Malachi - మలాకీ 2 | View All

1. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి యున్నది.

2. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.

3. మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు

4. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

5. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించు టకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై

6. సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞాన మునుబట్టి బోధింపవలెను.
మత్తయి 23:3

8. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు.
మత్తయి 23:3

9. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

10. మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? ఈలాగుండగా ఒకరియెడల ఒకరము ద్రోహము చేయుచు, మన పితరులతో చేయ బడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము?
1 కోరింథీయులకు 8:6

11. యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయులమధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి; యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లిచేసికొనిరి.

12. యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహో వాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.

13. మరియు రెండవసారి మీరాలాగుననే చేయుదురు; యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్ల తోను రోదనముతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయు నున్నాడు.

14. అది ఎందుకని మీరడుగగా, ¸యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.

15. కొంచెముగానైనను దైవాత్మనొందినవారిలో ఎవరును ఈలాగున చేయలేదు; ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవునిచేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా; కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, ¸యౌవన మున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి.

16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్య మని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుకాకుడి.

17. మీ మాటలచేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగు చున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారియందు ఆయన సంతోషపడును;లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను అని చెప్పు కొనుటచేతనే మీరాయనను ఆయాసపెట్టుచున్నారు.బైబిల్ అధ్యయనం - Study Bible
2:1-3 దేవుడు 1:2-5 లో చెప్పిన విధంగా యాజకులను ఎంతగా ప్రోత్సహించినా, వారు తమ వైఖరి, ప్రవర్తన మార్చుకోకుంటే (వారు తనను తిరస్కరించిన విధంగానే) వారిని తిరస్కరించి, యాజకత్వం నుంచి తొలగించాలని దేవుడు నిశ్చయించాడు (లేవీ 10:1-3; 1సమూ 2:29-36; యెహె 44:6-14; హోషేయ 4:6-8). ఆలయంలో జరిగే పండుగలలో అర్పించిన బల్యర్పణల శేషం, పేడ మొదలైన వాటిని అపవిత్రంగా ఎంచి “పాళెము వెలుపల" పడవేస్తారు. (నిర్గమ 29:14; లేవీ 16:27-28). ఇశ్రాయేలీయుల ఆధ్యాత్మిక అభివృద్ధి బాధ్యతను దేవుడు యాజకులకు అప్పగించాడు. (సంఖ్యా 25:11-13; ద్వితీ 33:8-11). కానీ, యేసు కాలం నాటికి యెరూషలేములో యాజకత్వం దేవుని శాపం కింద ఉంది (మత్తయి 16:21; 21:23-46). అయితే స్థిరమైన లేవీ యాజకత్వం గురించిన వాగ్దానం ఇంకా ప్రభావశీలంగానే ఉంది. (మలాకీ 3:3-4; యిర్మీయా 33:17-18 నోట్సు చూడండి). 

2:4-9 లేవీతో లేదా లేవీ ద్వారా చేసినట్లు వ.4,8 లో కనిపించే నిబంధన యాకోబు కుమారుడైన లేవీతో చేసిన నిబంధనను సూచించడం లేదు, కానీ అహరోను మనవడైన ఫీనెహాసు అనే లేవీయునితో దేవుడు చేసిన “సమాధాన నిబంధనను” సూచిస్తుంది. విగ్రహారాధన అనే దుష్టత్వం నుంచి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు ఫీనెహాసు చూపిన ఆసక్తికి ప్రతిఫలంగా దేవుడు అతని సంతానానికి “నిత్య యాజకత్వాన్ని" వాగ్దానం చేశాడు (సంఖ్యా 25:1-13). సీనాయి పర్వతం దగ్గర (నిర్గమ 32:26-29) ఇలాంటి నమ్మకత్వమే చూపినందుకు దేవుడు లేవీ గోత్రాన్ని తనకోసం ప్రత్యేకపరచుకున్నాడు. వారికి మందిరపు పనులు, ఆరాధన బాధ్యతలు అప్పగించాడు. (ద్వితీ 10:8-9; నెహెమ్యా 13:29). ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం బోధిస్తూ ఆ విధంగా దేవుని సందేశకులుగా ఉండటం, బలిపీఠం దగ్గర ఆరాధనా క్రమాన్ని నిర్వర్తించడం ఈ గోత్రపు వారి పని (లేవీ 10:8-11; ద్వితీ 33:8-11). దేవుడు దావీదుతో నిబంధనకు అనుగుణంగా, లేవీయులతో కూడా ఒక నిబంధన యిర్మీయా 33:14-22లో నూతనపరచాడు, అయినా యెహె 44:10-16లో అది సాదోకు వంశస్థుల వరకే పరిమితమైంది (1సమూ 2:35; 1రాజులు 2:27). యాజకులు ఆ నిబంధనను నిరర్థకము చేసినా, అది అమలులోనే ఉంటుందని 3:3-4 తెలియజేస్తుంది. దేవుని వాక్య బోధకులను "వార్తాహరులు"(దూతలు) అనడం దేవుడు గతకాలంలో ఇచ్చి సూచనలు ఎప్పటికీ ఉపయుక్తంగానే ఉంటాయనీ, దేవుని ప్రజల మధ్య వాక్యబోధకుల పాత్ర, ప్రాముఖ్యత స్థిరంగా ఉంటాయని సూచిస్తుంది. 

2:10 ప్రజలు తమకు ఒకరితో ఒకరికి గల నిబంధనా సంబంధాలను గౌరవించడంలో విఫలమయ్యారు. వ.10-11, 14-16 లలో కనిపించే ద్రోహము, విశ్వాసఘాతుకము (హెబ్రీ బగద్) అనే మాటలు వారు వాగ్దాన బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని సూచిస్తున్నాయి. అంటే వారు ఒకరినొకరు నమ్మించి మోసగించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ప్రవర్తించేవాడు ఒక విశ్వాసఘాతకుడు (యెషయా 21:2). మన పితరులతో చేయబడిన నిబంధన అంటే మోషే నిబంధన (న్యాయాధి 2:20; 1రాజులు 8:21). “అపవిత్ర పరచడం” అంటే నిబంధనను మీరడం ద్వారా దాని పట్ల తిరస్కారపూరితంగా వ్యవహరించడమని అర్థం (మలాకీ 1:12; 2:11). 

2:11-12 అన్య దేవతలను ఆరాధించే స్త్రీలను మతాంతర వివాహం చేసుకోవడం ద్వారా యూదా ప్రజలు దేవుని నిబంధన మీరుతున్నారని స్పష్టంగా కనబడుతుంది. ఆ విధంగా వారి క్రియలద్వారా నిబంధనా సమాజంలోనికి ఆధ్యాత్మికంగా వినాశకరమైన చర్యలను అనుమతించారు (నిర్గమ 34:11-16; ద్వితీ 7:3-4; ఎజ్రా 9:1-2; నెహెమ్యా 13:26; 2కొరింథీ 6:14-17). ఇది తీవ్ర హేయక్రియ. ఈ తీవ్ర అపవిత్రతకు వినాశనం లేక మరణమే తగిన శిక్ష (లేవీ 18:29; ద్వితీ 7:25; 13:15; యిర్మీయా 44:22-23). ఇలా చేసిన వాడెవడైనా శపించబడినవాడే (మలాకీ 2:12). పాప హృదయంతోనే వారు దేవునికి బల్యర్పణలు చెల్లిస్తున్నారు. ఇక్కడ ("సైన్యములకు అధిపతియైన యెహోవాకు నైవేద్యము చేయువారిని”) అని చెప్పిన మాటలను బట్టి, మందిరం వారి పాపం వలన ఎలా అపవిత్రమయ్యిందో తెలుస్తుంది.

2:13-14 కొందరు పురుషులు అన్యస్త్రీలను వివాహం చేసుకోడానికి దేవుని ముందు ఒడంబడిక ద్వారా వివాహం చేసుకున్న యూదా భార్యలకు విడాకులు కూడా ఇచ్చారు. రెండవసారి మీరాలాగుననే చేయుదురు అనే మాటలు వ.13 లోని ఏడ్పును సూచించడం లేదు గానీ వ.14 లోని విడాకుల సమస్యను పరిచయం చేస్తున్నాయి (రోదనముతో తడుపుదురు అనే మాట “రోదనముతో తడుపునప్పుడు" అని చదువుకోవాలి). విశ్వాసఘాతక చర్యల్లో విడాకులు అనేది రెండవ అసహ్యకరమైన కార్యం. ఇది పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తుంది. (వ.11). వ.13-14 లలో ఉపయోగించిన
క్రియాపదాలు వ.11-12 లలో ఉన్న పదాలకు భిన్నంగా ఉన్నాయి. దీనిని బట్టి మతాంతర వివాహాల కన్నా భార్యను పరిత్యజించడాన్నే మలాకీ తీవ్రంగా పరిగణించాడని తెలుస్తుంది. వివాహపు రద్దు పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తుంది, ఎందుకంటే ప్రజలు వైవాహిక జీవితంలో నమ్మకద్రోహం చేస్తూనే, బల్యర్పణలు చెల్లించడం కొనసాగించారు. (వ.13). దేవుడు వారి అర్పణలకు అనుకూలంగా స్పందించలేదు. అందుకే (వారికి కన్నీళ్ళు; ఆది 4:4-6; కీర్తన 6:6-9 చూడండి) సామాజిక, ఆర్థిక నష్టాలు వారిని ఎడతెగక వేధించాయి. (నెహెమ్యా 9:32-37; హగ్గయి 1:6,9-11; 2:16-19). పాపంలో కొనసాగుతూ చేసే ఆరాధన అర్థరహితం. పెండ్లి భార్య (తోడిది) అనేమాట స్నేహం, ఒకే లక్ష్యం, బంధుత్వం, నిబంధనతో ముడిపడిన బంధాన్ని సూచిస్తుంది. ఇక్కడ సందర్భంలో వివాహబంధం నిబంధన సంబంధమైనది (సామె 2:17; యెహె 16:8,59-62; హో షేయ 2:16-20). 

2:15 ఇక్కడ 15 వచనంలో వివరించిన విషయం , అనువాదం అస్పష్టంగా ఉన్నాయి. కానీ వివాహ బంధం కేవలం భూసంబంధమైనది కాదనీ, దానిని తేలికగా తెంచుకోలేమనీ, అది దేవుని ఆత్మమూలంగా కలిగిందనీ, దేవునిచేత సంతతి కలుగజేయడమే దాని లక్ష్యమనీ ఇక్కడి మాటలు సూచిస్తున్నాయి. 

2:16 ఒక స్పష్టమైన మార్పుతో వ.15 చివరి భాగంలోని మాటలు ఉపయోగిస్తూ, ఈ వచనం ముగుస్తుంది. వ.13-15 వచనాల్లో “మీరు”, “నీవు" అని సంబోధించి మాట్లాడిన తరువాత ఇప్పుడు వ.15 చివరి భాగంలో “ఒకడు” అంటూ మళ్ళీ వ.11-12 విధానంలో, సంబోధన తృతీయ పురుష లోనికి వచ్చింది, “యౌవనమున పెండ్లి చేసికొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి”. అయితే “విశ్వాస ఘాతకు”డు లేదా వస్త్రములను బలాత్కారముతో నింపుకునేవాడే ఇక్కడ కర్త. ఇక్కడ ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా మాట్లాడుతున్నాడు. విశ్వాసఘాతకుడు
భార్యకు నమ్మకద్రోహం ఎలా చేస్తున్నాడో ఈ వచనం వివరిస్తుంది. ఎలాంటి న్యాయమైన కారణం లేకుండానే (ద్వితీ 24:3), వారి భర్తలు వారిని “అసహ్యించి" వారిని “పరిత్యజిం".. చాలనుకున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఇలా క్రూరంగా, మనస్సాక్షి లేకుండా వివాహ బాధ్యతలు విస్మరించేవాడు, తాను చేసిన ఒడంబడికలకు, అంటే వివాహ నిబద్ధత, శ్రద్ధ తోడు, భద్రత, సాన్నిహిత్యం , సమాధాన - అంశాలకు ద్రోహం చేస్తున్నాడు (ఆది. 2:24; నిర్గమ 21:10; ద్వితీ 22:13-19; సామె 5:15-20). అలాంటివాడు. దేవునిచేత దోషిగా తీర్పు తీర్చబడ్డాడు. తన పాపపు డాగు కలిగిన వస్త్రం అందరికీ కనబడేలా ధరించి ఉన్నాడు (కీర్తన 73:6). 

2:17 ప్రజలు (ఇతరులకు ఇవ్వవలసింది ఇవ్వకుండా) ఒకరినొకరు (వ.10) మోసం చేసుకోవడం ఒక రకమైన అన్యాయం. అయితే తాము “దుర్మార్గులని" భావించిన వారిని నాశనం చేయడానికి దేవుడు సహాయం చేయలేదని వారు దేవుడినే అన్యాయస్థుడని నిందించారు (1:2; 3:15). అయితే, తన ప్రజలు, యాజకుల పాపం తొలగించి, వారిని పవిత్రపరచడానికి, తీర్పు తీర్చడానికి (3:5; హెబ్రీ భాషలో న్యాయం అనే పదానికి సమానార్థకమైనది) రాబోయే దూత గురించి దేవుడు 3:1-6లో వ్యంగ్యోక్తిగా ప్రకటిస్తున్నాడు. 


Shortcut Links
మలాకీ - Malachi : 1 | 2 | 3 | 4 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |