Job - యోబు 22 | View All

1. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు;బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు

3. నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా?

4. ఆయనయందు భయభక్తులు కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులనుబట్టి ఆయన నీతో వ్యాజ్యెమాడునా?

5. నీ చెడుతనము గొప్పది కాదా?నీ దోషములు మితిలేనివి కావా?

6. ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి

7. దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.

8. బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.

9. విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.

10. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది.

11. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?

12. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా?నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంతపైగా నున్నవి?

13. దేవునికి ఏమి తెలియును?గాఢాంధకారములోనుండి ఆయన న్యాయము కనుగొనునా?

14. గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా నున్నవి,ఆయన చూడలేదుఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు.

15. పూర్వమునుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా?

16. వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరివారి పునాదులు జలప్రవాహమువలె కొట్టుకొని పోయెను.

17. ఆయన మంచి పదార్థములతో వారి యిండ్లను నింపినను

18. మాయొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు.భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.

19. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసెననియు పలుకుచు

20. నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు.

21. ఆయనతో సహవాసము చేసినయెడల నీకు సమాధానము కలుగునుఆలాగున నీకు మేలు కలుగును.

22. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

23. సర్వశక్తునివైపు నీవు తిరిగినయెడలనీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినయెడల నీవు అభివృద్ధి పొందెదవు.

24. మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము

25. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును.

26. అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవుదేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.

27. నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

28. మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.

29. నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
మత్తయి 23:12, 1 పేతురు 5:6

30. నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.బైబిల్ అధ్యయనం - Study Bible
22:1-3 ఎలీఫజు మళ్లీ తార్కిక ప్రశ్నలతో తన సంభాషణ మొదలు పెట్టాడు, అతని ప్రశ్నలకు జవాబులు నిషేధార్థంలోనే ఉంటాయి. యోబు నీతి దేవునికెంత మాత్రం ప్రయోజనం కలిగించదు. 

22:4-5 దేవుని గద్దింపు ముగిసిన తర్వాత (5:17-18), యోబు భయభక్తులు అతడు కష్టకాలం నుండి బయటపడేలా చేస్తాయని ఇంతక్రితం ఎలీఫజు చెప్పాడు. (4:6-7). అయితే అతనిప్పుడు యోబులో చెడుతనము ఉందని నిందారోపణ చేస్తున్నాడు (వ.6-9 చూడండి). ఆ తర్వాత, యోబు తన మీద పడిన నిందల్ని త్రిప్పికొట్టాడు (31:16-17).

22:6 యోబు సాంఘికనేరాలు చేశాడని ఎలీఫజు ఆరోపిస్తున్నాడు. యోబు తనకు బాకీపడిన బీదవారి వస్త్రాల్ని తాకట్టు పెట్టించుకున్నాడనీ, వారు చలిబాధ ననుభవించకుండా వారిపై వస్త్రాల్ని యోబు తిరిగి ఇచ్చివేసి ఉండవలసినదనీ ఎలీఫజు చెబుతున్నాడు (నిర్గమ 22:26-27). తర్వాత, యోబు ఎలీఫజు ఆరోపణల్ని త్రిప్పికొట్టాడు (31:19-20 నోట్సు చూడండి). 

22:7-8 యోబు జాలిగుణం లేనివాడని ఎలీఫజు ఆరోపిస్తున్నాడు. యోబు బాహుబలము గలవాడు, ఘనుడని పేరు పొందినవాడైనప్పటికీ అతడు బీదసాదల పట్ల దయ చూపించలేదని ఎలీఫజు ఆరోపణ. యోబు ఆకలిదప్పులతో ఉన్న బీదలకు అన్నము పెట్టలేదనీ, నీళ్లియ్యలేదనీ ఎలీఫజు యోబును తప్పుబడుతున్నాడు (యెషయా 58:7; మత్తయి 10:41-42). 

22:9 యోబు విధవరాండ్రను, తండ్రి, లేనివారిని నిర్దాక్షిణ్యంతో చూశాడని ఎలీఫజు చెబుతున్నాడు. ప్రాచీన పశ్చిమాసియాలో బీదసాదల్ని దిక్కులేనివారిని అనాధల్ని ఆదరించడం సాంఘిక మర్యాద, సామాజిక బాధ్యత (ద్వితీ 14:28-29; 24:1711; యాకోబు 1:27). బీదలపట్ల జాలి చూపించి వారి అవసరాలు తీర్చడం దేవుని దృష్టిలో మంచి పని (ద్వితీ 10:17-18; 27:19). 

22:10-11 ఎలీఫజు బిల్టదు వ్యాఖ్యల్ని (18:8-11,18), యోబు పరిస్థితికి అన్వయిస్తూ అలంకారిక వర్ణనలో చెబుతున్నాడు. యోబు తనను ముంచుతున్న ప్రళయజలములను సైతం చూడలేనంతగా దుశ్చర్యలో చిక్కుకొని ఉన్నాడని ఎలీఫజు మాటల్లోని భావం (27:20; కీర్తన 69:15).

22:12-14 దేవుడు విశాల విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు (1రాజులు 8:2730 నోట్సు చూడండి) కాబట్టి ఆయనకు భూమ్మీద ఉన్న మనుషులందరి గురించి తెలుసని ఎలీఫజు చెబుతున్నాడు. యోబు కూడా ఈ వాస్తవాన్నే వ్యతిరేకభావనలో చెప్పాడనీ, అంటే మనుషుల చర్యల్ని పరిశీలించలేనంత దూరంలో దేవుడున్నాడని యోబు అన్నాడనీ ఎలీఫజు సూచిస్తున్నాడు. తన చర్యల్ని దేవుడు - తీక్షణంగా పరిశీలిస్తున్నాడని యోబు తన స్థితి గురించి చెప్పినదానిని (7:12,17-20; 9:17-18; 10:4-8; 13:27) ఎలీఫజు తప్పుభావంతో వర్ణిస్తున్నాడు. దేవుణ్ణి సమీపించలేని యోబు నిస్సహాయతకు అతడు అనుభవించిన గాఢాంధకారము సూచనగా ఉంది (19:7-8)

22:15-16 పాపము చేత పట్టబడిన మానవులు పూర్వము నుండి ఎలా నడుస్తున్నారో యోబు కూడా అదే వినాశ మార్గంలో నడుస్తున్నాడని ఎలీఫజు అభిప్రాయం (ఆది 7:20-24; 19:24-25). దుష్టులు దేవుణ్ణి ధిక్కరించి జీవిస్తున్నప్పటికీ వారెటువంటి శిక్ష ననుభవించడం లేదనే యోబు పరిశీలనకు భిన్నంగా (21:15-16), దేవుని తీర్పులో దుష్టులు కొట్టుకుపోతారనడానికి కాలమే సాక్ష్యమని ఎలీఫజు చెబుతున్నాడు.

22:17-18 దేవుడు మంచి పదార్థములతో దుష్టుల ఇళ్లను నింపుతున్నాడని యోబు చెబుతున్న దానితో ఎలీఫజు అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది (21:16). అయితే వారు దేవుణ్ణి అంగీకరించడం లేదు. కాబట్టి వారి క్షేమాభివృద్ధి కొంతకాలం మటుకే నిలిచి ఉంటుంది. దుష్టులు దేవుణ్ణి ధిక్కరించడం (వ.17) వారికే ఎదురుతిరుగుతుంది. అంటే దేవుడు కూడా వారిని తిరస్కరిస్తాడని అర్థం. దుష్టులు దేవుణ్ణి ధిక్కరించి జీవిస్తున్నా వర్థిల్లుతూనే ఉన్నారని యోబు చెప్పాడు (21:14), అయితే వారికి అకాల మరణం ప్రాప్తిస్తుందని ఎలీఫజు చెబుతున్నాడు. వీరిద్దరి వాదనల్లో వాస్తవం పాక్షికంగానే ఉంది. దేవుడు దుష్టులకు అన్నీ ఇచ్చి దీవిస్తున్నాడని యోబు వెలిబుచ్చిన భక్తిహీనుల ఆలోచనను తిప్పికొడుతున్నానని ఎలీఫజు చెబుతున్నాడు.  జోఫరు మాటలను (20:26-29), ఎలీఫజు నిర్ధారిస్తున్నాడు. దుష్టులకు ఇదే తగిన న్యాయమని నీతిమంతులు... సంతోషించుదురు (కీర్తన 52:1-7).

22:21-22 దేవుడు యోబుకు విధించిన శిక్ష నుండి అతడు మంచి పాఠం నేర్చుకోవాలని (5:17-26), స్నేహితుల ఉపదేశాల్లోని దైవజ్ఞానాన్ని యోబు తన హృదయములో పదిలపర్చుకోవాలని ఎలీఫజు వాదిస్తున్నాడు (కీర్తన 78:2-4), జ్ఞానము దేవుని నోటి నుండి వస్తుంది.

22:23-25 తిరిగిన యెడల అనే పదం దేవునికి ఆయన నైతిక ప్రమాణాలకు లోబడి జీవించాలని బాహాటంగా నిర్ణయించుకొని పాపాన్ని విడిచి పెట్టి దేవునివైపు మళ్లడాన్ని సూచిస్తుంది. (యిర్మీయా 23:5; అపొ.కా. 2:38). అభివృద్ధి పొందెదవు అనే పదబంధం అక్షరాలా “నిర్మించబడు” అనే అర్థాన్నిస్తుంది. ఇది సాఫల్యత గలిగిన సద్భక్తుల జీవనశైలిని సూచిస్తుంది. ప్రాచీన పశ్చిమాసియాలో అత్యంత ప్రశస్తమైనది ఓఫీరు సువర్ణము (1రాజులు 9:28). అయితే, దేవుడే యోబుకు నిధిగా ఉండాలంటే అతడు తన దగ్గరున్న ప్రశస్తమైన బంగారమును పారవేయాలి (కీర్తన 16:5; యెషయా 33:6; మత్తయి 13:44; 19:21; ఫిలిప్పీ 3:7-9, 1తిమోతి 6:6). 

22:26-27 తాను దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన నుండి తనకు ఏ జవాబూ రాలేదని యోబు అసంతృప్తిని వెల్లడిచేశాడు (13:20-24; 19:7
8). యోబు దేవుని శిక్షకు లోబడి ఆయనతట్టు తిరిగినట్లయితే మళ్లీ దేవునితో పూర్వముండిన సహవాసాన్ని ఆనందించగలడని ఎలీఫజు పునరుద్ఘాటిస్తు న్నాడు (15:17-26). 

22:28 యోబు పరిస్థితి బాగై అతడు కోలుకుని అభివృద్ధి చెందిన తర్వాత, అతని ఆలోచనలిక విఫలం కావని ఎలీఫజు సూచిస్తున్నాడు. ఇప్పుడు యోబు నావరించిన చీకటి తొలగిపోయి (వ.10-11; 19:8), అతని మీద అతడు నడవవలసిన మార్గం మీద దేవుని సన్నిధి నుండి వెలుగు ప్రకాశించును అని ఎలీఫజు చెబుతున్నాడు (కీర్తన 27:1; 56:13; 89:15; 1 యోహాను 1:7). 

22:29-30 యోబు దేవునితో మళ్లీ సహవాసాన్ని అనుభవించినపుడు అతడు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు. దేవుడు యోబు ప్రార్ధనల్ని ఆలకిస్తాడు, భక్తి జీవితానికి యోబు ఆదర్శప్రాయమైన దృష్టాంతమవుతాడు. 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |