Jeremiah - యిర్మియా 7 | View All

1. యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

ప్రజలు ఇంకా యెహోవాను ఆరాధించేందుకు వస్తూనే ఉన్నారన్న విషయాన్ని గమనించండి. ఆయన మాటకు లోబడకపోయినప్పటికీ దుష్టత్వంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆలయానికి వస్తూనే ఉన్నారు. యిర్మియా 6:20 చూడండి.

3. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

పశ్చాత్తాపపడవలసిందని ప్రజలకు మరొక హెచ్చరిక. శిక్షించడానికి దేవుడెంత విముఖుడో చూడండి.

4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.

ఈ మోసకరమైన మాటలు కపట ప్రవక్తలూ, భక్తిలో దిగజారిన యాజులూ (యిర్మియా 5:31) పలికినవి. ప్రజలు ఆ మతాచారాలను కొనసాగించినంత కాలం అంతా క్షేమమేననీ, దేవునికి కోపం లేదనీ, ఆయన వారిని శిక్షించడనీ వారు ప్రజలకు చెప్పారు.

5. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.

యిర్మియా 5:28. ఈ విషయాలు దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యం!

6. పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

“హాని”– వ 19; యిర్మియా 25:7; కీర్తనల గ్రంథము 16:4. నిజ దేవుణ్ణి తప్ప ఇతర దేవుళ్ళను బొమ్మలను ఆరాధించడం అలా చేసేవారందరికీ గొప్ప కీడును తెచ్చిపెడుతుందని బైబిలు నేర్పుతున్నది. దాన్ని నిషేధించిన దేవుని కోపాన్ని అది రేపుతుంది (నిర్గమకాండము 20:1-6). అలా చేసేవాళ్ళను అది బానిసత్వంలో ఉంచుతుంది. ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని అది కలుగజేస్తుంది (దేవుడు తమ విగ్రహాల్లాంటి వాడేనని మనుషులు నమ్మినంత కాలం దేవుడు నిజంగా ఎలాంటివాడో తెలుసుకోలేరు). చివరికి అది దేవునినుండి గొప్ప శిక్షను కొని తెస్తుంది (ప్రకటన గ్రంథం 21:8).

7. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.

ఆదికాండము 17:8; యెహోషువ 1:6.

8. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.

అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో అధిక సంఖ్యాకుల విషయంలో ఇది వాస్తవం. మనుషులు సాధారణంగా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేందుకు అనుమతినిచ్చే మోసకరమైన మాటలు వినాలని కోరుతారు. యోహాను 3:19-20; 2 థెస్సలొనీకయులకు 2:10-12 చూడండి.

9. ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

“బయల్ దేవుడికి”– న్యాయాధిపతులు 2:11 నోట్ చూడండి. 9వ వచనంలో ప్రజలు తెలిసి, తెలిసీ, పదే పదే పది ఆజ్ఞల్లో ఐదింటిని మీరారని కనిపిస్తున్నది (నిర్గమకాండము 20:1-17). ఇలా చేస్తూ కూడా దేవుడు ఇవేమీ పట్టించుకోడులే, మమ్మల్ని మా శత్రువుల బారినుంచి క్షేమంగా ఉంచుతాడులే అనుకున్నారు.

10. అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?

11. నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 21:13, మార్కు 11:17, లూకా 19:46

మత్తయి 21:13 చూడండి. వీరి దృష్టిలో దేవుని ఆలయం తాము దాక్కొనేందుకు పనికి వచ్చే గుహలాంటిది. దేవుడు గుడ్డివాడననుకుంటున్నారా వీళ్ళు? (యిర్మియా 16:17; యిర్మియా 23:24; యిర్మియా 29:23; కీర్తనల గ్రంథము 33:13-15; సామెతలు 5:21; హెబ్రీయులకు 4:13).

12. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.

కనాను దేశంలో దేవుని సన్నిధి గుడారం మొట్టమొదటగా షిలోహులో ఉంది (యెహోషువ 18:1). ప్రజలు ఆరాధించేందుకు అక్కడికి వెళ్తుండేవారు (1 సమూయేలు 1:3). ఇది జెరుసలంకు దాదాపు 30 కి.మీ. ఉత్తరాన ఎఫ్రాయిం ప్రాంతంలో ఉంది. అక్కడనుంచి దేవుని ఒడంబడిక పెట్టెను ఫిలిష్తీయవారు ఎత్తుకుపోయారు. ఆ తరువాత దాన్ని అక్కడికి తిరిగి తీసుకురావడం జరగనే లేదు (1 సమూయేలు 4:17; కీర్తనల గ్రంథము 78:59-61). షిలోహు శిథిలమైంది. ఎఫ్రాయిం, ఉత్తర రాజ్యమంతా చెరలోకి వెళ్ళిపోయింది (2 రాజులు 17:1-6). యూదా, జెరుసలం ఆ షిలోహును చూచి బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు.

13. నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

14. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.

ఇక్కడ ప్రజలు నమ్మకం ఉంచుతున్నది దేవునిలో కాదు, ఆలయంలోనే.

15. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.

16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱ నైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.

దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. ప్రజల పాపం హద్దులు మీరిపోయి, అందనంత దూరం వెళ్ళిపోతే ఇక వారికోసం మరెవరన్నా ప్రార్థించినా కూడా దేవుడు వినడు (యెహోషువ 15:1; 1 యోహాను 5:16).

17. యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.

18. నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
అపో. కార్యములు 7:42

“ఆకాశ రాణి”– యిర్మియా 44:17-19. ఆ కాలంలోనే అనేక దేశాల్లో ఆయా పేర్లతో ప్రజలు ఆరాధించిన దేవత ఈమె. తూరు సీదోనుల వారు ఈమెను అష్తారోతు అనీ, బబులోనువారు ఇష్తార్ అనీ, గ్రీకులు అస్తార్తె అనీ పిలిచారు. ఈమె తమ ఫలసామర్థ్యతకూ, యుద్ధానికీ కూడా ఆది దేవత, మాతృదేవతగా ఈమెను వారు ఎంచారు.

19. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.

20. అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

వ 29. సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 లో దేవుని కోపం గురించిన నోట్స్.

21. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.

హోమబలులను తినకూడదు (లేవీయకాండము 1:9). వారు అర్పిస్తున్నవి దేవునికి అంగీకారం కాదు కాబట్టి వాటిని వారు తినవలసిందని ఆయన అంటున్నాడు.

22. నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని

దేవుడు మొదటగా ప్రజలు తనకు విధేయులై ఉండాలని నొక్కి చెప్పి పది ఆజ్ఞలను ఇచ్చాడు (నిర్గమకాండము 19:5; నిర్గమకాండము 20:1-7). బలుల విషయాలను ఆ తరువాత చెప్పాడు (లేవీ 1–7 అధ్యాయాలు).

23. ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

24. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.

వారు దేవునిపట్ల విధేయత చూపలేదు కాబట్టి వారి బలులు నిష్‌ప్రయోజనాలే. “చెడ్డ హృదయం”– యిర్మియా 3:17; యిర్మియా 9:14; యిర్మియా 11:8; యిర్మియా 13:10; యిర్మియా 16:12; యిర్మియా 18:12. యిర్మీయా గ్రంథంలో మానవ హృదయం గురించి చాలా విషయాలు రాసి ఉన్నాయి. దానిలోని మొండితనం, మూర్ఖత్వం, దుర్మార్గత అంతా తేటగా బయటపడింది. ఈ పుస్తకానికి ఒక మూల యిర్మియా 17:9.

25. మీ పితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.

కొన్ని జాతులవారికి అంతకంటే ఉత్తమ మార్గం తెలియదు కాబట్టి తమ హృదయాలనే అనుసరించారు. అయితే ఇస్రాయేల్‌వారికీ, యూదావారికీ సత్య మార్గం తెలుసు. అందువల్ల మిగతా ప్రజలకంటే వారి పాపం మరింత ఘోరమైనది. సత్యం లేనందువల్ల చేసే పాపం చెడ్డది. అయితే సత్యానికి విరుద్ధంగా చేసే పాపం అంతకన్నా ఘోరం.

26. వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమ పితరులకంటె మరి దుష్టులైరి.

27. నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు

ప్రజల్లో ఎలాంటి మార్పూ లేదని దేవునికి తెలుసు.

28. గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము - వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.

వెంట్రుకలు కత్తిరించుకోవడం బైబిల్లో దుఃఖానికీ, పరితాపానికీ గుర్తు (యోబు 1:20; మీకా 1:16).లేవీయకాండము 21:5 చూడండి.

29. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.

30. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.

యిర్మియా 4:1; యిర్మియా 32:34. ప్రజలు దేవునిపట్ల, ఆయన ధర్మశాస్త్రం పట్ల ఇక ఇంతకంటే స్పష్టంగా తమ తిరస్కారాన్ని ఏ విధంగా చూపగలరు?

31. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

“తోఫెతు”– వ 32; యిర్మియా 19:6, యిర్మియా 19:11-14. అమ్మోనువాళ్ళు కొన్ని సార్లు తమ దేవుడు మోలెకుకు తమ పిల్లలను అగ్నిలో అర్పించేవారు (లేవీయకాండము 18:21; లేవీయకాండము 20:1-5; 1 రాజులు 11:7; 2 రాజులు 16:2-3; 2 రాజులు 21:1, 2 రాజులు 21:6). యూదా, జెరుసలం నివాసులు హేయకరమైన ఈ ఆచారాన్ని అనుసరించి ఇందుకోసం జెరుసలం గోడకు ఆనుకునే ఒక స్థలాన్ని కట్టారు. హిన్నోంలోయ అంటే గ్రీకులో గె–హిన్నోం. ఇదే ఇంగ్లీషులో గిహెన్న అయింది. క్రొత్త ఒడంబడికలో ఈ పదాన్ని నరకం, నిత్యాగ్నిని సూచించేందుకు వాడారు (మత్తయి 18:9; మార్కు 9:47-48).

32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 19:6. ఇది బబులోనువాళ్ళు దేశంపై దాడి చేసినప్పుడు జరిగే వధను సూచిస్తూవుంది.

33. ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

34. ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
ప్రకటన గ్రంథం 18:23



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవాలయంపై నమ్మకం వృథా. (1-16) 
వ్యక్తులు తమ ప్రవర్తన మరియు చర్యలను మెరుగుపరచుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్ప, మతపరమైన ఆచారాలు, వృత్తులు లేదా దైవిక ద్యోతకాల నుండి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరు. తెలిసి తెలిసి పాపపు ఆచారాలలో నిమగ్నమై లేదా తమకు తెలిసిన బాధ్యతలను విస్మరించిన వారు మోక్షాన్ని కోరుకుంటున్నట్లు వాస్తవముగా చెప్పలేరు. ఆలయాన్ని అపవిత్రం చేయడం తమను కాపాడుతుందని కొందరు విశ్వసించారు, అయితే కృప దానిని కప్పిస్తుందని లేదా దయ పుష్కలంగా వస్తుందని ఆశించి పాపం చేయడం కొనసాగించే ఎవరైనా వాస్తవానికి క్రీస్తు బోధలను దుర్వినియోగం చేస్తారు. సిలువపై క్రీస్తు త్యాగం యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అటువంటి హానికరమైన నమ్మకాలకు అత్యంత ప్రభావవంతమైన నివారణను అందిస్తుంది. దైవిక చట్టం యొక్క గొప్పతనాన్ని మరియు పాపం యొక్క దుర్మార్గాన్ని ప్రదర్శించడానికి దేవుని కుమారుడు మన పాపాల కోసం తనను తాను త్యాగం చేశాడు. మన చర్యలకు పర్యవసానాలను ఎదుర్కోకుండా మనం తప్పులో నిమగ్నమవ్వగలమని మనం ఎప్పుడూ అనుకోకూడదు.

విగ్రహారాధనలో కొనసాగడం ద్వారా రెచ్చగొట్టడం. (17-20) 
యూదులు తమ విగ్రహాల పట్ల తమ ఉత్సాహాన్ని ప్రదర్శించడంలో సంతృప్తిని పొందారు. ఈ ప్రతికూల ఉదాహరణ నుండి, దేవుని పట్ల మన భక్తిలో ఉత్సాహంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి మనం పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని కోసం ఏదైనా సేవలో పాల్గొనడం మరియు మన ప్రయత్నాలలో చాలా మంది పాపభరితమైన బోధలను వ్యాప్తి చేయడంలో శ్రద్ధ చూపడం ఒక గొప్ప విషయంగా పరిగణిద్దాం. ఈ పాపపు ప్రవర్తన చివరికి దేవునికి వ్యతిరేకంగా శత్రుత్వానికి దారి తీస్తుంది, కానీ దానిలో పాల్గొనే వారికి కూడా హాని చేస్తుంది. చివరికి, దేవుని ఉగ్రత ఆర్పివేయలేని అగ్ని కాబట్టి, పరిణామాల నుండి తప్పించుకోవడానికి మార్గం లేదని వారు కనుగొంటారు.

దేవుడు వారితో తన వ్యవహారాలను సమర్థిస్తాడు. (21-28) 
వారి నుండి విధేయత ఆశిస్తున్నట్లు దేవుడు స్పష్టం చేశాడు. అతని ఆజ్ఞ సూటిగా ఉంది: "మీ దేవుడైన యెహోవా స్వరాన్ని జాగ్రత్తగా వినండి." ఈ ఆదేశంతో కూడిన వాగ్దానం చాలా భరోసానిస్తుంది. మీరు దేవుని చిత్తాన్ని మీ మార్గదర్శకంగా చేసినప్పుడు, ఆయన అనుగ్రహం మీ ఆనందానికి మూలం అవుతుంది. దేవుడు అవిధేయతతో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. యూదులు ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా సువార్త యొక్క సారాంశాన్ని గ్రహించడంలో విఫలమవుతాము, క్రీస్తు త్యాగం మన బాధ్యతను తగ్గించిందని విశ్వసిస్తే.

మరియు ప్రతీకారాన్ని బెదిరిస్తుంది. (29-34)
దుఃఖం మరియు బందిఖానా రెండింటికి చిహ్నంగా, యెరూషలేము అధోకరణం చెందాలి, ఆమె ఇంతకుముందు దేవునికి అంకితం చేయబడినట్లే దేవుని నుండి దూరం అవుతుంది. హృదయం దేవుని కోసం నియమించబడిన నివాస స్థలం అయితే, పాపం లోపల అంతర్లీనంగా మరియు ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తే, అది ప్రభువు ఆలయాన్ని అపవిత్రం చేస్తుంది. జెరూసలేం యొక్క రాబోయే విధ్వంసం ఒక భయంకరమైన సంఘటనగా చిత్రీకరించబడింది. చాలా మంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు, ఎందుకంటే వారు దానిని పాప స్థలంగా మార్చారు. పాపులు తమను తాము మరణానికి మించిన చెడును వెంబడిస్తారు. దేవుని దయను తిరస్కరించి, పనికిమాలిన ఆనందాలను కొనసాగించేవారు చివరికి దేవుని న్యాయం యొక్క పరిణామాలను అనుభవిస్తారు, వారి ఆనందాన్ని కోల్పోతారు. ధర్మబద్ధమైన ఆనందాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవడం మరియు అన్ని ఇతర ఆనందాల నుండి, అనుమతించదగిన వాటి నుండి కూడా నిర్లిప్తతను కొనసాగించడం మాకు చాలా అవసరం.




Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |