Chronicles I - 1 దినవృత్తాంతములు 24 | View All

1. అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.

2. నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.

3. దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.

4. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.

5. ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.

6. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.

7. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,

8. మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,

9. అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

10. ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
లూకా 1:5

11. తొమ్మిదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,

12. పండ్రెండవది యాకీమునకు,

13. పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,

14. పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,

15. పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,

16. పందొమ్మిదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,

17. ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,

18. ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.

19. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.

20. శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,

21. రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,

22. ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,

23. హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,

24. ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,

25. ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,

26. మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.

27. యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.

28. మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.

29. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.

30. మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.

31. వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.



బైబిల్ అధ్యయనం - Study Bible
24:1 ఈ సమయంలో ఏర్పరచిన వంతులలో అతి ప్రాముఖ్యమైనది యాజకుల కోసం ఏర్పరచిన వంతు, వారిని ఇరవై నాలుగు భాగాలుగా ఏర్పరచారు. ఈ ఇరవై నాలుగు భాగాలు బ్రతికివున్న అహరోను కుమారులైన ఎలియాజరు, ఈతామారు వంశాలనుంచి ఏర్పడ్డాయి. 

24:2 ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్ర పరచిన కారణంగానే నాదాబు, అబీహు చనిపోయారని వృత్తాంతకారుడు ఇక్కడ పేర్కొనలేదు (లేవీ 10:1-2). వారు సంతతి లేకుండా చనిపోయారు. కాబట్టి, యాజకుల వంతులలో చేర్చడానికి వారికి వారసులు ఎవరూ లేరనేదే వృత్తాంతకారునికి చాలా ప్రాముఖ్యమైన విషయం . 

24:3 దావీదు కాలానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన యాజకులుగా నిలిచివున్నారు. ప్రత్యక్ష గుడారంవద్ద సాదోకు బాధ్యతలు నిర్వహించాడు, యెరూషలేములో మందసము దగ్గర అహీమెలెకు పర్యవేక్షకునిగా ఉన్నాడు. ఈ అహీమెలెకు అబ్యాతారు. కుమారుడు, ప్రత్యక్ష గుడారంలో సౌలు అనుచరుల చేతిలో హతుడైన అహీమెలెకు మనవడు. ఎలియాజరు, ఈతామారు వంశాలకు ప్రతినిధులుగా యాజకత్వం చేయడానికి ఈ ఇద్దరికీ ధర్మశాస్త్రానుసారమైన హక్కు ఉంది. అందుకే ఈ ఇద్దరి సంతతికి చెందిన వారిని ఈ యాజకుల జాబితాలో చేర్చారు.

24:4-5 ఎలియాజరు సంతతివారు ఈతామారు సంతతి వారికంటే ఎక్కువగా ఉన్నందున రెండు ఒకటి నిష్పత్తి చొప్పున పెద్దలను నియమించారు. ఆ విధంగా ఇరవై నాలుగు వంతులు రావడానికి, ఎలియాజరు వంశీకులకు పదహారు పని సమయాలు, ఈతామారు వంశీకులకు ఎనిమిది పని సమయాలు వస్తాయి. 

24:6 అధికారికంగా ఒక శాస్త్రి దస్తావేజులలో వివరాలు నమోదు చేశాడు, అదేవిధంగా రెండు కుటుంబాల వంశాలనుంచి పర్యవేక్షకులు ఉన్నారు. ఈ సంగతి అంతా ఎలా జరుగుతుందో తెలియని పెద్దలు కూడా ఉన్నారు. 

24:7-19 పదివేల మంది కంటే ఎక్కువగానున్న లేవీయులలో సుమారుగా ఇరవై నాలుగు విభాగాలు లేదా వంతులు ఏర్పరచారు, కానీ ఈ విధంగా ఇరవై నాలుగు వంతులు ఉండాలని దావీదు నియమించినా అది శాశ్వత సంఖ్య కాదు (ఎజ్రా 2:36-39; నెహెమ్యా 12:1-7). ఇంకా అబీయా వంటి కొందరి యాజక విభాగాలు ఇంచుమించు వెయ్యి సంవత్సరాల వరకు మందిరంలో సేవ కొనసాగించాయి (లూకా 1:5).

24:20-31 ఈ జాబితాలో ఇరవై నాలుగు పేర్లు ఖచ్చితంగా గుర్తించడం అంత సుళువు కాకపోయినా, ఇతర లేవీయులను కూడా ఇరవై నాలుగు గుంపులుగా విభజించారు. ఈ ఇరవై నాలుగు గుంపుల పితరుల పేర్లు అనేక తరాలకు చెందినవి కాబట్టి వాటి ప్రారంభం సమతుల్యంగా లేదు. ముఖ్యులైన పితరుల సంతానపు మనుషుల సంఖ్యను బట్టి ఈ గుంపులు ఏర్పాటు చేశారని స్పష్టంగా తెలుస్తుంది.
ఖచ్చితమైన వంశావళుల వివరాలు తెలియజేయడం కన్నా, వారి గుంపులలోనుంచి అవసరమైనంత మంది పనిచేయగలవారిని పంపగల సామర్థ్యం కలిగియుండటం ముఖ్యం. .


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |