Psalms - కీర్తనల గ్రంథము 51 | View All

1. దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
లూకా 18:13

2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

3. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
లూకా 15:18, రోమీయులకు 3:4

5. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
యోహాను 9:34, రోమీయులకు 7:14

6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.

7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.

8. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.

9. నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.

10. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.

11. నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.

12. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

13. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.

14. దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.

15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.

16. నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.

17. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

18. నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.

19. అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించెదరు.బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-51. ఒక విశ్వాసి పాపం చేసి, దాని విషయం గద్దించబడి, పశ్చాత్తాపంతో అనుభవించిన తీవ్రమైన పరితాపాన్ని వర్ణించే కీర్తన.
శీర్షిక: ఈ కీర్తనకు స్పష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు తన పాపాలను ఒప్పుకొన్నాడు (2సమూ 12:1; వివరాల కోసం 2సమూ 11-12 అధ్యాయాలు చదవండి). 

51:1-2 తుడిచివేయుము... కడుగుము... పవిత్రపరచుము - ఇదంతా క్షమాపణకు సంబంధించిన పదజాలం. ఇదే ఈ కీర్తనలో దావీదు ప్రధాన విన్నపం (ఇదే పదజాలానికి సంబంధించి 32:1-2 నోట్సు చూడండి). దావీదు పూర్తిగా దేవుని కనికరం మీద ఆధారపడ్డాడు, కృపచొప్పున... కరుణింపుము... వాత్సల్య బాహుళ్యము అనే పదాల్లో ఇది స్పష్టమవుతుంది. దావీదు విషయంలో, అతని పాపాలెంత తీవ్రమైనవంటే వీటి పరిహారం కోసం దేవుడు బలిని సైతం అంగీకరించడు (వ. 16). దేవుని ఆజ్ఞల ప్రకారం వ్యభిచారం, నరహత్య వంటి బాహాటమైన, ఉద్దేశపూర్వకమైన పాపాలు తీవ్రమైనవి (సంఖ్యా 15:30-31 తో పోల్చండి). వీరు పొందే శిక్ష సమాజం నుండి “కొట్టివేయ” బడడం, అంటే అనేక సందర్భాల్లో మరణం అని అర్ధం (31:22 నోట్సు చూడండి). 

51:3 కొన్నిసార్లు దేవుని క్షమాపణ, దీవెన పునరుద్ధరణ గురించిన అభయం అంత సులభంగా లభించదు. రక్షణానందాన్ని అనుభవించిన తర్వాత పాపంలో పడిపోయిన వ్యక్తి దేవుని పూర్తి క్షమాపణను, దేవుని అనుగ్రహపు పూర్వస్థితిని గూర్చిన అభయాన్ని పొందడానికి పశ్చాత్తాప సమయం పొడిగించబడుతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న దావీదు నా పాప మెల్లప్పుడు నా యెదుట నున్నది అంటూ తన అనుభవాన్ని వెల్లడి చేస్తున్నాడు. దేవుని వలన ఎంతగానో దీవించబడిన తర్వాత పరిశుద్దుడైన దేవునికి కోపం కలిగించడం ఎంత భయంకరమైన పరిస్థితో దావీదు అనుభవం తెలియజేస్తున్నది.

51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను అని చెప్పడంలో తన పాపం ఇతరులకు వ్యతిరేకంగా కాదని దావీదు చెప్పడం లేదు కాని, ఏ పాపమైనా అది ముందు దేవునికీ, ఆయన వాక్యానికీ వ్యతిరేకమైనదని అతడు గ్రహించాడు (2 సమూ 12:9-10 చూడండి). 

51:5 ఈ వచనం భిన్నమైన అభిప్రాయాలకు కారణమైంది. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం పాపపుక్రియ అని దీనిని కొందరు అపార్థం చేసుకున్నారు. అయితే లేఖనంలోని ఇతర వాక్యభాగాలతో పోల్చి చూచినప్పుడు ఈ అభిప్రాయం సమర్థనీయమైనది కాదు (127:3; హెబ్రీ 13:4). మరికొందరు ఈ వచనం ప్రసూతికి సంబంధించిన ఆచారపరమైన అపవిత్రతను తెలియజేస్తున్నదని చెబుతారు (లేవీ 12:2,5; 15:18), అయితే ఇది పాపం కాదు. ఇంకా కొందరు దావీదు తన పాపపుస్థితి ఎంత తీవ్రమైనదో అలంకారికంగా వర్ణిస్తున్నాడని చెబుతారు. క్రైస్తవ చరిత్రలో ముఖ్యమైన వివరణల్లో ఒకటిగా ఈ వచనం “మూలపాపం” సిద్ధాంతాన్ని ప్రబోధిస్తున్నది. గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం అనే జీవప్రక్రియలు మనుషుల్లోని పాపపు స్వభావానికి మూలం అని ఇది ప్రతిపాదించడం లేదు. పాపం మానవజాతి నంతటినీ ఆవరించిన విశ్వవ్యాప్త స్థితి అనీ, మన ఉనికి ప్రారంభమైనప్పటినుండీ ఉన్నదేననీ. దావీదు గుర్తిస్తున్నాడు. పాపం ప్రతి చోటా ప్రతి ఒక్కరిలోను ఉంది కాబట్టి, తాను పుట్టుకతోనే పాపిననే విషయాన్ని దావీదు ఒప్పుకొంటున్నాడు. “నేను పాపపు స్వభావంతోనే పుట్టాను కాబట్టి నా పాపాలకు నేనెందుకు నింద భరించాలి?” అంటూ సాకులు చెప్పకుండా, దావీదు తన ఒప్పుకోలు ద్వారా మనుషుల్లో స్వాభావికంగా ఉన్న పాపపు నడతల్ని "నిర్మలుడైన" (51:4) దేవుని స్వభావంతో బేరీజు వేసి, దేవుడు నీతిమంతుడనీ నిర్మలుడనీ ప్రకటిస్తున్నాడు.

51:10 పాపాన్ని ద్వేషించే పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతనాత్మను మనలో కలిగించే దేవుని పరిశుద్దాత్మ ఆవశ్యకత విశ్వాసులందరికీ ఉంది. అందుకే నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము అని దావీదు చేసిన ప్రార్థన మనకెంతో మాదిరికరం. దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి, నిజమైన దైవభక్తిలోనికి పునరుద్దరించ గలడు (యోహాను 8:3; 2కొరింథీ 5:17). 

51:11 నీ పరిశుద్దాత్మను నా యొద్దనుండి తీసి వేయకుము. తప్పును ఒప్పింపజేసి గద్దించే పరిశుద్దాత్మ కార్యాన్ని దేవుడు తన జీవితంలో నుండి తీసివేస్తే ఇక విమోచనకరమైన నిరీక్షణే పోతుందని దావీదుకు తెలుసు (యోహాను 16:8 నోట్సు చూడండి).

51:12 తన పాపం వలన తాను కోల్పోయిన రక్షణానందమును తనకు మరల పుట్టించమని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడు దానిని అతనికి అప్పటికే తిరిగి దయచేశాడు. కానీ... దావీదు ... జీవితంలో ఈ సంఘటన ఫలితాలను గూర్చి ఈ క్రింది వాటిని గమనించండి: (1) మనం ఏమి విత్తుతామో దానినే కోస్తామని లేఖనం వివరంగా చెబుతున్నది. మనం ఆత్మకోసం విత్తితే ఆత్మనుండి వచ్చే జీవమనే పంటను కోస్తాం. శరీరం కోసం విత్తితే ఈ శరీరం నుండి. క్షయత అనే పంటను కోస్తాం (గలతీ 6:7-8). తన పాప. ఫలితంగా దావీదు. జీవితంలో, కుటుంబంలో, రాజ్యంలో తన జీవితకాలమంతా శ్రమలనుభవించాడు (2సమూ 12:1-14). (2) దావీదు నిజంగా తన పాపాన్ని ఒప్పుకొని, క్షమాపణ పొందిన తర్వాత కూడా అతడు అనుభవించిన భయంకరమైన పాప ఫలితాలు యేసుక్రీస్తులో మనకనుగ్రహించబడిన విమోచనకు వ్యతిరేకంగా పాపంలో కొనసాగేవారిలో భయాన్ని పుట్టించాలి (2 సమూ 12 అధ్యా

51:17 పాపం పట్ల - అసహ్యతతో, దానిలోని దుష్టత్వం మూలంగా భారభరితమైన విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎప్పుడూ త్రోసిపుచ్చడు. మన స్వార్థాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి క్షమించే దేవుని కృప  కోసం మొర్రపెట్టినప్పుడు ఆయన మనలను అంగీకరిస్తాడని మనం దృఢంగా నమ్మవచ్చు (యెషయా 57:15; లూకా 18:10-14తో పోల్చండి).


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |