Hosea - హోషేయ 14 | View All

1. ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.

2. మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
హెబ్రీయులకు 13:15

3. అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కముమీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

4. వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.

5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.

6. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.

7. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.

8. ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.

9. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిం తురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతి మంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగు బాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
అపో. కార్యములు 13:10



బైబిల్ అధ్యయనం - Study Bible
14:1-3 పశ్చాత్తాపం చెందడానికి చివరి ఆహ్వానం (6:1-3)లో “పాపి ప్రార్ధన” కూడా ఉంది. 

14:4 నమ్మిన శేషం ఆశీర్వాదాన్ని, పునరుద్దరణను అనుభవిస్తుంది. వారి విశ్వాసఘాతకాన్ని గుణపరచుదునని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది “విశ్వాసఘాతకం అనేది చిత్రానికి మించిన కార్యం, కానీ అదే సమయంలో అది మానసిక భ్రష్టత్వం, దాన్ని దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు” అంటాడు డ్యూవేన్ గారెట్. 

14:5-7 వ.7 లోని మొదటి మూడు వరుసలు అంటే అక్షరాలా “ఆయన నీడలో నివసించేవారు. తిరిగి వస్తారు; వారు ధాన్యంలాగా నిలుస్తారు; ద్రాక్షవల్లి లాగా చిగురిస్తారు" అని అర్థం. మృతమైన, విడువబడిన తోటలాంటి ఇశ్రాయేలీయులకు సౌందర్యాన్ని, జీవాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మొదటిలో ఇశ్రాయేలు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశమో, అలాగే ఇశ్రాయేలు జనములకు దీవెనగా మళ్ళీ ఉండబోతుంది (ఆది 12:1-3; యెషయా 2:2-4). సుగంధభరితమైన ఒలీవ చెట్టు, ఆహారాన్ని, ఇంధనాన్ని, స్వస్థతను మాత్రమే కాక, నీడను కూడా ఇస్తుంది. (లూకా 13:18-19). “వారు పరిమళింతురు” అనే మాటకు అక్షరాలా “వారి జ్ఞాపకం" అని అర్థం. బహుశా ఇశ్రాయేలును దేవుడు జ్ఞాపకం చేసుకుని, వారికి తన కృపను చూపేలా ఆయనను ప్రేరేపించడాన్ని సూచిస్తుండవచ్చు (ఆది 8:21). వ.5-7లో లెబానోనును మూడుసార్లు పేర్కొన్నాడు. కానీ వేరెక్కడా ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. దానికి కారణం వర్ధిల్లిన లెబానోను ఇశ్రాయేలులో బయలు దేవత ఆరాధనకు ఆరంభస్థానం అయివుండవచ్చు (1రాజులు 16:31-33). 

14:8 "బొమ్మలు" అనడంలో దేవుని భావం బొమ్మలను గురించిన “అంశం", ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలు జాతి. దేవుడు వారికి జవాబిచ్చాడు, వారు ఏమి చేస్తారోనని కనిపెడుతున్నాడు. చిగురుపెట్టు సరళవృక్షము అంటే వారు ఏ వృద్ధి కోసమైతే సంతానోత్పత్తి దేవతలవైపు చూస్తున్నారో, దానికి అసలైన మూలం తానే అని దేవుడు చెబుతున్నాడు. 

14:9 తాను చెప్పిన సంగతులు వివేచించి, గ్రహించడానికి, తన ప్రవచనం చదవడంలో ఓపిక వహించమని పాఠకులను ప్రోత్సహిస్తూ హోషేయ ముగించాడు.


Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |