Matthew - మత్తయి సువార్త 1 | View All

4. పెరెసు ఎస్రోమును కనెను,ఒ ఎస్రోము అరామును కనెను, అరాము అమీ్మన ాదాబును కనెను, అమ్మీనాదాబును నయస్సోనును కనెను;
రూతు 4:13, రూతు 4:17-22, 1 దినవృత్తాంతములు 2:10-12

5. నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;
రూతు 4:13, రూతు 4:17-22, 1 దినవృత్తాంతములు 2:10-12

6. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
రూతు 4:17, రూతు 4:22, 2 సమూయేలు 12:24, 1 దినవృత్తాంతములు 2:13-15

7. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
1 దినవృత్తాంతములు 3:10-14

8. ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;

9. ఉజ్జియా యోతామును కనెను,యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;

10. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;

12. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;
1 దినవృత్తాంతములు 3:17, 1 దినవృత్తాంతములు 3:19, ఎజ్రా 3:2

13. జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;

14. అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;

15. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను;

16. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

17. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.

18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
నిర్గమకాండము 33:20

19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది;

21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను.

22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

23. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
యెషయా 7:14, యెషయా 8:8, యెషయా 8:10

24. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని

25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 ఈ వంశావళి శీర్షిక మత్తయి సువార్తలో అనేకమైన ముఖ్యాంశాలను పరిచయం చేస్తుంది. యేసు మెస్సీయ (క్రీస్తు)గా, తన ప్రజలను పాలించడా నికి దేవునిచే అభిషేకించబడిన రాజుగా గుర్తించబడ్డాడు. యేసును దావీదు కుమారుని (వ.20; 2:2; 9:27; 12:3,23; 15:22; 20:30-31; 21:9,15)గా గుర్తించడం ద్వారా ఇది పునరుద్ఘాటించబడింది. 2సమూ 7:16; యెషయా 9:2-7 వంటి పా.ని. ప్రవచనాలు, మెస్సీయ (“అభిషిక్తుడు") దావీదు రాజు సంతానమై ఉంటాడని ముందుగా చెప్పాయి. యేసు దావీదు వంశంలో పుట్టడం, ఆయన ఈ అర్హత కలిగి ఉన్నాడని చూపిస్తుంది.
అబ్రాహాము ఇశ్రాయేలీయులకు తండ్రి అయినట్లే, యేసు నూతన ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు వ్యవస్థాపకుడు కాబోతున్నాడు అని “అబ్రాహాము కుమారుడు" అనే పేరు సూచిస్తుంది. యేసు క్రీస్తు వంశావళి అనే మాటలు అసాధారణం. పా.ని. వంశావళులు, ఆయా వంశాల పితరుని పేరునుబట్టి ఉండేవి. ఎందుకంటే అతనినుండే అందరూ వచ్చారు కాబట్టి ఆ వ్యక్తి అత్యంత ప్రముఖుడు అని యూదులు భావించేవారు. మత్తయి తాను రాసిన వంశావళిని వంశక్రమములో చివరి వాడైన యేసు పేరుతో యేసు క్రీస్తు వంశావళి అని పేర్కొనడాన్ని బట్టి, తన ముందున్న వారందరికంటే యేసు మరింత ప్రముఖుడు అనే విషయాన్ని సూచిస్తున్నాడు. 

1:2-6 తాను రాసిన వంశావళిలో మత్తయి నలుగురు స్త్రీలను పేర్కొన్నాడు. వీరందరూ అన్యజనులే. తామారు కనానీయురాలు, రాహాబు యెరికో వాసి, రూతు మోయాబీయురాలు, ఊరియా భార్యగా నుండిన బత్పైబ, బహుశా హితీయురాలు కావచ్చు. ఈ స్త్రీల పేర్లు ప్రస్తావించడం, తన విమోచన
ప్రణాళికలో అన్యజనులు, స్త్రీలు ఉన్నారనే దేవుని ఉద్దేశాన్ని సూచిస్తుంది. అనేకమంది రాజుల పేర్లు రాసినా, రాజు అని దావీదుకు మాత్రమే ప్రత్యేకంగా రాశాడు. ఇది, దావీదు కుమారుడు (యేసు) కూడా రాజవుతాడని ఎత్తి చూపుతుంది. 

1:7-16 మత్తయి రాసిన వంశావళి 1దిన 1-3; లూకా 3:23-38 లో ఉన్న వంశావళులలో అబ్రాహామునుండి దావీదు వరకు ఉన్న తరాలతో ఏకీభవిస్తుంది. దావీదు తర్వాత ఉన్న మత్తయి వంశావళి, కొన్ని కావాలని ఇచ్చిన ఖాళీలు తప్ప 1దిన లోని వంశావళితో ఏకీభవిస్తుంది; కానీ లూకా రాసిన వంశావళితో చాలావరకు వేరుగా ఉంది. దీన్నిబట్టి కొందరు వ్యాఖ్యాతలు, కొ.ని.లో ఉన్న వాటిలో ఒకటిగాని లేక రెండూ గాని తప్పు అని వాదిస్తారు. అయితే దావీదు వంశంలోని యూదులు తమ వంశావళులను జాగ్రత్తగా భద్రపరచారు. ఎందుకంటే పా.ని. ప్రవచనాలను బట్టి తమ సంతానంలో ఒకరు మెస్సీయ కాబోతున్నారని వారికి తెలుసు. యెరూషలేములోని బలిపీఠానికి కట్టెలు అందించే భాగ్యాన్ని కూడా దావీదు వంశీకులు పొందారని కొన్ని సాంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి వారు తమ ఆధిక్యతలను కాపాడుకోవడం కోసం, తాము దావీదు వంశీకులమని చూపించే ఆధారాలను పదిలపరచుకున్నారు. జోసీఫస్, రబ్బీల పుస్తకాల్లో ఉన్న ఆధారాలను బట్టి, వంశావళుల జాబితాలు ప్రభుత్వ దస్తావేజులలో దాచేవారని తెలుస్తున్నది.

మత్తయి, లూకా సువార్తలలో ఉన్న వంశావళులను సామరస్య పరచడానికి పండితులు అనేక విధానాలు సూచిస్తారు. మొదటిది, యేసు వంశావళిని ఒకటి మరియ ద్వారా, మరొకటి యోసేపు ద్వారా కనుపరుస్తున్నదనేది. రెండవది. మరిది ధర్మం అమలు పరచబడిన వివాహ సాంప్రదాయం ప్రకారం ఆ దంపతులకు పుట్టిన శరీరరీత్యా ఒకరు, చట్టబద్ధంగా ఒకరు తండ్రులుగా పిలవబడేవారు. కాబట్టి ఈ వంశావళుల్లో ఒకటి శరీరసంబంధమైన వంశావళినివ్వగా, రెండవది "చట్టబద్ధమైన వంశావళిని అనుసరించినది అయివుండవచ్చు. మూడవదిగా, ఒక వంశావళిలో ఒకవేళ దావీదు రాజ్యము కొనసాగితే ఏలుబడి చేసే దావీదు చట్టబద్ధమైన సంతానం జాడను సూచిస్తుంటే, రెండవది నిర్దిష్టంగా యోసేపు వంశావళిని సూచిస్తుండవచ్చు. లేక ఈ రెండింటి కలయిక కూడా కావచ్చు. మిగిలిన వంశావళి అంతా అక్కడక్కడా తల్లుల పేర్లు పేర్కొన్నప్పటికీ ప్రధానంగా తండ్రులమీద దృష్టిపెట్టినా, 2.16లో మత్తయి ఉపయోగించిన గ్రీకు స్త్రీలింగ సర్వనామము బట్టి, మత్తయి యేసుకు ఒక మానవతల్లిని గుర్తించినట్లు ఉంది కానీ మానవ తండ్రిని సూచించలేదు. ఆ విధంగా యేసు కన్యక గర్భాన జన్మించాడని చెప్పినట్లయింది.

1:17 యేసు వంశావళిని పదునాలుగు తరములున్న మూడు విభాగాలుగా మత్తయి ఏర్పాటు చేయడం, బహుశా అక్షరాలకు సంఖ్యల విలువను ఆపాదించే (ఉదా., అ=1, ఆ=2, మొ||) విధానమైన "గెమెట్రియా" కు మాదిరి కావచ్చు. ఇది అంతర్లీనంగా ఒక సున్నితమైన సందేశాన్ని తెలియజేయడం కోసం కావచ్చు. హెబ్రీ భాషలో "
దావీదు" పేరులో ఉన్న అక్షరాల మొత్తం సంఖ్య పద్నాలుగు. ఆ విధంగా, యేసు దావీదు సంతానమని ఎత్తి చూపడానికి మత్తయి ఇలా కళాత్మకంగా రాసివుండవచ్చు. ఒకవేళ మత్తయి కావాలనే గెమెట్రియా ఉపయోగించివుంటే, అతడు తన సువార్తను మొదట హెబ్రీ భాషలో రాశాడనే దృక్కోణాన్ని అది సమర్థిస్తుంది. ఎందుకంటే ఆ గెమెట్రియా విధానం గ్రీకు భాషలో కాక హెబ్రీ భాషలోనే అర్ధవంతంగా ఉంటుంది.

1:18 యేసు క్రీస్తు జననవిధమెట్లనగా అనే మాటలు గ్రీకులో నొక్కి చెప్పబడ్డాయి. అంటే వంశావళిలోని ఇతరులు జన్మించిన సమయంలోని పరిస్థితుల కంటే యేసుక్రీస్తు జన్మించినప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పడం దీని ఉద్దేశం. ఈ వంశావళిలోని అనేకుల జననం కూడా అద్భుతాలవల్ల జరిగినప్పటికీ వారందరికీ ఒక పురుషుడు తండ్రిగా ఉన్నాడు. యేసు మాత్రమే కన్యక ద్వారా జన్మించాడు. మరియ యోసేపునకు ప్రదానము చేయబడినది. అయితే ప్రాచీన యూదుల ప్రదానం, చట్టబద్ధమైన వివాహంతో సమానం. ఆ దంపతులు కలిసి ఉండలేదు లేక లైంగికంగా కలవలేదు. కానీ ప్రదానం రద్దు చేసుకోవాలంటే విడాకులు తీసుకోవలసిందే (1:19లోని యోసేపు నిర్ణయానికి కారణం ఇదే). వారేకము కాకమునుపు అంటే యోసేపు, మరియలు ఇంకా లైంగికంగా కలవలేదు. అందువల్ల మరియ విశ్వాసఘాతకురాలైందని యోసేపు భావించాడు. పరిశుద్దాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే మరియ గర్భం దాల్చడం ఆత్మ ద్వారా జరిగిన అద్భుతం అని అర్థం. అంతేగాని దేవుడు శరీరం ధరించి ఆమెను గర్భవతిని చేశాడనే భావం కనిపించదు. ఇది యేసు జననాన్ని గ్రీకు పురాణాలలో దేవుళ్ళు స్త్రీలతో శయనించగా సంతానం కలగడం అనేదానితో నాటకీయంగా భిన్నమైనదిగా కనపరుస్తుంది..... 

1:19 యోసేపు బహిరంగంగా మరియను అవమానపరచదల్చుకోలేదు. ఎందుకంటే అతడు నీతిమంతుడు. అతని తోటివారు బహుశా అతడు ఆమె పాపాన్ని బట్టబయలు చేస్తాడని భావించి వుంటారు. అయితే యథార్ధమైన నీతి, కరుణ, కనికరాలతో కూడి వుంటుంది. ఇది మత్తయిలోని ముఖ్యాంశాల్లో ఒకటి (5:6-7, 21-26, 38-48). 1:20 దేవుడు పాత నిబంధనలో యోసేపు విషయంలో చేసినట్లుగా (ఆది 37:1-11), ఈ యోసేపుతో కూడా కలలద్వారా మాట్లాడాడు. దావీదు కుమారుడవైన అనే పిలుపు యోసేపుకు అతని రాజవంశాన్ని జ్ఞాపకం చేసి, మెస్సీయ జన్మను ప్రకటించడానికి సిద్ధపరచింది. గర్భము... పరిశుద్ధాత్మవలన, గురించి వ.18 నోట్సు చూడండి.

1:21 "యెహోవా రక్షించును" అని అర్థమిచ్చే "యెహోషువ" అనే హెబ్రీ నామానికి గ్రీకు రూపం యేసు. యేసు నామం ఆయన ఉద్దేశాన్ని బయల్పరుస్తుందని దేవదూత వివరించాడు. ఆయన పాపులను వారు పొందాల్సిన శిక్షనుండి విమోచిస్తాడు. ఈ రక్షణ యేసును అనుసరించేవారుగా గుర్తించబడే తన ప్రజలనుభవిస్తారు. ఈ 1:22-23 ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట అంటే ప్రవక్తలు చెప్పిన, రాసిన సందేశాలకు దేవుడే అసలైన రచయిత అని కనపరుస్తుంది. యెషయా 7:14 లోని వాక్యభాగాన్ని పరిచయం చేయడానికి మత్తయి ఉపయోగించిన వ్యాకరణం (మత్తయి 1:23) దేవదూత యోసేపుకు చేసిన ప్రకటనలో కనిపిస్తుంది. మత్తయి - యెషయా 7:14ను సరిగ్గా ఉపయోగించలేదని కొందరు వ్యాఖ్యాతలు వాదిస్తారు, కానీ అతడు దేవదూత చెప్పినట్లుగానే దానిని ఉపయోగించినట్లు కనబడుతుంది. ఆ
ఇమ్మానుయేలు (దేవుడు మనకు తోడు) అనే పేరు యేసు దైవత్వాన్ని • సూచిస్తుంది. కన్యక మరియకు పుట్టిన కుమారుడు దేవుడై యుండి, తన
ప్రజల మధ్య నివసిస్తాడు. యెషయా 7:14లోని ఇమ్మానుయేలును, యెషయా 9:2-7; 11:1-9లో వివరించిన వ్యక్తితో గుర్తించాల్సి వుంది. 1:24-25 ఈ వచనాలు దేవదూత మాటకు యోసేపు పరిపూర్ణంగా లోబడడాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ రెండు అధ్యాయాలలో ఇది ప్రబలంగా కనిపించే అంశం (2:13-15,19-21). యేసు శిష్యులు కనపరచాల్సిన విధేయతకు యోసేపు ఒక మంచి మాదిరి (5:19-20). ఆమెను ఎరుగకుండెను అనేమాటలు యేసు కన్యగర్భం ద్వారా జన్మించినవాడని మరొకసారి నిర్ధారిస్తున్నాయి. 


Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |