Luke - లూకా సువార్త 5 | View All

1. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,

గలలీకి మరో పేరు గెన్నేసరెతు. ఇక్కడ యేసుప్రభువు చెప్పిన మాటలను “దేవుని వాక్కు” అనడం గమనించండి. యోహాను 7:16-17; యోహాను 12:49-50; యోహాను 14:24; యోహాను 17:8 చూడండి.

2. ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.

3. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.

4. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా

అన్నీ తెలిసినట్టుగానే నీటిలో చేపలు ఎక్కడున్నాయో కూడా యేసుప్రభువుకు తెలుసు. యోహాను 21:4-7 కూడా చూడండి. ఈ రెండు ఒక ముఖ్య సత్యాన్ని నేర్పించే ఉదాహరణ సహితమైన పాఠాలు. యేసు ఆదేశాల మేరకు చేసే మన శ్రమకు ఫలితం ఉంటుంది. మనల్ని నడిపించేది మనమే అయితే మన శ్రమకు సరైన ఫలితం ఉండదు.

5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.

6. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా

7. వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

8. సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడ నని చెప్పెను.

యేసు మానవ మాత్రుడు కాదని పేతురు గ్రహించాడు. ఆయన సమక్షంలో ఉండేందుకు కూడా తాను తగననుకున్నాడు. యెషయా 6:5; యోబు 40:4; యోబు 42:6; ప్రకటన గ్రంథం 1:17 పోల్చి చూడండి. క్రీస్తు పవిత్రత వెలుగులో మనుషులు తమ పాపస్థితిని, భ్రష్ట స్వభావాన్ని గ్రహించగలుగుతారు. దీని తరువాత పేతురు క్రీస్తువెంట వెళ్ళాడు. క్రీస్తు తనను వదిలి వెళ్ళిపోవాలని అతడు నిజంగా కోరలేదు.

9. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరును విస్మయ మొందిరి.

10. ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

పేతురు తన పాపాన్నీ అయోగ్యతనూ కొంత గ్రహించాడు. అయితే అందుకోసం అతడు భయపడనక్కర్లేదు. నిజానికి ఇలాంటి గ్రహింపే అతణ్ణి మనుషుల్ని పట్టే జాలరిగా అయ్యేందుకు బాగా ఉపకరించింది. “మనుషులను పట్టేవారి” గురించి మత్తయి 4:19 చూడండి.

11. వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

మత్తయి 4:18-22.

12. ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.

మత్తయి 8:2-4.

13. అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.

14. అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని
లేవీయకాండము 13:49, లేవీయకాండము 14:2-32

15. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చు చుండెను.

16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యము లోనికి వెళ్లుచుండెను.

“ప్రార్థన”– లూకా 3:21; లూకా 6:12; లూకా 9:28; మత్తయి 14:23; మత్తయి 26:36; మార్కు 1:35; మార్కు 6:46; హెబ్రీయులకు 5:7; హెబ్రీయులకు 7:25.

17. ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.

మత్తయి 9:2-8. “పరిసయ్యులు”– మత్తయి 3:7. ప్రభువు ఒక స్థలంలో ఉంటే రోగాలు బాగుచేసే ప్రభావం కూడా అక్కడ ఉంటుందనుకోవచ్చు. ఒక విధంగా ఇది నిజమే. అయితే మార్కు 6:5 చూడండి.

18. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసి కొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచు టకు ప్రయత్నము చేసిరి గాని

19. జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

మార్కు 2:4.

20. ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా, నీ పాప ములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా,

21. శాస్త్రు లును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.
యెషయా 43:25

22. యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?

23. నీ పాపములు క్షమింపబడి యున్న వని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?

24. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను.

25. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.

26. అందరును విస్మయమొందినేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి.

27. అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా

లూకా 9:9-13 చూడండి. మత్తయి మరో పేరు లేవి.

28. అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.

29. ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితో కూడ భోజన మునకు కూర్చుండిరి.

30. పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.

31. అందుకు యేసురోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు.

32. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

33. వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు; ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.

మత్తయి 9:14-17.

34. అందుకు యేసుపెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింప గలరా?

35. పెండ్లికుమా రుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.

36. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగాఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు.

37. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును.

38. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను.

39. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.

పాపాలకు క్షమాపణ, దేవునితో శాంతి సమాధానాలు, ఆనందం, రక్షణ, శాశ్వత జీవాలను ఇచ్చే క్రీస్తు శుభవార్త అనే కొత్త ద్రాక్షరసాన్ని రుచిచూచేందుకు కొంతమంది ఎంత వెనుకాడుతుంటారు! వారి చాదస్తాలు, కొత్తది ఏది వచ్చినా దాన్ని అంగీకరించలేని సనాతనత్వం, పాత పద్ధతుల గురించిన అతిశయం మొదలైనవన్నీ కలసి వారు ఇంతకు ముందెన్నడూ అనుభవించని దాన్ని త్రోసిపుచ్చేలా చేస్తాయి. దావీదు కీర్తనల గ్రంథము 34:8 లో చెప్పినట్టు చేయడం వివేకం.


Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.