Isaiah - యెషయా 46 | View All

1. బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

2. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

3. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

4. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

5. మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?

6. దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.

7. వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.

8. దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి

9. చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.

10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

11. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.

12. కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి

13. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను.
లూకా 2:32



బైబిల్ అధ్యయనం - Study Bible
46:1-4 ఈ వచనాలు మనుషుల చేత మోయబడే విగ్రహాలకు, తన ప్రజల భారాన్ని మోస్తున్న దేవునికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాయి. 

46:1 బేలు అనే పదానికి "ప్రభువు” అని అర్థం. బేలు బహుశా బబులోనువారి ముఖ్యదైవమైన - మర్దూకు అయ్యుండవచ్చు. నబు అనే పదానికి హెబ్రీలోని పదం నెబో. నబు మర్దూకు కుమారుడు, అతడు తనను తానే ముఖ్యమైన దైవంగా ఎంచుకున్నాడు. నబు జ్ఞానానికి దైవం, లేఖికుల
దైవం. ఈ దైవాలు, ఇంకా ఖండితంగా చెప్పాలంటే, దైవాలుగా ఎంచబడే ఈ విగ్రహాల్ని ఒక చోటు నుండి ఒక చోటుకు తీసుకొని వెళ్లడానికి బండి మీద మోసుకొని పోవలసి ఉంటుంది (44:12-20 నోట్సు చూడండి). ఇవి వాటిని మోస్తున్న జంతువులకు మోత బరువు. 

46:2 ప్రాచీన పశ్చిమాసియాలో ఒక జనం మరొక జనాన్ని ఓడించినప్పుడు ఓడిపోయినవారి దేవతామూర్తుల విగ్రహాల్ని తరలించుకొని పోయేవారు. గిల్గామెష్ పురాణంలో దైవాలు జలప్రళయం యెదుట భయపడి కుంగిపోయిన వర్ణన కనబడుతుంది. 

46:3-4 శేషించినవారలనే పదం రాబోతున్న తీర్పు నుండి బ్రతికి బయట పడే ఇశ్రాయేలీయుల్ని సూచిస్తుంది. వారు గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడు వారిని భరిస్తూనే ఉన్నాడు. 

46:5-7 చుట్టుప్రక్కల ఉన్న అన్యజనుల దేవతలు సృష్టిలో ఉన్నవాటినుండే దేవతలుగా చేయబడ్డాయి. ఈ ప్రకారంగా ఎల్గిల్ యుద్ధదేవత, ఇనన్నా ప్రేమదేవత, ఇయా జ్ఞానదేవత. అయితే దేవునికి భూమ్మీద ఉన్న దేనితోనూ పోలిక లేదు. బైబిల్లోని సాదృశ్యాలు దేవుని స్వభావాన్ని, చర్యల్ని రాజు, శూరుడు, శైలం, వెలుగు, సుడిగాలి మొదలైనవాటితో పోల్చి వర్ణించినప్పటికీ, ఈ సాదృశ్యాలు దేవుణ్ణి సృష్టిలోని అంశాలుగా వర్ణించవు.
విగ్రహాలైతే సృష్టిలోని పదార్థాలతో నిర్మించబడినవి. సృష్టిలోని అంశాలకు సంబంధించినవి. అంతకంటే అతీతమైనదేదీ విగ్రహాలకు లేదు. విగ్రహాలు మానవనిర్మాణాలు, ఈ విషయాన్ని యెషయా ఇదివరకే చెప్పాడు (44:12-13 నోట్సు చూడండి). 

46:8-9 జ్ఞాపకము చేసికొనడమంటే గతంలోని దేవుని శక్తిమంతమైన కార్యాల్ని మననం చేసుకొని బలం పొందడం. 

46:10-11 దేవుడు తూర్పు నుండి రప్పిస్తున్న క్రూరపక్షి పారసీక రాజైన కోరెషు (45:1). ఇది ఈ ప్రవచనంలోని ప్రధానాంశం. ఆదినుండి... కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను అనే వర్ణన యెహోవా సర్వాధిపత్యాన్ని తెలియజేస్తుంది. 

46:12-13 కఠినహృదయులై అనే పదం "అతిక్రమము చేయువారలారా" వంటిదే (వ. 8). వీరు తమ విడుదల కోసం యెహోవాను ఆశ్రయించడానికి నిరాకరించినవారు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |