Isaiah - యెషయా 7 | View All

1. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను

2. అప్పుడుసిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

3. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెల విచ్చెనుఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము

4. భద్రముసుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.

5. సిరియాయు, ఎఫ్రాయి మును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు

6. మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.

7. అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ మాట నిలువదు, జరు గదు.

8. దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీనురాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును.

9. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు.

10. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను

11. నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

12. ఆహాజునేను అడుగను యెహోవాను శోధింప నని చెప్పగా

13. అతడుఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?

14. కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
మత్తయి 1:23, లూకా 1:31, యోహాను 1:45, ప్రకటన గ్రంథం 12:5

15. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.

16. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.

17. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రా యిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరుదేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.

19. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.

20. ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.

21. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱ లను పెంచుకొనగా

22. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును; ఏలయనగా ఈ దేశములో విడువ బడిన వారందరును పెరుగు తేనెలను తిందురు.

23. ఆ దినమున వెయ్యి వెండి నాణముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలు రక్కసి చెట్లును పెరుగును.

24. ఈ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు.

25. పారచేత త్రవ్వబడుచుండిన కొండ లన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చ పొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉపయోగమగును.బైబిల్ అధ్యయనం - Study Bible
7:1-2 యెరూషలేములో రాజకీయ వాతావరణం ఉద్రిక్తతతో నిండి ఉంది. క్రీ.పూ. 730 తొలి కాలంలో దురాక్రమణకు ముందుండే అష్నూరు. రాజు 3వ తిగత్పిలేసారు ఉత్తర సరిహద్దులో సంసిద్ధంగా ఉన్నాడు. దాదాపుగా అష్నూరు దాడి నిశ్చయమని తెలిసిపోయింది. కాబట్టి దమస్కు ముఖ్యపట్టణంగా గల సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలీయుల (ఎఫ్రాయిమీయులనే పేరు కూడా వీరికి ఉంది) రాజైన పెకహు ఏకమై సైన్యాల్ని సమకూర్చుకొని అష్కూరు దాడిని అడ్డుకోవాలనుకున్నారు, అషూరు సైన్యం దాడిచేసిన అనంతరం ఇక మిగిలిన పని ఉత్తరప్రాంతంలో తిగత్పిలేరు విజయం సాధించడమే. రెజీను, పెకహులు తమకు యూదా మద్దతు ఇవ్వాలని కోరుకున్నారు. అయితే ఆహాజు దీని గురించి అసలు పట్టించుకోలేదు. బహుశా అప్పటికి ఆహాజు తనను వీరిద్దరి నుండి కాపాడాలని అషూరు రాజుకు ఎంతో కొంత చెల్లించి ఉండవచ్చు లేదా, చెల్లించే ఉద్దేశం కలిగి ఉండవచ్చు. (2రాజులు 16:6-9). ఆహాజు తిగత్పిలేసెరుకు భయపడి ఉండవచ్చు, లేదా రెజీను పెకహుల కూటమి నొక తక్షణ ప్రమాదంగా పరిగణించి ఉండవచ్చు. ఇటువంటి నేపథ్యంలో యెషయా ఒక ప్రశ్నతో రాజు నెదుర్కొన్నాడు. రాజు ఎవరిని ఆశ్రయించాలి - యెహోవానా, అషూరునా? 

7:3 యెషయా కుమారుని పేరు షెయార్యాషూబు, ఈ పేరుకు “శేషజనం తిరిగి వస్తారు" అని అర్థం. యెషయా గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాల్లోని ముఖ్యాంశం ఇదే (1:9,26; 4:2-6; 6:13). 

7:4 రెండు దేశాల (ఇశ్రాయేలు, సిరియా) నాయకులు పొగబారుతున్న కొరకంచుల్లాగా ఉన్నారని (కీర్తన 2:1-6 తో పోల్చండి), అందుచేత ఆహాజు భయపడకూడదనే సందేశం అతనికి యెహోవా నుండి అందింది. 

7:5-6 బైబిల్లో టాబెయేలు ప్రస్తావన ఇక్కడ తప్ప మరెక్కడా కనబడదు, ఇతర ఆధారాల్లోను ఎక్కడా టాబెయేలు గురించి ఏ ప్రస్తావనా కనబడదు. రెజీను, పెకహుల రాజకీయ ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, ఆహాజు వారితో కూటమికి సమ్మతించడం లేదు కాబట్టి వారు ఆహాజును సింహాసనం నుండి దించివేసి, తమ చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండే వ్యక్తిని రాజుగా నియమించాలని కోరుకుంటున్నారు. 

7:7-8 అరువది యయిదు సంవత్సరములు అనే పదజాలం దేన్ని సూచిస్తున్నదో అర్థం కావడం లేదు. ఇది క్రీ.పూ. 735 ను సూచిస్తోందా లేదా అటూ ఇటుగా ఏమైనా సూచిస్తోందా అనేది తెలియడం లేదు. లేదా, ఇది క్రీ.పూ. 670 ని సూచిస్తున్నదేమో తెలియడం లేదు. అయితే క్రీ.పూ. 722 లోనే అషూరు ఉత్తరరాజ్యాన్ని చిత్తుగా ఓడించింది. (ఇది మటుకు అరవై అయిదు సంవత్సరాల్లోపే జరిగింది). బహుశా ఇది క్రీ.పూ. 670లో ఉత్తర రాజ్యంలో శేషజనం మధ్య అంతగా ప్రాముఖ్యత సంతరించుకోని ఏదో ఒక సంఘటనను సూచిస్తుండవచ్చు. ఆ సమయంలో ఇశ్రాయేలులోని ప్రజలు చెరలోకి వెళ్లి ఉండవచ్చు లేదా అన్యప్రాంతాల నుండి అన్యజనాలు వచ్చి ఇశ్రాయేలులో స్థిరపడి ఉండవచ్చు.

7:9 ఏదేమైనా, ఆహాజుకు రెజీను, పెకహుల నుండి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అతడు అషూరు నాశ్రయించ డానికి బదులు దేవుణ్ణి ఆశ్రయించాలనే ప్రకటన అతని కివ్వబడింది. 

7:10-11 రెజీను, పెకహుల నుండి ఆహాజు తనను కాపాడుకోవడం కోసం అష్నూరు నాశ్రయించడానికి బదులు, దేవుణ్ణి ఆశ్రయించాలని ఇంకా స్థిరంగా తెలియజేయడం ఈ సూచన వెనక ఉన్న ఉద్దేశం. పాతాళమంత అనే పదం అధఃలోకాన్ని సూచిస్తుంది. 

7:12 యెషయా ప్రతిచర్య నుండి పాఠకులకు ఒక విషయం అర్థమై ఉం టుంది, ఆహాజు జవాబు పైకి భక్తిపూర్వకంగా కనబడినట్టుగా ఉన్నా, వాస్తవా నికి భక్తిపూర్వకమైనది కాదు. రాజు బహుశా లేఖనంలోని పూర్వ సందర్భాన్ని ఉదాహరిస్తుండవచ్చు (ద్వితీ 6:16), అయితే మస్సా దగ్గర జరిగిన విధంగా తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి శోధించడాన్ని ధర్మశాస్త్రం నిషేధిస్తుంది (నిర్గమ 17:1-7), దేవుని నిజప్రవక్త ఆయనను శోధించడు. ఆహాజు అప్పటికే అషూరు సహాయాన్ని అర్థించాలని నిర్ణయించుకొని ఉండవచ్చు.. 

7:13 వ.11లో “నీ దేవుడైన" అనే పదజాలం ఉన్నట్టుగా కాక, ఈ వచనంలో నా దేవుని అనే పదజాలం ఉండడం ఆహాజులో దేవునిపట్ల నమ్మిక లేకపోవడం అతని జీవితాన్ని మలుపు త్రిప్పనుందని తెలియజేస్తుంది. యెషయా ఆహాజును దావీదు వంశస్తులారా అని సూచించడం అది దావీదు వంశం మీద బలమైన ప్రభావం చూపబోతోందని, రాజకీయంగా దావీదు వంశం క్షీణించనుందని తెలియజేస్తుంది. 

7:14 ఈ సూచన నెరవేర్పులోని తొలిమెట్టు దీని గురించి ప్రకటన వెలువడిన కొన్ని సంవత్సరాల్లోపే జరిగి ఉండవచ్చు - శిశువు గర్భంలో పడినప్పటి నుండి, శిశువు పుట్టి మంచిచెడులు గ్రహించే వయసు లోపుననే (వ.15-16), అంటే సుమారుగా పన్నెండేళ్ల లోపుననే అని అర్థం. కన్యక అని అనువదించబడిన హెబ్రీ పదానికి "వివాహపు వయసు వచ్చిన యువతి" అని అర్థం, ఈ పదం కన్యత్వానికి కూడా సూచనగా ఉంది. ఈ కన్యక యెషయా వివాహం చేసుకోబోయే యువతి అని అనేకమంది పండితుల అభిప్రాయం, అలా అయినట్లయితే ఈ యువతికి శిశువు పుట్టడం గురించి 8:1-4 వచనాల్లో ఉంది. ఇది ఈ సూచన నెరవేర్పులో తొలిమెట్టు అయ్యుండవచ్చు. అయితే దీని అంతిమ నెరవేర్పు మత్తయి 1:23 లో కనబడుతుంది, ఇక్కడ సెఫ్టువజింట్ లోని పార్తెనోస్ అనే గ్రీక్ పదాన్ని "కన్యక” అని అనువదించడం జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు “దేవుడు మనకు తోడైయున్నాడు” అని అర్థం. 

7:15 తెలివి వచ్చునప్పుడు అనే పదజాలానికి, కష్టాలు ఆ పిల్లవాణ్ణి దేవునివైపు మళ్ళుకునేలా ప్రేరేపించగలవని అర్థం. పెరుగు, తేనెను తినును అనే పదజాలం దేశంలో వ్యవసాయం పూర్తిగా నాశనమైపోయి ధాన్యం ఇతర ఆహార పదార్థాలేవీ లభించవని సూచిస్తుంది (వ. 23-24).

7:16 క్రీ.పూ. 732 లో రెజీను పరిపాలించే సిరియా నాశనం చేయబడింది. క్రీ.పూ. 733లో తిగత్పిలేరు పెకహు పరిపాలించే ఉత్తర రాజ్యంలోని భూభాగాన్ని కుదించివేశాడు, రాజు హత్యకు గురి కాగా, అతని స్థానంలో హోషేయ రాజయ్యాడు. అయినప్పటికీ, క్రీ.పూ. 722లో ఉత్తర రాజ్యం పూర్తిగా ఓటమిపాలైంది, ఇది ఇమ్మానుయేలు ప్రవచనం అనంతరం సుమారుగా పదమూడు సంవత్సరాలకు జరిగింది.

7:17 అష్కూరు చేతిలో నాశనమైనవి కేవలం సిరియా, ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాలు మాత్రమే కాదు. యూదా కూడా దేవుని నుండి వచ్చే శిక్ష ననుభవించబోతుంది. తరువాతి సంఘటనలు తెలియజేసిన ప్రకారం, ఆహాజు ఉత్తర రాజ్యం నుండి ఎదురయ్యే సమస్యను తప్పించుకోడానికి తిగత్పిలేరుకు చెల్లింపులు చేయడం తెలివైన పని కాదు. ఆ రకంగా అష్పూరు రాజుకు సామంతునిగా ఆహాజు భారీగా కప్పం చెల్లించడం
మొదలైంది (2రాజులు 16:10-18). 

7:18-19 దేశం జోరీగల (ఐగుప్తు) చేత , కందిరీగల (అష్నూరు) చేత నిండిపోయి ఉంటుంది. 7:20 మంగల కత్తి అనే పదజాలం తిగత్పిలేసేరును సూచిస్తుంది, ఇతడు యూదాను నేలమట్టం చేయబోతున్నాడు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |