Job - యోబు 21 | View All

1. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

3. నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.

4. నేను మనుష్యుని గురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

5. నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.

6. నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన యెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

7. భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8. వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

9. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు.

10. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.

11. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు.

12. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.

13. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.

14. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

15. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

16. వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

17. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపదవచ్చుట బహు అరుదు గదా.

18. వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

19. వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

20. వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

21. తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి?

22. ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

23. ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను

24. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును

25. వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖము గలవాడై మృతినొందును.

26. వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.

27. మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

28. అధిపతుల మందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

29. దేశమున సంచరించు వారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?

30. అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.

31. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు? వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?

32. వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును

33. పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.

34. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చ జూచెదరు?బైబిల్ అధ్యయనం - Study Bible
21:1-3 తానూ తాన స్నేహితులూ యోబుకు ఆదరణ నిస్తున్నామని ఎలీఫజు చెప్తున్నాడు (15:11), అయితే జోఫరు, ఇతరులు తనను ఆదరించడానికి బదులు అపహాస్యము చేస్తున్నారని యోబు చెప్తున్నాడు (16:20). ఇంతకు ముందు జోఫరు యోబును హేళనచేస్తూ అపహాస్యపు మాటలు మాట్లాడాడు (11:3). 

21:4 మనుష్యుని గురించి మొఱ పెట్టుకొన్నానా - యోబు తార్కిక ప్రశ్న అతని అసంతృప్తి దేవుని మీదనే అనీ (19:4,21-22), మనుషుల మీద కాదనీ తెలియజేస్తుంది. యోబు తన గురించి దేవునికి సూటిగా చెప్పుకొనలేక పోతున్నాడు కాబట్టి ఆతురపడుతున్నాడు (7:11-21; 9:33-35; 16:21). “ఆతురపడడం” అనే పదం బాధలో ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేయడాన్ని సూచిస్తుంది.

21:5-6 తన స్నేహితులు తన గురించి పునరాలోచన చేయాలని యోబు కోరుతున్నాడు (2:12-17:7-8; 18:20). వారు పెదవుల మీద నుండి నున్నగా జారిపోయే మాటలు మాట్లాడడానికి బదులు మౌనంగా తనను పరిశీలించి ఆశ్చర్యపడాలని యోబు కోరుతున్నాడు (29:9; 40:4; మీకా 7:16). యోబు సైతం తన పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు అతనికే వణకు కలుగుతున్నది.

21:7 దుష్టులు కొద్దికాలం మట్టుకే వర్ధిల్లుతారని తన స్నేహితులు చెప్పినవి తప్పని యోబు వక్కాణిస్తున్నాడు . (15:20; 18:5-21; 20:5, 15-18). దుష్టులు చిరకాలం జీవించడం, వారు వర్ధిల్లడం, పలుకుబడిగల స్థానాల్లో ఉండడం వాస్తవం (ప్రసంగి 7:15).

21:8-13 తన స్నేహితుల అభిప్రాయాలకు భిన్నంగా (15:20-30; 18:5-19; 20:21-28), దుష్టులు వారి సంతానముతో చిరకాలం వర్ధిల్లి తమ ఆస్తుల్ని వారికి అప్పగించి వెళ్తున్నారని యోబు చెప్తున్నాడు.

21:14-15 దుష్టులు సర్వశక్తుడగు దేవుణ్ణి తృణీకరించినప్పటికీ వారు వర్ధిల్లుతూనే ఉంటారని యోబు అభిప్రాయ పడుతున్నాడు. దుష్టులు దేవుణ్ణి సేవించరు, ఆయన సర్వాధికారాన్ని అంగీకరించరు (కీర్తన 73:9-12; 94:3). 

21:16 దుష్టులకు సైతం క్షేమము దేవుని నుండే కలుగుందని యోబు పరోక్షంగా సూచిస్తూ, తాను మట్టుకు దుష్టులు బాహాటంగా వెలిబుచ్చే ధిక్కా వైఖరికి దూరంగా ఉంటానని చెబుతున్నాడు. 

21:17 భక్తిశూన్యులు (భక్తిహీనులు) చర్యలు బహిరంగంగానే చెడుతనాన్ని ప్రదర్శిస్తున్నా, వారు దేవుణ్ణి బాహాటంగానే తిరస్కరిస్తున్నా ఆయన వారిని శిక్షించడం లేదని యోబు తార్కిక ప్రశ్న సూచిస్తుంది. ఆ కారణంచేత, జోఫరు ప్రకటనలకు బలం లేదు (18:5; కీర్తన 73:4-5, 12తో పోల్చండి), దీపము అనేది సంతోషం, సంతృప్తి నిండిన జీవితానికి సాదృశ్యం(కీర్తన 18:28). దీపం ఆరిపోవడం అకాలమరణాన్ని సూచిస్తుంది (2 సమూ 21:17). దేవుని తీర్పును బట్టి కాలం తీరకముందే మరణించడాన్ని సూచిస్తుంది (సామె 13:9; 20:20; 24:20). 

21:18 గాలికి కొట్టుకొని పోయే చెత్త... పొట్టు తరచూ తీర్పును సూచిస్తాయి. దుష్టుల మీదకు వారి జీవితకాలంలో దేవుని తీర్పు రాదని యోబు అభిప్రాయపడుతున్నాడు. యోబు వ్యాఖ్యలు. బహుశా అతడు శ్రమ ననుభవిస్తున్నందువలన కలిగిన నిరాశ నుండి పుట్టినవి కావచ్చు. అయితే ఇవి బైబిల్ ఉపదేశాన్ని నిర్దిష్టంగా ప్రతిబింబించడం లేదని గమనించాలి (కీర్తన 1:4; దాని 2:35; జెఫన్యా 2:1-2). 

21:19-20 దుష్టులు తమ జీవితకాలంలో దేవుని తీర్పును తప్పించుకొనడం, మరుసటి తరం మీదకు వచ్చేలా చేయడం అన్యాయమని యోబు ఆలోచిస్తున్నాడు (ద్వితీ 24:16; యిర్మీయా 31:29-30; యెహె 18:2-4). సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని త్రాగుదురు అనే వర్ణన దేవుని తీర్పు పాత్రను సూచిస్తుంది (కీర్తన 75:8; యెషయా 51:17, యిర్మీయా 25:15; యెహె 23:31-34). మరికొన్ని సందర్భాల్లో పాత్ర లేదా గిన్నె దేవుని దీవెనను సూచిస్తుంది (కీర్తన 23:5). పాత్ర యేసు తనను తాను తన తండ్రి చిత్రానికి అప్పగించుకొనడాన్ని (యోహాను 18:11), యేసు ద్వారా ప్రారంభమైన కొత్త నిబంధనను (మత్తయి 26:27-29; 1కొరింథీ 11:25-26) సూచిస్తుంది.

21:21 ఇది వ.19 లోని భావనకు కొనసాగింపు. దేవుడు దుష్టుడిని శిక్షించాలి గానీ, అతని కుటుంబాన్ని కాదు (20:10). 

21:22 దేవుణ్ణి ఎవరైనా సరిగా ప్రశ్నించగలరా అని యోబు ఇంత క్రితం అడిగాడు (9:12,19). లోకంలో ఎవరూ ప్రత్యేకంగా జ్ఞానవంతులు కాలేరనీ (11:7-9), దేవదూతలతో సహా. ఆయన దృష్టిలో ఎవరూ పూర్ణంగా పరిశుద్ధులు కారనీ (4:17-18) యోబు స్నేహితులు చెప్పారు. అయినా యోబు స్నేహితులు దేవుని మార్గాల గురించీ ఆయన సత్యం గురించి తమకు విశేషజ్ఞానం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు (4:12-21; 8:3-7; 11:5-6; 15:8-13; 20:4-5,20). 

21:23-26 మానవ జీవితం గురించిన యోబు పరిశీలనలు అతని స్నేహితులు వ్యక్తపరచిన ప్రాపంచిక దృక్పథంలో కనిపించని సత్యాలను సూచించాయి. ఒక వ్యక్తి మంచితనానికి లేదా చెడుతనానికి, జీవిత సౌభాగ్యానికి ఏ సంబంధమూ లేదని యోబు దృష్టిస్తున్నాడు. 

21:27 దుష్టులకు పట్టబోయే గతి గురించి యోబు స్నేహితులు మాట్లాడిన మాటలు పరోక్షంగా తననే సూచిస్తున్నాయనీ (16:1-4), అయితే వారు పొరబడుతున్నారనీ (19:1-6) యోబు చెబుతున్నాడు. 

21:28 తన స్నేహితులు అధిపతుల మందిరము గురించీ అందులోని వస్తువుల గురించీ తనను దృష్టిలో పెట్టుకొనే మాట్లాడుతున్నారు అని యోబు గ్రహించాడు (15:34; 18:14-21; 20:26-28). యోబు స్నేహితులు అతడు తన కుమారుల్ని, కుమార్తెల్ని కోల్పోవడం, తన సమస్తాన్నీ పోగొట్టు కోవడం అతనికి గుర్తు చేస్తూ బాధకరమైన మాటలు మాట్లాడుతున్నారు (1:13-19). 

21:29-30 దుష్టుల మీదికి వేగిరమే తీర్పు వస్తుందని యోబు స్నేహితులు చెబుతున్న తాత్విక చింతన, దుష్టులు నిశ్చింతగా ఉన్నారని దేశసంచారం చేసి వచ్చినవారు చేసిన పరిశీలనకు భిన్నంగా ఉందని యోబు ప్రశ్న సూచిస్తుంది. ధనికులైన దుష్టుల గృహాలు నాశనం కాకపోగా (18:14-15, 20:22) వారు వాటిలో భద్రంగా నివసిస్తున్నారు. 

21:31 దుష్టులు కదులుతున్న నేల మీద ఉన్నారని వారు కిందపడతారనీ ఇంతకు ముందు యోబు స్నేహితులు చెప్పినా, నిజానికి యోబు పరిశీలనలో ఎవరూ కదిలించలేనంత బలంగా దుష్టులున్నారు. 

21:32-33 బిల్డదు. వ్యాఖ్యలకు భిన్నంగా (18:17), దుష్టులు యోబు పరిశీలనలో గొప్ప అట్టహాసంతో, ఆర్భాటపు ఊరేగింపులతో సమాధికి తేబడుతున్నారు (ప్రసంగి 8:10), మంటిపిల్లలు వారికి ఇంపుగా నున్నవి అనే వర్ణన యోబు దృష్టిలో దుష్టులు మరణాన్ని సైతం బాగానే అనుభవిస్తున్నారని తెలియజేస్తుంది.

21:34 తన స్నేహితులు తనను ఓదార్చడంలో విఫలమయ్యారనీ (వ.3; 16:2-3), పైగా వారి మాటలు నమ్మదగినవి కావు అనీ (13:4) యోబు ఖరాఖండిగా చెప్తున్నాడు.. 


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |