Nahum - నహూము 1 | View All

1. నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

2. యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

3. యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

4. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.

5. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.

6. ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
ప్రకటన గ్రంథం 6:17

7. యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.

8. ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,

9. యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.

10. ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.

11. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

12. యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

13. వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

14. నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.

15. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
అపో. కార్యములు 10:36, రోమీయులకు 10:15, ఎఫెసీయులకు 6:15బైబిల్ అధ్యయనం - Study Bible
1:2-8 యెహోవా దేవుని గురించిన ఈ విజయగీతం గురించి ఈ గ్రంథ , పరిచయం చూడండి. 

1:2 రోషము గల భర్తలాగా ఇశ్రాయేలు ప్రేమకు పోటీగా దేవుడు ఎవరినీ సహించడు, వారు దేవుళ్ళని పిలవబడినవారైనా (నిర్గమ 34:14-16), - అన్యరాజ్యాలు వారి రాజులైనా సరే. 

1:3 యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు అనడంలో, ఆయన కోపం నిరంకుశుని ఉగ్రత వంటిది కాదు అని భావం. ఆయన కనికరం, తన ప్రజలను అణచివేసిన వారిని ఓడించలేని అసమర్థత కాదు. తన స్వంత ప్రజలైనా, వారి శత్రువులైనా (నిర్గమ 34:7) దోషులను ఆయన ఎట్టి పరిస్థితిలోను విడిచిపెట్టడు. 

1:4 భయంకరమైన కరువు వల్ల, పాలస్తీనాలోని అత్యంత పచ్చని ప్రాంతం -తూర్పున నున్న, యోర్దాను నదీ పరివాహక ప్రాంతంలోని బాషాను నుండి, కర్మలు కొండ, లెబానోను పర్వతాల వరకు ఉన్న తుపాను దేవతైన బయలు వాయువ్య సరిహద్దులు బీటలు వారిపోతాయి (యెషయా 33:9), బాషానును, కర్మలును వాడిపోవును లెబానోను పుష్పము కూడా వాడిపోతుంది. నిజానికియెహోవా ఒక్కడే తుపానును, వర్షాన్ని, ఉత్పాదకతను (సముద్రమును, నదులన్నిటిని ఎండిపోజేయడం) నియంత్రిస్తాడు. బాషాను పచ్చని పచ్చిక బయళ్ళకు (యిర్మీయా 50:19), మంచి పశుసంపదకు (ద్వితీ 32:14), చిక్కని అరణ్యాలకు (యెషయా 2:13; యెహె 27:6), కర్మలు (అక్షరార్థంగా వనభూమి) పచ్చదనానికి (యిర్మీయా 50:19; ఆమోసు 1:2) ప్రసిద్ధి. దేవుని తీర్పుకు రెండూ ఎండిపోయాయి. 

1:5 దేవుని కోపానికున్న భయానకమైన శక్తిని భూమిని వణికింపజేసే భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనంతో సమానమైన అనుభవంగా ఈ వచనం. పోలుస్తున్నది. భూకంపాలతో దేవుని తీర్పును పోల్చి చూపే ఇతర వాక్యభాగాలు: యెషయా 24:18-20; 29:6; యిర్మీయా. 10:10; యెహె 26:18 యోవేలు 3:16. సాధారణంగా కూడా దేవుని సన్నిధినీ, ఆయన కార్యకలాపాలను భూకంపాలు అనుసరించాయి. ఉదా. సీనాయి పర్వతం దగ్గర, కల్వరి కొండ దగ్గర (పాత నిబంధన ముగింపును సూచిస్తూ). “నాడు, నేడు కూడా భూకంపాలు మనుషులకు జ్ఞాపకం చేసేది -దేవుడు ఒక్కడే స్థిరమైనవాడు. ఈ భూమి సహితం చివరికి స్థిరం కాదు. క్రీస్తు మహిమతో ప్రత్యక్షమయ్యే రోజు, మానవ రాజ్యాలన్నిటినీ దేవుడు ఆ కుదిపేస్తాడనే సత్యాన్ని కూడా అవి సూచిస్తున్నాయి (జెకర్యా 14:4-5)".

1:6 అంతటికీ ఒకేసారి “అయితే" అని చెబుతోంది. ఈ వచనం. దేవుడైన యెహోవా తన శత్రువులకు విరోధంగా పగతీర్చుకుంటే, ఆయన తన సృష్టికంటే గొప్పవాడైతే, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన ఆ కోపాగ్ని యెదుట నిలువగలవాడెవడు? స్పష్టమైన జవాబు “ఎవడూ నిలువలేడు". ఆయన ఉగ్రత కుమ్మరించబడిన అగ్నిలాంటిది. అది రాళ్ళను బద్దలుగొట్టేటంత తీక్షణంగా ఉంది. 

1:7 యూదా కోసం ప్రవక్త ఇచ్చే ప్రాథమిక సందేశానికి మొదటి సూచన
ఈ వచనంలో కనిపిస్తుంది. దయాళుడు, తన ప్రజలకు బలమైన ఆశ్రయం, తన శత్రువులకు భయంకరుడు అయిన దేవునిలో ఆశ్రయం పొందమని నహూము యూదావారికి చెబుతున్నాడు. “ఆశ్రయించడం" అనేది పా.ని.లో విశ్వాసాన్ని సూచించే అనేక వ్యక్తీకరణల్లో ఒకటి. 

1:8 అషూరు నూతన రాజులు తమ శత్రువులను వరదలాగా కమ్మేస్తామని చెప్పుకునేవారు, వీరి ఒప్పందాల్లో తమకు విధేయులు కానివారిపై వరదలు ముంచెత్తాలనే శాపనార్థాలు కనిపించేవి. దేవుడు నీనెవె నగరానికి ఆశ్రయం కాక, దానికి వ్యతిరేకమైనదానిని ఇస్తాడు. 

1:9 ఈ వచనం ప్రశ్నతో ఆరంభమౌతున్నట్లుంది, అక్షరార్థంగా "యెహోవాకు విరోధంగా మీరేం పన్నాగం పన్నుతున్నారు?" అని అపూరీయులను అడుగుతున్నట్లు ఉంది. తనకు విరోధంగా ఉన్న ఏ వ్యూహాన్నైనా సర్వనాశనం చేసేవాడు యెహోవాయే. 

1:10 అగ్ని, ముళ్ళను, చెత్తను కాల్చినట్లు, తాగుబోతులు మద్యాన్ని మింగినట్లుగా, యెహోవా శత్రువులు కాలిపోతారు. 

1:11 యెహోవా మీద దురాలోచన చేసి, వ్యర్ధమైన వాటిని బోధించినవాడు ఎవరైనా అషూరు పాలకుడు. అయ్యుండవచ్చు (వ. 15, “వ్యర్ధుడు” అనే దానికి హెబ్రీ పదం కూడా ఇదే), లేక అతనికి శక్తినిచ్చే దయ్యపు ఆత్మ అయినా కావచ్చు (దాని 10:13,20-21; మెస్సీయ అయితే ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తయై యున్నాడు. యెషయా 9:6). సనెరీబు దుర్మార్గం తలపెట్టాడు, కాని యెరూషలేమును నాశనం చేయాలన్న అతని ఉద్దేశం (సుమారు క్రీ.పూ. 701) భంగమైపోయింది (2రాజులు 19:20-28,32-34). 

1:12 విస్తారజనమై పూర్ణ బలము అంటే బలీయమైన సైన్యం ఎదురుగా ఉంది, కాని విస్తారమైన సైన్యాలను ఇశ్రాయేలీయుల ద్వారా గానీ, తనకుతానుగా గాని జయించడంలో దేవుడు సంతోషిస్తాడు (న్యాయాధి 7:2 తో పోల్చండి; 1సమూ 17:45-47). నిన్ను అని చివరి వరుసల్లో ఉన్న మాట యూదాను సూచిస్తుంది. “తన ప్రజలను శిక్షించడానికి అష్బూరీయులను దేవుడు ఎంత అధికంగా వాడుకున్నా, ఇకపై అలా జరగదు" అని ఒక వ్యాఖ్యాత అన్నాడు. 

1:13 కాడిమాను, కట్లు అనే ఊహ, యిర్మీయా 30:8లో ఉన్నదానిలాగా కనిపిస్తుంది, కాని అక్కడ అది. బబులోను చెరనుండి విడుదల గురించినదైవిక వాగ్దానం.

1:14 వ.13లోని "నిన్ను" అనే రెండు మాటలు యూదాను ఉద్దేశించి స్త్రీలింగం, ఏకవచనంలో ఉపయోగించాడు. వ.14లో రెండుసార్లు కనిపించే “నీ” “నిన్ను" నీనెవెని లేక దాని రాజును సూచిస్తూ పురుషలింగం, ఏక వచనంలో వాడాడు. మొదటి తీర్పు రాజు వంశం అంతమైపోతుంది. అతని మరణం తర్వాత అతని పేరుప్రతిష్ట కూడా పోతుంది (యెషయా 56:5; 66:22 తో పోల్చండి). పురాతన ప్రపంచంలో ఏ గుర్తింపూ లేకుండా మరణించడం గురించి మనుషులు భయపడేవారని" అలన్ మిల్లార్డ్ చెబుతూ “దాని అర్థం, అతడు త్వరలో మరపులోకి వెళ్ళిపోతాడు... అంతేకాక అన్య సమాజాల్లో అతని ఆత్మకు తరువాతి లోకంలో శాంతి కలిగేలా అతనికి అంత్యక్రియలు జరిగించడానికి ఎవడూ రాడు అని" రాశాడు. అష్నూరులోని ప్రధానులలో ఘనతను పోగొట్టుకున్న వారి పేర్లు, వారి స్థూపాలనుండి తొలగించారు. విలువ కోల్పోయిన రాజులు, దేవతల పేర్లు ఐగుప్తులోని స్తూపాలమీద నుండి చెరిపివేశారు”. రెండవ తీర్పు ఏమిటంటే, అతని చిత్రాలు, విగ్రహాలు దేవాలయం నుండి తొలగించబడతాయి (జెకర్యా 13:2). కాబట్టి అష్నూరు దేవతలకు ఇకపై పూజలు చేయరు. కాబట్టి తరువాతి జీవితంలో వారికి అతని మీద కోపం వస్తుంది. రాజరికం అనుగ్రహిస్తారు
అని చెప్పుకునే అష్వూరు దేవతలపై యెహోవా ఔన్నత్యాన్ని కూడా ఈ మాట తెలియజేస్తుంది. మూడవ తీర్పు కేవలం ఆ రాజు మరణాన్నే కాక, అతని సమాధి అపవిత్రపరచబడడాన్ని కూడా సూచిస్తుంది.

1:15 "ముట్టడి వేయబడిన ఒక పట్టణం, నిర్ణయాత్మకమైన పోరులో విజయం ఎవరిదో తెలుసుకోవడానికి ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నది. విజయం అని వార్త వస్తే వారు విడుదలౌతారు; ఓడిపోయాం అని వస్తే సర్వ నాశనమే. హఠాత్తుగా, దూరంగా ఉన్న కొండమీద ఒకడు పరుగెడుతూ కనిపించాడు. వార్త ఏమై ఉంటుంది? అతడు దగ్గరకు వస్తుండగా, చేతిలో విజయసూచిక ఎగురుతూ ఉంది, అతడు పరుగెత్తడం లేదు, నాట్యం చేస్తున్నాడు. యెహోవా గెలిచాడు! పాటలు మొదలుపెట్టండి!" అంటూ ఈ దృశ్యాన్ని వివరిస్తాడు జాన్ ఆస్వాల్డ్.


Shortcut Links
నహూము - Nahum : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |