Peter II - 2 పేతురు 2 | View All

1. మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

2. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
యెషయా 52:5

3. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.

4. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

5. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
ఆదికాండము 8:18

6. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,
ఆదికాండము 19:24

7. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
ఆదికాండము 19:1-16

8. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.

9. భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు,

10. శిక్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు.

11. దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.

12. వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,

13. ఒకనాటి సుఖాను భవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగ ములయందు సుఖించుదురు.

14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి,

15. తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.
సంఖ్యాకాండము 22:7

16. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
సంఖ్యాకాండము 22:28

17. వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.

18. వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.

19. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా

20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును.

21. వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు.

22. కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.
సామెతలు 26:11



బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-3 పా.ని. ఇశ్రాయేలులో ఆత్మచే ప్రేరేపించబడిన దైవజనులే కాక, అబద్ధప్రవక్తలు కూడా ప్రజలలో ఉండేవారు. ఇప్పుడు కూడా పేతురు పాఠకుల మధ్యలో అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ “అబద్ధ బోధకులు" నాశనకరమగు భిన్నాభిప్రాయములను లేక విశ్వాసానికి నష్టం కలిగించే బోధలు విస్తరింప జేస్తున్నారని పేతురు. హెచ్చరిక వివరిస్తుంది. వారు తమ్మును కొనిన ప్రభువును “సార్వభౌముడైన ప్రభువు"ను; గ్రీకు. డెస్ఫోటెస్) కూడా నిరాకరించేటంతగా వారి బోధ ప్రభావం విస్తరించింది. ఈ దుర్బోధకుల అవమానకరమైన అపవిత్రతను అనేకులు అనుసరించి, సత్యమార్గము దూషించబడినట్టు చేసినా, ప్రభువును నిరాకరించడం ద్వారా తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకోవడం (వ.3తో పోల్చండి) అని ఈ అబద్ధ బోధకులు గుర్తించలేకపోతున్నారు. దురాశచేత ఈడ్వబడి, ఈ అబద్ధ బోధకులు మోసపూరితమైన కథలను సృష్టించి (1:16లో పేతురుకు పూర్తి వ్యతిరేకంగా), వాటితో తమ శ్రోతలను కొల్లగొట్టారు. 

2:4-10 తన పాఠకులను హెచ్చరించి, వారిని కార్యోన్ముఖులను చేయడానికి పేతురు దేవుని తీర్పు, విమోచనలకు సంబంధించిన మూడు ఉదాహరణలను జ్ఞాపకం చేశాడు: (1) దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు తీర్పుతీర్చాడు. (ఆది 6:1-4 తో పోల్చండి). (2) జలప్రళయం సమయంలో కూడా దేవుడు ప్రాచీన లోకానికి తీర్పు తీర్చాడు. (ఆది 7:17 - 23తో పోల్చండి) కానీ నోవహును మరి యేడుగురిని కాపాడాడు (ఆది. 7:13-16తో పోల్చండి). (3) అవినీతితో నిండిన సొదొమ గొమొజా పట్టణములకు తీర్పుతీర్చాడు. (ఆది 19:23-29తో పోల్చండి), అయితే దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు (ఆది 19:29తో పోల్చండి). దేవుడు తన భక్తులను వారి మధ్యనున్న అబద్దబోధకుల నాశనకరమైన దుర్బోధల నుండి తప్పించడానికి సమర్థుడని పేతురు తన పాఠకులకు ఎత్తి చూపాడు. అబద్ధ బోధకులు అవినీతిపరులుగా జీవిస్తున్నప్పటికీ, మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు ఉండే అనీతిపరులు, దేవుని సార్వభౌమాధికారాన్ని లేక శిక్షను తప్పించుకోలేరు అని పేతురు తన పాఠకులకు నొక్కి వక్కాణించాడు.

2:10-22 పేతురు అబద్ధ బోధకులను " ఇంకా వర్ణిస్తూ, వారు తెగువగలవారు, స్వేచ్ఛాపరులు, వారికంటె శక్తిమంతులైన దేవదూతలను దూషించడానికి సహితం భయపడనివారు అన్నాడు. వారు మృగములవలె అవగాహనలో వివేకశూన్యులు, దేవదూషకులు, శరీరాశలు, దురాశల చేత నిండినవారు. అబద్ధ బోధకులను పేతురు బిలాము (సంఖ్యా 22-24)తో పోల్చాడు. బిలాములాగా ఈ అబద్ధ బోధకులు కూడా తిన్నని మార్గమును విడిచి, లోభత్వంతో నిండి, వారి అవినీతికి తగిన ఫలితాన్ని పొందుతారు. బిలాముకంటె బిలాము గాడిద మరి ఎక్కువ వివేకాన్ని చూపింది! అబద్ధ బోధకులను నీళ్ళులేని బావులు, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములుగా వర్ణించాడు. మరొకలా చెప్పాలంటే వారు అసంతృప్తులు, అస్థిరులు. వారికి శిక్షగా గాడాంధకారము భద్రం చేయబడి వుంది. వారి వ్యర్ధమైన డంబపు మాటలు, ఇతరులను స్వతంత్రులను చేస్తామనే వాగ్దానాలు చేస్తూ, తాము ఎలాంటి ఆత్మీయ బానిసత్వానికి, భ్రష్టత్వానికి దాసులైవున్నారో, ఇతరులను కూడా అలాగే నడిపిస్తున్నారు. ఈ దుర్బోధకులు తాము క్రీస్తును ఎరుగుదుమని ఒకప్పుడు చెప్పినా, పాపం నుండి కొంతవరకు స్వేచ్ఛను అనుభవించినా, తిరిగి తమ పాత ఆచారాలకు మరలిపోయి వాటిలో చిక్కుబడిపోయారు. ఆరంభంలో అజ్ఞానంగా ఉన్నదానికంటే చివరిలో క్రీస్తును తృణీకరించిన స్థితిని బట్టి వారు మరింత భయంకరమైన స్థితిలోకి జారిపోయారు. నిజానికి నీతిమార్గము... అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, పంది మళ్ళీ బురదలో దొర్లడానికి వెళ్ళినట్లు, ఈ అబద్ధ బోధకులు తమ స్వాభావికమైన దుర్నీతి జీవితానికి మరలిపోయారు. అబద్ధ బోధకుల దుర్నీతి జీవితం, అసలు వారు ఎన్నడూ యథార్గంగా మారుమనస్సు పొందనేలేదని వెల్లడి చేస్తుంది. 


Shortcut Links
2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |