Zechariah - జెకర్యా 1 | View All

1. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
మత్తయి 23:25

2. యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను.

3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగామీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
యాకోబు 4:8

4. మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గ తను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.

5. మీ పితరు లేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?

6. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
ప్రకటన గ్రంథం 10:7, ప్రకటన గ్రంథం 11:18

7. మరియదర్యావేషు ఏలుబడియందు రెండవ సంవ త్సరము శెబాటు అను పదకొండవ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

8. రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
ప్రకటన గ్రంథం 6:2-4-5, ప్రకటన గ్రంథం 19:11

9. అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.

10. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.

11. అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.

12. అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
ప్రకటన గ్రంథం 6:10

13. యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.

14. కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను-నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

15. నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.

16. కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

17. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

18. అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.

19. ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.

20. యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా

21. వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ము లను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 జెకర్యా, హగ్గయి, ఇద్దరూ కేవలం రెండు నెలల వ్యత్యాసంతో తమ పరిచర్యను ప్రారంభించారు (హగ్గయి 1:1). అది పర్షియా రాజైన కోరెషు ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చని అనుమతి జారీచేసిన తరువాత 19 సంవత్సరాలకు క్రీ.పూ.520 లో జరిగింది. ఈ ఇద్దరు ప్రవక్తలు క్రీ.పూ. 516/515 లో (ఎజ్రా 5:1-2; 6:14) పూర్తయిన దేవుని మందిర పునర్నిర్మాణంలో పాత్ర వహించారు.

1:2 ఉత్తరదేశంలో సమరయను, 10 గోత్రాలను అష్ఫూరీయులు నాశనం చేస్తే దక్షిణరాజ్యంలో యెరూషలేమును, రెండు గోత్రాలను బబులోనీయులు నాశనం చేశారు (2రాజులు 17:5-23; 25:8-21; 2దిన 36:17-20). వారు పొందిన బాధ, కష్టం, వారు తమ నివాసాలు, ప్రాణాలు, నగరాలు అన్నిటినీ కోల్పోయి పరాయిదేశానికి చెరగా కొనిపోబడడం, మరి ముఖ్యంగా యెరూషలేము దేవాలయ విధ్వంసం, ఇవన్నీ దేవుని నిబంధనా వాగ్దానాలు, న్యాయనిరతి గురించి వారిలో ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే దేవుని మహోగ్రతను విశ్లేషించడంలో ఈ ఇద్దరు ప్రవక్తలూ ఐక్యంగా నిలిచారు. వారి పైకి వచ్చిన దేవుని తీర్పు తీవ్రత పూర్తిగా సమర్ధనీయమే. 

1:3 జెకర్యా గ్రంథం అంతటిలో తిరిగిరావడం (హెబ్రీ. షువ్) అనేది కీలకమైన తలంపు (వ.4 తో పోల్చండి, “తిరిగి" వ.6, “తిరిగియున్నాను", వ. 16, 8:3, “తిరిగి రండి", 13:7, “మరలి రండి"). ఇది ఇశ్రాయేలీయులకు రెండు రకాలుగా అన్వయిస్తుంది. చెరలోనుండి తిరిగి రావడం (భౌతికం) ఒకటైతే దేవుని వైపుకు మళ్ళడం (ఆధ్యాత్మికం) మరొకటి. అది దేవునికి కూడా రెండు రకాలుగా అన్వయించింది. యెరూషలేము నుండి తన సన్నిధిని కొద్దికాలం వెనక్కి తీసుకున్న తరవాత “తిరిగి" అనే మాట ఆయన మళ్ళీ తన కనికరాన్ని చూపించడాన్ని సూచిస్తుంది. అలాగే దేవుడు తిరగడం అనేది ప్రజలను శిక్షించడం నుండి వారిని దీవించడాన్ని సూచిస్తున్నది. తిరిగి వస్తానన్న దేవుని వాగ్దానం ఆ ప్రజలు తనవైపు తిరగడం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నిబంధనలోని ఒక నిత్యమైన షరతు (ఆది 17:1-2,9; యిర్మీయా 18:7-10). 

1:4 వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి అనేవి బైబిల్లో అతి బాధాకరమైన మాటల్లో కొన్ని, ప్రవక్తలు రెండు వందల సంవత్సరాలకు పైగా ప్రజల అవిధేయత ఎంత అసహ్యంగా ఉంటుందో వర్ణిస్తూ వచ్చారు (3:3-4; యెషయా 57:3-9 తో పోల్చండి). వారు నమ్మకత్వానికి కలిగే ఆశీర్వాదాలను పరిపూర్ణమైన ప్రపంచం గురించిన అద్భుతమైన చిత్రాలతో వర్ణించారు. అయితే జెకర్యా 1:3 లో మాత్రం దానిని “నేను మీతట్టు తిరుగుదును” అనే సాధారణమైన మాటలతో వివరించారు. (వ.16-17; 3:8-10 నోట్సు గమనించండి). అయితే ఏదీ కూడా పాపులైన వారి చల్లబడిన హృదయాలలోకి చొచ్చుకుపోలేకపోయింది (7:11-12; 2రాజులు 17:14-23; 2దిన 36:15-16; యిర్మీయా 5:11-13; మలాకీ 3:7). 

1:5-6 జెకర్యా తనకు ముందుగా వచ్చిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటూ వారి స్థానంలో తనను నిలుపుకొని వారు బోధించిన సందేశాన్నే తానూ ప్రకటించడం ప్రారంభించాడు. అతని సందేశం చెరిగిపోని ప్రాధాన్యతతో కూడి ఉంది. ఎందుకంటే ఏర్పరచబడిన ఆ జనాంగానికి విశ్వాసంతో కూడిన జీవితం గడపాలనే ఎడతెగని సవాలు ఒకటి ఉంది. వారిని నివ్వెరపోయేలా చేస్తూ మీ పితరులేమైరి? అనే ప్రశ్న వారిని అడిగాడు. అవిధేయతలోని నిరర్థకత్వాన్ని ఇంతకంటే స్పష్టంగా వర్ణించలేము. గతంలో నాయకులైనవారి వ్యర్థమైన ప్రయత్నాలు పునరావృతం కాకూడదు. 

1:7 తమ నాయకులు, నగరాలు, యెరూషలేము దేవాలయం పూర్తిగా ధ్వంసం అయిపోయి, అనేక సంవత్సరాల చెర తరవాత అప్పుడప్పుడే తమను తాము తిరిగి నూతనపరచుకుంటున్న ఆ సమాజానికి ఒక కొత్త దర్శనం, నిరీక్షణ చాలా అత్యవసరం. మానవ హృదయాంతరంగంలోకి చొచ్చుకుపోయి వారి లోతైన భావాలను రూపాంతరీకరించే మార్గాలు చాలా అవసరం. దాని పరిష్కారంగా కొన్ని దృశ్యాల చిత్రీకరణ, దర్శనాలు కలిగాయి. జెకర్యాకుప్రత్యక్షమైన దర్శనాల పరంపర నిరాశానిస్పృహల్లో ఉన్న ఆ ప్రజలకు సరైన జవాబును వెలుగులోకి తెచ్చాయి. దేవుడు అధికారంలో ఉన్నాడు, ఆయన నీ పక్షంగా ఉన్నాడు. 

1:8-11 ఆ దృశ్యం క్రమక్రమంగా తేటగా - కనిపిస్తున్నది. దేవదూత (సందేశకుడు) కొన్ని విషయాలను వివరిస్తుండగా దానికున్న చిక్కుముడులు విడిపోతున్నాయి. ఎర్రని గుఱ్ఱమునెక్కిన మనుష్యుడు... గొంజి చెట్లలో నిలువబడి ఉన్నాడు. ఆయనే యెహోవా దూత. సాధారణంగా గుర్రములు వేగాన్ని సూచిస్తాయి గాని తిరుగులాడుటకు అని ఇక్కడ వాడిన హీబ్రూ పదాలను “గస్తీ" అని అనువదించవచ్చు (లేక "నడక"). అంటే ఇది నియంత్రణను సూచిస్తుంది (10:3 తో పోల్చండి). లోకం నిమ్మళంగా, నిశ్శబ్దంగా ఉండడం అంతవరకు ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న అల్లకల్లోల పరిస్థితుల్ని ప్రత్యేకంగా గుర్తుచేస్తున్నాయి. ఈ దర్శనంలోని కొన్ని వివరణలు (లోయలో... గొంజి చెట్లు... ఎర్రని... చుక్కలు చుక్కలు గల... తెల్లని గుఱ్ఱములు) ఒక సాదృశ్యపూర్వక భావంతో కాక ఆ దృశ్యానికి ఒక స్పష్టతను ఆపాదించడానికి పేర్కొని ఉంటారు. 

1:8 రాత్రి అనే మాట ప్రవక్త పొందిన మొత్తం ఎనిమిది దర్శనాలకు పరిచయంగా భావించవచ్చు. అవి కొన్ని సాధారణమైనవి, మరికొన్ని నమ్మ శక్యం కాని విధంగా పరలోకం, భూలోకాల మధ్య జరిగిన సంఘటనలుగా కనిపిస్తాయి. దానియేలు, ప్రకటన గ్రంథాల్లో కనిపించే ప్రత్యక్షాత్మకమైన దర్శనాల్లాగా సాదృశ్యరూపం తప్పనిసరిగా ఉండి తరచుగా దానికి ఒక అనువాదకుడు అవసరం ఉంటుంది. 

1:12-13 యెరూషలేము ధ్వంసం అయిన తరవాత దేవుని మహిమ అక్కడి నుండి వెడలిపోయింది (యెహె 10:1-19). దాదాపు డెబ్బయి సంవత్సరాలు దేవుని ప్రజలు ఆరాధించడానికి ఒక స్థలం లేకుండా తిరిగారు. ప్రవక్తలు యెరూషలేము ఒక బీడుభూమిగా మారుతుందని (యెషయా 32:14-15; యిర్మీయా 9:11) ముందుగానే ప్రవచించినా, వారి ప్రవచనాల్లో పునరుద్ధరణ కూడా ఒక భాగంగా ఉంది (యెషయా 2:2-5; యెహె 40-48), అందుకే దేవుని ప్రజలు ఆ దూత అడిగిన "ఇంక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు” అనే ప్రశ్నకు జవాబు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

1:14-17 దేవుడు యెరూషలేము విషయములో... అధికాసక్తి కలిగి ఉండడం అనేది ఆయన తీవ్రమైన ప్రేమనే గాక తన ప్రజల విషయంలో ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఆశలను సూచిస్తున్నది (నిర్గమ 20:5). ఏర్పరచబడిన శేషం విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన అన్యజనుల మీదికి దేవుని కోపం మరలబోతున్నదనీ, వారిపై తన శిక్షకు ముగింపు పలుకుతూ వారిని తిరిగి దీవించడానికి దేవుడు యెరూషలేముకు తిరిగి వస్తాడనీ జెకర్యా చెప్పిన మాటలు ఆ ప్రజలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి ఉంటాయి. నా మందిరము కట్టబడును అనే ప్రకటన ఈ దర్శనమూ, దీని తరవాత రాబోయే
శక్యం కాని విధంగా పరలోకం, భూలోకాల మధ్య జరిగిన సంఘటనలుగా కనిపిస్తాయి. దానియేలు, ప్రకటన గ్రంథాల్లో కనిపించే ప్రత్యక్షాత్మకమైన దర్శనాల్లాగా సాదృశ్యరూపం తప్పనిసరిగా ఉండి తరచుగా దానికి ఒక అనువాదకుడు అవసరం ఉంటుంది. 

1:12-13 యెరూషలేము ధ్వంసం అయిన తరవాత దేవుని మహిమ అక్కడి నుండి వెడలిపోయింది (యెహె 10:1-19). దాదాపు డెబ్బయి సంవత్సరాలు దేవుని ప్రజలు ఆరాధించడానికి ఒక స్థలం లేకుండా తిరిగారు. ప్రవక్తలు యెరూషలేము ఒక బీడుభూమిగా మారుతుందని (యెషయా 32:14-15; యిర్మీయా 9:11) ముందుగానే ప్రవచించినా, వారి ప్రవచనాల్లో పునరుద్ధరణ కూడా ఒక భాగంగా ఉంది (యెషయా 2:2-5; యెహె 40-48), అందుకే దేవుని ప్రజలు ఆ దూత అడిగిన "ఇంక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు” అనే ప్రశ్నకు జవాబు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

1:14-17 దేవుడు యెరూషలేము విషయములో... అధికాసక్తి కలిగి ఉండడం అనేది ఆయన తీవ్రమైన ప్రేమనే గాక తన ప్రజల విషయంలో ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఆశలను సూచిస్తున్నది (నిర్గమ 20:5). ఏర్పరచబడిన శేషం విషయంలో అన్యాయంగా ప్రవర్తించిన అన్యజనుల మీదికి దేవుని కోపం మరలబోతున్నదనీ, వారిపై తన శిక్షకు ముగింపు పలుకుతూ వారిని తిరిగి దీవించడానికి దేవుడు యెరూషలేముకు తిరిగి వస్తాడనీ జెకర్యా చెప్పిన మాటలు ఆ ప్రజలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి ఉంటాయి. నా మందిరము కట్టబడును అనే ప్రకటన ఈ దర్శనమూ, దీని తరవాత రాబోయే
దర్శనాలూ అన్నీ ప్రజలను దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి ఏకం చేసి వారిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయని సూచిస్తున్నది. నూలు సాగలాగడం అనేది కొలమానం. దీనిగురించి 2:1-5 నోట్సు చూడండి.

1:18-21 తిప్పివేయడం అనే అంశం ఈ దృశ్యంలో కూడా కొనసాగుతున్నది (వ.15). ఇశ్రాయేలును శిక్షించడానికి దేవుడు ఇప్పటివరకూ అన్య రాజ్యాలను వాడుకున్నాడు. ఇప్పుడు ఆయన అవే అన్యరాజ్యాలకు వ్యతిరేకంగా తిరిగాడు (హబ 2 తో పోల్చండి). ఎవడును తల ఎత్తకుండ ప్రజలను చెదరగొట్టి మరెవరూ తలెత్తలేని విధంగా చేసిన ఆ నాలుగు కొమ్ములు చిత్రం ఇశ్రాయేలు శత్రువుల భయానకమైన శక్తినీ వారు జరిగించిన కౄరమైన వినాశనాన్నీ సూచిస్తున్నది. కంసాలులు అంటే వివిధ రకాల ప్రావీణ్యం గల కళాకారులు (ఆ కొమ్ములు ఇనుపవి, వారు కమ్మరివారు) ఆ కొమ్ములను వివిధరకాల ప్రయోజనాల నిమిత్తం విరిచి మార్చగలరు. దర్శనంలోని ఆ కొమ్ములు తొలగిపోయాయి కాబట్టి ఇక ఏర్పరచబడిన ప్రజలు వాగ్దాన దేశానికి తిరిగి వెళ్ళవచ్చు. 


Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |