Revelation - ప్రకటన గ్రంథము 15 | View All

1. మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.
లేవీయకాండము 26:21

2. మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

3. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
నిర్గమకాండము 15:1, నిర్గమకాండము 15:11, నిర్గమకాండము 34:10, ద్వితీయోపదేశకాండము 32:4, కీర్తనల గ్రంథము 92:5, కీర్తనల గ్రంథము 111:2, కీర్తనల గ్రంథము 139:14, కీర్తనల గ్రంథము 145:17, యిర్మియా 10:10, ఆమోసు 4:13

4. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
కీర్తనల గ్రంథము 86:9, యిర్మియా 10:7, మలాకీ 1:11

5. అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను.
నిర్గమకాండము 38:21, నిర్గమకాండము 40:34-35, సంఖ్యాకాండము 1:50

6. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించు కొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి.
లేవీయకాండము 26:21

7. అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను.
కీర్తనల గ్రంథము 75:8, యిర్మియా 25:15

8. అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.
1 రాజులు 8:10-11, 2 దినవృత్తాంతములు 5:13-14, యెషయా 6:3, యెహెఙ్కేలు 44:4, లేవీయకాండము 26:21, నిర్గమకాండము 40:34-35



బైబిల్ అధ్యయనం - Study Bible
15:1 ప్రకటన గ్రంథంలో ఇది మూడవ సూచన. యేడుగురు దూతలు వారికి సంబంధించిన తెగుళ్ళు (ఐగుప్తుపై తీర్పుగా వచ్చిన, తెగుళ్ళను జ్ఞాపకం చేసుకుంటే) విషయంలో ఇది మొదటి రెండింటికన్నా భిన్నమైనది (12:1,3). వీటిని “కడవరి తెగుళ్ళు" అని పిలిచాడు, ఎందుకంటే అవి దేవుని కోపమును సమాప్తం చేస్తాయి. ఏడవ క్రోఢపాత్ర (16:17,21) 11:19 లో జరుగుతుందని కనిపించేదాన్ని సరిగ్గా నెరవేరుస్తుంది కాబట్టి క్రోధ పాత్రల క్రమం (15:1-19:5), బూరల క్రమం ముగింపు నుండి, క్రీస్తు రెండవ రాకడ వరకు (19:11-16) ఉంటుంది.

15:2-4 1 అగ్నితో కలిసియున్న అనే మాటలు తీర్పు పాత్రల అంతిమలక్ష్యమైన మహా బబులోనును మింగేసిన అగ్నిని దృష్టిస్తున్నట్లు కావచ్చు. (16:17-21; 18:8-9, 18), ప్రతిమను... జయించినవారు “నిత్య సువార్త”కు సరిగ్గా స్పందించి, దేవునికి భయపడి, ఆయనను మహిమపరచి, ఆరాధించిన (14:6-7 నోట్సు చూడండి) హతసాక్షులు (12:11). దేవుని దాసుడగు మోషే కీర్తన నిర్గమ 15లో కనిపిస్తుంది.. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులైన తమ తరుమువారిని తప్పించుకుని, ఎర్ర సముద్రం అద్దరిని క్షేమంగా చేరినపుడు దాన్ని పాడారు. ప్రక 15:3-4ను దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొట్టిపిల్ల కీర్తనయు అని పిలవడం, ఈ హతసాక్షులు ఆధ్యాత్మికంగా “అద్దరికి క్షేమంగా చేరారని” అంటే పరలోకం చేరారని భావం ఇస్తుంది.

15:5-8 పరలోకమందు... - ఆలయము - చివరిగా 11:19లో చివరి బూర ఊదినప్పుడు కనిపించింది. ఈ పుస్తకంలో సాక్ష్యపు గుడారం అని ఇంతకు ముందు వాడిన గ్రీకుపదం “పరలోక నివాసులను” సూచిస్తుంది. (7:15; 13:6 చూడండి). తెగుళ్ళు చేతపటుకొనియున్న దూతలు పా.ని. యాజకులు ధరించే దుస్తులు ధరించారు. బంగారు పాత్రలని పేర్కొనడం, ప్రభువు యెదుట “పరిశుద్ధుల ప్రార్థనలు” అనే సువర్ణ పాత్రలను జ్ఞాపకం చేస్తాయి (5:8). ముఖ్యంగా తమ రక్తం కోసమై “భూనివాసుల”పై ప్రతీకారం తీర్చమనే హతసాక్షుల ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది (6:10), మూడవ ఉగ్రత పాత్రకు ఉపయోగించిన మాటలు (16:4-7), ముఖ్యంగా “బలిపీఠము” నుండి వచ్చిన స్వరాన్ని పేర్కొనడం (16:7), ఈ ఏడు బంగారు పాత్రలను దేవుని కోపముతో నిండియున్న “పరిశుద్దుల ప్రార్థనల"తో కలిపినట్లు కావచ్చు. దేవుని మహిమనుండి... వచ్చిన పొగతో ఆలయము నింపబడడం,
అరణ్యములో దేవుని మహిమ, మేఘము ప్రత్యక్షపు గుడారాన్ని నింపడాన్ని జ్ఞాపకం చేస్తూ (నిర్గమ. 40:34), దేవుడు తన ప్రజలతో ఉండి వారిని నడిపిస్తున్నాడని సూచిస్తుంది.


Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |