Hebrews - హెబ్రీయులకు 7 | View All

1. రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును
ఆదికాండము 14:17-20

2. ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థ మిచ్చునట్టి షాలేము రాజని అర్థము.

3. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.

4. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను.
ఆదికాండము 14:19-20

5. మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని
సంఖ్యాకాండము 18:21

6. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.
ఆదికాండము 14:19-20

7. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.

8. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

9. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను.

10. ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.
ఆదికాండము 14:19-20

11. ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మ శాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధి కలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
కీర్తనల గ్రంథము 110:4

12. ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.

13. ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవ డును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు.

14. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
ఆదికాండము 49:10, 1 దినవృత్తాంతములు 5:2, యెషయా 11:1

15. మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
కీర్తనల గ్రంథము 110:4

16. మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.

17. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
కీర్తనల గ్రంథము 110:4

18. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది;

19. అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.

20. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.

21. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయన నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను;

22. ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.

23. మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని

24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.

25. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
యెషయా 59:16

26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు.

27. ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక,
లేవీయకాండము 16:6, లేవీయకాండము 16:15

28. ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను.
కీర్తనల గ్రంథము 2:7



బైబిల్ అధ్యయనం - Study Bible
7:1-10:39 ఈ అధ్యాయాలు క్రీస్తు క్రమము, నిబంధన, పరిచర్య, బలియాగములోని ఆధిక్యతలు కనపరచే ఆయన యాజకత్వపు శ్రేష్ఠతను గూర్చిన చర్చకు పొడిగింపు. 

7:1-19 యూదుల లేవీయ యాజకత్వం అహరోను క్రమములో స్థాపించబడింది. కానీ యేసు క్రీస్తు యాజకత్వం మెల్కీసెదెకు క్రమము చొప్పున స్థిరపరచబడింది. ఈ మర్మయుక్తమైన మెల్కీసెదెకు ఆది 14:1820లో కనిపించి తరువాత కీర్తన 110లో మెస్సీయను గూర్చిన వాగ్దానం వరకు మరలా పేర్కొనబడలేదు. మెల్కీసెదెకు క్రమం దాని ఉనికి, విస్తీర్ణంలో నిత్యమైనది అని చూపడానికి పా.ని.. సాక్ష్యాలనుండి హెబ్రీ పత్రిక రచయిత చూపిస్తున్నాడు. నిత్యత్వం, నీతి, సమాధానము, సర్వాధికారం అనే దైవిక గుణలక్షణాలను ప్రతిబింబిస్తూ, మెల్కీసెదెకు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. జీవితకాలమునకు ఆదియు, జీవమునకు అంతము లేని ఆయన నిరంతరము యాజకుడై యుండుటలో ఆయన నిత్యత్వము స్పష్టం. ఆయన నామము హెబ్రీభాషలో నీతికి రాజు అనే అర్థమిచ్చే మెల్కీసెదెకు కావడం ఆయన నీతికి నిదర్శనం. ఆయన సమాధానపు రాజు అని అర్ధమిచ్చే షాలేము రాజు అనడంలో ఆయన సమాధానం స్పష్టమౌతుంది.
చివరిగా, యుద్ధంనుండి విజయంతో తిరిగి వస్తున్నపుడు, అబ్రాహాము మెల్కీసెదెకు అధికారాన్ని గుర్తించి ఈ యాజకరాజుకు తన సమస్తంలో నుండి దశమభాగమును ఇచ్చాడు. అబ్రాహాము మెల్కీసెదెకు ఔన్నత్యాన్ని గ్రహించి అతనికి పదియవభాగమిస్తే, ఇశ్రాయేలు కూడా ఇవ్వాలి. లేవీయ యాజకత్వంమెల్కీసెదెకు యాజకత్వంకన్నా తక్కువైంది. ఎందుకంటే తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదించబడును. మెల్కీసెదెకు అధికారం దేవుని కుమారుని సర్వాధికారంలో ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే లేవీయ యాజకత్వం ఆజ్ఞగల ధర్మశాస్త్రము చొప్పున అధికారం పొందగా, క్రీస్తు యాజకత్వం నాశనము లేని జీవమునకున్న శక్తినిబట్టి నియమించబడింది. ఆ

7:20-8:13 ఈ రెండు యాజకత్వాల అధికార మూలాలను రచయిత వివరించాడు. సాధారణంగా ఒక ఒప్పందం లేక నిబంధనకు అధికారం ప్రమాణం ద్వారా నిర్ధారించబడుతుంది. యిర్మీయా 31:31-34ను పేర్కొంటూ, దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న పాత నిబంధన మనుష్యుని ప్రమాణము మీద ఆధారపడిందని రచయిత గమనిస్తున్నాడు; విచారకరమైన సంగతి ఏమంటే లేవీయ యాజకులు ఈ నిబంధనలో ఎల్లప్పుడును ఉండ సాధ్యము కాలేదు. కానీ యిర్మీయా ద్వారా వాగ్దానం చేయబడిన కొత్త నిబంధన భిన్నమైనది, ఎందుకంటే ఆ ప్రమాణం పూర్తిగా దేవుడే చేశాడు. దేవుడు కొత్త నిబంధనను బట్టి ప్రమాణము చేశాడు కాబట్టి, దానికి శాశ్వత హామీ లభించింది. దేవుడు కరుణతో తన ఆజ్ఞలను వారి మనస్సులలోను, హృదయాలలోను ఉంచుతానని అన్నాడు. దైవిక ప్రమాణంవల్ల, కొత్త నిబంధన మరి శ్రేష్ఠమైన నిబంధన. మొదటి నిబంధన పాతగిలి ఉడిగిపోయి, అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.
పాత నిబంధన మీద ఆధారపడిన యాజకత్వంలో ఉన్న యాజకులు మరణించుచుండుట వలన, ఎల్లప్పుడు ఉండడం సాధ్యం కాదు, కానీ కొత్త నిబంధన ప్రధానయాజకుడు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. పాత నిబంధన యాజకత్వం బలహీనతగల యాజకులతో నిండిపోయింది (7:28), కానీ కొత్త నిబంధన ప్రధానయాజకుడైన యేసు విధేయతతో శ్రమనొందడం వల్ల నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందాడు. పాత నిబంధన యాజకుడు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు, కానీ కొత్త నిబంధన యాజకుడు ఒక్కసారే అర్పణను ముగించెను. పాత నిబంధన యాజకుడు తనకోసం, అలాగే తన ప్రజల కోసం బలి అర్పించేవాడు, కానీ కొత్త నిబంధన ప్రధానయాజకుడైన యేసు పాపరహితుడు కాబట్టి ఆయన తన ప్రజల పక్షంగా తన్నుతాను అర్పించుకొన్నాడు. 

Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |