Job - యోబు 15 | View All

1. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?

3. వ్యర్థసంభాషణ చేత వ్యాజ్యెమాడ దగునా? నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

4. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

5. నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.

6. నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.

7. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?

8. నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
రోమీయులకు 11:34

9. మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?

10. నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులును మాలో నున్నారు నీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.

11. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా నున్నదా?

12. నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?

13. దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?

14. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?

15. ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు.ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.

16. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా.

17. నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను.

18. జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.

19. అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.

20. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును.

21. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.

22. తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.

23. అబ్బా,ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.

24. శ్రమయు వేదనయు వానిని బెదరించును.యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.

25. వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.

26. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.

27. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కల పైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.

28. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు

29. కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు

30. వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.

31. వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును.

32. వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.

33. ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును

34. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును

35. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.బైబిల్ అధ్యయనం - Study Bible
15:1-3 ఎలీఫజు తార్కిక ప్రశ్నలకు జవాబులు నిషేధార్థంలో ఉన్నాయి. నిజమైన జ్ఞానిలాగా కాక యోబు తనను తాను సమర్థించుకొనడం స్వార్థంతో కూడినదేనని, అది నిరర్ధకమైన తెలివి అని, తూర్పు గాలి విసిరినట్టు యోబు తన భావోద్రిక్తతల్ని బయటకు వెళ్లగక్కుతున్నాడని ఎలీఫజు ప్రత్యుత్తరం. తన కడుపులోతుల్లోకి దూసుకుపోయినట్టుగా ఉన్న తీవ్రంగా వీచే తూర్పు గాలి (హెబ్రీ. ఖాసిమ్ లేదా సిరాకో) లాగా తన కోరికను వ్యక్తపరుస్తున్నాడు (1:19 చూడండి). 

15:4 యోబు మితిమీరిన వైఖరి దేవుని పట్ల అతడు యుక్తమైన భక్తిని చూపకుండా చేస్తోందని ఎలీఫజు సూచిస్తున్నాడు. అటువంటప్పుడు యోబు తాను జ్ఞానినని ఏ విధంగా అనుకోగలడు? దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉండడం జ్ఞానానికి మూలం (సామె 1:17 చూడండి). 

15:5-6 యోబు తన స్నేహితుల హితోపదేశాలకు ఇచ్చిన ప్రత్యుత్తరంలో అతని పాపము వెల్లడవుతున్నదనీ, అతడు మోసపూరితమైన మాటలు పలుకుతూ తన అపరాధాన్ని సమర్థించుకుంటున్నాడనీ ఎలీఫజు అభిప్రాయం. అయితే యోబు ఎలీఫజు మాటల్ని ఖండిస్తున్నాడు (9:20). 

15:7-10 యోబుకు తాను ఎక్కువ జ్ఞానవంతుడనని చెప్పుకొనే హక్కులేదని గుర్తుంచుకోవాలని ఎలీఫజు మాటల్లోని భావం (12:1-3; 13:1-2). ఎలీఫజు వ్యంగ్యధోరణిలో యోబు అందరికంటే ముందు పుట్టినవాడు కాదనీ, దేవుని ఆలోచన సభలో (1:6;2:1) పాల్గొన్నవాడు కాదనీ ఎత్తిపొడుస్తున్నాడు.
యోబు యొక్క తండ్రికాలం ముందునుండి ఉంటూ కాలపరీక్షకు నిలబడి నెగ్గిన జ్ఞానము యోబు. స్నేహితులైన తమలో ఉందని ఎలీఫజు చెబుతున్నాడు.

15:11-13 దేవుని మీద నీవేల ఆగ్రహపడుచున్నావు? - యోబు తన భావ తీవ్రతలో అనాలోచితంగా దేవుని మీద కోపం ప్రదర్శిస్తూ పరుషంగా మాట్లాడుతున్నాడని ఎలీఫజు వాదన (7:1-2,11-20; 9:14-19; 10:3, 17; 13:25-27). 

15:14-16 దేవుడు తన దూతల్లో సైతం లోపాల్ని చూడగలిగినప్పుడు (4:18), ఆయన యెదుట నరుడు ఏపాటివాడు? మనిషి స్వాభావికంగానే అపవిత్రుడు. 

15:17-19 ఎలీఫజు తాను తన విశేషజ్ఞానం నుండి, అపారమైన జీవితాను భవం నుండి చెప్పాలనుకుంటున్నానని తెలియజేస్తున్నాడు (4:8-9,12-21; 5:3-7,27). తన అనుభవం, జ్ఞానవివేచన తన దేశంలో మొట్టమొదట నివసించిన పితరుల నుండి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయక జ్ఞానం నుండి సంక్రమించినవనీ, అవి అన్యుల సహవాసం వలన కలుషితం కాలేదనీ ఎలీఫజు తెలియజేస్తున్నాడు.

15:20 దేవుడు నీతిమంతుల్ని ప్రత్యేకంగా ఏమీ చూడడం లేదని (9:22), దుష్టులకు భూమిని అప్పగించాడని(9:24;10:3) యోబు అభిప్రాయపడ్డాడు. దుష్టులు తమ స్వల్ప జీవితాన్ని బాధ ననుభవిస్తూ గడుపుతారని జోఫరు చెప్పిన అభిప్రాయంతో ఎలీఫజు ఏకీభవిస్తున్నాడు (11:20). భిన్న ధృవాల్లాగా ఉన్న ఈ రెండు వైఖరుల్లో ఏదీ వాస్తవంతో సరిపడడంలేదు. 15:21 తమ మీదకెవరైనా దాడిచేస్తున్నారేమోనని దుష్టులు తలంచేలా ఈ భీకరమైన ధ్వనులు చేస్తున్నాయి. దుష్టులకు నిజంగా క్షేమకాలము అనేది ఉండదు. 

15:22 నీతిమంతుడి నిరీక్షణకు భిన్నంగా (కీర్తన 23:6; 27:13), దుష్టులకు హింసాత్మకమైన మరణం, తీర్పు ఎదురవుతాయి (కీర్తన 1:4-6).

15:23 దుష్టుడు నిలకడ లేక దేశదిమ్మరిలాగా తిరుగుతాడని ఎలీఫజు దృఢమైన అభిప్రాయం.

15:24-25 దేవుని మీదకు చేయి చాపును - దుష్టుడు దేవుని మీద సైతం తిరగబడతాడని ఎలీఫజు మాటల్లోని భావం. 

15:26 మార్కొనును అనే పదానికి అక్షరాలా “మెడను సారించు” (మెడ వంచక) అని అర్థం. దుష్టుడు అతిశయించి లెక్కలేకుండా దేవుని మీదకు దూసుకువెళ్తాడని భావం. 

15:27-29. క్రొవ్వు అనే పదం అలంకారిక వర్ణనలో ఆరోగ్యాన్ని, సంపదను సూచిస్తుంది. (ఆది 45:18). అయితే ఈ పదం ప్రతికూలార్థంలో గర్వాన్ని సూచిస్తుంది (కీర్తన 73:3-7). ఇక్కడ ఈ రెండు అర్థాలూ స్ఫురిస్తున్నాయి.

15:30 సూర్యుని వేడి లేదా నిప్పులు చెరిగే ఎడారి గాలి లేతకొమ్మల్ని వాడిపోజేసినట్టుగా (దహించును) దుష్టులు దేవుని తీర్పులో అన్నీ కోల్పోతారు (4:8-9; యెషయా 11:3-4). దేవుని నోటి - దేవుని తీర్పును సూచించే అలంకారిక వర్ణన. ఆయన ఊపిరి ఎంతటి కార్యాన్నైనా చేయగల ఆయన శక్తిని సూచిస్తుంది. ఆయన ఊపిరి దుష్టుల్ని నశింపజేయడం ఎడారి గాలి లేతకొమ్మల్ని వాడిపోజేయడమనే దృష్టాంతాన్ని సూచిస్తుంది.

15:31 నిష్ప్రయోజనమైన వాటిని నమ్ముకొనడం నిజంగా నిష్ప్రయోజన కరమే. 

15:32-38 దుష్టుల ఆకస్మిక అంతాన్ని దృష్టాంతాల ద్వారా కళ్లకు కట్టినట్టు ఎలీఫజు వర్ణిస్తున్నాడు. దుష్టులు వారు సంపాదించుకున్న దానిని అనుభవించకుండానే అంతమవుతారు (22:15-16; సామె 10:27). 

15:34 భక్తిహీనుల దుర్నీతికరమైన సాంఘిక ఆచారాలు (సామె 17:8; యెషయా 5:23; మీకా 3:11; 7:3), చివరికి వారికే చేటును తెస్తాయి (సామె 15:27), వాటి వలన వారు లాభపడేదేమీ ఉండదు.

15:35 భక్తిహీనులు తమ దుష్ట లక్ష్యాలను సాధించకపోగా, వారి కడుపున దుష్కార్యము, పాపము, కపటము పుడతాయి. అవే వారి సంతానం. ఇతరుల్ని నాశనం చేయడానికి ఏం చేయాలనుకుంటారో అదే వారిని నాశనం చేస్తుంది. గర్భమున అనే పదం, వ.2లోని “తన కడుపు” అనే పదం ఒకే మూలపదం నుండి ఉత్పన్నమయ్యాయి. 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |