Psalms - కీర్తనల గ్రంథము 4 | View All

1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.

4. భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
ఎఫెసీయులకు 4:26

5. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి

6. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.

8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-4. కీర్తనలో నిర్దిష్టమైన సందర్భం గురించి వర్ణన లేకపోయినా, ఏదో ఒక గొప్ప విపత్తు (బహుశా కరువు కావచ్చు, వ.7 చూడండి) సంభవించినప్పుడు ఆ విపత్తు కారణంగా ప్రజలు యెహోవా దేవుణ్ణి విడిచి సహాయం కోసం కనాను దేవతల వైపు తిరుగుతున్న సమయంలో దానినుండి విమోచన కోసం చేసిన ప్రార్థన. ఈ కీర్తనలోని రచనావస్తువూ, విషయమూ కీర్తన 3 ను పోలి ఉన్నాయి.

శీర్షిక: ప్రధానగాయకునికి సంగీతపరమైన సూచనలున్న కీర్తనల్లో ఇది మొదటిది. 

4:1-8 ఎంత కష్టంలో ఉన్నా దేవునిపై వ్యక్తిగతమైన నమ్మకంతో (వ. 5,8), ఆయన సహాయం కోసం మనఃపూర్వకంగా నా కుత్తరమిమ్ము అని కోరే (వ.1,3,6) భక్తిపరుల (వ.3-5; తర్వాతి నోట్సు చూడండి) ప్రార్థనలు దేవుడు వింటాడని ఈ కీర్తన తెలియజేస్తున్నది. 

4:1 నా నీతికి ఆధారమగు దేవా అనే మాటలు కీర్తనకారుడు దేవుడే తనకు న్యాయం చేయాలని సూటిగా చేస్తున్న విన్నపం. ఇరుకులో అనే పదం శత్రువులు పన్నిన ఉచ్చులో చిక్కుకొనడాన్ని లేదా శత్రువులు చుట్టుముట్టడాన్ని వర్ణిస్తున్నది. తన విన్నపానికి ప్రతిస్పందనగా దేవుడు తనను కాపాడడాన్ని కీర్తనకారుడు నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే అని చెబుతున్నాడు. క్రియాపదం పూర్తయిన చర్యను తెలియజేస్తున్నది, బహుశా ఇది దేవుడు తనను కాపాడతాడని కీర్తనకారుడిలో ఉన్న నిశ్చయత కావచ్చు. 

4:2 నరులారా అనే పదం కీర్తనకారుని శత్రువుల్ని సూచిస్తున్నది, కీర్తన 62:9 లో లాగా ఈ పదం కీర్తనకారుని శత్రువులు పలుకుబడి, ప్రాభవం కలిగినవారని తెలియజేస్తున్నది. వీరికీ, కీర్తన 49:2 లో ఉన్న “సామాన్య" మైన మనుషులకూ భేదం ఉంది. బీదలకు వేరుగా ప్రముఖుల్ని, ఘనుల్ని వర్ణించడానికి ఐగుప్తీయ, బబులోనీయ గ్రంథాల్లోనూ ఇదే పదాన్ని ఉపయోగించారు. ఎంత కాలము అనే భావప్రకటన ఒక వ్యక్తి సుదీర్ఘకాలంగా ఆ స్థితిలో కలత చెందుతున్నాడని సూచిస్తుంది. ఇతర కీర్తనల్లోని ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ మాటలు కనబడతాయి (79:5; 89:46). 

4:3 నిర్గమ 11:7 లో ఉన్నట్టుగా దేవుడు తన భక్తులను (దేవుని పట్ల విశ్వాస విధేయతలు గలవారు), ఘనులను ("నరుల”ను) వేర్వేరుగా చూస్తున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది. అందుచేత, తాను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును అనే ప్రగాఢమైన నమ్మకం కీర్తనకారునిలో ఉండవచ్చు. ఏర్పరచుకొను అనే పదం “పరిశుద్ధపర్చు” (హెబ్రీ. కాదేష్) అనే పదానికి వ్యక్తీకరణ కాదు. అయితే ఈ పదం (హెబ్రీ. పేలాహ) “వ్యత్యాసపరచు” లేదా “ప్రత్యేకపరచు” అనే అర్థాన్నిస్తుంది.

4:4 భయమునొంది అనే అర్థాన్నిచ్చే హెబ్రీ పదానికి “కంపించడంలో లేదా “వణకడం" అనే భావం ఉంది. ఈ పదాన్ని కొన్నిసార్లు అక్షరాలా వణికిపోవడాన్ని వర్ణించడానికి ఉపయోగించారు. (18:7; 77:18). ఈ పదాన్ని మనుషుల కుపయోగించినప్పుడు దిగులు చెందడాన్ని లేదా జడుపుతో వణకడాన్ని (నిర్గమ 15:14; ద్వితీ 2:25), కలహించుకొనడాన్ని (ఆది 45:24), లేదా కోపంతో ఊగిపోవడాన్ని (2రాజులు 19:27-28) సూచిస్తుంది. ఈ పదం దేవుని కోపాన్ని రేపడాన్ని సైతం సూచిస్తుంది (యోబు 12:6). సెప్టువజింట్ లో (LXX) ఈ పదాన్ని “కోపపడడం" అని (గ్రీకు. ఆర్టిజో) అనువదించారు. పౌలు దీనినే ఎఫెసీ 4:26 లో ఉపయోగించాడు. ఈ కీర్తన సందర్భాన్ని బట్టి భయంతో వణకడమనే అర్థం తీసుకుంటే కోపపడడమనే అర్థం కూడా సమంజసంగానే కనబడుతుంది. దేవుని ప్రజలపైన దాడులుచేయకుండా నియంత్రించుకోమని కోపోద్రేకులైన శత్రువులకు ఇది ఒక సవాలుగా ఉందని భావించాలి. 

4:5 నీతియుక్తమైన బలులు అర్పించుచు అన్నది శత్రువులకు మరొక సవాలు, ఇటువంటి బలులు దేవుని పట్ల భయభక్తులు గలవారే అర్పించగలరని అర్థం. శత్రువులకు తుది సవాలు ఏమిటంటే, వారు తమ మార్గాలు విడిచిపెట్టి యెహోవాను నమ్ముకోవడం. 

4:6 ఈ మాటలు నెమ్మది లేనివారు, నిరాశావాదులు, తమ అవస్థను బట్టి, విధికృత్యాన్ని బట్టి పలికే మాటలుగా కనబడుతున్నాయి. దేవుని ప్రజల సమాజంలో సైతం ఆయనలో పూర్తినమ్మిక లేనివారు ఇలాటి మాటల్నే పలుకుతారనడానికి ఇదొక ఉదాహరణ. దేవుడు తన సన్నిధికాంతిని సమాజమంతటి మీదా ప్రకాశింప జేయాలనేది వీరి ప్రార్థన. ఇది సంఖ్యా 6:24-26 లోని అహరోను ఆశీర్వచనాన్ని గుర్తుచేస్తున్నది. 

4:7-8 కీర్తనకారుని స్వంత అనుభవం వ.6 లోని నిరాశావాది వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉంది. కీర్తనకారునికి యెహోవాతో ఉన్న అన్యోన్యతను బట్టి అతనిలో అధికమైన సంతోషము, భద్రతాభావం ఉన్నాయి. 3:5 లోని “పండుకొని నిద్రబోయి" అనే వర్ణన ఇక్కడ కూడా కనబడుతుంది (పండుకొని నిద్రబోవుదును). 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |