Isaiah - యెషయా 18 | View All

1. ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొను చున్న రెక్కలుగల దేశమా!

2. అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవ లలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జన ములను త్రొక్కు చుండువారునగు జనము నొద్దకు పోవుడి.

3. పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

4. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘ ములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

5. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరు వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.

6. అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.

7. ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
18:1-7 కూషు నుద్దేశించిన ప్రకటన క్రిందటి అధ్యాయాలు సూచించినట్టుగా శిక్షా ప్రకటన కాకపోయినా గానీ, ఓహో అనే పదం శిక్షాప్రకటన వంటిదాన్నే సూచిస్తుంది. (1:4; 17:12 నోట్సు చూడండి). కూషు ఐగుప్తు దేశానికి దక్షిణంలో నైలు నది ఎగువ భాగంలో (దక్షిణాన) ఉంది, రమారమి ప్రస్తుత ఐతియోపియా అని చెప్పవచ్చు. 

18:1 కూషు నదుల కవతల ఉన్న ప్రదేశమెటువంటిదో సరిగ్గా సరిపోయే వర్ణన: తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా - ఇది కీటకాలకు ఆలవాలమైన ప్రదేశం. 

18:2 కూషు జమ్ము పడవల మీద నైలు నదిపై యూదా వరకు రాయబారుల్ని పంపించింది. ఐగుప్తులో, కూషులో జమ్ము పడవల వాడకం సర్వసాధారణం. తర్వాత, రాయబారులు యెత్తయినవారును నునుపైన చర్మముగల వారునగు జనము నొద్దకు వెళ్లాలనే ఆజ్ఞ కనబడుతుంది. వీరు ఇతరుల్ని భీతిల్లజేసే భీకరజనం, దౌష్టికులైన జనం. ఈ వర్ణన కూషుకు సరిపోయే వర్ణన కాబట్టి కూషుకు వెళ్ళమనే ఈ ఆజ్ఞ యూదా రాయబారులకివ్వబడింది గానీ, ఇంటికి తిరిగి వెళ్లాలని కూషు రాయబారుల కివ్వబడలేదని కూడా తెలుస్తుంది. ఈ వచనంలో తీవ్రమైన దౌత్య వ్యవహారం కనబడుతుంది. 

18:3 మానవ దౌత్య ప్రయత్నాలు ఎన్నున్నప్పటికీ, సైన్యం యుద్ధానికి సమాయత్తమయ్యే ఒక నిర్ణయాత్మకమైన సమయం భవిష్యత్తులో రాబోతుంది. ధ్వజమెత్తునప్పుడు అనే పదం యుద్ధానికి బారులు తీరి వెళ్లడాన్ని సూచిస్తుంది (5:26; 11:10, 12; 13:2). యుద్ధం ప్రారంభమైందని బాకా సూచిస్తుంది. 

18:4 మనుషులు దౌత్యం కోసం అమితావేశంతో చేసే తీవ్ర ప్రయత్నాలకు భిన్నంగా దేవుడు మాత్రం నిమ్మళంగా ఉన్నాడు. 

18:5-6 ద్రాక్షలు పక్వానికి రాకమునుపు ద్రాక్షతీగల్ని కత్తిరించినట్టుగా దేవుని తీర్పును పోల్చవచ్చు. యుద్ధంలో పడిపోయినవారిని మృగములు తినివేస్తాయి. 

18:7 కూషీయుల్ని (ఐతియోపీయులు) ఎత్తయినవారును నునుపైన చర్మము గలవారును అని వర్ణించారు. (వ.2). వీరు కప్పం తెస్తున్నట్టుగా వర్ణన కనబడుతుంది. తీర్పు తర్వాత వారు సీయోను లోని దేవాలయానికి చూపించే విధేయతకు ఇది సూచన.


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |