Proverbs - సామెతలు 21 | View All

1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

2. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.

3. నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.

4. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.

5. శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

6. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

7. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.

8. దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.

9. గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.

10. భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.

11. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.

12. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.

13. దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.

14. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలోనుంచబడిన కానుక మహా క్రోధమును శాంతి పరచును.

15. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.

16. వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.

17. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.

18. నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు

19. ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.

20. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.

21. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.

22. జ్ఞానియైన యొకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకార మెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును.

23. నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.

24. అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమితగర్వముతో ప్రవర్తించును.

25. సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.

26. దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.

27. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.

28. కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.

29. భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.

30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

31. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.బైబిల్ అధ్యయనం - Study Bible
21:1 ఇశ్రాయేలు రాజుల మీదనే కాదు, ఏ రాజు మీదనైనా దేవుడే సార్వభౌ ముడు (1రాజులు 11:23; ఎజ్రా 6:22; యెషయా 44:28; యిర్మీయా 25:9; అపొ.కా.4:27-28). 

21:2 మనిషి కొన్నిసార్లు లెక్కచేయడు లేక తన చర్యల్ని సమర్థించుకుంటాడు కాబట్టి అతడు దేవునిలాగా మంచి న్యాయనిర్ణేత. కాలేడు (15:11; 16:2; 17:3; 24:12 తో పోల్చండి). 

21:3 బలుల నర్పించుట బాహ్యమతాచారాలకు ఒక సూచన... నిజమైన విశ్వాసం లేకుండా క్రైస్తవ ఆరాధనలకు హాజరు కావడం కూడా ఇటువంటిదే. 

21:4 దున్నని పొలంలో కలుపు మొక్కలు మొలిచినట్టుగానే, అహంకార దృష్టియు (6:17 నోట్సు చూడండి) గర్వ హృదయమును (అమర్యాద చూపిం చడం, అదుపు లేకుండా ప్రవర్తించడం) ఉన్నచోట పాపం పుట్టి పెరుగుతుంది (పాపయుక్తములు). ఇందుకు భిన్నంగా, ఆజ్ఞ, ఉపదేశం నీతిమంతులను నడిపిస్తాయి (6:23). 

21:5 తాలిమిలేక పనిచేయు అంటే అక్షరార్థంగా “అనాలోచితంగా తొందర పడడం" (19:2 చూడండి; 29:20 తో పోల్చండి), “అజాగ్రత్తగా ఆతురత పడడం" (28:20), ముందు చూపు లేకుండా, ఓర్పు వహించకుండా పనిచేయడం.

21:6 ధనము, మనిషిని నిత్య మరణము నుండి కాపాడలేదు (10:2; 20:21). ఊపిరి గురించి 13:11 నోట్సు చూడండి. ఊపిరి అక్షరార్థంగా "పొగ లాగా చెదిరి కనుమరుగై పోతుంది (కీర్తన 68:2తో పోల్చండి). 

21:7 "కొట్టుకొని పోవును" అంటే చేపలతో నిండిన వలను ఈడ్చుకొని పోయినట్టుగా “ఈడ్చుకొని పోవడం” అనే అర్థం కావచ్చు (హబ 1:15).

21:8 వంకరగా ఉండడం అంటే వక్రబుద్ధితో లేక వంచనతో ఉండడం.

21:9 కంటె... మేలు సామెతల కోసం 15:16-17 నోట్సు చూడండి. గయ్యాళి గురించి 19:13 నోట్సు చూడండి. ప్రాచీన ఇశ్రాయేలులో ఇళ్ళ పైకప్పులు బల్లపరుపుగా ఉండేవి, దాని పైన మేడగది (మిద్దె మీద గది) నిర్మిం చేవారు (2రాజులు 4:10), లేదా వేసవి కాలంలో నిద్రపోయేవారు (1సమూ 9:25-26). సాధారణంగా మిద్దెమీద బయట ఉండడం కంటె ఇంటిలోపల ఉండడం “మేలు". అయితే, ఇంటిలోపల భార్యతో పోరు కంటె ఒంటరిగా మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలు అనే భావన కనపడుతోంది. 

21:10 కీడు (రా), పొరుగువాని (రే) అనేవి హెబ్రీలో అక్షరసామ్యం , ధ్వనిసామ్యం ఉన్న పదాలు. 

21:11 అపహాసకుడి వలన ఏ ఉపయోగమైనా ఉన్నదంటే అది అతనిని చూసి అతనిలాగా ఉండకూడదని తెలుసుకోవడం మాత్రమే (1:22 నోట్సు చూడండి). జ్ఞానము లేనివాడు (1:4 నోట్సు చూడండి) ముందుగా జ్ఞానము పొందినవాడై, ఆ తరువాత తెలివి గల వాడవుతాడు.

21:12 నాశనములో కూల్చును గురించి 13:6లో “చెరపివేయును” పై నోట్సు చూడండి.

21:13. ప్రార్థించే వారిలో యథార్థత లేనప్పుడు వారు. సహాయం కోసం పెట్టే మొఱ్ఱలకు దేవుడు జవాబివ్వడు (1:28; యెషయా 1:15; యిర్మీయా 11:9-12; యెహె 8:16-18; మీకా 3:4; జెకర్యా 7:13; 1 పేతురు 3:7). 

21:14 కానుక (లంచం) అది ఉద్దేశించిన కార్యాన్ని సాధించగలగడం వాస్తవమే అయినా (15:27 నోట్సు చూడండి; 17:8 తో పోల్చండి), దేవుడు లంచాన్ని అసహ్యించుకుంటాడు. ఒడిలోనుంచబడిన అంటే “రహస్యంగా” అని. 17:23 దగ్గర “ఒడిలో నుండి” వివరణ చూడండి.

21:15 "యెహోవా దినము" నాడు ఆయన న్యాయమైన తీర్పు ఇశ్రాయేలులో పాపం చేసేవారికి భయంకరము. అని ఆమోసు హెచ్చరించాడు. (ఆమోసు 5:18). సమాజంలో చెడకార్యాలు చేసేవారికే అధికారులు భయంకరులుగా కనబడతారని పౌలు బోధించాడు (
రోమా 13:3-4). . 

21:16 విడిచి తిరుగు కోసం 7:25-27 వచనాలతో పోల్చి చూడండి. ప్రేతల గుంపు గురించి 2:18-19 నోట్సు చూడండి. 

21:17 ద్రాక్షారసమును నూనెయు దేవుని నుండి కలిగే దీవెనలు (ద్వితీ 7:13; కీర్తన 104:14-15), సుఖభోగముల ననుభవించడం కూడా దీవెనయే (అక్షరార్థంగా "సంతోషముతో" కీర్తన 21:6). అయితే దేవునికి స్థానం ఇవ్వకుండా ఆయన దీవెనల కొరకు వాంఛ కలిగి ఉంటే అవి దుర్గుణాలుగా మారతాయి. 

21:18 నీతిమంతుల కోసం పాపాత్ములు శిక్ష ననుభవిస్తారని ఈ సామెత చెప్పడం లేదు. వాస్తవానికి ఏ పాపమూ లేని క్రీస్తు మనుషులందరి పాపాల కోసం శిక్ష ననుభవించాడు. (కీర్తన 49:7-9,15; గలతీ 3:13, 1తిమోతి 2:6). ఈ వచనం రక్షణ కలిగే మార్గాలను వివరించడం లేదు గానీ దాని ఫలితాలను మాత్రం వ్యక్తపరుస్తున్నది: నీతిమంతులు విడుదల పొందుతారు, విశ్వాసఘాతకులు శిక్షింపబడతారు.

21:19 జగడగొండి గురించి 19:13 నోట్సు చూడండి. ప్రాణము విసికించు వ్యక్తులు ఇతరులకు చికాకును, దు:ఖాన్ని పుట్టిస్తారు. రెచ్చగొడతారు, మాటిమాటికీ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తారు (12:16; 17:25; 27:3). 

21:20 జ్ఞానులు విలువైన వాటిని ఆదా చేసికొని వృద్ధిపరచుకుంటారు, బుద్ధి హీనుడు (హెబ్రీ. కేసిల్) రాబడి వచ్చిన వెంటనే దాన్ని శీఘ్రంగా ఖర్చుచేస్తాడు. “వ్యయపరచును” అంటే అక్షరార్థంగా “మ్రింగివేయడం" (1:12; 19:28). 

21:21 కృప గురించి 19:22 నోట్సు చూడండి. దైవభక్తితో నీతి ననుసరించే వారు దేవుని నుండి దీవెనలు పొందుతారు. (1రాజులు 3:10-14; మత్తయి 6:33). 

21:22 14:26 లో “బహు ధైర్యము” అనే అర్థాన్నిచ్చే రెండు హెబ్రీ పదాల్నే ఇక్కడ ఆశ్రయమైన కోట అనే మాటకు ఉపయోగించారు. ఏదేమైనా, ఈ బలమైన కోట నాశ్రయించినవారు అస్థిరమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. జ్ఞానియైన వ్యక్తి ఎంతటి కఠినమైన ఆటంకాలనైనా ఎదుర్కొనగలడు. 

21:23 నోటిని కాపాడుకొనడం అంటే దాన్ని ఊరకనే తెరవకుండా ఉండడమే (13:3).

21:24 అహంకారియైన వాడి ముఖ్య లక్షణం అపహసించడం. అపహాసకుడు గురించి 1:22 నోట్సు చూడండి. 

21:25-26 సోమరి (6:6 నోట్సు చూడండి) పనిచేయడు కాబట్టి అతడు కోరుకునేది (యిచ్చ) అతనికి లభించదు. తత్ఫలితంగా సోమరికి భౌతిక మరణంతో బాటు ఆధ్మాత్మిక మరణం సైతం తప్పదు. నీతిమంతుడు ఇతరులకు దానధర్మాలు చేస్తాడు. తనకున్నదానితోనే సంతృప్తి ననుభవిస్తాడు (19:24). 

21:27 దేవుడు వేషధారణను అసహ్యించుకుంటాడు (15:8). మరి ఆ వేష ధారణలో (11:31 నోట్సు చూడండి) ఇతరులకు హానిచేయడం కూడా కలసి ఉంటే అది మరింత హేయమైనది (2 సమూ 15:7-13; మత్తయి 23:14). 

21:28 విని మాటలాడువాడు అంటే జరిగిన నేరం గురించిన నివేదికను శ్రద్ధగా విని సరైన సాక్ష్యాన్ని ఇచ్చేవాడు. లేదా తెలుసుకున్న తర్వాతనే దానికి జవాబు ఇవ్వడం గురించి గానీ, నేరం ఆపాదించబడిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా కూటసాక్షి పలికిన మాటలు జాగ్రత్తగా విని అతనికి ఖండింపుతో కూడిన తగిన జవాబు ఇచ్చేవాడి గురించి గానీ అయ్యుండాలి.

21:29 ముఖమును మాడ్చుకొనును అంటే సిగ్గుమాలిన ముఖంలో నటన కనపర్చడం (7:13), లేదా అతిశయం చూపించడం (దాని 11:12) 

21:30-31 దేవుడే సర్వా ధికారి (19:21; కీర్తన 33:10-11).యుద్ధతంత్రంలో వివేచన చాలా ముఖ్యం. యుద్ధంలో గుఱ్ఱములను సిద్ధం చేసుకొనడం వివేచన కొక ఉదాహరణ. అయితే దేవుని చిత్తానికి వేరుగా గుఱ్ఱం సైతం విజయం సాధించలేదు. (కీర్తన 20:7; 33:17; యెషయా 31:1; యిర్మీయా 3:23). 


Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |