Hebrews - హెబ్రీయులకు 3 | View All

1. ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.

2. దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
సంఖ్యాకాండము 12:7

3. ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,

4. ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.

5. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
సంఖ్యాకాండము 12:7

6. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

7. మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు.
కీర్తనల గ్రంథము 95:7-11

8. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
నిర్గమకాండము 17:7, సంఖ్యాకాండము 20:2-5

9. నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.

10. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.

11. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
సంఖ్యాకాండము 14:21-23

12. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.

13. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,

14. పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.

15. ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.

16. విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
సంఖ్యాకాండము 14:1-35

17. ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలి పోయెను.
సంఖ్యాకాండము 14:29

18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
సంఖ్యాకాండము 14:22-23

19. కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.



బైబిల్ అధ్యయనం - Study Bible
3:1-4:16 ఈ అధ్యాయాలలో కుమారుడు దేవదూతలకంటే శ్రేష్ఠుడు అని చూపించడం నుండి, కుమారుడు ధర్మశాస్త్రానికి మధ్యవర్తియైన మోషేకంటే, వాగ్దాన దేశాన్ని జయించిన యెహోషువ కంటే శ్రేష్ఠుడని చూపుతున్నాడు. ఈ అధ్యాయాలలో అంతర్లీనంగా ఉన్న ఉమ్మడి అంశం నమ్మకత్వం. యేసు నమ్మకముగా (3:2) ఉన్నాడని వివరించడం ద్వారా, పాఠకులను అంతము వరకు గట్టిగా చేపట్టుమని (4:14) నచ్చచెప్పాలని రచయిత ఆశించాడు. 

3:1-6 దేవుని నుండి , తాను పొందినటువంటి పిలుపునే పొందిన తన పాఠకులకు తనకు ఉమ్మడిగా ఉన్న లక్షణాన్ని గుర్తిస్తూ, పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తూ రచయిత విజ్ఞప్తి చేస్తున్నాడు. వారి మనస్సులు, హృదయాలు రక్షకుని వైపుకు తిప్పి, యేసుమీద లక్ష్యముంచమని వారిని అడుగుతున్నాడు. దేవుని యిల్లంతటిలో నమ్మకమైనవాడుగా దేవుడు మోషేను ప్రత్యేకంగా గుర్తించాడు (సంఖ్యా 12:7). అతని నమ్మకత్వం క్రీస్తు నమ్మకత్వపు ఆధిక్యతను చూపించడానికే. ఎందుకంటే క్రీస్తు కుమారుడైయుండి యింటిమీద నమ్మకముగా ఉన్నాడు. మోషే కూడా ఒక భాగంగా ఉన్న “యింటిమీద” యేసు. నమ్మకంగా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రము అందించడంలో మోషే నమ్మకంగా ఉన్నప్పటికీ, అతనికి అప్పగించబడిన కార్యం రానున్న దేవుని కుమారుని వైపు చూపించడమే. ధర్మశాస్త్రపు శాపం కింద ఉన్న వారికి సువార్తను తేవడంలో యేసు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. 

3:6 ధైర్యమును, నిరీక్షణ... స్థిరముగా చేపట్టిన యెదల: చివరివరకు కుమారునిలో తమ నిరీక్షణను నిలిపి, స్థిరముగా సహించేవారు, ఆయనతోపాటు నిత్యత్వంలో జీవిస్తారు.

3:7-19 మోషే ధర్మశాస్త్రముకంటే సువార్త ఎక్కువ శ్రేష్ఠమైనదని స్థాపించి, రచయిత కీర్తన 95 అర్థాన్ని వివరించ సాగాడు. ధర్మశాస్త్రానికి అవిధేయులైన వారికే శిక్ష తీవ్రంగా ఉంటే, సువార్తపట్ల అవిశ్వాసం కలిగి ఉంటే మరింత భయంకరమైన శిక్ష ఉంటుందని తన పాఠకులను హెచ్చరించడమే రచయిత ఉద్దేశం. అరణ్య ప్రయాణంలో అవిధేయులైన ఇశ్రాయేలీయులపై వచ్చిన దేవుని తీర్పు కీర్తన 95:7-11లో వివరించబడింది. తమ హృదయాలను దేవునికి విరోధంగా కఠినపరచుకున్నందున దేవుడు ఆ అవిశ్వాసపు తరమువారిని వాగ్దానభూమిలోనికి అనుమతించలేదు. ఇక్కడ పాఠం ఏమిటంటే దేవుని శబ్దమును వినినవారు, దేవుని వాక్యమునకు విరోధముగా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపేలా తమ హృదయములను కఠినపరచుకొన కూడదు. అలాంటి అవిశ్వాసానికి ఫలితం దైవ తీర్పే. వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశింపరు. 

3:11 విశ్వాసం ద్వారా క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టి ఇప్పుడు మనకు దేవునితో సమాధానమున్నది (మత్తయి 12:28; హెబ్రీ 4:1,3,8-11). 

3:12 అవిశ్వాసం అనేది దేవుని నుండి మనలను దూరంగా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అది భయంకరమైన పాపం. అది ఆయన వాక్య సత్యంలో విశ్వాసముంచడానికి మొండిగా తిరస్కరించడమేనని స్థూలంగా చెప్పవచ్చు.


Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |