Matthew - మత్తయి సువార్త 20 | View All

1. ఏలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

2. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

3. తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

4. మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

5. దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.

6. తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా

7. వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.

8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
లేవీయకాండము 19:13, ద్వితీయోపదేశకాండము 24:15

9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.

10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.

11. వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,

12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి.

13. అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;

14. నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

15. నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను.

16. ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

17. యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

18. ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి

19. ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.

20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా

21. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

22. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు త్రాగగలమనిరి.

23. ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.

24. తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి

25. గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.

26. మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;

27. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండ వలెను.

28. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

29. వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహు జనసమూ హము ఆయనవెంట వెళ్లెను.

30. ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

31. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.

32. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా

33. వారుప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి.

34. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
20:1-7 యూదుల ఉపమానాలలో ధనవంతుడైన ఇంటి యజమాని వంటి అధికారమున్నవారు, సాధారణంగా దేవుని సూచిస్తారు. దేనారము అంటే మొదటి శతాబ్దంలో ఒక రోజు కూలి.

20:8 చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారి వరకు అనే మాటలు 19:30ని జ్ఞాపకం చేస్తూ ఈ ఉపమానం అక్కడ నేర్పించిన సూత్రానికి ఉదాహరణ అని చూపుతుంది. 


20:9-12 ఒక్క గంట మాత్రమే పనిచేసినవారు, రోజుకూలి అయిన . దేనారము పొందేసరికి, మిగిలిన కూలీలు దామాషా ప్రకారం గంటకు ఒక దేనారము చొప్పున పొందుతామని ఆశించారు. 

20:13-15 వారి జీతం సాధారణంగా అంగీకరించబడిన మొత్తం కాబట్టి, మొదటగా వారు ఆ జీతానికి పనిచేయడానికి అంగీకరించారు (వ.2), కాబట్టి కూలీలు నిరసించడానికి హక్కులేదు. తన సొంతసొమ్ముతో తన ఇష్ట ప్రకారం చేయడానికి యజమానికి స్వేచ్ఛ ఉన్నట్టుగానే, దేవుడు తన కృపను తాను నిర్ణయించుకున్నట్లుగా పంచిపెట్టవచ్చు. మొదట కూలికి పెట్టబడిన వ్యక్తులు, 19:16-26లోని స్వనీతిపరునిలాగా తమను తాము దేవునికి ప్రాముఖ్యమైనవారమని భావించేవారు. చివరిగా కూలికి తీసుకొనబడినవారు, త్యాగపూరితంగా జీవిస్తూ, వారు ఆశించినదానికన్నా, యోగ్యమైనదానికన్నా ఎక్కువ పొందబోయే, పన్నెండుమంది శిష్యులవంటివారు. 

20:16 ఇది 19:30ని మరలా చెబుతుంది. ద్రాక్షతోట పనివారి ఉపమానా నికి ముందు, తరువాత ఇది పునరావృతమైంది. కాబట్టి, ఇది ఉపమానాన్ని వ్యాఖ్యానించడానికి తాళపుచెవివంటిది. 20:1 ఆరంభంలో ఉన్న సముచ్చ
యం (ఏలాగనగా). ఈ చర్చను యేసు శిష్యులు పొందబోయే ఊహించని ప్రతిఫలానికి దీన్ని జోడిస్తుంది.

20:17-19 పేతురు ఒప్పుకోలు దగ్గర్నుండి, ఇది యేసు తన మరణం గురించి చెప్పిన మూడవ పెద్ద ప్రవచనం (16:21; 17:22-23 చూడండి). ప్రతి ప్రవచనంలో అదనపు వివరాలు కలుస్తాయి. ఈసారి ఆయన అపహసిం చుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువవేయుటకును అన్యజనుల చేతికి తాను అప్పగింపబడతానని చెప్పాడు.

20:20 యాకోబు, యోహానులు జెబెదయి కుమారులు (4:18-22 నోట్సు చూడండి). 

20:21 ప్రపంచ పునర్జననమందు, తన శిష్యులు పన్నెండు సింహాసనాల
మీద కూర్చుని ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చుతారని యేసు వాగ్దానం ఈ చేశాడు (19:28-29). ఇప్పుడు యాకోబు, యోహానులు తమ తల్లిద్వారా, మిగిలిన వారికంటె ప్రాధాన్యతను సంపాదించుకోవాలని ప్రయత్నించారు. పేతురుతోపాటు, వారిద్దరు యేసు ఆంతరంగికులైన ముగ్గురు శిష్యులు. యేసు పేతురును 16:23లో గద్దించాడు కాబట్టి పేతురుకున్న ప్రాధాన్యత కలిగిన స్థానాన్ని తాము పొందాలని వారు ఆశించివుంటారు.

20:22-23 పాత్ర శ్రమకు సాదృశ్యం (26:39). యేసు ప్రశ్న ఆయన వారికోసం శ్రమపడుతున్నట్లుగా వారు ఆయనకోసం శ్రమపడగలరా అని శిష్యుల సిద్ధమనస్సును పరిశోధించింది. మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు అనేమాటలు, యాకోబు (అపొ.కా.12:1-2), యోహాను శ్రమలను ముందుగా సూచిస్తున్నాయి. మత్తయి 20:1-16లోని ఉపమానం, యోగ్యతను బట్టి కాక తండ్రి తాను ఎంచుకున్నట్లుగా బహుమానాలు ఇస్తాడని చెబుతుంది. పరలోకంలో
అత్యధిక ఆశీర్వాదాలు - ఎవరు అనుభవిస్తారో అని నిర్ణయించే స్వేచ్ఛ తండ్రిదేననే సూత్రాన్ని యేసు మరలా నిర్ధారించాడు. 

20:24-28 శిష్యుల మధ్య పోటీ వారిలోని గర్వాన్ని బయటపెట్టింది. తాను చూపిన దీన సేవక మాదిరికి యేసు తన శిష్యులను పిలిచాడు. విశ్వాసుల కోసమై విమోచన క్రయధనముగా చెల్లించబడే ఆయన సొంత త్యాగపూరిత మరణం ఆయన దీనత్వానికి పరాకాష్ట. యేసు మాటలు యెషయా 53లోని అంశాలను ప్రతిధ్వనిస్తాయి. ఆ మాటలను మత్తయి 8:17లో మత్తయి యేసుకు అన్వయించాడు.

20:29-34 దీనికి సమాంతరంగా ఉండే మార్కు 10:46-52 లోని వాక్యభాగం, ఒక్క గుడ్డివానినే సూచిస్తుంది, యిద్దరు గ్రుడ్డివారు కాదు. అయితే మార్కు తాను పేర్కొన్న గుడ్డివాని పేరు ప్రస్తావించడాన్ని బట్టి, బహుశా మార్కును చదివిన అసలు పాఠకులకు ఆ గుడ్డివాడు తెలిసివుంటాడు. మార్కు రెండవ గుడ్డివానిని పేర్కొనకపోవడానికి కారణం, తన పాఠకులు ఎరిగిన వ్యక్తిపై దృష్టిపెట్టాలని అతడు భావించినందువల్ల కావచ్చు. దావీదు కుమారుడు అనే మాటను గురించి, 1:1 నోట్సు చూడండి.

Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |