Psalms - కీర్తనల గ్రంథము 89 | View All

1. యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

2. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.

3. నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను
యోహాను 7:42, అపో. కార్యములు 2:40

4. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)
యోహాను 12:34, యోహాను 7:42, అపో. కార్యములు 2:40

5. యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.

6. మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

7. పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
2 థెస్సలొనీకయులకు 1:10

8. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

9. సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.

10. చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
లూకా 1:51

11. ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.
1 కోరింథీయులకు 10:26

12. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.

13. పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

14. నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.

15. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.

16. నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.

17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.

18. మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.

19. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.
మార్కు 1:24, లూకా 1:35, అపో. కార్యములు 3:14, అపో. కార్యములు 4:27-30

20. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
అపో. కార్యములు 13:22

21. నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.

22. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు.

23. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.

24. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.

25. నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.

26. నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.
1 పేతురు 1:17, ప్రకటన గ్రంథం 21:7

27. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.
ప్రకటన గ్రంథం 1:5, ప్రకటన గ్రంథం 17:18

28. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

29. శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

30. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల

31. వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల

32. నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.

33. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.

34. నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.

35. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు

36. చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు
యోహాను 12:34

37. నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.
ప్రకటన గ్రంథం 1:5, ప్రకటన గ్రంథం 3:14

38. ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.

39. నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.

40. అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు

41. త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.

42. అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు

43. అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు

44. అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు

45. అతని ¸యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)

46. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

47. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?

48. మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

49. ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?

50. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.
హెబ్రీయులకు 11:26, 1 పేతురు 4:14

51. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.
హెబ్రీయులకు 11:26, 1 పేతురు 4:14

52. యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్ఆమేన్‌.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-89. యెరూషలేము నాశనాన్ని గూర్చి, పతనమైన దావీదు వంశాన్ని గూర్చి, అదే సమయంలో యేసు క్రీస్తు ద్వారా దావీదు వంశం శాశ్వత కాలముంటుందన్న దేవుని వాగ్దానాన్ని గూర్చిన ప్రార్థన. 

శీర్షిక: ఎజ్రాహీయుడైన ఏతాను లేవీయుడైన సంగీత విద్వాంసుడు (1దిన 15:17-19). ఈ కీర్తనకు, 2సమూ 7, 1దిన 17 లకు సంబంధం ఉందనడంలో పొరబాటు లేదు. 

89:1 కృపాతిశయము గురించి 77:8 నోట్సు చూడండి. 

89:2 స్థాపింపబడుననియు అనే క్రియాపదంలో నిబంధనకున్న ప్రాముఖ్యత కనబడుతుంది (2సమూ 7:5,13,27; 18న 17:4,10,12). 

89:3 దావీదును, అతని సంతానాన్ని నేను ఏర్పరచుకొనిన అనే పదాలు సూచిస్తున్నాయి. యెహోవా తన నిబంధనలో భాగంగా ఇశ్రాయేలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని చెబూ తన బాధ్యతను స్వీకరిస్తున్నాడు. 

89:4 తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదను. దావీదుతో దేవుడు చేసిన నిబంధన "సింహాసనము" అంటే అతడు శాశ్వతకాలం సింహాసనాసీనుడై పరిపాలిస్తాడని అర్థం. (వ.29, 36-37 కూడా చూడండి). దేవుని ఈ వాగ్దానం దావీదు సంతానంలోని అందరికీ సంబంధించింది కాదన్నది స్పష్టం. ఉత్తర రాజ్య ప్రజలు అవిధేయులైనప్పుడు వారిని శత్రువుల బానిసత్వానికి అప్పగించినట్లే దావీదు వంశపురాజులు దేవునికి అవిధేయులైనప్పుడు దేవుడు వారిని కూడా తొలగించాడు (వ.38-51). అయితే ఈ వచనం. నెరవేర్పు కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తులో కనిపిస్తున్నది. “అతని (దావీదు) సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను” (అపొ.కా.13:23) అని అపొస్తలుడైన పేతురు అన్నాడు. గబ్రియేలు దూత మరియతో “ప్రభువైన దేవుడు ఆయన (యేసు) తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును... ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును" అని చెప్పాడు (లూకా 1:32-33; 1:69తో పోల్చండి). 

89:7 పరిశుద్ధ దూతల సభలో -వ.5 చూడండి; 82:1 నోట్సు చూడండి. 

89:8 సైన్యములకధిపతివగు (హెబ్రీ. సెవావోత్ ) అనేది యెహోవాను యుద్దశూరునిగా వర్ణించే సైనిక పరిభాష...

89:9-10 రహబు సముద్రంలో అల్లకల్లోలాన్ని సృష్టించేదిగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీన పశ్చిమాసియా పురాణగాథల్లోని జలరక్కసి. ఈ కల్పిత కథనానికి భిన్నమైన వాస్తవం ఏమిటంటే, సముద్రాన్ని సృష్టించిన దేవునిదే దాని మీద సర్వాధిపత్యం (సముద్రపు పొంగు నణచువాడవు నీవే) (కీర్తన 74:13-17). 

89:11 కీర్తన 50:12- "లోకమును దాని పరిపూర్ణతయు నావే”. యెషయా 48:13- “నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను స్థాపించెను" - (యెషయా 51:13; ఆమోసు 9:6; జెకర్యా 12:1లతో పోల్చండి) 

89:12 ఉత్తర దక్షిణ దిక్కుల్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్నీ దేవుడే సృష్టించాడని కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. నిర్మించితివి (హెబ్రీ. బారాఆ) సృష్టించాడనే అర్థాన్నిచ్చే ఈ పదాన్ని ఎప్పుడూ దేవునికొక్కడికే ఉపయోగించారు. తాబోరు హెర్మోనులు ఉత్తర దిక్కున ఉన్న ముఖ్యమైన పర్వతాలు. 

89:14 నీతిన్యాయములు దేవుని మహాత్మ్యానికి వేదికగా ఉన్నాయి. ప్రాచీన పశ్చిమాసియా గాథల్లో “నీతి”, “న్యాయము" రాజు సింహాసనానికి ఆధారంగా నిలిచే దివ్యశక్తులు. వీటితోబాటు, కృపాసత్యములు యెహోవా గుణలక్షణాలు. యెహోవా సింహాసనము ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని తెలియజేస్తున్నది (97:2).

89:15-17 దేవుని ప్రజలు స్తుతి చెల్లించడానికి పిలిచే పిలుపును గుర్తించి (శృంగధ్వనుల నెరుగు), ఆయన సన్నిధిలో (ముఖకాంతిని చూచి) సంతోషిస్తారు (హరించుచున్నారు) (1:1; 15:1 నోట్సు చూడండి). యెహోవా తన దక్షిణహస్తాన్ని పైకెత్తినప్పుడు (89:13), ఆయన ప్రజలు ఘనతనొందుతారు (హెచ్చింప బడుచున్నారు). దేవుని దయచేతనే ఇశ్రాయేలు ఘనతను, గౌరవాన్ని, గుర్తింపును పొందింది. కొమ్ము బలాన్ని, శక్తిని వర్ణించే అలంకారిక దృష్టాంతం (75:5). ఇది 89:24 లోను కనబడుతుంది. దేవుడు తన నామాన్ని బట్టి అతని కొమ్ము (దావీదు)ను హెచ్చించాడు.

89:18 ఇశ్రాయేలు కేడెము వారి రాజు. దేవుని సహాయంతో రాజు తన ప్రజల్ని కాపాడతాడు. దేవుడే... రాజును నియమించాడు. రాజు దేవుని సేవకుడు (వ.19-20). అందుచేత రాజు యెహోవాకు చెందినవాడు (యెహోవా వశము).

89:19 దర్శనమున వ.3-4 లను సూచిస్తున్నది. ఇది దావీదు నిమిత్తం నాతానుకు కలిగిన దర్శనాన్ని లేదా దైవోక్తిని సూచిస్తుండవచ్చు (2సమూ 7:1-17). దేవుడు ప్రజల్లో నుండి ఎన్నుకున్న శూరుడు దావీదు (శూరునికి, ప్రజలలో నుండి యేర్పరచబడిన యొకని). యెహోవా తన దక్షిణహస్తాన్ని పైకెత్తాడు (వ.13), దేవుని ప్రజలకు హెచ్చింపు కలిగింది. (వ.16), వారికి విజయం లభించింది. (కొమ్ము హెచ్చింపబడుచున్నది - వ.17). ఇప్పుడు దేవుడు తానెన్నుకున్న రాజును హెచ్చించాడు.

89:20-38 కీర్తనలోని ఈ భాగం 2సమూ 7:14-17; 18న 17:3-15 లతో పోలిక గలిగి ఈ కీర్తనకు ఆ యా వచనభాగాలకు సంబంధాన్ని సూచిస్తున్నది. 

89:20. రాజుల్ని, యాజకుల్ని పరిశుద్ధ తైలముతో అభిషేకించేవారు. రాజుగా యాజకులుగా దేవుడు వారిని నియమించాడనీ, వారు యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగి, దైవాత్మ(పరిశుద్దాత్మ)ను కలిగి ఉన్నారనీ తెలియజేసే సాదృశ్యమిది. (లేవీ 4:3-4,16; న్యాయాధి 9:8; 1రాజులు 19:16; యెషయా 61:1)

89:21-22 దేవుని చెయ్యి ఆయన విశ్వాస్యతను (వ.2), దావీదు వంశాన్ని (వ.4), దైవబలాన్ని (నా బాహుబలము అతని బలపరచును) స్థాపిస్తుంది. దేవుని బాహువు బలమైనది కాబట్టి (నా బాహుబలము), ఆయన నియమించిన రాజులు బలవంతులుగా ఉంటారు.

89:23 2సమూ 7:10 లోని వాగ్దానం దావీదుకు మాత్రమే వర్తిస్తుంది.

89:24 కొమ్ము - వ.15-17 నోట్సు చూడండి. హెచ్చింపబడును - వ.13,15-17,19 నోట్సు చూడండి. 

89:25 దావీదు దేవుడిచ్చిన అధికారంతో పరిపాలిస్తాడు. అతని ప్రభుత్వం పడమర దిక్కున ఉన్న మధ్యధరా సముద్రము నుండి తూర్పున ఉన్న టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల వరకు విస్తరిస్తుంది. కుడిచేతిని అనే పదం ఎప్పుడూ దేవుడు, ఆయన ప్రతినిధి (రాజు) అధికారాన్ని, ఏలుబడిని సూచిస్తుంది, వారి కార్యాలు వారి అధికారాన్ని వెల్లడిచేస్తాయి (వ.12-13,25,42 దగ్గర పదాధ్యయనం చూడండి; వ.13 నోట్సు చూడండి). 

89:26 దేవుడు తండ్రి అనే భావన ఆయన రాజును ఎన్నుకొని అతణ్ణి అంగీకరించాడని తెలియజేస్తుంది. ప్రాచీన . పశ్చిమాసియా , గాథల్లోను ఈ భావన కనబడుతుంది, ఫరోలు లేదా ఇతర రాజులు తమను తాము దైవపుత్రులుగా పరిగణించుకోవడం పరిపాటి. కీర్తనలోని ఈ భావం దావీదు వంశంలో నుండి వచ్చిన దావీదు కుమారుడు, దేవుని కుమారుడునైన క్రీస్తులో సంపూర్ణంగా నెరవేరింది. 

89:27 ఈ కీర్తన ప్రధానంగా దావీదు గురించి మాత్రమే చెబుతున్నా, 2సమూ 7:14 లోని తండ్రి కుమారుని సంబంధం మటుకు దావీదు కుమారుడైన సొలొమోనును సూచిస్తుంది. జ్యేష్ఠకుమారునికి సాధారణంగా తండ్రి నుండి ప్రత్యేకమైన దీవెన, రెండింతల స్వాస్థ్యం లభిస్తాయి. అత్యున్నతునిగా నుంచెదను అనే పదాలకు హెబ్రీ సమాంతరం (ఎలియాన్) దేవుణ్ణి “సర్వోన్నతుడు” గా వర్ణిస్తుంది (87:5; 91:1). ఈ మాటలు దావీదుకు తగినవేయైనప్పటికీ, ఇవి క్రీస్తులోనే సంపూర్ణంగా నెరవేరాయి. 

89:29 దావీదు వంశం శాశ్వతకాలం ఉంటుందని దేవుడు ప్రమాణపూర్వకంగా చెబుతున్నాడు. ఆకాశమున్నంత వరకు దావీదు పాలన శాశ్వతంగా కొనసాగుతుంది. కీర్తన 72:5,17 వచనాలు రాజు పాలనను సూర్యునితో పోల్చుతున్నాయి. ఇది ప్రాచీన పశ్చిమాసియా ఆలోచనా స్రవంతిలోని సాధారణ భావప్రకటన. 

89:30 అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి... 30-37 వచనాలలోని దేవుని వాగ్దానాలు దావీదు వంశీయుల రాజ్యపాలన సదాకాలం కొనసాగుతుందని గాని, లేక ఈ రాజుల వ్యక్తిగత రక్షణల గురించి గాని నిశ్చయంగా చెప్పడం లేదు. అవి దావీదు వంశంలో ఒకరిని (అంటే యేసును) శాశ్వత సింహాసనం మీద స్థాపించడం అనే దేవుని సంకల్పంలో ఇశ్రాయేలీయుల, వారి రాజుల అపనమ్మకత్వం ఏ విధంగానూ జోక్యం చేసుకోలేవని దావీదుకు అభయమిస్తూ చేసిన వాగ్దానాలు (వ.36-37). 

89:33-34 అవిధేయత, అన్యాయం, దైవికమైన శిక్ష ఉన్నప్పటికీ, యెహోవా వాగ్దానాలు రద్దు కావు (లేవీ 26:44; యిర్మీయా 14:21; జెకర్యా 11:10). దేవుని స్వభావం అచంచలమైనది (మలాకీ 3:6; హెబ్రీ 13:8), అందుచేత ఆయన వాగ్దానాల్లో ఏ మార్పు ఉండదు (102:27-28; యెషయా 51:6-8; 55:10-11). 

89:35-36 దావీదు సింహాసనం శాశ్వతమైంది, సూర్యుడున్నంత కాలము చంద్రుడున్నంతకాలము. స్థిరంగా ఉంటుంది. (72:5,17). ఈ కీర్తనలోని పరిభాష ప్రాచీన కాలంలో రాజులు దానాలిస్తూ పూర్తి పూచీకత్తుతో ధారాదత్తం చేసేటప్పుడు చేసే నిబంధనను పోలి ఉంది. రాజులు ఎవరికి దానమియ్యాలను కుంటున్నారో వారి పట్ల ఏకపక్షంగా తమ నమ్మకాన్ని, దత్తతను ప్రదర్శిస్తారు. మింటనుండు సాక్షి చంద్రుడు కావచ్చు, లేదా దేవుని సింహాసనం కావచ్చు, లేదా యెహోవాయే కావచ్చు. 

89:37 యెహోవా ఒక్కడే తన పరిశుద్ధత తోడని ప్రమాణము చేయగలడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, అబద్ధమాడడు (78:3.6; యెషయా 57:11; హెబ్రీ 6:17-18). 

89:38-39 ఈ వచనాల్లో కీర్తనకారుని స్వరం మారింది. (వ.38-45). దేవుడు తన నిబంధనను (ఇట్లు సెలవిచ్చి యుండియు) భంగపర్చాడని, అదే తన ప్రస్తుత పరిస్థితులకు కారణమని కీర్తనకారుడు ఆరోపిస్తున్నాడు. విడనాడి విసర్జించియున్నావు అంటూ యెహోవా తన సేవకుని పట్ల చూపవలసిన నిబంధనా పూర్వకమైన విశ్వాస్యతను చూపలేదని కీర్తనకారుడు ఆరోపిస్తున్నాడు.

89:40-41 యెరూషలేము శత్రువుల దాడికి గురైంది. దాని ప్రాకారాలు పడిపోయాయి, దాని బురుజులు పాడయ్యాయి. నిందాస్పదుడాయెను గురించి 44:13-16 నోట్సు చూడండి. 

89:43 యెహోవా దావీదు శత్రువుల్ని హెచ్చించడం మాత్రమే కాదు, దావీదు సైన్యం విజయం సాధించకుండా వారి శక్తిని కూడా తొలగించాడు. 

89:44 వైభవమును అనే పదానికి “మిరుమిట్లు గొలిపే ప్రకాశం, పరిశుద్ధత" అని అక్షరార్థం. వైభవం. కోల్పోడం, రాజకీయ పతనాన్ని నైతికపతనంతో (విగ్రహారాధన ద్వారా అపవిత్రం కావడం) ముడి పెడుతున్నది. ఇది ఇశ్రాయే లును దేవునికి దూరం చేసింది. రాజు సింహాసనం నేలమట్టమైంది, అతని కిరీటానికి ధూళి అంటింది. ఇది రాజు అవమానం పొందడాన్ని సూచిస్తున్నది. 

89:45 తగ్గించియున్నావు - జీవితకాలం కుదింపు కావడం గురించి 102:23-24 నోట్సు చూడండి.

89:46 ఎంతవరకు - 13:1-2 నోట్సు; 79:5 నోట్సు చూడండి. 

89:47-48 దేవుడు మనుషుల్ని సృష్టించడంలో ఆయన ఉద్దేశమేమిటనీ, దావీదుతో నిబంధనను స్థిరపర్చి తరువాత దాన్ని భంగపర్చడంలో ఆయన లక్ష్యమేమిటనీ కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు. కీర్తనకారుని విచారణ అతని విచారాన్ని, యెహోవా చర్యల్ని అర్థం చేసుకోవడంలో అతని అశక్తతను నొక్కి చెబుతున్నది. 

89:49 కీర్తనకారుడు దేవుడు దావీదుతో చేసిన నిబంధనను విన్నవించు కుంటూ, కృప చూపించమనీ, దావీదు వంశం శాశ్వతంగా ఉండడం దేవుని కాపుదల మీదా ఆయన కటాక్షం మీదా ఆధారపడి ఉందని గుర్తుచేసుకొమ్మని యెహోవాను ప్రార్థిస్తున్నాడు.

89:50-51 నిందను - ఈ పదం పునరావృతం కావడం యెహోవా అభిషేకించిన వ్యక్తి నిర్విరామంగా యాతన ననుభవించడాన్ని నొక్కి చెబుతున్నది. (80:12-15). "నీ" అనే పదం పునరావృతం కావడం (నీ సేవకులకు, నీ శత్రువులు, నీ అభిషిక్తుని) యెహోవా తన నామానికి ప్రతీకలుగా ఉన్న తన ప్రజల్ని కాపాడాలని కీర్తనకారుడు పట్టుదలతో ఆయనను ప్రార్థిస్తున్నాడని తెలియజేస్తున్నది. 

89:52 41:13 నోట్సు చూడండి. 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |