Psalms - కీర్తనల గ్రంథము 116 | View All

1. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.

2. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును

3. మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
అపో. కార్యములు 2:24

4. అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.

5. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.

6. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.

7. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.

8. మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.

9. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.

10. నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
2 కోరింథీయులకు 4:13

11. నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
రోమీయులకు 3:4

12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

13. రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

14. యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను

15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది

16. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.

17. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను

18. ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

19. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-116. ఈ కీర్తనలో ఒక ఆరాధకుడు తన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి తనను రక్షించినదాన్ని బట్టి తన మొక్కుబడులు నెరవేర్చడానికి వచ్చి తన అర్పణలద్వారా దేవునికి బహిరంగంగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు. 

116:1-19 ఈ కీర్తనలోని కొన్ని పదాలు, భావనలు యోనా 2:2-9 వచనాల్లోను ఉన్నాయి. అనుభూతి పూర్వకమైన ఈ రెండు రచనల మధ్య సాహితీపరమైన సంబంధం కనిపిస్తుంది.

116:1 ప్రేమించు (హెబ్రీ. " ఆహావ్ ) - ఇక్కడ ఈ పదం నిబంధనా పూర్వకమైన సంబంధాన్ని సూచిస్తున్నది. ఇదే భావన ప్రాచీన పశ్చిమాసియాలో విజేతలకు, ఓటమి పాలైనవారికి మధ్య ఉండే ఒప్పందాల్లో సైతం కనబడుతుంది. 119:47-48,97,113; ద్వితీ 6:5; 11:1; 13:3 లను పోల్చండి.. ఈ వచనాలన్నిటిలో దేవుని వాక్యం పట్ల, ఆయన ఉద్దేశం పట్ల ఆయనను వెంబడించే వ్యక్తికుండే ప్రేమ గురించి వర్ణించబడింది.

116:2 ఆయన... చెవియొగెను - విజ్ఞప్తి మన్నించబడిందని అర్ధం. కీర్తనకారుడు తన కాలమంతా ఆయనకు మొఱ్ఱపెట్టేలా చేయడానికి కారణం యెహోవా విశ్వాస్యత. 

116:3-4 కీర్తనకారుడు తనకు పొంచి ఉన్న మరణాన్ని పాతాళంలోకి తనను లాగివేసే బంధములు అని పోల్చుతున్నాడు (18:4-5; యోనా 2:2,5-6). 

116:5 దయాళుడు, వాత్సల్యత గలవాడు గురించి 103:8; నిర్గమ 34:6-7 లతో పోల్చండి.

116:6 యెహోవా సాధువులను కాపాడువాడు - సామె 1:4 నోట్సు చూడండి. సాధువులంటే బుద్ధికుశలతలేని సామాన్యజనం లేదా వంచన గానీ మోసంగానీ తెలియని అమాయకులు. మనుషుల్లోని సామాజిక స్థాయీభేదాల్ని దేవుడు చూడడు. తన కృపను కనపరచడంలో ఆయన ఎటువంటి పక్షపాత
ధోరణీ చూపడు. క్రుంగి (హెబ్రీ. డాల్) యున్నవారు అంటే “ఆసరా, ఆశ్రయంలేని అల్పజీవులు” లేక “బలహీనులు" అని అర్థం. 

116:8-11 కీర్తనకారుడు మరణము నుండి తప్పించుకోవడం అతనినొక తీర్మానానికి, పరివర్తనకు నడిపించింది, సజీవులున్న దేశములో... కాలము గడుపుదును అని అతను వాగ్దానం చేస్తున్నాడు (27:13; యోనా 2:6-7 చూడండి). అందరూ తనను మోసం చేసినవారేనని తలంచిన కీర్తనకారుని కెదురైన ప్రతికూల పరిస్థితుల్లో అతని విశ్వాసమే ముందుకు నడిపించింది.

116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నే నాయన కేమి చెల్లింతును? దేవుని రక్షణానుభవాన్ని పొందిన వారందరి హృదయాలనుండి కృతజ్ఞత ప్రవహిస్తుంది. దానిని వారు తమ ప్రేమ ద్వారా (వ. 1), భక్తి ద్వారా (వ.2), నీతిమంతంగా జీవించడం ద్వారా (వ.9), కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా, దేవునికి విధేయులు కావాలని స్థిరంగా నిర్ణయించు కొనడం ద్వారా వ్యక్తం చేస్తున్నారు (వ.14).

116:13-14 ఎవరికైనా పాత్ర నివ్వడం సాధారణంగా ఎవరినైనా ఒత్తిడి చేసి అంగీకరింపజేయడమనే అర్థాన్నిస్తుంది. ఉదా: "క్రోధపాత్ర” (యెషయా 51:17), "తూలిపడజేయు పాత్ర" (యెషయా 51:22). అయితే ఇక్కడ కీర్తనకారుడు దేవుని నుండి రక్షణ పాత్రను అందుకున్నాడు.

116:15-16 తన భక్తుల జీవితాలను దేవుడు - జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వారి మరణ పరిస్థితులు ఆయన అదుపులో ఉంటాయి. (రోమా 8:28, 35-39). వారి మరణ సమయంలో ఆయన అక్కడ వారితో ఉంటాడు. వారి మరణము ఆయన దృష్టికి విలువ గలది. అది వారు సమస్త దుష్టత్వం నుండి విడిపించబడే సమయం. వారు ఈ లోక జీవితంలో ధన్యకరమైన విజయం పొంది యేసును ముఖాముఖిగా చూడడానికి పరలోకానికి తీసుకొని పోబడతారు (ఫిలిప్పీ 1:21-24 నోట్సు చూడండి). 

116:17-18 ఈ వచనాల్ని యోనా 2:9తో పోల్చి చూడండి. 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |