Hebrews - హెబ్రీయులకు 11 | View All

1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

2. దానినిబట్టియే పెద్దలు సాక్ష్యముపొందిరి.

3. ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింప బడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
ఆదికాండము 1:1, ద్వితీయోపదేశకాండము 32:18, కీర్తనల గ్రంథము 33:6, కీర్తనల గ్రంథము 33:9

4. విశ్వాసమునుబట్టి హేబెలకయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.
ఆదికాండము 4:4

5. విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు.
ఆదికాండము 5:24

6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

7. విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
ఆదికాండము 6:13-22, ఆదికాండము 7:1

8. అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయల
ఆదికాండము 12:1

9. విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
ఆదికాండము 17:19, ఆదికాండము 18:11-14, ఆదికాండము 21:2

12. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
ఆదికాండము 15:5, ఆదికాండము 32:12, నిర్గమకాండము 32:13, ద్వితీయోపదేశకాండము 1:10, ద్వితీయోపదేశకాండము 10:22

13. వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
ఆదికాండము 47:9, 1 దినవృత్తాంతములు 29:15, కీర్తనల గ్రంథము 39:12, ఆదికాండము 23:4, ఆదికాండము 26:3, ఆదికాండము 35:12, ఆదికాండము 35:27

14. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?

15. వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

16. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
నిర్గమకాండము 3:6, నిర్గమకాండము 3:15, నిర్గమకాండము 4:5

17. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను.
ఆదికాండము 22:1-10

18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
ఆదికాండము 21:12

19. తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.

20. విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
ఆదికాండము 27:27-40, ఆదికాండము 27:30-40

21. విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
ఆదికాండము 47:31, ఆదికాండము 48:15-16

22. యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
ఆదికాండము 50:24-25, నిర్గమకాండము 13:19

23. మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
నిర్గమకాండము 1:22, నిర్గమకాండము 2:2

24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
ఆదికాండము 4:10, నిర్గమకాండము 2:11

25. అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,

26. ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
కీర్తనల గ్రంథము 69:9, కీర్తనల గ్రంథము 89:50-51

27. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.
నిర్గమకాండము 2:15, నిర్గమకాండము 10:28-29, నిర్గమకాండము 12:51

28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
నిర్గమకాండము 12:21-29

29. విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
నిర్గమకాండము 14:21-31

30. విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను.
యెహోషువ 6:12-21

31. విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధాన ముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను.
యెహోషువ 2:11-12, యెహోషువ 6:21-25

32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.
న్యాయాధిపతులు 4:10-17, న్యాయాధిపతులు 11:32-33, న్యాయాధిపతులు 16:28-30, 1 సమూయేలు 7:9-12, 1 సమూయేలు 19:8

33. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి;
న్యాయాధిపతులు 14:6-7, 1 సమూయేలు 17:34-36, దానియేలు 6:22

34. అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి.
దానియేలు 3:23-25

35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతనపెట్టబడిరి.
1 రాజులు 17:17-24, 2 రాజులు 4:25-37

36. మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి.
ఆదికాండము 39:20, 1 రాజులు 22:26-27, 2 దినవృత్తాంతములు 18:25-26, యిర్మియా 20:2, యిర్మియా 37:15, యిర్మియా 38:6

37. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి,గొఱ్ఱచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
2 దినవృత్తాంతములు 24:21

38. అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
1 రాజులు 18:4, 1 రాజులు 18:13

39. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందిన వారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,

40. దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధ పరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.



బైబిల్ అధ్యయనం - Study Bible
11:1-40 ఈ అధ్యాయం పా.ని. పితరుల విశ్వాసంతో క్రైస్తవుల విశ్వాసాన్ని , పోల్చుతుంది. నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవియున్నవనుటకు రుజువు అని విశ్వాసాన్ని నిర్వచించాడు. “నిజస్వరూపము" నకు గ్రీకు పదం "హుపోస్టాసిస్". క్రీస్తుకు దేవునితో ఉన్న సంబంధాన్ని వర్ణించడానికి (1:3), విశ్వాసులకున్న స్థిరమైన నమ్మకాన్ని వర్ణించడానికి (3:14) ఇంతకుముందు ఈ పదం వాడారు. విశ్వాసం నిలకడలేనిది కాదుగాని నమ్మకాన్ని పుట్టించేటంత రూఢియైనది. "రుజువు” అని అనువదించబడిన గ్రీకు పదం దృశ్యమైన వాటిపై ఆధారపడని అంతరంగ ఒప్పుదలను సూచిస్తుంది. దేవునికి ఇష్టుడుగా ( ఉండడానికి విశ్వాసము కావాలి. ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా! ఆయన ఉన్నాడు, తప్పక స్పందిస్తాడు.
దైవిక ఆమోదం విశ్వాసానికి ప్రాథమిక ఫలితం. విశ్వాసానికి ఇతర ఫలితాలు: (1) నీతిగా ప్రకటింపబడుట; (2) దేవుని పరలోకపట్టణం వైపుకు చూడగలిగే సామర్థ్యం; (3) పాపం అల్పకాల సుఖభోగమేనని గుర్తించడం; (4) దేవుడు నమ్మదగినవాడు కాబట్టే విశ్వాసం సాధ్యం అని అర్థం చేసుకునే శక్తి; (5) లోకంలో గొప్ప కార్యాలను సాధించగలిగే సామర్థ్యం; (6) విశ్వాసులు హింసింపబడి, హతులైనపుడు కూడా, ఈ లోకానికి అవతలశ్రేష్ఠమైన పునరుత్థానం ఉందని చూసే సామర్థ్యం.
ఈ అధ్యాయమంతటిలో ఎక్కువగా పా.ని.లో విశ్వాసాన్ని అభ్యసించిన వ్యక్తుల మాదిరులను రచయిత పేర్కొన్నాడు. అతడు అబ్రాహాము, మోషేలపై ఎక్కువ దృష్టిపెట్టాడు. పతాక సన్నివేశంతో జాబితాను ముగించడానికి (వ.32-40), విశ్వాసఫలితంగా నీతిగా జీవించి, నమ్మకత్వంతో మరణించి, పునరుత్థానాన్ని అపేక్షించిన అనేకమంది పా.ని. విశ్వాస వీరుల ప్రోత్సాహకరమైన జీవితానుభవాలను పునరుద్ఘాటించాడు. వారి విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినవారైనను, దేవుడు వాగ్దానము చేసినదానిని వారు పొందలేదు. వారు యేసు క్రీస్తుకు వేరుగా పరిపూర్ణులు కారనేదే ఈ ఆలస్యానికి కారణం. 

11:4 అతని విశ్వాసమును బట్టి, హేబెలు అర్పణ దేవునికి అంగీకారమైంది. అందువల్లనే అతడు నీతిమంతుడని పిలువబడ్డాడు. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించడానికి అతి ప్రాముఖ్య కారణం అతడు దేవునికి లోబడే వైఖరి కలిగి ఉండడమే. 

11:7 నోవహు ఎన్నడూ వర్షాన్ని లేక వరదను చూడని స్థితిలో దేవునిచేత హెచ్చరించబడి, ఎండిన నేలమధ్యలో ఓడను కట్టడం అనే నోవహు విధేయత, అతని పొరుగువారికి విచిత్రంగా కనిపించేలా చేసింది. నీవు దేవునికి విధేయత చూపేటప్పుడు, ఇతరులు నిన్ను విచిత్రంగా చూసి, ఎగతాళి చేస్తే ఆశ్చర్యపోకు. నీ విధేయత, వారి అవిధేయతను ప్రత్యేకంగా చూపుతుంది. నీవింతవరకు చేయనిదానిని చేయమని దేవుడు చెబితే, అది చేయడానికి అవసరమైన ప్రణాళిక, వనరులు, బలము ఆయన నీకిస్తాడని గుర్తుంచుకో....

11:8 తానెక్కడికి వెళుతున్నాడో అబ్రాహాముకు తెలియదు. అయినప్పటికీ అతడు పూర్తిగా దేవుని నమ్మాడు. విశ్వాసము అంటే విధేయతతో ఎరుగనిదానిలోనికి అడుగుపెట్టడమే. అబ్రాహాము ఇది చేశాడు, దానినిబట్టి దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచాడు. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు (ఆది 22:1-19 చూడండి). దేవుడు తన చిత్రాన్ని చేయడానికి నీకు సంరక్షణగా ఉన్న నీ కుటుంబ పరిస్థితులను విడిచిపెట్టమంటే ఆశ్చర్యపోవద్దు.

11:12 మొదట శారా నవ్వింది గాని ఆ తరువాత యెహోవాకు అసాధ్యమేమీ లేదు అని స్పష్టంగా నమ్మింది. (ఆది 18:15), తత్ఫలితంగా ఆమె పిల్లలను కనే వయస్సు దాటిపోయినప్పటికీ, దేవుడు ఆమెకు వాగ్దానపుత్రుని ఇచ్చాడు.

Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |