Ezekiel - యెహెఙ్కేలు 25 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము.

3. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు, మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక

4. నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు, వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు.

5. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱెల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

6. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీ యుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు

7. నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.

8. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక

9. తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;

10. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.

11. నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

12. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13. ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును,దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

14. నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

16. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.

17. క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.



బైబిల్ అధ్యయనం - Study Bible
25:1-32:32 యెహెజ్కేలు గ్రంథంలోని ఈ విభాగం వినాశన సందేశానికి, నిరీక్షణ సందేశానికి మధ్య ఓ వారధిగా ఉంది. ఇశ్రాయేలు శత్రువుల వినాశనమంటే ఇశ్రాయేలుకు నిరీక్షణయే. ఇక్కడ ఈ భాగంలో ఈ ప్రవచనాలుండడం గ్రంథ వెల్లువను ఒకింత అడ్డుకున్నట్టుగా కనబడుతుంది, దేవాలయం నేడో రేపో నాశనం కావడం తథ్యం కాబట్టి వత్తిడి తీవ్రంగా ఉంది. అన్యజాతుల మీద దేవుని తీర్పుకు అబ్రాహాముతో చేసిన నిబంధనయే మూలం, ఇశ్రాయేలును శపించినవారిని దేవుడు శపిస్తాడని ఈ నిబంధన తెలియజేస్తుంది (ఆది 12:1-3). ఈ ప్రవచనంలో పేర్కొన్న అన్యజాతులన్నీ యెరూషలేమును నాశనం చేయడంలో పాల్గొని ఉండవచ్చు. లేదా యెరూషలేము నాశనం కావడాన్ని చూసి సంతోషించి ఉండవచ్చు. ఈ ప్రవచనాలు వినిన శ్రోతలు యూదా ప్రజలు కాబట్టి ఇది వారికి భవిష్యత్తు పట్ల నిరీక్షణకు కారణం.

25:1-2 అమ్మోను, మోయాబు, ఎదోము దేశాలు ఉత్తరం నుండి దక్షిణం వరకు వాటి వాటి భౌగోళిక ప్రదేశాన్ని బట్టి ప్రస్తావించబడ్డాయి. ఈ ప్రవచనాల విభాగంలో మొదటిగా అమ్మోనీయుల ప్రస్తావన కనబడుతుంది. కారణం ఇంత క్రితం అన్యజాతి గురించి ప్రవచనం ఉన్నదంటే అది అమ్మోను గురించి మాత్రమే (21:28-32). అమ్మోనీయులు అబ్రాహాము బంధువైన లోతు వంశస్థులు (ఆది 19:30-38). అమ్మోనీయులు విగ్రహారాధనకు (1రాజులు 11:7,33), క్రూరత్వానికి (ఆమోసు 1:13), గర్వానికి (జెఫన్యా 2:9-10), దేవుని ప్రజల్ని వ్యతిరేకించడానికి (ద్వితీ 23:3-4; న్యాయాధి 3:13; 1సమూ 11:1-3; 2సమూ 10:1-14; 2రాజులు 24:2; "నెహెమ్యా 4:3,7-8) పేరుపొందినవారు. అమ్మోను నుద్దేశించి యిర్మీయా పలికిన ప్రవచనం కోసం యిర్మీయా 49:1-6, ఆమోసు పలికిన ప్రవచనం కోసం ఆమోసు 1:13-15 చూడండి. 

25:3-6 వీరు యూదా దురవస్థను చూసి సంతోషించారు కాబట్టి, అమ్మోను తూర్పుననుందు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించబడుతుంది.

25:7 విధి విచిత్రమేమిటంటే, యూదా నాశనాన్ని చూసి సంతోషించిన అన్యదేశానికి (వ.3), ఇప్పుడు అదే దురవస్థ కలగబోతుంది. శత్రువులు అమ్మోనును జయించి అణచివేస్తారు. నిబంధనలోని శిక్షల్లో ఇది ఒకటి (లేవీ 26:16-17; ద్వితీ 28:31,33,43). 

25:8-11 అమ్మోనీయుల్లాగానే మోయాబీయులు కూడా లోతు వంశస్థులే (ఆది 19:30-38), ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వెంటనే, మోయాబీయులు ఇశ్రాయేలీయుల్లోని యౌవనస్థులకు బయలు దేవత పూజను పరిచయం చేసి వారిని ఆటంకపర్చారు (సంఖ్యా 21:1-25; 31:16). రాజకీయంగా, సైనికపరంగా చరిత్రలో చాలా కాలం మోయాబు మీద యూదా ఆధిపత్యం చూపించింది. ఏదేమైనా, యెహెజ్కేలు కాలంలో మోయాబు సైన్యం నెబుకద్నెజరు సైన్యంతో చేతులు కలిపి యూదా రాజైన యెహోయాకీము మీద దాడి చేసింది. (2రాజులు 24:2). యూదా ఓటమి పాలైనప్పుడు, మోయాబీయులు సంతోషించారు (యిర్మీయా 48:29; జెఫన్యా 2:8-9), మోయాబు నుద్దేశించిన ఇదివరకటి ప్రవచనాల కోసం యెషయా 15:1-16:14; యిర్మీయా 48:1-47; ఆమోసు 2:1-3 చూడండి. 

25:12-13 ఎదోమీయులు, యూదావారి మధ్య కలహం వారి పితరుల కాలం నుండే ఉంది. ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు, యూదావారి మూలపురుషుడైన యాకోబు కవల సోదరులు, వారి తల్లి రిబ్కా గర్భంలో నుండి బయటికి వచ్చేటప్పుడే యాకోబు ఏశావు మడిమను పట్టుకొని వచ్చాడు (ఆది. 25:21-34). శతాబ్దాల అనంతరం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు కనానుకు వెళ్తున్నప్పుడు వారిని ఎదోమీయులు తమ దేశంగుండా ప్రయాణించడానికి అనుమతించలేదు (సంఖ్యా 20:14-21). ఈ సంఘటన మొదలు సుదీర్ఘకాలంగా ఇశ్రాయేలు, ఎదోములకు మధ్య మంచి సంబంధాల్లేవు. సౌలు రాజు కాలంలో (1సమూ 14:47), సొలొమోను (1రాజులు 11:14-22), యెహోషాపాతు (2దిన 20:1-23), యెహోరాము (2రాజులు 8:20-21), ఆహాజు (2దిన 28:17) రాజుల కాలంలో ఇశ్రాయేలుకు ఎదోముకు మధ్య యుద్ధాలు జరిగాయి. దేవుని ప్రజల పట్ల ఎదోముకున్న వ్యతిరేక భావానికి ఘోరమైన ఉదాహరణ యెరూషలేము దేవాలయం వినాశనంలో ఎదోము పోషించిన పాత్ర (కీర్తన 137:7; విలాప 4:21-22; ఓబద్యా వ.1-14). మోయాబీయులు, అమ్మోనీయుల్లాగానే, ఎదోమీయులు కూడా యుద్ధకాంక్ష గల ప్రజలు (ఆది 27:39-40), విగ్రహారాధికులు (2దిన 25:14,20), క్రూరస్వభావులు (ఆమోసు 1:11-12), ప్రతీకారేచ్చ గలవారు (యెహె 25:12-14). యెహెజ్కేలు, ఇంకా ఇతర ప్రవక్తలు ఇశ్రాయేలు చివరకు ఎదోమును స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు (35:1-36:15; యెషయా 11:14; దాని 11:41; ఆమోసు 9:12; ఓబద్యా వ,18-19), మక్కాబీయులు ఎదోమును ఓడించి, దాన్ని యూదాలో ఐక్యం చేసినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. 

25:14 దేవుడు ఎదోము మీద తన తీర్పును ప్రకటించాడు. ఈ తీర్పు గురించి 35:1-36:15 వాక్యభాగం విశదీకరిస్తుంది. ప్రధాన ప్రవక్తలు అన్యజాతుల నుద్దేశించి చేసిన అనేక ప్రవచనాల్లో ఎదోము కూడా ఉంది. ఎదోముకు వ్యతిరేకంగా ఇతర ప్రవచనాల కోసం యెషయా 34:5-17; 63:1-6; యిర్మీయా 49:7-22; ఆమోసు 1:11-12; ఓబద్యా చూడండి. 

25:15 ఫిలిపీయులు గ్రీసు ప్రాంతపు సముద్రతీరాలు, ఏజియన్ సముద్రంలోని ద్వీపాల నుండి పాలస్తీనా తీరప్రాంతానికి వలస వచ్చినవారు (యిర్మీయా 47:4; ఆమోసు 9:7; జెఫన్యా 2:5). న్యాయాధిపతుల కాలం నాటికే వీరు ఇశ్రాయేలీయులకు చిరకాల శత్రువులుగా ఉన్నారు (న్యాయాధి 3:31; 10:7; 13-16 అధ్యా., 1సమూ 4; 13; 31; 2సమూ 5; 2రాజులు 18:8; 2దిన 21:16-17; 28:18). తన పరిపాలనా కాలంలో ఫిలిపీయుల్ని పూర్తిగా అణచివేసిన ఘనత దావీదుకే దక్కుతుంది (2సమూ 5:17-25). మక్కాబీయుల కాలం (క్రీ.పూ. 2వ శతాబ్దం) తర్వాత ఫిలిపీయుల ఉనికి గురించి ఏ ఆధారాలూ లేవు. అయితే కనాను ప్రాంతానికి ఫిలిపీయ అనే పేరులోనుండి వచ్చిన పాలస్తీనా అనే పేరు నిలిచిపోయింది. ఫిలిపీయకు వ్యతిరేకంగా ఉన్న ఇతర ప్రవచనాలకు యెషయా 14:28-32; యిర్మీయా 47:1-7; ఆమోసు 1:6-8 వచనాలు చూడండి. 

25:16-17 కెరతీయులను అనే పదం బహుశా క్రేతువాసుల్ని సూచిస్తుండవచ్చు. కనాను నైరుతి తీరంలో స్థిరపడిన వీరు ఏజియన్ సముద్రంలోని ద్వీపాల్లోని జాతి అయ్యుండవచ్చు. దావీదు కాలంనాటికి వీరికి ఇశ్రాయేలీయులతో మంచి సంబంధాలే ఉన్నాయి, దావీదు కెరతీయుల్లో అనేకులను తన వ్యక్తిగత సంరక్షకులుగా నియమించుకున్నాడు (1సమూ 30:14; 2సమూ 8:18). కెరెతీయుల్ని పెలెతీయులతో కలిపి చెప్పడం పరిపాటి, దావీదు కాలంలో ఈ రెండు జాతుల్ని ఒకే దండుగా పేర్కొనడం జరిగింది (2సమూ 8:18; 20:23). దావీదు అబ్లాలోము నుండి పారిపోయినప్పుడు అతని వెంట పెలెతీయులు, కెరెతీయులు ఉన్నారు (2 సమూ 15:18)


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |