Jeremiah - యిర్మియా 7 | View All

1. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

3. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.

5. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.

6. పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.

8. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.

9. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

10. అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?

11. నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 21:13, మార్కు 11:17, లూకా 19:46

12. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.

13. నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

14. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.

15. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.

16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.

17. యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.

18. నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
అపో. కార్యములు 7:42

19. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.

20. అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

21. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.

22. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని

23. ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

24. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.

25. మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

26. వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.

27. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు

28. గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము-వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.

29. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.

30. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.

31. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

33. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

34. ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
ప్రకటన గ్రంథం 18:23బైబిల్ అధ్యయనం - Study Bible
7:1 ఈ అధ్యాయంలోని మందిర ద్వారం దగ్గర యిర్మీయా సందేశం అధ్యా. 26లో పునరావృతమౌతుంది. 

7:2 నమస్కారము చేయుటకై అనే పదానికి హెబ్రీలోని పదం సచిత్రవర్ణనను తెలిపే అలంకారిక పదం. “ఎవరిపట్ల విధేయత చూపించవలసి ఉన్నారో ఆ వ్యక్తి యెదుట తల వంచుకొని వంగి సాష్టాంగపడడం" అని ఈ పదానికి

7:3 నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు అనే మాటలకు “నేను మీతో బాటు నివసిస్తాను” లేక “మీతోబాటు జీవిస్తాను” అనే అర్థం కూడా ఉంది (వ.7 తో పోల్చండి). 

7:4 ఈ స్థలము అనే పదం యెహోవా ఆలయాన్ని మాత్రమే కాక, ఆలయం చుట్టూ ఉన్న భవన సముదాయాన్ని కూడా సూచిస్తుంది. ఎన్నిక చేయబడిన సీయోను పట్టణంలో లేదా యెరూషలేములో దావీదు వంశం నిత్యమైన వంశంగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు (2 సమూ 7:12-13; కీర్తన 132:13-14). దేవాలయం తమను నాశనం కానివ్వని “రక్షరేకు” వంటిదని ప్రజలు నమ్ముతూవచ్చారు.

7:5-8 పశ్చాత్తాపమంటే న్యాయాన్ననుసరించడం, విగ్రహారాధనను మాని వేయడమని ఈ వచనాలు సూచిస్తున్నాయి. 

7:9 పది ఆజ్ఞల్లోని ఎనిమిదవ, ఆరవ, ఏడవ, తొమ్మిదవ, ఒకటవ, రెండవ ఆజ్ఞలను ప్రజలు ఉల్లంఘించి పాపాలు చేశారు.

7:10 దేవుని నామము పెట్టబడినవన్నీ ఆయనకు చెందినవే, వాటిమీద ఆయనకు పూర్తి హక్కు ఉంది (వ.11,14,30). 

7:11 దొంగలు దొంగతనం చేసినప్పుడు వారి గురించి వెదకడం సద్దుమణిగే వరకు రహస్యంగా దాగినట్టుగా, యూదా ప్రజలు అన్నిరకాల దుష్టక్రియలు జరిగించి, ఇప్పుడు కాపుదల కోసం దేవుని మందిరంలోకి పరుగెత్తుతున్నారు. వీరు దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేస్తున్నారు, "దొంగల గుహ" అంటే బందిపోటు దొంగలు దాగుకొనే గుహ అని అక్షరార్థం (మత్తయి 21:13 తో పోల్చండి).

7:12, 14 షిలోహు యెరూషలేముకు ఉత్తరదిక్కులో పదునెనిమిది మైళ్ళ దూరంలో ఇప్పటి సీలాన్ అనే ప్రదేశంలో ఉంది. కనాను విజయం తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని నిబంధన మందసాన్ని షిలోహులో స్థాపించారు (యెహో 18:1; 22:12; న్యాయాధి 21:19). ఎబెనెజరు దగ్గర యుద్ధం తర్వాత (1సమూ 4:1-11), ఫిలిపీయులు ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 1050 లో నాశనం చేశారు (కీర్తన 78:60-64). క్రీ.శ. 1922-31 మధ్య కాలంలో డెన్మార్క్ దేశస్థుల త్రవ్వకాలు ఈ సంఘటనను పురావస్తు ఆధారాల ద్వారా ధృవీకరించాయి.

7:13 నేను మీతో మాటలాడినను... అనే మాటలను యిర్మీయా పదే పదే ఉపయోగించాడు, ఒక మనిషి మరొక మనిషికి ఎదురుగా నిలబడి మాట్లాడినట్టుగా వ్యక్తిత్వారోపణలో దేవుడు మాట్లాడడాన్ని యిర్మీయా తెలియజేశాడు (వ. 25; 11:7; 25:3-4; 26:5; 29:19; 32:33; 35:1415; 44:4). యెహోవా "పెందలకడ లేచి మాట్లాడినట్లున్న" వర్ణన ఇది.

7:15 వెళ్లగొట్టినట్లు (హెబ్రీ. షాలక్) అనే క్రియాపదం “విసరివేయడం" అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఉదా: యోసేపును గుంటలోకి విసరివేసినట్టుగా, లేదా చచ్చిన గాడిద “యెరూషలేము . గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడినట్టుగా (22:19). ఇక్కడ ఈ వర్ణన దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడడాన్ని లేదా ఈడ్చివేయబడడాన్ని సూచిస్తుంది. 2రాజులు 13:23; 24:20; 2దిన 7:20 వచనాలు చూడండి. 

7:16-17 ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము అని యెహోవా ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. యూదాజాతి ఇక ఏ మాత్రం యెహోవా వైపు తిరిగిరాలేని దశకు వచ్చింది (11:14; 14:11; 15:1). యూదా ప్రజల పక్షాన చేసే ఏ విజ్ఞాపననూ దేవుడిక వినడు. 

7:18 అష్బూరీయులు, బబులోనీయులు పూజించే దేవత ఆకాశరాణి (ఇష్టారు), కనానీయులు పూజించే అషారోతు దేవతతో సమానం. ఈ రెండు దేవతలు శృంగారం, సంతానోత్పత్తి, యుద్ధం మొదలైన వాటికి సంబంధించిన ఆకాశ సమూహంలోని నక్షత్రదేవతలు (బహుశా శుక్ర గ్రహం కావచ్చు). స్త్రీలు ఈ దేవతలకు అర్పించడం కోసం పిండి వంటలు వండారు, బహుశా వారు ఈ రొట్టెల్ని నక్షత్రాల ఆకారంలో చేసి ఉండవచ్చు (44:15-19), మనషే అనే రాజు ఈ కల్పితదైవాల పూజలను ప్రారంభించాడు (2రాజులు 21:1-9), యోషీయా అనే రాజు మరణించిన తర్వాత ఈ పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. 

7:19 "ఆకాశరాణి" ని పూజించడమంటే (వ.18) తమను తాము అవమానపర్చుకున్నట్లే. 

7:20 ప్రజలు చేసిన ఈ పనులు దేవుడు చర్యతీసుకొనేలా చేశాయి, అయితే కోపము దేవుని ముఖ్య లక్షణాల్లో ఒకటి కాదు గానీ, అది ఆయన పరిశుద్ధ స్వభావానికి వ్యతిరేకంగా జరిగే అన్యాయం పట్ల, అక్రమం పట్ల ఆయన ప్రతిచర్య. దేవుని కోపం గురించీ, ఆయన ఉగ్రత గురించీ యిర్మీయా చాలాసార్లు ప్రస్తావించాడు (వ. 18; 8:19, 11:17; 25:6-7; 32:29-32; 44:3,8). 

7:21-23 దహనబలులను గూర్చిగాని బలులను గూర్చిగాని నేను వారితో చెప్పలేదు అనే మాటల్ని బట్టి కొందరు విమర్శకులు దైవారాధనలో బలులకు అర్పణలకు సంబంధించిన కట్టడలు విధులు మోషే కాలంలోనివి కాదనీ, ఇవి ప్రవక్తల కాలం అనంతరం మొదలయ్యాయనీ ప్రతిపాదిస్తున్నారు. “గూర్చి" అనే అర్థాన్నిచ్చే హెబ్రీలోని పదాన్ని (అల్ ది బ్రె) “కొరకు” లేదా “నిమిత్తం” అని కూడా అనువదించవచ్చు (ద్వితీ 4:21; 2సమూ 18:5; 2రాజులు 22:13). శుష్కమైన ఆచారాలు పాటించాలని దేవుడెన్నడూ తన ప్రజలను ఆజ్ఞాపించలేదు. ప్రజలర్పించే అర్పణలు, బలులు మనఃపూర్వకమైనవిగా, విధేయత నుండి వచ్చేవిగా ఉండాలి. 

7:24-26 యూదా హృదయకాఠిన్యం, దుష్టత్వం ఐగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని ఉన్నవేనని దేవుడే చెబుతున్నాడు.

7:27-28 కొట్టివేయబడియున్నది. అనే "కత్తిరించివేయబడినది" లేదా “కోసివేయబడినది” అని అక్షరార్థం) క్రియాపదం వారి నాలుకలు కోసివేయ బడ్డాయనే భావాన్ని స్పురింపజేస్తుంది. 9:3 వచనం ప్రకారం ప్రజలు “అబద్దాలకు ప్రచారకులు" అయ్యారు (జాక్ లండ్బమ్). నమ్మకము అనే పదం యథార్థత లేదా నైతికత అనే అర్థాన్ని సైతం ఇస్తుంది.

7:29 ఇది యూదా యెహోవా విడిచిపెట్టిన వధువులాగా ఉన్నదనే వర్ణన. నియమనిష్టలతో నాజీరు వ్రతాన్ని పాటించినవారు దీక్ష ముగిసినప్పుడు వారి తలవెండ్రుకలను కత్తిరించి వాటిని కాల్చివేయాలి (సంఖ్యా 6:13-18). నీ తలవెండ్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము అని దేవుడు
యూదాతో చెప్పినదానికి యూదా తన వ్రతం పూర్తిచేసుకుందని కాదు గానీ అది ఆ వ్రతాన్ని ఉల్లంఘించింది అని అర్థం. యూదా భౌతికంగా, ఆధ్యాత్మికంగా వ్యభిచరించింది కాబట్టి అది ఇక యెహోవాకు ప్రతిష్ఠితమైంది కాదు. 

7:30 యూదా ప్రజలు హేయవస్తువులను సైతం (అన్యదేవతల విగ్రహాలు) యెహోవా మందిరం లోపలికి తెచ్చారు. బహుశా ఇది యెహోయాకీము చేసిన పని కావచ్చు. యెహె 5:11 చూడండి. 

7:31 అరామిక్ భాషలో తో ఫేతు అనే పదానికి "అగ్నిగుండం" లేదా "పొయ్యి" లేదా "కొలిమి” అని అర్థం, ఈ పదాన్ని “అవమానం" అనే అర్థాన్నిచ్చే బోషెత్ అనే హెబ్రీ పదం లోని అచ్చులతో బాటు పలకాలి. ఈ బలిపీఠం యెరూషలేముకు దక్షిణాన బెన్ హిన్నోము లోయలో ఉంది. ఆహాజు రాజు (2రాజులు 16:3), మనషే రాజు (2రాజులు 21:5-6) ఇక్కడ అన్యదైవాలకు బలులర్పించడం ప్రారంభించారు. యూదాలోని చిన్నపిల్లలను బయలుకు లేదా మోలెకుకు బలిగా సైతం అర్పించారు. మోషే ధర్మశాస్త్రం శిశుబలిని లేదా నరబలిని నిషేధిస్తుంది. (లేవీ 18:21, 20:2-5, ద్వితీ. 18:10). ఈ దురాచారాన్ని రాజైన యోషీయా నిషేధించాడు (2రాజులు 23:10). యిర్మీయా కాలంలో ఇవి మళ్ళీ మొదలయ్యాయని తెలుస్తుంది. అనంతర కాలంలో బెన్ హిన్నోము లోయ(హెబ్రీ. గేహిన్నోమ్)లో చెత్తను కుమ్మరించడం ప్రారంభమైంది, బహుశా అది అక్కడ జరిగిన దారుణ కృత్యాలకు నిరసనగా అయ్యుండవచ్చు. క్రమేపీ, ఇది గెహన్నా అనే భవిష్యకాలంలోని తీర్పు స్థలాన్ని సూచించేదిగా మారింది (మత్తయి 5:22).

7:32-34 యూదా మీదకు రాబోయే దాడి ఎంత వినాశనం కలిగిస్తుందంటే ఎటుచూచినా శవాలు గుట్టలుగా పడి ఉంటాయి (కీర్తన 79:2 నోట్సు చూడండి). అతిఘోరమైన విషయం ఏమిటంటే, శవాల చుట్టూ మూగే ఆకాశపక్షులు భూజంతువులు మొదలైన వాటిని తోలివేయువాడు లేకపోవడం. దేశంలో ఎక్కడా సంతోషధ్వనులు వినబడవు, దేశము తప్పక పాడైపోతుంది. 


Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |