Psalms - కీర్తనల గ్రంథము 31 | View All

1. యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.

2. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.

3. నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే.

4. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలోనుండి నన్ను తప్పించుము.

5. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.
లూకా 23:46, అపో. కార్యములు 7:59, 1 పేతురు 4:19

6. నేను యెహోవాను నమ్ముకొని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు.

7. నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతో షించెదను.

8. నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

9. యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.

10. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.

11. నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారి పోవుదురు.

12. మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.

13. అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.

14. యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.

15. నా కాలగతులు నీ వశములో నున్నవి. నా శత్రువుల చేతిలోనుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారినుండి నన్ను రక్షింపుము.

16. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.

17. యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక.

18. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.

19. నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.

20. మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు

21. ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాక.

22. భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.

23. యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును.

24. యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
1 కోరింథీయులకు 16:13



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-31. నిరాశా నిస్పృహలతో నిండిన పరిస్థితుల్లో కృంగిపోకుండా దేవునిలోనే తన నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి ప్రార్థన. 

31:1-4 ఆశ్రయశైలము... కొండ... కోట అనే పదాలకు హెబ్రీలో వేర్వేరు పదాల్ని ఉపయోగించినా, అవన్నీ యెహోవాలోనే క్షేమం, సంరక్షణ అనే అవగాహనను సూచిస్తున్నాయి (18:2). కోటలు శత్రువుల నుండి కాపాడే స్థావరాలు (27:1). కొండ స్థిరత్వానికి సూచన, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమని దీని భావం (యెషయా 26:4). వల అనేది శత్రువుల దుష్టపన్నాగానికి ఒక అలంకారిక దృష్టాంతం (35:7; 140:5). 

31:5 ఆత్మ మనిషి అస్తిత్వాన్నంతటినీ, లేదా దేవుడు ప్రతి మనిషిలోను ఉంచిన జీవాత్మను సూచిస్తుంది (ఆది 7:22; యెషయా 38:16). దానిని దేవుని చేతికప్పగించు కోవడం దేవుని అధికారాన్ని, లేక ఆ ఆత్మ దేవునికి చెందినదనే సత్యాన్ని సూచిస్తుంది. (యెహో 7:7). యేసు సిలువ మీద తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకుంటున్నానని చెబుతూ ఈ మాటలు పలకడం గమనార్హం (లూకా 23:46).

31:9-10 శరీరబాధతో బాటు హృదయవేదన ఉండడం సహజమే. కీర్తనకారుడు బాగా ఏడవడం వలన అతని కన్ను క్షీణించుచున్నట్టు అయ్యింది (6:7; 88:9; యోబు 17:7), యెముకలు క్షీణించుచున్నవి అనేది కీర్తనకారుడు విచారము వలన దుఃఖముతో బ్రతుకును వెళ్లదీయడం వలన అతను కృశించి పోతున్నాడనే అలంకారిక వర్ణన (6:2; 22:14; 102:5 చూడండి). తన దోషమును ఒక కారణంగా చెప్పడం కీర్తనకారుడు కృశించిపోతున్నాడు, బాధలు, శ్రమలు పాప ఫలితాలే అనే సామాన్య దృక్పథాన్ని ఇది వ్యక్తపరుస్తున్నది. సార్వతికంగా, సామాన్యంగా ఇది సత్యమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఇది. అన్ని సార్లూ వర్తించకపోవచ్చు. దేవుని కోపం వల్లనే శ్రమ సంభవిస్తుందని చెప్పడం కూడా ఇదే కోవకు చెందిన అభిప్రాయం (6:1 నోట్సు చూడండి).

31:13 నీతిమంతుల్ని బాధించడానికి కుట్రలు పన్నడం దుష్టుల నైజం (21:11; 37:12). శత్రువులు కీర్తనకారునికి ప్రాణహాని... యోచించు చున్నారు. ఇటువంటి అనుభవం యిర్మీయాకు కూడా ఎదురైంది (యిర్మీయా 11:19, 18:23). నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది అనే మాట యిర్మీయా గ్రంథంలో పలుచోట్ల చూడగలం (యిర్మీయా 6:25; 20:10; 46:5)

31:14-15 శత్రువుల చేతిలో పడకుండ, దేవుని వశములో ఉండాలనే విన్నపం ఈ కీర్తనలో ముఖ్యాంశం (వ.5; 2సమూ 24:14 తో పోల్చండి).

31:19 దేవుడు తన పట్ల భయభక్తులు గలవారి కోసం మేలు దాచి ఉంచుతాడు (1కొరింథీ 2:9).

31:20 దాచుచున్నావు గురించి 17:7-9 నోట్సు చూడండి.

31:21 కీర్తనకారుడు తన శ్రమను ప్రాకారముగల , పట్టణముతో పోల్చుతున్నాడు. అంటే అక్కడ నుండి బయటపడడం అసాధ్యమని అతని భావన. అయితే అతడు దేవుని ఆశ్చర్యకరమైన కృపను పొందాడు. 

31:22 కీర్తనకారుడు తాను ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడిన సాదృశ్యంలో దేవుని నుండి కొట్టివేయబడి నాశనమైతిననుకున్నాడు. (నిర్గమ 12:15; సంఖ్యా 19:13). మరణం అన్నిటికంటె తీవ్రమైన ఎడబాటు (నిర్గము 9:15; 31:14; యిర్మీయా 9:21). దేవునికి కనబడకుండ కొట్టివేయబడడం ఆయన త్రోసివేశాడని, అందుకే ఆయన నుండి వేరైపోవడం జరిగిందనే భావాన్ని తెలియజేస్తున్నది. “దూరంగా ఉండడం”, “ముఖాన్ని దాచుకోవడం” అనేవి కూడా ఇలాటి భావాన్నే సూచించే పదజాలం (10:1-2 నోట్సు చూడండి).

31:24 ఇశ్రాయేలీయులు - వాగ్దానదేశాన్ని స్వతంత్రించుకొనే ముందు దేవుడు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో పలికిన మాటలను ధైర్యము... నిబ్బరము అనే మాటలు గుర్తుకు తెస్తున్నాయి (ద్వితీ 31:6-7,23; యెహో 1:6-7,9,18) 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |