Micah - మీకా 7 | View All

1. వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి ఆలాగే యున్నది. ద్రాక్షపండ్ల గెల యొకటియు లేకపోయెను, నా ప్రాణమున కిష్టమైన యొక క్రొత్త అంజూరపుపండైనను లేకపోయెను.

2. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.

3. రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.

4. వారిలో మంచివారు ముండ్లచెట్టువంటివారు, వారిలో యథార్థ వంతులు ముండ్లకంచెకంటెను ముండ్లు ముండ్లుగా నుందురు, నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు.

5. స్నేహితునియందు నమ్మికయుంచవద్దు,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.

6. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.
మత్తయి 10:21-35-3, మార్కు 13:12, లూకా 12:53

7. అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.

8. నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

9. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.

10. నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.

11. నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచ బడును.

12. ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రముల మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.

13. అయితే దేశనివాసులు చేసిన క్రియలనుబట్టి దేశము పాడగును.

14. నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు.

15. ఐగుప్తుదేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును.

16. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంత కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును.

17. సర్పము లాగున వారు మన్ను నాకుదురు, భూమిమీద ప్రాకు పురుగులవలె తమ యిరవులలోనుండి వణకుచు ప్రాకి వత్తురు, మన దేవుడైన యెహోవాయొద్దకు భయపడుచు వత్తురు, నిన్ను బట్టి భయము నొందుదురు.

18. తన స్వాస్థ్య ములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడ వైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

19. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.

20. పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు.
లూకా 1:55, రోమీయులకు 15:8



బైబిల్ అధ్యయనం - Study Bible
7:1-6 మీకా నివసించిన సమాజం పతనమైపోతుండగా, అతడు కన్నీటితో స్పందించాడు. నూర్చబడిన పొలంలో ఏమీ దొరకనట్టు, తన పరిచర్యలో ఏ ఫలమూ మీకాకు కనబడలేదు. భక్తులు, యథార్థపరులు దేశంలో లేకుండా పోయారు, సమాజ నైతిక స్థితి చెడిపోయింది. రక్తపాతం, కీడు, లంచాలు, చెడు తంత్రాలు అతడు చూశాడు. అది భీతితో కూడిన కలవరసమయం. కనీసం భార్యను, స్నేహితుని నమ్మలేనంతగా కుటుంబాల్లో, సంబంధాలు పతనమై పోయాయి. పిల్లలు తల్లిదండ్రులను అవమానించి, వారిమీద తిరుగుబాటు చేసి, వారిని తమ విరోధులుగా చేసుకున్నారు. యేసు తన పరిచర్య ఫలితాలను వర్ణిస్తూ మత్తయి 10:35-36లో మీకా 7:6ను పేర్కొన్నాడు.

7:7 మీకా దేవునికి మొర్రపెట్టి, తన దేశాన్ని రూపాంతరపరచమని అడిగాడు. దేవునితో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని కనపరుస్తూ, తాను యెహోవా కొరకు ఎదురుచూచి, తన రక్షణకర్తయైన దేవునికొరకు కనిపెట్టియుంటానని, దేవుడు తప్పక తన ప్రార్థన వింటాడని మీకా ప్రకటించాడు.

7:8-20 ఈ వచనాల్లో మీకా సందేశం, రానున్న ఓటమి, నాశనాలను దాటి (1:1-16), ఆ తీర్పును ప్రభువు త్రిప్పివేసే రోజును ప్రస్తావించింది. పశ్చాత్తాపపడిన ప్రజలు తిరిగి లేస్తారు (7:8-9). శత్రువులు ఓడిపోతారు, ఇశ్రాయేలు తిరిగి కట్టబడుతుంది (వ.10-11). చెరలోనివారు కూర్చబడతారు (వ.12), కొత్త నిర్గమం జరుగుతుంది. (వ.15). అబ్రాహాముకు తాను చేసిన వాగ్దానం ప్రకారం (వ.20), కరుణకు పాత్రులు కాని పాపులను క్షమిస్తాడు (వ.18-19). దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. 

7:8-10 తన ప్రజల ప్రతినిధిగా, మీకా తన విశ్వాసాన్ని, నిరీక్షణను ప్రకటించాడు. దేవుని కోపాగ్ని, పాపంపై ఆయన తీర్పు తాత్కాలికమే. ప్రజలు యెహోవా దృష్టికి పాపము చేశారు కాబట్టి, వారిపట్ల ఆయన కోపం సహేతుకమే, శిక్ష న్యాయమే. ఒకనాడు ప్రవక్త తిరిగిలేచి, యోహోవాను తన వెలుగుగా అనుభవిస్తాడు. ప్రభువు అతని పక్షంగా నిలిచి, అతనికి న్యాయం చేస్తాడు. ఆ రోజున ప్రవక్త ఆయన రక్షణను చూస్తాడు, శత్రువులు అది చూసి అవమానముతో కప్పబడతారు.

 7:11-13 యూదా తిరిగి కట్టబడుతుంది, అష్పూరు, ఐగుప్తు వంటి దేశాల నుండి ప్రజలు వస్తారు. దేశ నివాసులు చేసిన చెడుక్రియలను బట్టి దేశము పాడు అయిపోతుంది.

7:14-17 నిబంధనా రూపంగా మాట్లాడుతూ, ఐగుప్తునుండి మొదటిసారి నిర్గమానికి నడిపించినట్లు దేవుడు తన జనులకు కాపరిగా ఉండి, ఒకప్పుడు ఇశ్రాయేలుకు చెందిన పచ్చని భూములకు తన స్వాస్యపువారిని నడిపించమని మీకా ప్రార్థిస్తున్నాడు. (నిర్గమ 19:6తో పోల్చండి). ఇలా జరిగితే సకల రాజ్యాలు ఆ రక్షణలో దేవుని శక్తిని చూచి, తమ అల్పమైన శక్తిని గురించి సిగ్గుపడతారు. ఆశ్చర్యంతో నోరు మూసుకుని, భయంతో వణకుతూ, యెహోవా సన్నిధిలో భీతితో నిలబడతారు.

7:18-20 నిరీక్షణ మార్పులేని దేవుని గుణగణాల మీద ఆధారపడి వుంటుంది. నీతో సముడైన దేవుడున్నాడా? అనే ప్రశ్నను అందరూ తలపోయాలి. మన అతి గొప్ప సమస్య పాపం. దాన్ని దేవుడే పరిష్కరించగలడు. అతిక్రమమును తన దృష్టినుండి క్షమించి, ఇక సంబంధం లేనివిషయంలా దోషమును తొలగించడమే దేవుని క్షమాపణ అని మీకా వివరించాడు. జయశాలిలాగా దేవుడు వారి దోషములను అణచివేస్తాడు, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో పడవేస్తాడు. ప్రజల పాపాలను దేవుడు పూర్తిగా తీసివేస్తాడు. యెహోవా అసమానుడు, కృపామయుడు, కరుణామయుడు, కనికరపూర్ణుడు, నమ్మకమైనవాడు, నమ్మదగినవాడు, ప్రేమగలవాడు (నిర్గమ 34:6-7). ఆయన వారి పితరులైన యాకోబు, అబ్రహాములతో నిబంధన చేశాడు. (ఆది. 22:17; 28:14). తాను నిబంధన చేసిన ప్రజలకు ఆయన నిరంతరం తన సత్యమును, కనికరమును చూపుతాడు. ఆయన మార్పులేనివాడు కాబట్టి ఆయనతో నిబంధన కలిగివున్న వారందరూ నిరీక్షణతో సురక్షితంగా నివసించవచ్చు.


Shortcut Links
మీకా - Micah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |