Matthew - మత్తయి సువార్త 4 | View All

1. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

2. నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా
నిర్గమకాండము 34:28

3. ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను

4. అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
ద్వితీయోపదేశకాండము 8:3

5. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
Neh-h 11 1, యెషయా 52:1

6. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
కీర్తనల గ్రంథము 91:11-12

7. అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 6:16

8. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి

9. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
దానియేలు 3:5, దానియేలు 3:10, దానియేలు 3:15

10. యేసు వానితో-సాతానా, పొమ్ము-ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.
ద్వితీయోపదేశకాండము 6:13

11. అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

12. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి

13. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

14. జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు

15. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
యెషయా 9:1-2

16. అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను.)
యెషయా 9:1-2

17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

18. యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

19. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

20. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

21. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.

22. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

23. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

24. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

25. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దాను నకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.బైబిల్ అధ్యయనం - Study Bible
4:1-2 క్రీస్తు శోధింపబడడం. యేసుకు, పా.ని. ఇశ్రాయేలీయులకు అనేకమైన సమాంతరాలను ఎత్తి చూపుతుంది. ప్రభువు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పరీక్షించడానికి అరణ్యంలోనికి నడిపించాడని ద్వితీ 8:2-3 చెబుతోంది. అలాగే, యేసు అపవాది చేత... నలువది దినములు పరీక్షింపబడడానికి ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ఎదుర్కొన్న మూడు శోధనలు, అరణ్యములో ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న శోధనలకు సమాంతరంగా ఉన్నాయి. యేసు తన శోధనలకు చెప్పిన ప్రతి జవాబు, ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఎదురైన పరీక్షల గురించి దేవుడు ఇచ్చిన సందేశాలలోనుండి తీసుకోబడింది. (ద్వితీ 6-8), ఇశ్రాయేలీయులు ఈ పరీక్షలలో విఫలం కాగా యేసు తన శోధనలలో విజయం సాధించి, తద్వారా "నీతి యావత్తును నెరవేర్చాడు” (మత్తయి 3:15). అలా ఆయన కొత్త ఆధ్యాత్మిక ఇశ్రాయేలును సృష్టించడానికి యోగ్యుడయ్యాడు. దేవునికోసం ఒక కొత్త జనాంగమును సమకూర్చే యేసు ఉద్దేశాన్ని మత్తయిలోని అనేక అంశాలు నిర్ధారిస్తాయి. ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలకు సమాంతరంగా ఉండడానికి ఆయన పన్నెండుమంది. శిష్యులను ఎన్నుకున్నాడు. ఇది తన అనుచరులు కొత్త ఇశ్రాయేలుగా గుర్తించబడడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. యేసు ఆకలిగొనుట అనే సత్యం ఆయన నిజముగా దేవుడు, అలాగే మానవుడు అని చూపిస్తుంది. 

4:3 అరణ్యంలో పడివున్న రాళ్ళు రూపంలో, పరిమాణంలో, రంగులో, గుండ్రంగా ఉన్న రొట్టెలవలె ఉంటాయి. యేసు ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినడంలో తప్పేమిటి అనే విషయంలో వ్యాఖ్యాతలు ఏకీభవించరు. దేవుని పోషణ మీద ఆధారపడకుండా, మానవాతీతశక్తిని ఉపయోగించడానికి శోధింపబడ్డాడని అధికశాతం సూచిస్తారు. కానీ వాక్యభాగంలోని మాటల
భావం, యేసును అరణ్యంలోనికి నడిపిన ఆత్మ, ఈ ఉపవాసాన్ని చేయమని నడిపించాడు. కాబట్టి పరిశుద్దాత్మ చెప్పకమునుపే ఉపవాసాన్ని ముగించడం అవిధేయతగా మారి, యేసు నీతియంతటినీ నెరవేర్చే పనిని పూర్తిచేయనీయ కుండా చేస్తుంది. (3:15). అనే భావాన్ని స్పురింపజేస్తాయి. పరీక్ష ముగిసిన తర్వాతే యేసు తన ఉపవాసాన్ని ముగిస్తాడు, ఏ మాత్రం తొందరపడడు. ఆహారాన్ని అనుగ్రహించడంద్వారా దేవుడు " ఉపవాసాన్ని ముగించమని సూచిస్తాడు. ఉపవాసం ముగిసిన తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు “పరిచర్య చేసిరి" అని మత్తయి 4:11 చూపుతుంది. ఇక్కడ ఉన్న "పరిచర్య అనే క్రియాపదం, “వడ్డించేవానివలె పరిచర్య చేయడం" అని అర్థమిచ్చేదిగా ఉండి, దేవదూతలు యేసుకు ఆహారం తెచ్చినట్లుగా సూచిస్తుంది. అరణ్యంలో తిరుగాడిన సమయంలో ఇశ్రాయేలీయులు దేవుడు తమకు ఆహారాన్ని, నీళ్ళను అనుగ్రహిస్తాడని విశ్వసించలేకపోయారు. కొత్త ఇశ్రాయేలుగా శరీరధారియైన యేసు దేవుని పోషణలో నిశ్చలమైన విశ్వాసాన్ని కనపరచాడు. దేవుని కుమారుడు అనే మాట కోసం 3:17 నోట్సు చూడండి. . 

4:4 యేసు ద్వితీ 8:3 పేర్కొన్నాడు. దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట అని ఆయన చెప్పడం, దేవుని మాటలు నిష్ఫలం కావనీ, వాటిని ఆజ్ఞలుగా స్వీకరించాల్సివుందనీ చెప్పే పా.ని. అంశాన్ని జాపకం చేస్తాయి. ద్వితీ 8:1,6, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపే అవసరాన్ని నొక్కి చెబుతాయి, దేవుని నోటనుండి వచ్చే దానివల్లనే మనుష్యుడు జీవిస్తాడని 8:3 చెప్పినట్లు (ద్వితీ 6:24), దేవుని ఆజ్ఞలను అనుసరించడంవల్ల మనుష్యుడు బ్రతుకుతాడని ద్వితీ 8:1 బోధిస్తుంది. ఆ విధంగా, యేసు ఎత్తిచెప్పిన పా.ని. లేఖనం బాగా పోషించబడడంకంటే దేవునికి విధేయత చూపడం మరింత ప్రాముఖ్యమని బోధిస్తుంది. ఇశ్రాయేలీయులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోయారు (నిర్గమ 16:3; సంఖ్యా 11:4-5). తద్విరుద్ధంగా యేసు రొట్టెకంటే ఎక్కువగా నీతి కోసం: ఆకలిగొన్నాడు, నీళ్ళకంటే ఎక్కువగా విధేయత కోసం దప్పిగొన్నాడు. అదే ప్రాధాన్యతగా కలిగి వుండాలని ఆయన తన శిష్యులకు బోధించాడు (మత్తయి 5:6). 

4:5-7 తన ప్రాణంతో చెలగాటమాడినా, తండ్రి ఆయన్ని అద్భుతంగా రక్షిస్తాడని యేసును నమ్మించే ప్రయత్నం చేస్తూ, కీర్తన 91:11-12ను సాతాను వక్రీకరించి చెప్పాడు. దేవుడు అద్భుతంగా బండనుండి నీళ్ళు ప్రవాహంలా రప్పించేటంతగా ఇశ్రాయేలీయులు “యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించిన” (నిర్గమ 17:7) అన్న వాక్యాన్ని సూచించే ద్వితీ 6:16 లో ఆయనను కోపంతో, దాహంతో విసిగించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ యేసు దానికి జవాబిచ్చాడు. యేసు ఈ సాతాను శోధనకు పడిపోయి వుంటే, ఆయన విశ్వాసం అల్పమైనదనీ, అది దేవుని ఆశ్చర్యకార్యం మీద ఆధారపడినదనీ భావించాల్సి వచ్చేది. దేవాలయ శిఖరము నుండి దూకడం అంటే, ఒక అద్భుతం చేయమని దేవున్ని బలవంతం చేయడానికి ప్రయత్నించినట్లయ్యేది. అందుకు ముందు ఆయన మనలను శ్రమనుండి, ప్రమాదం నుండి రక్షించినప్పుడే దేవుడు నమ్మదగినవాడు అనే భావాన్ని సాతాను కలిగించాలనుకున్నాడు. యేసుకు వానికంటే ఎక్కువ తెలుసు. దేవుడు మనకు శ్రమ అనుమతించినా, లేక ఆయనే శ్రమపెట్టినా, ఆయన నమ్మదగినవాడే. నిజమైన విశ్వాసం దీనిని గుర్తించి కష్టసమయాల్లో ఓపికతో కనిపెడుతుంది. యేసు సిలువపై శ్రమ పొందినపుడు (27:41-44) ఆయనను బాధించినవారు కూడా అపవాది చేసిన వాదనలవంటి వాటినే ఉపయోగిస్తూ “నీవు దేవుని కుమారుడవైతే, సిలువనుండి దిగి రా” అన్నారు. దేవుడు నిజంగా ఆయనను ప్రేమిస్తే, యేసు తప్పించబడతాడని వాదించడానికి కీర్తన 22:8ని కూడా పేర్కొన్నారు. అలాగే యేసు నిజంగా దేవుని కుమారుడైతే, దేవాలయ శిఖరంమీద నుండి దూకినప్పుడు దేవుడు ఆయనను కాపాడతాడని సాతాను కీర్తన 91:11-12 ఎత్తి వాదించాడు. కానీ యేసుకు దీనికి మించి తెలుసు. దీనికన్నా భయంకరమైన కొరడాదెబ్బలు తిన్నపుడు, ఆయన చేతులగుండా మేకులు కొట్టినపుడు, భయంకరమైన మరణాన్ని అనుభవించడానికి దేవుడు తనను విడిచిపెట్టినపుడు కూడా ఆయన దేవుని నమ్మాడు. 

4:8-9 సాతానుకు లోకం మీద కొంత అధికారమున్నప్పటికీ (లూకా 4:6; యోహాను 12:31), యీ లోక రాజ్యములన్నియూ దేవునివే. వాటిని తన కుమారునికి ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు (కీర్తన 2:8). 

4:10-11 ద్వితీ. 6:14; 10:20 పేర్కొంటూ - యేసు సాతానుకు జవాబిచ్చాడు. లోకాధికారం కోసం యేసు సాతానుకు నమస్కరించి వుంటే, ఆయన సృష్టికర్తకన్నా సృష్టికీ, దేవుని రాజ్యంకన్నా లోక రాజ్యాలకు ఎక్కువ విలువనిచ్చినట్లయ్యేది. దేవుని మాత్రమే సేవింపవలెను అని యేసు నొక్కి చెప్పాడు.  ద్వితీ 6:13 పేర్కొన్న తర్వాత, అలాగే ఈ సువార్తలో ఇతర చోట్ల యేసు తనను ఆరాధించేవారిని వారించకుండా (అపొ.కా. 10:25-26; 14:11-15) వారి ఆరాధనను స్వీకరించడం (8:2; 9:18; 14:33; 15:25; 20:20; 28:9,17), ఆయన దైవత్వాన్ని బలంగా సూచిస్తున్నది. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయడం కూడా ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తుంది.. 

4:12-16 హేరోదు అంతిప, తన సహోదరుని భార్యను వివాహం చేసుకోవడం అనైతికమని ధైర్యంగా చెప్పడంవల్ల బాప్తిస్మమిచ్చే యోహాను చెరపట్టబడెను. హేరోదు. గలిలయ, పెరయలకు చతుర్ధాధిపతి కాబట్టి (లూకా 3:1), అతనికి యేసు బాప్తిస్మం పొంది, శోధింపబడిన అరణ్యం ఉన్న ప్రాంతమైన యూదయ మీద అధికారం లేదు. ఆ విధంగా యోహాను బంధించబడ్డాడని విని, యేసు నిర్భయంగా హేరోదు పాలించే ప్రాంతంలోనికి ప్రవేశించాడు. లూకా 13:31-33లో, హేరోదు ఆయనను బంధించకుండా ఉండడం కోసం గలిలయను విడిచి వెళ్ళమని పరిసయ్యులు యేసును బతిమాలారు. యేసు హేరోదును “ఆ నక్క" అని సంబోధిస్తూ, హేరోదునుండి తప్పించుకోవడానికి కాక తాను అక్కడ మరణించాల్సి ఉంది. కాబట్టే యెరూషలేముకు వెళ్తానని నొక్కి చెప్పాడు. యేసు రాజులను వణికించాడు (2:3; 14:1-2) కానీ ఆయన ఏ మనుష్యునికి భయపడలేదు.
సరిగ్గా ఇదే సమయంలో యేసు తన ముఖ్య పట్టణాన్ని నజరేతు నుండి కపెర్నహోముకు - మార్చడం ద్వారా ఒక ముఖ్యమైన వ్యూహాత్మక అడుగు వేశాడు. నజరేతు ప్రాధాన్యతలేని ఒక చిన్న పల్లె.
కానీ కపెర్నహోము గలిలయ సరస్సు తీరాన చేపలను పట్టే చాలా పెద్ద కేంద్రం. దానిలో ఉన్న పన్ను వసూలు
కేంద్రం గురించి, అది కనీసం. వందకన్నా ఎక్కువమంది సైనికులు ఉండే రోమీయుల సైనిక స్థావరమని గొప్పగా చెప్పుకునేవారు. సముద్రతీరమందు అనే మాటలను యెషయా తన ప్రవచనాలలో దమస్కునుండి కైసరయవరకు మధ్యధరా తీరప్రాంతాన విస్తరించివున్న ప్రాచీన వ్యాపారమార్గాన్ని “సముద్రమార్గము” అని వర్ణించాడు. క్రీస్తుకాలం వచ్చేసరికి, రోమీయులు ఆ మార్గంలో రాళ్ళతో రహదారిని నిర్మించి, సిరియానుండి కపెర్నహోము గుండా కైసరయకు వ్యాపారుల బృందాలు ప్రయాణం చేసేలా ఏర్పాటు చేశారు. కపెర్నహోము గలిలయ సముద్రతీరాన ఉంది కాబట్టి, గలిలయ తీరప్రాంతాన ఉన్న ప్రతి ఇతర పట్టణానికి అది సులువైన దారిగా ఉండేది. అలా తన ముఖ్య పట్టణాన్ని అత్యధిక రద్దీవుండే ప్రాంతానికి మార్చడం ద్వారా, యేసు అనేకమంది యూదులను, యూదేతరులను చేరగలుగుతాడు.
అన్యజనులు నివసించు గలిలయ అని గలిలయను వర్ణిస్తూ, యెషయా 9:1-2 వచనాలను మత్తయి పేర్కొనడం యేసు అంతర్జాతీయ పరిచర్యను ఎత్తిచూపుతుంది. 2 రాజులు 15:29; 17:24-27 ద్వారా, ఉత్తరరాజ్య మైన ఇశ్రాయేలునుండి యూదులు చెరగొనిపోబడిన తరువాత, గలిలయలోకియూదేతరులు ప్రవాహంలా వచ్చారని తెలుస్తుంది. ఉదాహరణకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన స్ట్రాబోతో పాటు, మొదటి శతాబ్దపు యూదుల చరిత్రకారుడైన జోసీఫస్ నివేదించినదాని ప్రకారం, ఐగుప్తీయులు, అరబీయులు, ఫెనీకయులు, గ్రీకులు గలిలయలో నివసించారని తెలుస్తుంది. గలిలయ జనాభాలో అత్యధికశాతం యూదేతరులని అప్రమాణిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. యేసు గలిలయకు, అందులోను వ్యూహాత్మకంగా కపెర్నహోము పట్టణానికి రావడం ఆయన యూదులనే కాక యూదేతరులను కూడా రక్షించాలనే ఉద్దేశం కలిగివున్నాడని సూచిస్తుంది. మత్తయి యెషయా 9 ని యేసుకు ఆపాదిస్తున్న మాటలబట్టి ఆయన దావీదు సింహాసనంనుండి సార్వత్రిక, నిత్యరాజ్యమును పాలించి, దేవుని ప్రజలను ఆధ్యాత్మిక బానిసత్వం నుండి విడిపించి, ప్రపంచానికి సంతోషాన్ని, సమాధానాన్ని తెచ్చే “బలవంతుడైన దేవుడు” అనే గొప్ప రాజు అని సూచిస్తున్నాయి (యెషయా 9:3-7), 

4:17 అప్పటినుండి యేసు... మొదలు పెట్టెను అనే మాటల విశిష్టతను గూర్చి మత్తయి సువార్త పరిచయంలోని “గ్రంథ నిర్మాణం" చూడండి. యేసు సందేశం, బాప్తిస్మమిచ్చే యోహాను చెరపట్టబడక ముందు అతడు ప్రకటించిన సందేశంలాగానే ఉంది. ఇది, యోహాను తన వెనుక వచ్చినవాడైన (3:11) యేసును ప్రభువైన దేవునిగా గుర్తించినట్లు (యెషయా 40:3; మత్తయి 3:3 నోట్సు చూడండి) సూచిస్తుంది. 

4:18-22 నా వెంబడి రండి అన్న యేసు ఆజ్ఞ, శిష్యులను తన ప్రయాణా లలో తనతోపాటు ఉండమని మాత్రమే కాక, తన మాదిరిని అనుసరించి, తన స్వభావాన్ని అనుకరించమని కోరుతుంది. యేసును వెంబడించడం సీమోను... ఆంద్రియ... యాకోబు... యోహానులకు చాలా త్యాగంతో కూడిందే. వారు తమ చేపలుపట్టే వృత్తిని విడిచి పెట్టేశారు. వారు తమ... తండ్రిని విడిచిపెట్టి అంటే యేసును వెంబడించడానికి శిష్యులు తమ కుటుంబాలకంటే ఎక్కువగా యేసుకు సమర్పణ చేసుకున్నారని కూడా సూచిస్తుంది (10:37; 19:29). 

4:23. సమాజమందిరములలో యేసు పరిచర్య, యేసు తన పరిచర్య ఆరంభంలో గలిలయలోని యూదులపైనే దృష్టి పెట్టినట్లుగా చూపిస్తుంది, కానీ తరువాత కాలంలో అది అక్కడ, దాని వెలుపల ఉన్న అన్యులకు కూడా విస్తరించింది. దేవుని రాజ్యమును గూర్చిన సువార్త యేసు ప్రసంగంలోని
ప్రాథమిక అంశం. అది ఏమిటంటే, ఏ మానవ పాలకుని ద్వారా దేవుడు తన రాజ్యాన్ని భూమిమీద స్థాపించబోతున్నాడో ఆయన, అంటే వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రీస్తు చివరికి భూమిమీదకు వచ్చాడు. అనేదే. బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించిందీ (3:2), యేసు ప్రకటించిందీ (4:17), యేసు దావీదు వంశావళిలో పుట్టాడని, ఆయన అద్భుతజన్మ వృత్తాంతం, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారని మత్తయి నొక్కి చెప్పిందీ ఈ సందేశాన్నే. యేసు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు సంచరించాడు. యేసు స్వస్థపరచలేని. అనారోగ్యం ఏదీ లేదనే విషయాన్ని, “ప్రతి” అనే విశేషణం చూపుతుంది. గ్రీకులో “ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును” అని రాశాడు. ఇది స్వస్థపరచే యేసు శక్తి అపరిమితమైనది అని నొక్కి చెబుతున్నది (9:35).4:24 సిరియా గలిలయకు ఉత్తరంగా ఉంది. యేసు స్వస్థతలను గూర్చిన సంగతి భౌగోళికపరమైన, భాషాపరమైన ఆటంకాలను అధిగమించి ఆ ప్రాంతానికి త్వరగా వ్యాపించెననడంలో ఆశ్చర్యం లేదు. సిరియనులు తమ రోగులను స్వస్థపరచడానికి యేసు దగ్గరకు తీసుకురావడంలో ఆలస్యం
చేయలేదు. దీనికి సమ్మతించడం ద్వారా, ఒక మునిగిపోతున్న అన్యునికి ఎలాంటి సహాయం చేయరాదనీ లేక ప్రసవిస్తున్న అన్యురాలైన స్త్రీకి సహాయం చేయకూడదనీ తన తర్వాత వచ్చిన కొందరు యూదయ వ్యాఖ్యాతలకు భిన్నంగా యేసు ప్రవర్తించాడు. యేసు దయ్యము పట్టినవారిని స్వస్థపరచాడని మత్తయి చెబుతున్నాడు. కానీ వీరు కేవలం మూర్చరోగులని కొందరు పండితులు వాదిస్తారు. ఏదేమైనా, దయ్యములు పట్టినవారు, మూర్చరోగుల మధ్య తేడా ఉందని ఈ వచనం చెబుతుంది. ఎందుకంటే ఇద్దరి పరిస్థితికి మధ్య తేడాను ఈ వచనం చెబుతుంది. 

4:25 యేసు ఆరంభ అనుచరులు యూదయ, అన్య ప్రాంతాలకు చెందిన వారు. యెరూషలేము, యూదయ యూదుల ప్రాంతాలు. గలిలయలో యూదులు, యూదేతరులు కలిసి ఉన్నారు, దెకపొలి అనేవి అధికంగా అన్యజనులుండే పట్టణాలు. ఈ భౌగోళిక ప్రాంతాలు, వాటిలోని వివిధరకాల ప్రజలు, యేసు భూమిమీద ఉన్న సకల రాజ్యా ల ప్రజలనూ తన పరిచర్య, స్వస్థత, బోధల ద్వారా రక్షించడానికి కోరిక కలిగివున్నాడని చూపుతున్నాయి (28:18-20). ఆయన లోకమంతటికీ మెస్సీయగా వచ్చాడు. 


Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |