Mark - మార్కు సువార్త 1 | View All

1. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము.

2. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును.
నిర్గమకాండము 23:20, మలాకీ 3:1

3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు
యెషయా 40:3

4. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను.

5. అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.
2 రాజులు 1:8, జెకర్యా 13:4

7. మరియు అతడునాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను;

8. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.

9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను.

10. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.

11. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
ఆదికాండము 22:2, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.

13. ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.

14. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

15. కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ;మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు,గలిలయకు వచ్చెను.

16. ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

17. యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

18. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి.

19. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి.

20. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

21. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.

22. ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి.

23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.

24. వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
కీర్తనల గ్రంథము 89:19

25. అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా

26. ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.

27. అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

28. వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.

29. వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.

30. సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

31. ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

32. సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి;

33. పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.

34. ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

35. ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.

36. సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి

37. ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా

38. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.

39. ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలోప్రక టించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.

40. ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూనినీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా

41. ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.

42. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.

43. అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ;

44. కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచు కొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక లను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను.
లేవీయకాండము 13:49, లేవీయకాండము 14:2-32

45. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
1:1 యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అంటూ మార్కు సువార్త గ్రంథం మొదలవుతుంది. (గ్రీకు. ఇవాంగెలియోన్, అంటే మంచివార్త అని అర్థం). యెహోషువ అనే హెబ్రీ నామానికి గ్రీకు రూపం యేసు. ఈ పేరుకు “యెహోవాయే రక్షణ" అని అర్థం. యేసు క్రీస్తు మెస్సీయ)గా, దేవుని కుమారుడుగా గుర్తించబడ్డాడు. మార్కు సువార్తలోని యేసు తరచూ దేవుని కుమారునిగా గుర్తించబడ్డాడు: బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో (వ.11), దయ్యా ల చేత (3:11; 5:7), రూపాంతర సమయంలో (9:7), తీర్పు తీర్చబడిన సమయంలో (14:61), శతాధిపతి ఒప్పుకోలు చేత (15:39).

1:2-3 వ్రాయబడినట్టు అనే మాట పాత నిబంధన అధికారాన్ని సూచించే సూత్రంగా ఉంది (7:6-7; 9:13; 11:17; 14:21,27). ప్రవక్తయైన యెషయాచేత అనే మాట నిర్గమ 23:20; యెషయా 40:3; మలాకీ 3:1 మొదలైన భిన్న వాక్యభాగాలను ప్రస్తావిస్తుంది. అందువల్ల కొన్ని రాతప్రతులు “ప్రవక్తలు" అని తెలియచేస్తున్నాయి. మూలరచనల సందర్భంలో చూస్తే ప్రభువు అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. దూత దేవుని స్వీయ రాకడను ప్రకటించాడు. సువార్త గ్రంథకర్తలు ఈ పదాలను శరీరధారియైన దేవుడైన యేసుకు అన్వయించారు (యోహాను 1:14). 

1:4 యోహాను అరణ్యములో... బాప్తిస్మము ఇస్తున్నాడని మార్కు పరిచయం చేస్తున్నాడు. ఈ అరణ్యం ఇశ్రాయేలు అవిధేయతనూ దేవుని విమోచననూ గుర్తు చేస్తుంది. (యెహో 5:6). పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము కోసం యోహాను పిలుపునిచ్చాడు. “మారుమనస్సు" అంటే “మనస్సు మార్చుకోవడం" అని అర్థం. పాపాల నుంచి స్వచ్చందంగా తొలగిపోవడం మారుమనస్సులో ఇమిడి ఉంటుంది. 

1:5 యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును యోహాను చేత ఆకర్షించబడ్డారనే మాట గ్రామీణ ప్రాంత వాసులకూ పట్టణవాసులకూ అతడు చేసిన విన్నపాన్ని సూచిస్తున్నది. 

1:6 యోహాను వస్త్రాలు ఏలీయా (2రాజులు 1:8), ఇతర ప్రవక్తలు ధరించిన దుస్తుల మాదిరిగా (జెకర్యా 13:4) ఉన్నాయి. ప్రభువు దినానికి ముందు తిరిగి వచ్చి పశ్చాత్తాపానికై ఇశ్రాయేలు జనాంగానికి పిలుపునిచ్చే ఏలీయా యోహానేనని మార్కు వివరణ సూచిస్తుంది (మలాకీ 4:5-6). 

1:7-8 నాకంటే శక్తిమంతుడొకడు... నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడను కాను అని యోహాను ప్రకటించాడు. చెప్పులవారును విప్పడం అనేది అన్యజాతికి చెందిన బానిసలు చేసే పని. ఆ రాబోయేవాడు తాను చేసే పనిలో కూడా శ్రేష్ఠుడే. ఆయన పరిశుద్దాత్మలో మీకు బాప్తిస్మమిచ్చును (అపొ.కా. 11:16; అపొ.కా. 1:5; 1:8 నోట్సు చూడండి). యోహాను ఇచ్చే బాప్తిస్మం సూచనప్రాయంగానూ, యేసు ఇచ్చే బాప్తిస్మం వాస్తవాన్ని పరిచయం చేసేదిగానూ ఉంటాయి. 

1:9-11 నజరేతు అనేది మార్కులో ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడింది (6:1తో పోల్చండి). యేసు నీళ్ళలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా మూడు విషయాలు జరిగాయి: ఆకాశము చీల్చబడుటయు... పరిశుద్ధాత్మ దిగివచ్చుట, ఆకాశము నుండి దేవుని స్వర శబ్దము వినబడుట. నా
ప్రియకుమారుడు అనే మాట కుమారుని విశిష్ఠతను సూచిస్తుంది. ఇస్సాకుపై అబ్రాహాముకున్న ప్రేమను గుర్తుచేస్తుంది. (ఆది 22:2,12,16). పా.ని.లో కేవలం ఇశ్రాయేలీయులు (నిర్గమ 4:23), ఇశ్రాయేలు రాజు (కీర్తన 2:7) మాత్రమే దేవుని కుమారుడని పిలవబడ్డారు. మార్కు 1:11లో దైవ ప్రకటన దేవునితో యేసుకున్న నిత్యసంబంధాన్ని ప్రకటించింది. యేసు బాప్తిస్మం పొందిన సమయంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులనూ చూడవచ్చు. 

1:12-13 బాప్తిస్మ సమయంలో యేసు పైకి దిగి వచ్చిన పరిశుద్దాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొనిపోయెను. “త్రోసికొనిపోవడం” అనేది చాలా శక్తివంతమైన పదం, ఈ పదాన్ని దయ్యాలను పారదోలే సందర్భంలోనూ (వ.34,39; 3:15,22-23; 6:13; 7:26; 9:18,28,38), బలవంతంగా వెళ్లగొట్టే సందర్భంలోనూ ఉపయోగిస్తారు. (5:40; 9:47, 12:8). అరణ్యములో నలువది దినములు అనే మాటలు అరణ్యంలో నలభైరోజులు ఉపవాసం చేసిన మోషే (ద్వితీ 9:18), ఏలీయా (1రాజులు 19:8) లనూ అదేవిధంగా నలభై సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలు ఎదుర్కొన్న పరీక్షలనూ గుర్తుచేస్తుంది. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. నలభై రోజులు పూర్తయ్యేవరకూ ఆయనకు ఆహారం లేకపోయినా (మత్తయి 4:11), శోధింపబడుతున్న సమయమంతటిలో ఏదో ఒకవిధంగా వారు యేసుకు పరిచర్య చేస్తున్నారని ఈ మాట తెలియచేస్తుంది. అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేస్తున్న సమయంలో ఏలీయాకు కూడా దేవదూతలు - పరిచర్య చేశారు (1రాజులు 19:1-8) 

1:14-15 యోహాను. చెరపట్టబడిన తరువాత అనే మాటలు 13,14 వచనాల మధ్య కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ సంఘటన యోహాను 4:3.43 వచనాలకు సమాంతరమైనదైతే సుమారు ఒక సంవత్సరం ఉండి ఉంటుంది. యూదయలో యేసు ఇంతకు ముందు చేసిన పరిచర్యను మార్కు ప్రస్తావించలేదు (యోహాను 3:22-36). యోహానును బంధించడం, వధించడం గురించి మరిన్ని విషయాలు మార్కు 6:17-29లో కనబడతాయి. కాలము సంపూర్ణమై యున్నది. అనే మాట పా.ని. వాగ్దానాల నెరవేర్పును సూచిస్తున్నది. యేసు అనే వ్యక్తి ద్వారా దేవుని రాజ్యము చాలా సమీపంగా ఉంది. అందువల్ల ఆ రాజ్యపు రాకడను గురించిన ప్రకటన మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి అనే సత్వర స్పందన కోసం కనిపెట్టింది. ఆ 1:16-20 రెండు జతల జాలరి సోదరులను తన శిష్యులుగా ఉండమని యేసు పిలిచిన రెండు సంఘటనలను మార్కు రాశాడు. ఈ నలుగురు శిష్యులు పన్నెండు మంది శిష్యుల గుంపులో కీలక వ్యక్తులయ్యారు (వ. 29; 3:16-18; 13:3; నోట్సు చూడండి. 5:37; 9:2; 14:33). సమస్తాన్నీ విడిచి తనను వెంబడించమని ప్రజల్ని పిలవడంలో యేసుకున్న అధికారం గురించి మార్కు నొక్కి చెప్పాడు. లూకా 5:7-10 ప్రకారం ఈ రెండు జతల సహోదరులు చేపల వ్యాపారంలో భాగస్వాములు. 

1:16-18 గలిలయ సముద్రమనే మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 700 అడుగుల దిగువన ఉంటుంది; 12.మైళ్ల పొడవు, 7 మైళ్ల వెడల్పు ఉంటుంది. దీనికి గెన్నెసరేతు సముద్రం (లూకా 5:1), తిబెరియ సముద్రం (యోహాను 21:1) అనే పేర్లు కూడా ఉన్నాయి. సంపన్నమైన చేపల వ్యాపారానికి అనువైన సముద్రమిది. సీమోనును... అంద్రియలు బేత్సయిదాకు చెందినవాళ్లు. ఈ పట్టణం సరస్సుకు ఉత్తరభాగంలో ఉంది. (యోహాను 1:44), అయితే వాళ్లు ఇప్పుడు కపెర్నహూములో జీవించడం మొదలుపెట్టారు (మార్కు 1:29). నా వెంబడి రండి అనే పిలుపు కొ.ని. శిష్యత్వానికి గుండెలాంటిది. యేసుని విలువలనూ జీవనశైలినీ అవలంబించడం ఈ శిష్యత్వంలో ఉంటుంది. నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసెదను అనే మాట శిష్యుల పూర్వవృత్తిని జ్ఞప్తికి తెస్తుంది. శిష్యత్వంలో ఉన్న రెండవ కోణాన్ని కూడా ఈ మాటలు సూచిస్తున్నాయి. పరిచర్య ద్వారా ప్రభువుకూ ప్రజలకు సేవ చేయాలన్న పిలుపే ఆ రెండవ కోణం. 

1:19-20 ఇంక కొంత దూరము వెళ్లి - అనేమాట. యాకోబును... యోహానును అనే రెండవ జత సహోదరుల పిలుపును ముడిపెట్టింది. మొదటి జత సహోదరులను పిలిచిన సమయానికీ, స్థలానికి ఇది భిన్నమైనది. అక్కడ జీతగాండ్రు ఉన్నారనే వాస్తవం వాళ్ల చేపల వ్యాపారం బాగా వర్ధిల్లిందని తెలియచేస్తుంది. యేసును వెంబడించడానికి ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టడమంటే తమ సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలివేయడమే. వ.18 లో ఉన్న మొదటి జత సహోదరుల లాగా వీళ్లు కూడా యేసును వెంబడించిరి. వ. 17 లో యేసు జారీచేసిన ఆజ్ఞకు వాళ్ల స్పందన వ.20 లో కనబడుతుంది.
గ్రీకులో మార్కు ఉపయోగించిన పదాలు నేరుగా యేసు ఆజ్ఞనూ వాళ్ల స్పందననూ ముడిపెట్టాయి. 

1:21-22 కప్నెహూము అనే పట్టణం గలిలయ సముద్రానికి వాయవ్యది శలో ఉంటుంది. ఈ పట్టణమే యేసుకు నివాసమూ (2:1), ఆయన పరిచర్యకు ప్రధాన స్థావరమూ అయ్యింది (మత్తయి 4:13). సమాజమందిరములో యేసు ఏం బోధించాడో మార్కు గ్రంథస్థం చేయలేదు. కానీ ప్రజలు ఆశ్చర్యపడిరి అని మాత్రమే అతడు చెప్పాడు. యేసు ఉపదేశాలకు తరచూ ఇలాంటి స్పందనే వచ్చేది (6:2; 7:37; 10:26; 11:18). యేసు అధికారము గలవానివలె వారికి బోధించెను. అది ప్రజల్ని ఆశ్చర్యపరచింది. ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని, సాంప్రదాయబద్ధమైన భాష్యాన్ని (మౌఖిక సాంప్రదాయాల ద్వారా) నిక్షిప్తపరచుకున్న శాస్త్రుల, అధికారానికి ఆయన అధికారం భిన్నమైంది. మార్కు సువార్తలో శాస్త్రులే యేసుకు బద్ద విరోధులు (2:6-7,16; 11:27). ఆయన మరణానికి ముఖ్యకారకులుగా ఉన్నది కూడా వీళ్లే (8:31; 10:33; 11:18; 14:1,43,53; 15:1,31). 

1:23-24 ఆ సమయమున అనే మాట ఈ సన్నివేశాన్ని 21-22 వచనాలకు ముడిపెడుతుంది. దురాత్మను సూచించడానికి మార్కు అపవిత్రాత్మ అనే పదం ఉపయోగించాడు. యేసు దేవుని పరిశుద్ధుడని దయ్యాలు గుర్తించాయి. అపవిత్రాత్మ యేసు తత్వానికి విరుద్ధమైనది. మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? అంటూ మనుషులకంటే ముందుగానే యేసుని వ్యక్తిత్వ కార్యాలను దయ్యాలు స్పష్టంగా గుర్తించాయి, ప్రకటించాయి.

1:25-26 తన మాటలో అధికారాన్ని బట్టి అపవిత్రాత్మను గద్దింపగా అది విడిచిపోయింది. ఊరకుండుము. ("నోటికి చిక్కం కట్టుకో" అని అక్షరార్థం), వానిని విడిచిపొమ్ము అని ఆజ్ఞాపించాడు. ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వానిని విడిచిపోయెను (9:26-27 నోట్సు చూడండి). యేసును ఎదిరించడానికి విఫలయత్నం చేసి దిక్కుతోచక బిగ్గరగా అరిచింది. 

1:27-28 యేసు దయ్యాలపై- ప్రదర్శించిన అధికారాన్ని చూసి ప్రజలు విస్మయమొందిరి. అపవిత్రాత్మలు... ఆయనకు లోబడుచున్నవని వాళ్లు పలికిన మాట “ఒక్క ఆత్మకు ఆయన చేయగలిగింది, అన్ని ఆత్మలకు కూడా చేయగలడని" వాళ్లు నమ్మినట్లు తెలియచేస్తుంది. వెంటనే అనే మాట ఈ సంఘటనలు గలిలయ ప్రాంతములందంతట ఎంత తొందరగా వ్యాపించాయో తెలియచేస్తున్నాయి. 

1:29-31 వెంటనే వారు సమాజమందిరములో నుండి వెళ్లి అని 29-34 వచనాలను ప్రారంభిస్తున్న మాట 21-28 వచనాల్లో (అదే) విశ్రాంతి దినానికి జతచేస్తుంది. యేసుకూ, ఆయన అనుచరులకూ ఆతిథ్యమిచ్చేంత పెద్దగా సీమోను, అంద్రియల ఇల్లు ఉంది. కపెర్నహూములో సమాజమందిరానికి దగ్గరగా అలాంటి ఇంటిని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. సీమోను అత్త అనే మాట పేతురు వివాహితుడని తెలియచేస్తుంది. పరిచర్యలో పేతురుకు తన భార్య సహకారిగా ఉందని 1కొరింథీ 9:5 ద్వారా తెలుస్తుంది. పేతురు అత్తతో యేసు ఏ మాటలు చెప్పలేదు. కేవలం చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను అన్నది. “మార్కు సువార్తలో యేసుని స్వస్థతను తెలియచేయడానికి ఉపయోగించబడిన సాధారణ పదజాలం " (2:9,11; 3:3; 5:41; 9:27; 10:49).


1:32-34 సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు అనేమాట విశ్రాంతి దినాచారము సూర్యాస్తమయంతో ముగుస్తుంది కాబట్టి పనిచేయడం గురించి ఉన్న నిషేధం ముగిసిందని నొక్కి చెబుతుంది. రోగులను, దయ్యములు పట్టిన వారిని అనే మాటలు ఆ రోజు ముందు భాగంలో యేసు చేసిన రెండు రకాల స్వస్థతలను గుర్తుచేస్తుంది. (వ.23-26; వ.30-31). రోగానికీ, దయ్యం పట్టడానికి మధ్య వ్యత్యాసముంది అని యేసు చేసిన చర్యలను మార్కు వివరించిన విధానం ధృవీకరిస్తుంది. యేసు అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను (3:10-11; 6:13), నానావిధ రోగాలను యేసు స్వస్థపరచడం ఆయన స్వస్థపరిచే శక్తికున్న సంపూర్ణ స్వభావాన్ని సూచిస్తుంది. 

1:35-39. పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటియుండగానే అనే మాటలు ఇంతకు ముందు రాత్రి చేసిన స్వస్థత పరిచర్య తర్వాత యేసు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోలేదని సూచిస్తున్నాయి. ఎవరిచేత గుర్తించబడకుండా. ఆయన ఎలా పట్టణాన్ని విడిచి వెళ్ళాడనే విషయాన్ని “పెందలకడ" అనే మాట తెలియచేస్తుంది. లేచి... బయలుదేరి... వెళ్లి అనే క్రియాపదాలు : అరణ్యప్రదేశమును కనుగొనడానికి యేసు - చేసిన అన్వేషణను వివరిస్తున్నాయి. యోహాను ప్రసంగించిన (వ.4) ప్రదేశం, యేసు శోధించబడిన ప్రదేశమైన (వ.12) అరణ్యానికి అదే పదం ఉపయోగించ బడింది. సీమోనును అతనితో కూడ నున్నవారును అంటే యేసు పిలిచిన నలుగురు శిష్యులు. . శిష్యుల్లో పేతురు నాయకుడని తొలిసారి మార్కు వివరించిన సందర్భం ఇదే. ప్రతీ ఒక్కరూ మరెన్నో. అద్భుతాల కోసం ఎదురుచూశారు. అయితే యేసు సువార్త ప్రకటించుచు ఉండడానికి తీర్మానించుకున్నాడు. ఆవిధంగా ఆయన తన గమనాన్ని తన పరిచర్య ప్రారంభంవైపు మళ్లించాడు (వ.14-15). 

1:40-45 కుష్ఠరోగానికి సంబంధించిన నియమాలు లేవీ 13-14 అధ్యాయాల్లో కనబడతాయి. ఆయన యొద్దకు వచ్చి అనేమాట ఆ రోగి కార్యాచరణకు ఉపక్రమించాడని తెలియచేస్తుంది. అయితే అలా చేయడం ద్వారా అతడు చట్టాన్ని మీరాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనే మాట అతడు యేసుని సామర్థ్యాన్ని నమ్ముతున్నట్లు, ఆయన ఇష్టానికి లోబడుతున్నట్లు తెలియచేస్తుంది. యేసు కనికరపడి అనే విషయాన్ని మార్కు మాత్రమే తెలియచేశాడు. (సమాంతర వాక్యభాగాలను చూడండి. మత్తయి 8:1-4; లూకా 5:12-16). కుష్ఠరోగమున్న వ్యక్తిని తాకడం అంటే పా.ని. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లే. దానిమూలంగా వ్యక్తి అపవిత్రుడవుతాడు. అయినా సరే, యేసు తన చెయ్యి చాచి అతనిని ముట్టి అతణ్ణి స్వస్థపరిచాడు. తనకు జరిగిన స్వస్థత గురించి యాజకులకు సాక్ష్యార్థమై కనపరచుకొని లేవీ 13:47-14:55లో ఉండే నియమాలను పాటించమని యేసు అతనికి చెప్పాడు. అతడు ధర్మశాస్త్ర నియమాలను పాటించాడా లేదా అనే విషయం మనకు తెలియదు కానీ తనకు జరిగిన స్వస్థత గురించి ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ అన్న యేసు ఆజ్ఞను మాత్రం అతడు ధిక్కరించాడు. 


Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |