Chronicles II - 2 దినవృత్తాంతములు 21 | View All

1. యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించితన పితరులచెంతను దావీదు పురమందు పాతిపెట్ట బడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.

2. యెహోషాపాతు కుమారులైన అజర్యా యెహీయేలు జెకర్యా అజర్యా మిఖాయేలు షెఫట్య అను వారు ఇతనికి సహోదరులు; వీరందరును ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.

3. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేక ములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.

4. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.

5. యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూష లేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.

6. అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.

7. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.

8. అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధి కారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా

9. యెహోరాము తన చేతిక్రిందనున్న అధి కారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.

10. కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగ బడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.

11. మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.

12. అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెనునీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగానీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక

13. ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.

14. కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.

15. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.

16. మరియయెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా

17. వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.

18. ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున

19. రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.

20. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
21:1 యెహోరాము: యెహోషాపాతు కుమారుడైన ఇతడు యూదాదేశానికి ఐదవ రాజు. బయలు దేవతారాధన ప్రోత్సహించి యూదా మీదికి విపత్తు తెచ్చాడు. తరువాత కొన్ని అధ్యాయాలలో, అనేక తరాల గురించిన వివరాలు త్వరగా మనం అధ్యయనం చేస్తాం.
ఎందుకంటే, వారి పాలనాకాలం త్వరగా ముగియటం, చిన్నవయసు గలవారు రాజులు కావడం, యూదా అసలు వారసుడు ఒక సంవత్సరం వయసులో ఉన్నప్పుడు అతల్యా సింహాసనం ఆక్రమించుకోవడం వంటి కారణాలు కనబడతాయి. యెహోరాము పుట్టే సమయానికి యెహోషాపాతుకు సుమారు పద్దెనిమిది సంవత్సరాలు. యెహోషాపాతు . ముప్పది. ఐదు సంవత్సరాల వయసులో సింహాసనం అధిరోహించి ఇరవై ఐదు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు. అతని కుమారుడైన యెహోరాము ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా ఇరవై రెండు సంవత్సరాల వయసులో రాజయ్యాడు, కానీ ఒక సంవత్సరమే పరిపాలించాడు. అహజ్యా చనిపోయే సమయానికి, ఒక పసివాడు మాత్రమే సింహాసనానికి వారసునిగా మిగిలాడు. 

21:2-6. తన కుమారుడైన యెహోరాముకు అహాబు, యెజెబెలు కుమార్తె అతల్యాతో వివాహం చేయడం ద్వారా (వ.6), యెహోరాము ఒకనాటి కాలంలో ఐక్యంగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యమంతటికీ రాజు కావచ్చని యెహోషాపాతు అనుకుని ఉంటాడు. ఆవిధంగా ఇశ్రాయేలీయులందరూ దేవుని ఆరాధనకు మరలుతారని, ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తారని అనుకుని ఉంటాడు. అయితే యెహోరాము ఒక కొత్త దావీదు కాలేదు సరికదా, యూదాలో అహాబు ప్రతిరూపంగా మారాడు.
తన భార్య అతల్యాతో కలసి యూదాదేశానికి కొత్తరూపు తీసుకురావడం ప్రారంభించి, బయలు దేవతను ఘనంగా ఎంచుతూ, ప్రభుత్వాలు మారాలంటే హత్యలే మార్గంగా ఎంచుకునే ఉత్తర ఇశ్రాయేలు దేశంలా మార్చేశాడు. దక్షిణ యూదాదేశంపై పూర్తిగా పట్టు చేజిక్కించుకున్న తరవాత యెహోరాము తన సహోదరులనందరిని, సింహాసనం చేజిక్కించుకునే అవకాశమున్న ఇతరులందరినీ హతం చేశాడు. 

21:7 అయితే దావీదు రాజవంశం నిత్యము కొనసాగుతుందని తాను ఇచ్చిన వాగ్దానం దేవుడు దయతో కొనసాగించాడు కాబట్టే యెహోరామును నశింపజేయలేదు (6:40-42 నోట్సు చూడండి; 2సమూ 7:13,16 పోల్చండి; కీర్తన 89:29). 

21:8-9 యెహోరాము తండ్రి యెహోషాపాతు కాలంలో ఎదోమీయులు ఓటమిపాలై అవమానం పొందారు. అయితే యెహోషాపాతు చేసిన విధంగా యెహోరాము శక్తిగల దేవునిని ఆరాధించడం లేదని గ్రహించినప్పుడు (వ. 10 చూడండి; 20:29 పోల్చండి), వారు యూదా ఆధిపత్యంపై తిరగబడ్డారు. తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకుని, తిరిగి తమ సొంత ప్రభుత్వం స్థాపించుకున్నారు. తిరుగుబాటు చేసిన ఎదోమీయులపై దాడి చేయడానికి రథములన్నిటితో, ఎక్కువమంది సైన్యంతో యెహోరాము వారి భూభాగంలోకి ప్రవేశించాడు. కానీ దేవుడు అతని పక్షంగా లేడు. ఎదోమీయులు అతని చుట్టుకొన్నారు.

21:10 నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు... తిరుగబడిరి అనే మాటలు యెహోరాము చేసిన సైనికచర్య విఫలమయ్యిందని సూచిస్తాయి. అదేవిధంగా, యూదాలో లిబ్నా పట్టణం కూడా యెహోరాముపై తిరుగుబాటు చేసింది. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విడిచినందున ఆ పట్టణ పౌరులు అతడిని అనుసరించడానికి నిరాకరించారు. యెహోరాము దేశాన్ని నాశనకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తుంటే అందరూ తమకు పట్టనట్లు కళ్ళు మూసుకుని కూర్చోలేదు.

21:11 యూదాదేశమంతటా విగ్రహారాధన స్థలాలను ఏర్పాటు చేయడానికి యెహోరాము తీరిక లేకుండా పనిచేశాడు. అతడు యూదా వారిని విగ్రహపూజకు లోపరచెను (వ్యభిచరింపజేసెను) అనే మాటలు వాస్తవాలు కావచ్చు, సూచనగా చెప్పినవి కూడా కావచ్చు. సూచనగా అర్థం చేసుకుంటే, ప్రజలు ఆధ్యాత్మికంగా వ్యభిచారం చేస్తున్నారని అర్థం. అయితే వాస్తవిక కోణంలో చూస్తే అనేక అన్యమత విధానాలలో లైంగిక విశృంఖలత కనబడుతుంది. ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అందించడం రాజు బాధ్యత. ప్రజలు పెడత్రోవ పడితే అతడు బాధ్యత వహించాలి, కానీ ప్రజలు చేసే పనులకు ప్రజలే బాధ్యులు. లిబ్నా ప్రజలు నిరూపించినట్లు దుష్టుడైన రాజును అనుసరించడానికి ప్రజలు నిరాకరించవచ్చు (వ.10; అపొ.కా.4:18-20 పోల్చండి).

21:12-15 యెహోరాము అహాబుకు అల్లుడు గనుక, అహాబుకు చిరకాల ప్రత్యర్ధిగానున్న ఏలీయా ప్రవక్త అహాబు ప్రవర్తన బట్టి అతడిని గద్దించిన విధంగానే "యెహోరామును • కూడా గద్దించడంలో ఆశ్చర్యం లేదు. విగ్రహారాధన, భ్రాతృహత్యలతో సహా యెహోరాము చేసిన అనేక పాపాల గురించి ఏలీయా తన పత్రికలో పేర్కొన్నాడు. త్వరలోనే వారికి కఠినమైన శిక్ష పడుతుందని తెలియజేశాడు. యెహోరాము తన సహోదరులను హతం చేసినట్లే, ఇప్పుడు యెహోరాము ఇంటివారు కూడా హతులవుతారు. 

21:16-17 ఫిలిపీయులు, వారి పొరుగునున్న అరబీయులు యూదారాజైన యెహోషాపాతుకు (17:11) కానుకలు - తెచ్చి ఎంతో కాలం గడవలేదు. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. కానీ ఈసారి కానుకలు వెనుకకు తీసుకుని పోడానికి, రాజనగరులో దొరికిన సమస్తం : పట్టుకుపోడానికి వచ్చారు.
యెహోరాము కుమారులలో యెహోయాహాజు (తరవాత కాలంలో అతడిని అహజ్యా అని పిలిచారు)ను తప్ప, అతని భార్యలలో ఈ విపత్తు అంతటికీ బాధ్యురాలైన అతల్యాను తప్ప మిగిలిన వారందరినీ చంపారు. 

21:18-20 ఏలీయా ముందే చెప్పిన విధంగా, యెహోరాముకు పేగులలో వేదనకరమైన జబ్బు వచ్చింది. చివరికి ఆ జబ్బుతోనే అతడు మరణించాడు. ప్రజల్లో ఎవరూ అతని కోసం దుఃఖించలేదు. రాజు గౌరవార్థం చేసే ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతణ్ణి యూదా రాజుల సమాధులలో గాక, వేరేచోట పాతి పెట్టారు. 

22:1 అహజ్యా: యెహోరాము, అతల్యాల కుమారుడైన ఇతడు యూదాకు ఆరవ రాజు. అహాబు ఇంటిని సమూలంగా నాశనం చేసిన సమయంలో యెహూ ఇతనిని చంపాడు. యెహోరాము పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, అతడు చనిపోయిన తరవాత అతని కుమారుడు అహజ్యాను అతనికి బదులుగా రాజును చేశారు.
ఈ భాగంలో సంఘటనలు అర్థం చేసుకోవాలంటే, ఉత్తర, దక్షిణ దేశాలలో ఒకే పేరుగల రాజులను గుర్తించాలి. ఉత్తర ఇశ్రాయేలు దేశంలో అహాబుకు అహజ్యా, యెహోరాము అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అహాబు చనిపోయిన తరవాత, అతని కుమారుడైన అహజ్యా అధికారానికి వచ్చాడు. అతని తరవాత అతని సహోదరుడైన యెహోరాము (యోరాము) అధికారంలోకి వచ్చాడు. దక్షిణ యూదా దేశంలో, యెహోషాపాతు చనిపోయిన తరువాత అతని కుమారుడైన యెహోరాము, అతని తరవాత "అతని కుమారుడైన (యెహోషాపాతు మనవడు) అహజ్యా (లేదా యెహోయాహాజు) అధికారంలోకి వచ్చాడు. ఆ విధంగా, ఉత్తరాది ఇశ్రాయేలు దేశంలో వరసగా అహాబు, అహజ్యా, యెహోరాము పరిపాలించారు. దక్షిణాది యూదా దేశంలో యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా పరిపాలించారు. 


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |