5:1-3 గెన్నేసంతు సరస్సుకు ఉన్న మరొక రెండు పేర్లు గలిలయ సముద్రం, తిబెరియ సముద్రం (యోహాను 6:1; 21:1). యేసు ఎంచుకున్న దోనె సీమోను పేతురుది. ఇంతకుముందు ప్రభువు స్వస్థపరచిన వారిలో పేతురు అత్త కూడ ఉంది. (4:38-39). యేసు దోనెలో కూర్చుండి బోధించాడు. బోధకుడు బోధించేటప్పుడు సాధారణ భంగిమ ఇదే (4:19-21 నోట్సు చూడండి).
5:4-7 రాత్రి అంతా పేతురు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయన్నది వాస్తవం. అయినా, నీ మాట చొప్పున వలలు వేతునని యేసుని ఆజ్ఞకు విశ్వాసంతో అతడు స్పందించాడు. వలలు పిగిలిపోయేంతగా, దోనెలు మునిగిపోయేటంతగా చేపలు పడ్డాయి. అతని విశ్వాసానికి తగిన ప్రతిఫలం దక్కింది. (పరిపాలకుడు), (2) పరిపాలన (పరిపాలించడానికి సార్వభౌమాధికారం), (3) పరిపాలించబడుతున్న ప్రదేశం (ఈ లోకం) (4) పరిపాలించబడేవాళ్లు (యేసుక్రీస్తు సువార్తను నమ్మేవాళ్లు). సువార్త గ్రంథాల్లో కొన్ని వాక్యభాగాలు దేవుని రాజ్యం ఇప్పటికే వచ్చిందని చెబుతుండగా (మత్తయి 12:28), మరికొన్ని వాక్యభాగాలు. అది భవిష్యత్తులోనే వస్తుందని మాట్లాడుతున్నాయి (మత్తయి 6:10)
5:1-3 గెన్నేసంతు సరస్సుకు ఉన్న మరొక రెండు పేర్లు గలిలయ సముద్రం, తిబెరియ సముద్రం (యోహాను 6:1; 21:1). యేసు ఎంచుకున్న దోనె సీమోను పేతురుది. ఇంతకుముందు ప్రభువు స్వస్థపరచిన వారిలో పేతురు అత్త కూడ ఉంది. (4:38-39). యేసు దోనెలో కూర్చుండి బోధించాడు. బోధకుడు బోధించేటప్పుడు సాధారణ భంగిమ ఇదే (4:19-21 నోట్సు చూడండి).
5:4-7 రాత్రి అంతా పేతురు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయన్నది వాస్తవం. అయినా, నీ మాట చొప్పున వలలు వేతునని యేసుని ఆజ్ఞకు విశ్వాసంతో అతడు స్పందించాడు. వలలు పిగిలిపోయేంతగా, దోనెలు మునిగిపోయేటంతగా చేపలు పడ్డాయి. అతని విశ్వాసానికి తగిన ప్రతిఫలం దక్కింది.
5:8-11 వారు పట్టిన చేపల రాశికి, ఆ అద్భుతానికి కారణమైన యేసు దైవశక్తినీ, పరిశుద్ధతనూ పేతురు పాత నిబంధనలో యోబు (42:5-6), యెషయా (6:5)ల వలె గ్రహించాడు. సీమోను పేతురుతోబాటు యాకోబు, యోహానులు యేసు ఆంతరంగిక అనుచరులయ్యారు. 19:28, మత్తయి 26:37) ఎలాంటి సువార్త పరిచర్యను సీమోను చేయబోతున్నాడో ఉదహరించడానికి విస్తారమైన చేపలను యేసు ఉపయోగించుకున్నాడు (మనుష్యులను పట్టు జాలరిగా; అపొ.కా.2:41: 4:4 చూడండి). పేతురు, ఇతర జాలరులు సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించారు. నిజమైన శిష్యత్వపు సారం ఇలాంటి సంపూర్ణమైన తీర్మానమే (14:26).
5:12-14 కుష్ఠరోగి విశ్వాసానికి స్పందించిన యేసు " అతణ్ణి వెంటనే స్వస్థపరిచాడు. అయితే ఈ స్వస్థత గురించిన సమాచారం వ్యాప్తి చేయకూడ దని యేసు అతనికి చెప్పాడు. శుద్ధి పొందినందుకు మోషే ధర్మశాస్త్ర (లేవి. 14:1-32) ప్రకారం చేయమనీ, తనకు జరిగిన స్వస్థతకు దృశ్యనీయమైన రుజువును చూపి యూదుల యాజకుని దగ్గర సాక్ష్యార్ధమై కనపరచుకోమనీ యేసు అతనికి ఆజ్ఞాపించాడు..
5:15-16 భూమిపై పరిచర్య చేసిన తొలినాళ్లలో యేసు బహిరంగ జీవితానికీ ఏకాంత జీవితానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని ఈ వచనాలు తెలియచేస్తున్నాయి. ఓ ప్రక్కన బహుజనసమూహములు ఆయన ప్రసంగాలను వింటూ ఉన్నారు. తమ రోగములను కుదుర్చుకుంటున్నారు. మరొక ప్రక్కన నిరాటంకంగా ప్రార్ధన చేసుకోడానికి తరచూ యేసు నిర్మానుష్యమైన ప్రదేశాల కోసం అన్వేషించేవాడు.
5:17-20 పరిసయ్యులు యూదుల మతాన్ని నిష్ఠగా, కఠోరమైన క్రమశిక్షణతో ఆచరించేవారు. మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్లని శాస్త్రులు అని పిలిచేవాళ్లు. ఈ శాస్త్రులు పరిసయ్యులతో సన్నిహితంగా ఉంటూ న్యాయవాదులుగా పనిచేసేవారు. యేసుని బోధల గురించి, స్వస్థపరచునట్లు ఆయనకున్న శక్తి గురించి ఈ నాయకులు విన్నారు. ఆయనను శ్రద్ధగా పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. పక్షవాతం గల వ్యక్తికున్న స్నేహితులు అతణ్ణి యేసుని సన్నిధిలోనికి తీసుకురావాలని చూపిన పట్టుదల వాళ్లకున్న బలమైన విశ్వాసముకు ప్రతీక. అయితే దేవుని కుమారునిలో విశ్వాసం ద్వారా పాపాలకు క్షమాపణ పొందడమే మనిషికున్న అత్యంత గొప్ప అవసరం. యేసు ఆ అత్యవసరతపై తన దృష్టిసారించాడు.
5:21-25 పక్షవాయువు గలవాని పాపములను క్షమించానని చెప్పడం ద్వారా తానే దేవునిలా యేసు ప్రవర్తిస్తున్నాడని శాస్త్రులు పరిసయ్యులూ గ్రహించారు. వాళ్లు ఆయనను దేవునిగా గుర్తించలేదు. అందువల్ల ఆయన వ్యాఖ్యల్ని దేవదూషణలుగా పరిగణించారు. మనిషి అంతరంగంలో ఏముందో
యేసుకు తెలుసు కాబట్టి ఆయన వాళ్ల ఆలోచనలెరిగి ఉన్నాడు (యోహాను 2:24-25). లూకా 5:22లో వాళ్ల సందేహపూరిత హృదయాలను యేసు బట్టబయలు చేశాడు. పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం కంటే మీ పాపాలు క్షమించబడ్డాయో లేదో తెలుసుకోడానికి దృశ్యనీయమైన సాక్ష్యాలు ఉండవు. పాపాలు క్షమించడమనే అదృశ్యమైన అద్భుతాన్ని చేయడానికి శక్తి తనకు ఉందని నిరూపించడానికి పక్షవాతం గల వ్యక్తిని స్వస్థపరచడమనే దృశ్యనీయమైన అద్భుతాన్ని యేసు చేసి చూపించాడు. లేచి... ఇంటకి వెళ్ళుమని యేసు చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి లేచి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఇంటికి వెళ్లాడు.
5:26. యేసు చేసిన అద్భుతాన్ని చూసి పరిసయ్యులూ శాస్త్రులూ జనసమూహంలో ప్రతీ ఒక్కరూ విస్మయమొందిరి. దేవుని మహిమపరిచిన వారిలో అవిశ్వాసులైన శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. యేసు చేసిన అద్భుతాన్ని తృణీకరించడం సాధ్యం కాని పని. అయితే ఆయన చేసిన బోధకు లోబడడం, ఆయన తన గురించి చేసుకుంటున్న వ్యాఖ్యల భావం వారికి భరించలేనివిగా ఉన్నాయి.
5:27-28 సుంకరి పన్నులు వసూలు చేసే కార్యాలయంలో (సుంకపు మెట్టు) కూర్చుని సుంకం వసూలు చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో గలిలయ గుండా వెళ్ళే ఒక అంతర్జాతీయ రహదారిలో పన్నులు వసూలు చేసే కార్యాలయం ఉండి ఉంటుంది. లేవికి ఉన్న మరొక పేరు మత్తయి (మత్తయి 9:9; 10:3). సమస్తమును విడిచిపెట్టి... ఆయనను వెంబడించిన (వ.8-11 నోట్సు చూడండి) సీమోను యాకోబు యోహానుల్లాగా లేవి కూడా ఒక శిష్యత్వపు తీర్మానాన్ని చేసుకున్నాడు.
5:29-30 లేవి యేసుకు శిష్యుడు కావడం చాలా బహిరంగంగా జరిగింది. అందరికీ తెలిసింది. అతడు యేసుకు మర్యాదపూర్వకమైన గొప్ప విందును సిద్ధం చేసి, తనతోటి సుంకరులను ఆ విందుకు ఆహ్వానించాడు. సుంకరులు అపవిత్రులని ఎంచబడేవారు. కాబట్టి పరిసయ్యులూ శాస్త్రులూ (వ.17-20 నోట్సు చూడండి) జరుగుతున్న ఈ విందు విషయంలో ఆగ్రహించారు. భక్తి గల యూదులు సామాజికంగా అంటరానివాళ్లుగా పరిగణించబడే సుంకరులతో, పాపులతో (ఆచారపరంగా అపవిత్రులైనవారితో) సాంగత్యం చేసేవారు కాదు. లేవి తోటి యూదుడే, అయితే అతడు రోమా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాడు కాబట్టి అతణ్ణి యూదులు తృణీకరించారు.
5:31-32 పరిసయ్యులనూ వారి మిత్రబృందాలను ఆరోగ్యవంతులుగా నీతిమంతులుగా యేసు ప్రస్తావిస్తున్నాడు. దానికి భిన్నంగా సుంకరులనూ వారి స్నేహితులనూ రోగులుగా పాపులుగా యేసు పేర్కొన్నాడు. పరిసయ్యులు ఎవరినైతే పాపులుగా పరిగణించారో వాళ్లు తాము ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులమనీ, తమను మారుమనస్సుకు నడిపించే ఆధ్యాత్మిక వైద్యుని అవసరం తమకెంతోగానో ఉందని గ్రహించారు (3:2-3 నోట్సు చూడండి). ఆవిధంగా వ్యాధిగ్రస్తుల యెడల, పాపుల యెడల యేసుకు చాలా ఉన్నతమైన శ్రద్ధ ఉంది.
5:33 పరిసయ్యులు తమ శిష్యులతోనూ యోహాను శిష్యులతోనూ యేసు శిష్యులను పోల్చి వారి ప్రవర్తన పట్ల అభ్యంతరాన్ని వెలిబుచ్చారు. యేసు ఉపవాసానికి వ్యతిరేకి కాదు (మత్తయి 4:2; 6:16-18), అయితే లేవి లాంటి వాళ్లు ఏర్పాటు చేసిన (వ.29-30 నోట్సు చూడండి) విందుల్లో తిని త్రాగుచుండడానికి ఆయన తన శిష్యులను అనుమతించాడు. పరిసయ్యులు ఆచరించే కఠినమైన ఉపవాస ఆచారానికి ఇది పూర్తి భిన్నమైంది. వారానికి రెండుసార్లు (18:12), ప్రాయశ్చిత్త దినాన (లేవీ 16:29), బబులోనీయులు యెరూషలేమును నాశనము చేసిన సంఘటనను జాపకం చేసుకుంటూ సంవత్సరంలో 4 సార్లు (జెకర్యా 8:19), వీటికి అదనంగా ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు వాళ్లు ఉపవాసం చేస్తుండేవాళ్లు.
5:34-35 యేసు తననుతాను పెండ్లి కుమారుడుగా పోల్చుకుంటూ ఉపవాసమనే అంశాన్ని పెండ్లికి ముడిపెట్టాడు. వివాహ విందు సమయంలో దైవ పెండ్లికుమారుడు కొనిపోబడక ముందు (అంటే సిలువ, పునరుత్థానం, ఆరోహణాలకు ముందు) ఉపవాసం చేయడం సరైన పని కాదు..
5:36 యేసు రెండు ఉపమానాలు చెప్పాడు. కొత్త గుడ్డతో పాతబట్టకు మాసిక వేయలేరనే నియమాన్ని మొదటి ఉపమానం అన్వయించింది. పాత గుడ్డ కొత్త దానిని చింపేస్తుంది. పాత వస్త్రంలో అది కలవదు. ఉపవాసం గురించిన వివాదంలో తన సందేశం విప్లవాత్మకమైందనీ (నూతనమైందనీ), అంతకుముందే ఉనికిలో ఉన్న యూదు మతాచారాలకు (పాత వస్త్రానికి) మాసికగా పనిచేయదనీ యేసు ఉదహరించాడు.
5:37-39 యేసు చెప్పిన రెండవ ఉపమానపు. సందేశం కూడా మొదటి ఉపమానం లాంటిదే. అయినప్పటికీ ఇందులో కొంత అదనపు సమాచారం ఉంది. పాత తిత్తులలో క్రొత్త (పూర్తిగా పులియని) ద్రాక్షారసమును పోయకూడదు. ఎందుకంటే అది వాటిని పిగిలిపోయేలా చేసి పనికిరాకుండా చేస్తుంది. క్రొత్త ద్రాక్షరసమును (యేసు సందేశాన్ని) క్రొత్త తిత్తులలో (యేసుక్రీస్తు సంఘంలోకి; మత్తయి 16:18 చూడండి) పోయాలి. అయితే యేసు చెబుతున్న మాటలను వింటున్న వారిలో చాలామంది యూదుమతాన్ని హత్తుకొని ఉండడానికి ఒక సహజమైన కారణముంది: (ఎంతో కాలంగా పులిసి, మత్తెక్కించేదిగా ఉన్న) పాత ద్రాక్షరసం (స్థిరపరచబడిన యూదుల మతాచారం) రుచిగా (సుపరిచితంగా, సౌకర్యవంతంగా) ఉంటుంది.