Isaiah - యెషయా 29 | View All

1. అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.

2. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.

3. నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.

4. అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుం డును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.

5. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.

6. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

7. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.

8. ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.

9. జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

10. యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించి యున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి యున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి యున్నాడు.
రోమీయులకు 11:8

11. దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.
ప్రకటన గ్రంథం 5:1

12. మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షర ములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియౌవనును.

13. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
మత్తయి 15:8-9, మార్కు 7:6-7

14. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
1 కోరింథీయులకు 1:19

15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలో పల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలి యును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.

16. అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?
రోమీయులకు 9:20-21

17. ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.

18. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
మత్తయి 11:5

19. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

20. బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.

21. కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమును బట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.

22. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెల విచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

23. అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.

24. చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.బైబిల్ అధ్యయనం - Study Bible
29:1 అరీయేలు యెరూషలేముకు ప్రతీక. ఈ పదానికి అర్థమేమిటో స్పష్టంగా తెలియడం లేదు. బహుశా “దేవుని సింహం" అయ్యుండవచ్చు. లేదా దీని అర్థం యెహె 43:16 లోని పరిశుద్ధాలయంలోని “దేవాగ్ని గుండము" అయ్యుండవచ్చు. ఈ అధ్యాయం యెరూషలేముకు శ్రమ (1:4 నోట్సు చూడండి) కలగబోతోందని తెలియజేసే ప్రకటన. ఇది 28-33 అధ్యాయాల్లో రెండవ శ్రమ (28:1; 29:15; 30:1; 31:1; 33:1). 

29:2 దేవుడు యెరూషలేమును అరీయేలుగా, అంటే దేవాగ్నిగుండంగా మార్చనున్నాడు. అంటే ఇది దేవుడు అగ్నిచేత నాశనం చేయబోతున్నాడనే అర్థాన్నిస్తున్నట్టుగా కనబడుతుంది.

29:3 అక్షరార్ధంగా చూసినట్లయితే, యెరూషలేము చుట్టూ ముట్టడివేయ బోయేది అష్పూరే అయినప్పటికీ అష్మూరు వేసే ముట్టడి యెహోవా వలననే జరుగుతుందని యెషయాకు తెలుసు.. 

29:4 దేవుడు నీవు... నీ అంటూ ఒక వ్యక్తితో మాట్లాడినట్లు యెరూషలేము పట్టణంతో మాట్లాడుతున్నాడు... ఆయన యెరూషలేమును నేలకు అణచివేస్తాడు, దాని పలుకు ధూళిలో నుండి వినబడుతుంది. 

29:5-8 ప్రకటన హఠాత్తుగా యెరూషలేము మీదకు రాబోయే తీర్పు నుండి పట్టణ పునరుద్ధరణ మీదకు మళ్ళుతుంది. ఇది యూదా మీద సనెరీబు దాడిని వర్ణనాత్మకంగా తెలియజేస్తుంది. ప్రారంభంలో అతనికి లభించే విజయాలు యెరూషలేము ముట్టడి తర్వాత తుస్సుమంటాయి (అధ్యా.37). 

29:6 దేవుడు యుద్దశూరునిగా వచ్చినప్పుడు, ఆయన భూకంపముతోను... సుడిగాలి తుపానులతోను... అగ్నిజ్వాలలతోను వస్తాడు.

29:8 యెరూషలేము మీదకు దండెత్తి వచ్చే సైన్యాలు చివరకు విఫలమవుతాయి. వారు తొలుత సాధించే విజయాలు చివరకు పరాజయానికి దారితీస్తాయి. అందుచేత వారి తొలి చర్యలు కల వంటివి. 

29:9-10 ప్రకటన మరల దేవుని ప్రజల ఆధ్యాత్మిక కాఠిన్యం మీద నుండి శిక్ష మీదకు మారుతుంది. వారు కండ్లను చెడగొట్టుకొని తమను తామే గ్రుడ్డివారుగా చేసుకుంటున్నారు. అయితే దేవుడు వారి కళ్లను (నేత్రములుగా ఉన్న ప్రవక్తలను) మూసివేస్తున్నాడు. ప్రజలు మత్తులైయున్నారు. దేవుడు వారి మీదకు గాఢనిద్రాత్మను కుమ్మరించబోతున్నాడు. ఈ ప్రకటన ప్రజల పాపపు చర్యల్ని, దేవుని సర్వాధిపత్యాన్ని తెలియజేస్తుంది.

29:11-12 దేవుడు దీనినంతటిని గూర్చిన ప్రకటనను ప్రజల ముందు ఉంచాడు. అయితే వారు ఆధ్యాత్మికంగా మందబుద్ధితో ఉండడం వలన దానినర్ధం చేసుకొనలేకపోతున్నారు. దేవుని హెచ్చరికల్ని వారు వినడం లేదు, అందుచేత పరిణామాల్ని అనుభవించక తప్పదు. ప్రాచీన ఇశ్రాయేలులో పత్రాల (దస్త్రాల)ను జమ్ముతో చేసిన అట్టల వంటి కాగితాల మీద లేదా ఎండిన చర్మపు కాగితాల మీద లిఖించేవారు. తరువాత వాటిని చుట్టగా చుట్టి అది గూఢమైన గ్రంథం లాగా కనబడడానికి మైనంతో గానీ కాల్చిన మట్టితో గానీ ముద్ర వేసేవారు, ముద్ర మీద దాన్ని వేసిన వ్యక్తి లేదా దాన్ని పంపించిన వ్యక్తికి సంబంధించిన ఆనవాలు లేదా చిహ్నం ఉండేది. 

29:13 ప్రజలకు దేవునిపట్ల ఉన్న భయభక్తులు శూన్యమైనవి, అర్థం లేనివి. కేవలం వారు నోటిమాటలతో, భంగిమలతో ఆరాధిస్తున్నారు. యేసు ఈ మాటల్నే మత్తయి 15:8-9; మార్కు 7:6-7 వచనాల్లో ఉటంకించాడు. 

29:14 జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఎందుకంటే అది గతం మీద ఆధారపడింది. ఇప్పుడు దేవుడు నూతనంగా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. యెరూషలేము నాశనం, చెర నుండి తిరిగి రావడం, రక్షకుని పంపించడం. పౌలు ఈ వచనాన్నే 1కొరింథీ 1:19లో ఉటంకించాడు. 

29:15 ఈ వచనంలో మరొక శ్రమ ప్రకటన (1:4 నోట్సు చూడండి) ప్రారంభమై, అధ్యాయం చివరి వరకు కొనసాగుతుంది. 28-33 అధ్యాయాల్లో ఇది మూడవ శ్రమ (వ.1; 28:1; 30:1; 31:1; 33:1). దుషాలోచనలు చేసేవారు తమ చర్యలు దేవునికి కనబడకుండా మరుగుగా ఉండాలనుకుంటారు. బహుశా ఇవి అష్పూరు నెదిరించడానికి సహాయం కోసం ఐగుప్తు నాశ్రయించాలనే ఆలోచనలై ఉండవచ్చు. ఇటువంటి ఆలోచన శిక్షను తప్పించుకొనలేదు. 

29:16 దేవుడు కుమ్మరి అనే సాదృశ్యాన్ని ప్రవచన సాహిత్యంలో ముఖ్యమైన కొన్నిచోట్ల ఉపయోగించడం జరిగింది (45:9; 64:8; యిర్మీయా 18:1-12; రోమా 9:21 కూడా చూడండి... ఇది దేవుడు నేలమంటి నుండి ఆదామును సృష్టించిన వృత్తాంతాన్ని గుర్తుచేస్తుంది. (ఆది. 2:7). మట్టి నుండి చేసిన పాత్రల్లాంటి మనుషులు తమను సృష్టించిన కుమ్మరి వంటి దేవుణ్ణి సవాలు చేయడం లేదా ప్రశ్నించడం వింతగా ఉంటుందని ప్రవక్తలు తెలియజేశారు.

29:17-24 ఇదివరకటి శ్రమ దేవోక్తి లాగానే, ఈ వచనాల్లోనూ శిక్ష నుండి నిరీక్షణవైపు మార్పు కనబడుతుంది (వ.5-8 నోట్సు చూడండి).

29:17 లెబానోను దేవదారు వృక్షాలున్న అడవులకు ప్రసిద్ది, అయితే అది పండ్లతోటలుండే పొలముగా మార్చ బడుతుంది. బైబిల్లో పలుచోట్ల దేవదారు వృక్షం శక్తికి గర్వానికి చిహ్నంగా కనబడుతుంది, బహుశా ఇది గర్వం నుండి దీనమైన సేవకు పరివర్తనను సూచిస్తుండవచ్చు.

29:18 కలగబోయే పరివర్తనను చెవిటివారు వింటున్నట్టుగా, గ్రుడ్డివారు చూస్తున్నట్టుగా వర్ణించడం జరిగింది. గ్రంథవాక్యములు బహుశా వ.11-12 లో ఉన్నదాన్ని సూచిస్తుండవచ్చు. ఆ వచనాల్లో గ్రంథవాక్యాలనెవరూ అర్థం చేసుకోలేకపోయారు. అయితే, ఇక్కడ అర్థం చేసుకొనడం జరుగుతుంది. 

29:21 పట్టణపు గుమ్మము అనేది బహిరంగ వ్యాజ్యాలు, న్యాయపరమైన తీర్పులు జరిగే చోటు. తమ్మును గద్దించువాని అనే పదజాలం వ్యాజ్యాన్ని వినే మధ్యవర్తిని సూచిస్తుంది. మధ్యవర్తి లేకపోవడం అన్యాయం ప్రబలేలా చేస్తుంది.

29:22 ఈ ప్రకటన దేవుడు తన ప్రజలకు తండ్రిగా అబ్రాహాము నెన్నుకొన డాన్ని గుర్తు చేస్తుంది. (ఆది. 12:1-3). యాకోబు ఇశ్రాయేలు జాతికున్న మరొక పేరు. 

29:23-24 దేవుడు తన ప్రజల్ని రూపాంతరపరచి, తాను అబ్రాహాముతోను యాకోబుతోను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |