ఉండే అవకాశం ఉండేది. వారు మరణించిన తర్వాత కుక్కలు, పక్షులు లేక పురుగులు వారిని తినివేసేవి. సిలువ శిక్షను “అన్నిరకాల మరణంకంటే అత్యంత దారుణమైన మరణం" అని జోసీఫస్ రాశాడు. సిలువవేయడం రోమా పౌరులను ఎంత భయపెట్టేసిందంటే, వారు సిలువ అనే మాట పలకడానికి కూడా భయపడేవారు అని అంటాడు సీసెరో (క్రీ.పూ.106-43)

27:37 నేరస్తుడు. మరణానికి నడిచివెళ్తుండగా, అతని మెడచుట్టూ టిటులస్ అనే చెక్క పలక తరచు వారి మెడలో వేసేవారు. దానిపై
అతడు సిలువవేయబడడానికి కారణం రాసేవారు. యేసు గొల్గొతా వద్దకు వచ్చినపుడు, ఆ పలకను ఆయన తలకు పైగా దిగగొట్టారు. రోమావారి సిలువలు కొన్నిసార్లు X లా లేక T లా ఉండేవి. కానీ యేసు సిలువపై ఈ చెక్క పలక దిగగొట్టిన విధానాన్ని బట్టి అది “t లా ఉందని చూపుతుంది.

27:38-44 యేసు చివరి శోధన సిలువను విడిచిపెట్టడం. కానీ “ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొనెను” అందువల్ల ఆయన “సంపూర్ణసిద్ది" పొందినవాడై “తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారణమాయెను” (హెబ్రీ 5:8-10). “ఆయనను సిలువకు పట్టి వుంచింది మేకులు కావు గాని ప్రేమ శక్తియే”. (రాబర్ట్ హెచ్. మౌన్స్), 27:45 ప్రక్కన నిలబడినవారు చీకటిని దేవుని తీర్పు అని (ఆమోసు 8:9) వ్యాఖ్యానించారు. ఆ తీర్పు యేసుకు విరుద్ధంగా (ఆయన ఒక మత భ్రష్టుడు అయివుండవచ్చునని వారు తలంచారు) వచ్చిందని వారు అనుకున్నారు. కానీ తరువాత ఆయన పునరుత్థానపు వెలుగులో ఆ చీకటి మన పక్షంగా యేసు పాపంగా మారడం వలన ఆ పాపంపై వచ్చిన తీర్పు అని వారు గ్రహించారు (2కొరింథీ 5:21) 

27:46-49 యేసు విలాపం కీర్తన 22:1ని పేర్కొంటుంది. సిలువపక్కన నిలబడినవారెవరో ఆ కీర్తన రాసినట్లుంటుంది. (ముఖ్యంగా కీర్తన 22:7-8,14-18 చూడండి). యేసు కేక, పాపానికి విరోధంగా దేవుని ఉగ్రతను భరిస్తూ, దేవునినుండి వేరైన పరిస్థితిని వ్యక్తీకరిస్తుంది. యేసు వేరేచోట దేవున్ని "తండ్రీ” అని పిలిచినా, ఈ వచనంలో ఆయన దేవుని కేవలం నా దేవా అని పిలిచాడు. 

27:50-51 "మధ్యాహ్నం 3:00 గం॥ లకు యేసు మరణించడం మధ్యాహ్న బలియర్పణ సమయంతో సమాంతరంగా ఉంది. కాబట్టి తెర చిరిగిపోవడాన్ని కళ్ళారా చూసేలా యాజకులు దేవాలయంలోనే ఉన్నారు. దేవాలయపు తెర అతి పరిశుద్ధ స్థలాన్ని మిగిలిన దేవాలయం నుండి వేరుచేసేది. మిష్నా ప్రకారం అది అరవై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, మనుష్యుని అరచేయంత మందంగా ఉంది. అది ఎంత బరువుగా ఉండేదంటే, అది తడిచినప్పుడు ఎత్తడానికి మూడువందలమంది మనుషులు అవసరమయ్యేవారు. పైనుండి కిందివరకు రెండుగా చినిగెను అనేమాటలు, దాన్ని దేవుడే చింపాడని చూపుతుంది. యేసు మరణం దేవునియొద్దకు వెళ్ళడానికి పాపులకు కొత్త మార్గాన్ని తెరచిందని సూచించింది (హెబ్రీ 6:19-20; 10:19-20). 

27:52-53 యేసు మరణించినపుడు సమాధులు తెరవబడినప్పటికీ, యేసు పునరుత్థానం వరకు అందులోనుండి పరిశుద్ధులు వెళ్ళలేదు. యేసు మరణంపై సాధించిన విజయం దేవుడు తన ప్రజలను లేపుతాడనే హామీని చూపింది (1కొరింథీ 15:20).


27:54 అన్యజనులు మరలా యేసు నిజమైన గుర్తింపును కనుగొని, ఒప్పుకున్నారు. దేవుని సార్వత్రిక రక్షణ ప్రణాళికను గురించి ఇది సూచన ఇస్తున్నది (28:19 నోట్సు చూడండి).

27:55-56 యాకోబు యోసే అనువారి తల్లియైన మరియ, బహుశా అంతగా తెలియని యేసు ఇద్దరు శిష్యుల తల్లి అయివుండవచ్చు (మార్కు 15:40)

27:57-61 యూదుల మహాసభలో సభ్యుడైన యోసేపు (మార్కు 15:43), వారు. యేసును శిక్షించడాన్ని వ్యతిరేకించాడు. (లూకా 23:50-51). ధనవంతులు తమ సొంత ప్రయత్నాలతో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరని యేసు బోధించినప్పటికీ, దేవుడు తన కృపవల్ల ఎవరినైనా రక్షిస్తాడు అనడానికి యోసేపు ఒక సాక్ష్యం (మత్తయి 19:24-26). సాధారణంగా సిలువ వేయబడినవారి శరీరాలు సిలువపైనే కుళ్ళిపోవడానికి విడిచిపెట్టేవారు, కానీ పిలాతు యూదుల నియమాలను గౌరవించి, మరణించిన వారిని సమాధిచేయడానికి అనుమతించాడు.

27:62-64 యూదుల నాయకులు మత్తయి 12:38-40 లోని యేసు పునరుత్థాన ప్రవచనాన్ని గుర్తుచేసుకుంటున్నట్లుంది. వారు శిష్యులను తప్పు అంచనా వేశారు. శిష్యుల దుఃఖం ఎంత ఎక్కువగా ఉందంటే, వారికి యేసు సమాధినుండి లేస్తాడనే అభిప్రాయం కూడా ఉన్నట్లు లేదు.

27:65 పునరుత్థాన నాటకానికి శిష్యులు - ప్రయత్నించకుండా సమాధిని కాపాడడానికి ఒక సైనికుల గుంపును పిలాతు పంపించాడు. ఎంతమంది సైనికులో తెలిసే పదాన్ని గ్రీకులో వాడలేదు.

27:66 ముద్రలో రోమా అధికారి ముద్ర ఉన్న మైనం ఉండేది. దీనివల్ల సమాధిని తెరచినవారు దొరికిపోతారు. అనధికారికంగా ఈ ముద్రను పగలగొట్టిన వారు ఎవరైనా సరే, రోమా అధికారాన్ని ధిక్కరించినట్టుగా పరిగణించి మరణశిక్ష విధించేవారు. 

Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |