Job - యోబు 20 | View All

1. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

4. దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రముండును.

5. ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

6. వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

7. తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

8. కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

9. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

10. వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.

11. వారి యెముకలలో ¸యౌవనబలము నిండియుండును గాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.

12. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

13. దాని పోనియ్యక భద్రము చేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.

14. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

15. వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.

16. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.

17. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

19. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

20. వారు ఎడతెగక ఆశించిన వారు తమ యిష్టవస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు.

21. వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.

22. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.

23. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.

24. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.

25. అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

26. వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును.

27. ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.

28. వారి యింటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

29. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.బైబిల్ అధ్యయనం - Study Bible
20:1-3 జోఫరు తన మనోవివేకము యోబు సమస్యలకు తెలివైన పరిష్కారాన్ని సూచిస్తుందని ఇంకా నమ్ముతున్నాడు.

20:4-5 దుష్టులకు శిక్ష తప్పదనే నియమం సృష్టి ఆది నుండి ఉన్నదేనని జోఫరు చెప్తున్నాడు. 

20:6-7 దుష్టుడు తన స్వావలంబనను ఎంతగా నమ్మినప్పటికీ, తన విధివ్రాతను తానే రాసుకుంటానని తలంచినప్పటికీ, గర్విష్టుడైన బబులోను రాజులాగా (యెషయా 14:12-15), తనను తానే నమ్ముకున్న నీనెవె పట్టణంలాగా (జెఫన్యా 2:15) అతడు చివరికి నాశనం కాక తప్పదు. 

20:8-10 కల క్షణభంగురం, మెలకువ వచ్చిన తర్వాత కల కనుమరుగవు తుంది. దుషులు కల లాంటివారు.

20:11. దుష్టులకు యౌవనంలోనే మరణం సంభవిస్తుందని జోఫరు చెప్తున్నాడు. యోబు మాటల్నే (19:25), జోఫరు చమత్కార రీతిలో తిరిగి చెప్తున్నాడు. దుష్టుడిని పాతిపెట్టిన మంటి మీద విమోచకుడు నిలబడతాడని ఎదురు చూడకూడదు.

20:12-14 నాలుక కింద తేనె తీపిదనాన్ని దాచుకున్నట్టుగా, దుష్టుడు తనకు తియ్యగా ఉన్న చెడుతనాన్ని తన నాలుక కింద దాచిపెట్టుకుంటాడు. అయితే నోటికి తియ్యగా ఉన్నది. కొన్నిసార్లు కడుపులోనికి పోయి , హాని చేస్తుంది (సామె 23:31-32). 

20:15 వైద్యుడు కడుపులోకి వెళ్లిన హానికరమైన పదార్థాల్ని కక్కించినట్టుగా, దుష్టులు ఇతరుల నుండి బలవంతంగా లాక్కున్న ధనమును దేవుడు వారినుండి బయటికి కక్కిస్తాడు.

20:16 విషమును తాగడమెంత ప్రమాదకరమో అక్రమంగా సంపాదించిన ధనం కూడా అంతే ప్రమాదకరం. అది విషసర్పంతో ఆటలాడడం వంటిది. 

20:17 నేటికాలంలో తేనెటీగల పెంపకం కేంద్రాల నుండి తేనెను సేకరించినట్టుగా కాక ప్రాచీన కాలంలో తేనెను అడవి తేనెటీగల నుండి సేకరించేవారు " (న్యాయాధి 14:8). ఖర్జూరపండ్ల నుండి తీసిన చిక్కటి గుజ్జును కూడా తేనె అని పిలిచేవారు. తేనెను వెన్నతోబాటు కలిపి చెప్పడం మంచి పదార్థాల్ని సమృద్ధిగా కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. (నిర్గమ 3:8; యోవేలు 3:8). 

20:18 దుష్టులు ప్రయాసపడి సంపాదించినదేదీ వారికి ప్రయోజనకరం కాదు.

20:19 దుష్టుల పతనానికి కారణం వారు బీదల్ని హింసించి వారి నుండి బలవంతంగా లాక్కోవడమే. దుష్టులు బీదలు చేసిన అప్పులకు బదులుగా గానీ, మోసపూరితంగా గానీ వారి ఇంటిని ఆక్రమించుకొనేవారు (మీకా 2:2). 

20:20 దుష్టుల్ని వారి అత్యాశ దహించివేస్తుంది. ఈ వచనంలో రెండవ భాగా నికి "దుష్టులు తమ అత్యాశ నుండి తమను తాము తప్పించుకొనజాలర"ని అర్థం.

20:21 దుష్టులు ఏది కనబడితే దానిని “మ్రింగి" వేయాలని తాపత్రయపడ తారు, చివరకు అదే వారు క్షేమం కోల్పోయి పతనమయ్యేలా చేస్తుంది. 

20:22-23 తినుచుండగా అనే సాదృశ్యం జీవితంలోని సుఖసౌఖ్యాల్ని అనుభవించడాన్ని, రుచికరమైన ఆహారపదార్థాల్ని కడుపారా తినడాన్ని సూచిస్తుంది.

20:24-25 జోఫరు అప్పటి యుదోపకరణాల్ని ప్రస్తావిస్తూ దేవుని యుద్ధాపకరణాల్ని వర్ణిస్తున్నాడు. వీటిలో ఇనుప ఆయుధము... ఇత్తడి విల్లు, దేహముల గుండ చొచ్చుకుపోయే బాణాలు ఉన్నాయి. బాణములను విసరినప్పుడు వాటి మొనలు ఎంత వాడిగా ఉంటాయంటే అవి లోపలికి దూసుకొనిపోయి, వీపును చీల్చుకొని శరీరములో నుండి బయటికి వస్తాయి. ఆ తీవ్రతకు పైత్యపు తిత్తి సైతం బయటపడుతుంది. ఒకవేళ లోపల ఇరుక్కున్న బాణములను బయటకు లాగాలని ప్రయత్నిస్తే అది దుష్టుల శరీరం లోపలి భాగాల్ని బయటికి లాగుతూ ప్రమాదాన్ని మరింత అధికం చేస్తుంది. దేవుడు బాణాలను తనపైకి ఎక్కుపెట్టాడని(16:13), ఆయన అంబులు తనలో చొచ్చుకొనిపోయాయని (6:4) యోబు దేవునిపై ఫిర్యాదు చేస్తున్నాడు. దుష్టునికి జరగవల్సినట్టుగానే దేవుడు యోబుకు న్యాయంగానే తీర్పు తీరుస్తున్నాడని జోఫరు సూచిస్తున్నాడు. 

20:26 దుష్టుల పతనం ఎంత తీవ్రంగా ఉంటుందంటే వారు సంపాదించు కున్న ధననిధులు సైతం మరణపు అంధకారం(15:22) లోకి వెళ్తాయి. దుష్టులూ, వారితో బాటు వారు సంపాదించు కున్నవన్నీ దేవుని కోపమనే అగ్నిలో కాలిపోవడం తథ్యం (15:34; 22:20; ద్వితీ 32:22; కీర్తన 21:89; 1కొరింథీ 3:13). 

20:27 దుష్టుల దోషం ఎంత విస్తారమైందంటే ఆకాశము... భూమి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి. ఈ సాదృశ్యం దుష్టుల పాపం గురించి భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని న్యాయస్థానంలో ఆరోపణ చేస్తారనే భావనను సైతం తెలియజేస్తుంది. యోబు నిర్దోషత్వానికి తన యథార్థతకు పరలోకంలో ఉన్న దేవుడే సాక్షి అని చెప్పగా (16:18-19), జోఫరు అందుకు భిన్నంగా జరుగుతుందని పరోక్షంగా సూచిస్తున్నాడు.

20:28-29 ప్రతికారానికి సంబంధించి తన సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించడం మాత్రమే కాక. ఇది వాస్తవంగా దేవుడు విధించిన పద్ధతి అని ప్రకటించడం జోఫర్ అంతిమ సారాంశం. దుష్టులు తమ సంతానానికి వారసత్వంగా ఆస్తి నివ్వడానికి బదులు దేవుని చేత నియమింపబడిన న్యాయమైన తీర్పును స్వాస్థముగా ఇచ్చి వెళ్తారు.


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |