Psalms - కీర్తనల గ్రంథము 97 | View All

1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూ లోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక.
ప్రకటన గ్రంథం 19:7

2. మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.

3. అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయు చున్నది.
ప్రకటన గ్రంథం 11:5

4. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది.

5. యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.

6. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది

7. వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
హెబ్రీయులకు 1:6

8. యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

9. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
యోహాను 3:31

10. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.

11. నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.

12. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-97. దేవుడే ఈ సర్వలోకానికి రాజు అనీ, పవిత్రత, నీతి, న్యాయం అనేవి దేవుని రాజ్యానికి మూలం అనీ ప్రస్తుతిస్తూ ఆయనకు ఆహ్వానం పలికే కీర్తన. 

97:1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు 93:1-2 నోట్సు చూడండి. సుదూరప్రాంతాల్లో ఉన్న జనవాసాల్ని ద్వీపములన్నియు అనే మాట సూచిస్తున్నది. యెహోవా రాజ్యపాలన, ఆయన సంస్తుతి భూదిగంతాల వరకు విస్తరించి ఉంది (యెషయా 20:5-6; 41:1; 42:4,10,12,15). 

97:2 మేఘాంధకారములు - ఈ పదం సీనాయి పర్వతం మీద గాఢాంధకారాన్ని తలపించే దట్టమైన మేఘాల మధ్య దేవుడు మాట్లాడడాన్ని గుర్తుకు తెస్తున్నది. ప్రవక్తల గ్రంథాల్లో సాధారణంగా ఈ మాటలు తీర్పును సూచిస్తాయి (యెషయా 60:2; యోవేలు 2:2). నీతిన్యాయములు... ఆయన సింహాసనమునకు ఆధారము - 89:14 నోట్సు చూడండి. 

97:3-5 అగ్ని, దానితోబాటు మెరుపులు, కంపిస్తున్న భూమి, పర్వతముల నుండి అగ్నిజ్వాలలు వెలువడడం, ఇవన్నీ దేవుని ప్రత్యక్షతకు చిహ్నాలు (77:16-18; నిర్గమ 19:16; మీకా 1:3-4). సృష్టికర్త యెదుట యావసృష్టి ప్రణమిల్లుతుందని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. 

97:6 ప్రకృతిలోని అలజడులు, యెహోవాను వ్యతిరేకించే శత్రువులు ఓడిపోవడం - ఇవి యెహోవా నీతి, ఆయన మహిమ భూనివాసులందరికీ తెలిసేలా చేస్తున్నాయి. (19:1). దేవుడిచ్చే విజయాలు ఆయనకు రక్షించే శక్తి ఉందని నిరూపణాత్మకంగా తెలియజేస్తున్నాయి, సర్వలోకం ఆయన మహిమను గుర్తిస్తుంది. 

97:7 వ్యర్ధ విగ్రహములను - హెబ్రీలో దీనికి మూలపదం చెక్కిన ప్రతిమలను, అన్యజనులు పూజించే కల్పిత దేవతలు శక్తిహీనమైనవనీ, వాటిని పూజించువారందరు వాటిలాగే శక్తిహీనులనీ అర్థాన్నిస్తుంది.

97:8-9 విగ్రహాల్ని పూజించేవారు సిగ్గుపడతారు, దైవాలుగా పిలిపించుకొనే వారందరూ యెహోవాకు లోబడవలసిన వారే (వ.7). యెహోవా మాత్రమే గొప్పవాడు, మహోన్నతుడు. కల్పితదైవాలన్నీ శక్తిహీనమైవని కాగా, యెహోవా ఒక్కడే అత్యధికమైన ఔన్నత్యం గలవాడు. 

97:10 యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించు కొనుడి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొనే వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాన్ని వారెంతగా ద్వేషిస్తున్నారో పరీక్షించబడతారు. క్రీస్తులో తిరిగి జన్మించి పరిశుద్దాత్మను హృదయంలో కలిగి ఉన్న విశ్వాసి దేవుడు దేనిని
ప్రేమిస్తాడో దానిని ప్రేమిస్తాడు. దేవుడు దేనిని అసహ్యించుకొంటాడో దానిని అసహ్యించుకొంటాడు. ఇప్పటికే ఈ లోక దుర్మార్గత, భక్తిహీనత, దాని చెడుతనం వలన కలిగిన దుఃఖంతో మనం విసిగిపోయాం . ఇప్పుడు కూడా దేవుని గృహంలో ఇంకా పాపాన్ని, అవినీతిని సహిస్తున్నందుకు ఎంతగానో బాధపడుతున్నాం (1కొరింథీ 5:2 నోట్సు; హెబ్రీ 1:9 చూడండి). 

97:11-12 కీర్తనకారుడు యెరూషలేము దేవాలయంలో యెహోవా సన్నిధిని వెలుగుతో ఆనందంతో నీతితో సమానంగా వర్ణిస్తున్నాడు. ఈ భావన యెషయా గ్రంథంలో మరింత విశదంగా కనబడుతుంది (యెషయా 10:17; 42:6; 49:6; 58:10; 60:1-3, 19-20). యెహోవా నివాసస్థలమైన సీయోను వెలుగుతో తేజరిల్లుతుంది, యెహోవా మహిమయే ఆ వెలుగు. పునరుద్ధరణ గావించబడిన ఇశ్రాయేలు దేవుని సాన్నిధ్యంలోని వెలుగును ప్రతిబింబిస్తుంది. సకల దేశాల ప్రజలు చీకటిలో నుండి యెరూషలేములోని వెలుగు వద్దకు వస్తారు (యెషయా 60:2-3).


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |