Psalms - కీర్తనల గ్రంథము 86 | View All

1. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము

2. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షిం పుము.

3. ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము

4. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.

5. ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.

6. యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,

7. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టెదను.

8. ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.

9. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.
ప్రకటన గ్రంథం 15:4

10. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు

11. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.

12. నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.

13. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.

14. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.

15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు

16. నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.

17. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-86. దేవుడు అన్యాయపు తీర్పు పొందినవారి పక్షం వహిస్తాడు కాబట్టి ఆ నమ్మకంతో తన సహాయానికి రమ్మని కీర్తనకారుడు దేవుణ్ణి వేడుకొంటూ రాసిన కీర్తన. 

86:1-3 వ్యక్తిగత విలాపాల్లో చాలావాటిలో కీర్తనకారుడు దేవుడు తనను విడిపించేవరకు దినమెల్ల ప్రార్థించడం కనబడుతుంది. 

86:4-5 తనపట్ల దయ చూపి క్షమించమనీ కృపాతిశయము కనపరచమనీ కీర్తనకారుడు మనవి చేస్తున్నాడు. ఇదే పదజాలం వ.15 లోను కనబడుతుంది. పాపక్షమాపణను యెహోవా నిబంధనాపూర్వకమైన విశ్వాస్యతకు చెందినదిగా కీర్తన 103:8 చెబుతున్నది. 

86:6 చెవియొగ్గుము - జవాబివ్వవలసిన పూచీ ఉన్న ప్రతివాది వినాలనే మనవి ఇది. నా మనవుల ధ్వని - దైవకృపను వెతుకుతూ చేసే యాచన (28:2; 31:22; 130:2; 140:6).

86:7 దీనుల (హెబ్రీ. ఆని) ప్రార్థన దేవుడు వింటాడు (ఉత్తరమిచ్చువాడవు - హెబ్రీ. అనన్), వ.1 చూడండి (34:6 నోట్సు చూడండి). 

86:8-10 దేవుని సర్వాధిపత్యాన్ని భూమ్మీద ఉన్న -మనుషులందరూ గుర్తించాలనే ఆహ్వానాన్ని పలికేముందు దేవుని ఘనత మహాత్మ్యాలు నిరుపమానమైనవనీ, ఎవరూ ఆయనతో సమం కాలేరనీ ప్రకటించబడుతుంది (నిర్గమ 15:11; 2సమూ 7:22; 1రాజులు 8:23; మీకా 7:18).

86:11 యెహోవా... నీ మార్గమును నాకు బోధింపుము. హృదయపూర్వకంగా తాను దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండేలా ఆయన మార్గాలను, ఆయన సత్యాన్ని తనకు బోధించమని, తన బాధల, కష్టాల మధ్యనుండి కీర్తనకారుడు వినయంతో దేవునికి వేడుకుంటున్నాడు. మనం శోధనలు, కష్టాలు ఎదుర్కొనేటప్పుడు సహితం ఆయన మార్గాల్లో నడిచేలా నిజమైన భయభక్తులు గల హృదయాన్నీ, ఆయన సత్యంలో ఆనందించే వివేకాన్నీ దయచేయమని మనం దేవునికి మొర్రపెట్టాలి. 

86:13 దైవస్తుతి లేని మృతులలోకాన్ని (యెషయా 14:9; యెహె 31:16), దేవుని నుండి వేరుగా ఉన్న స్థలాన్ని (6:5; యెషయా 38:18) పాతాళపు అగాధము సూచిస్తుంది. అలంకారిక దృష్టాంతంగా పాతాళం అనే పదం పొంచి ఉన్న మృత్యువును లేదా దేవుని సన్నిధి నుండి తొలగిపోవడాన్ని సూచిస్తుంది (యోనా 2:3).

86:14 గర్విష్ఠులు దేవుని పట్ల భయభక్తులు చూపించరు, ఆయనను అసలు గుర్తించరు (19:13; 54:3). 

86:15 కీర్తనకారుడు యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడనీ, కృపామయుడనీ, దీర్ఘశాంతుడనీ, కృపాసత్యములతో నిండినవాడనీ నొక్కి చెబుతున్నాడు. ఈ సూత్రీకరణలోని రెండవ సగభాగం లోపించడం గమనార్హం. అదేమంటే, దేవుడు పాపం పట్ల ఉగ్రతతో స్పందిస్తాడు (నిర్గమ 34:6-7; 86:4-5 నోట్సు చూడండి). 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |