Nehemiah - నెహెమ్యా 8 | View All

1. ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మన స్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చియెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా

2. యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదు టను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి

3. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి

4. అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠముమీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వ మందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.

5. అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జను లందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్పగానే జనులందరు నిలువబడిరి.

6. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తిఆమేన్ఆమేన్‌ అని పలుకుచు, నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి.

7. జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.

8. ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.

9. జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులునుమీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.

10. మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖ పడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.

11. ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి,ఇది పరిశుద్ధదినము,మీరు దుఃఖ పడకూడదని వారితో అనిరి.

12. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.

13. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపుమాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.

14. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీ యులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుటకను గొనెను

15. మరియు వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగామీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.

16. ఆ ప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమ తమ యిండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.

17. మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.

18. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దిన ములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
8:1-10:39 యెరూషలేమును తిరిగి ప్రజలతో నింపే వృత్తాంతం, 7:73 లో ఆగిపోయి, 11:1 వరకు మరలా ఆరంభం కాలేదు. 8-10 అధ్యాయాలు వాస్తవానికి ఎజ్రాకు సంబంధించిన అనుభవాలు. కాల క్రమం ప్రకారం చూస్తే ఈ భాగం ఎజ్రా 8, 9 అధ్యాయాల మధ్య ఉండేది. ఎజ్రా, నెహెమ్యాల పరిచర్యలను అనుసంధానించడానికి ఈ కథనం ప్రస్తుతమున్న స్థానంలో కూర్చబడిందని అనేకమంది పండితులు వాదిస్తారు. వారం ఎజ్రా 8 (బహుశా 9 కూడా) ఎజ్రా జ్ఞాపకాలలో భాగం అయ్యే అవకాశం ఉంది (ఎజ్రా పరిచయంలోని ఉగ్రంథ నిర్మాణం” చూడండి). అంటే దీని అర్థం సమాచారం అంతా మార్పు చేయబడిందని కాదు. కొన్నిసార్లు బైబిలు గ్రంథకర్తలు తమ సమాచారాన్ని కాలక్రమాన్ని బట్టి కాక అంశానుగుణంగా ఇచ్చారు. (ఎజ్రా 4:6-24; లూకా), నెహెమ్యా కాలంలో ధర్మశాస్త్రము చదవబడినప్పుడు (ఎజ్రా 8), ఎజ్రా అక్కడ లేకుండడానికి బలమైన కారణాలేమీ లేవు. వారి పరిచర్యలు ఒకేకాలంలో ఉన్నట్లుగా ఉన్నప్పటికీ ఎజ్రా నెహెమ్యాలు ఒకరి పేరు ఒకరు పేర్కొనకపోవడం (ఈ సందర్భంలో అది విచిత్రంగా కనిపించినప్పటికీ) అనేదానికి బైబిలు సాహిత్యంలో ఉదాహరణలు ఉన్నాయి. ఆ విధంగా, ఎజ్రా-నెహెమ్యాల గ్రంథకర్త నెహెమ్యా 1:1-7:73 వరకు ఉపయోగించిన నెహెమ్యా జ్ఞాపకాల నుండి మళ్ళుకొని, నెహెమ్యా 8, 9లోని కొంతభాగం వరకు, ఎజ్రా జ్ఞాపకాలనుండి రాయడం మొదలు పెట్టి ఉంటాడని సూచిస్తారు. 

81-8:2 ఏడవ నెల (తిప్రీ యూదుల కాలమానంలో చాల ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కాలంలో అనేక సంఘటనలు జరిగాయి. వీటిలో కొత్త సంవత్సరం, ప్రాయశ్చిత్త దినం, పర్ణశాలల పండుగలు ఉన్నాయి. ఏడేండ్ల కొక్కసారి పర్ణశాలల పండుగలో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేవారు. (ద్వితీ 31:10-12). చదువబడుదాని గ్రహింప శక్తిగల వారిలో ఒక వయసు పిల్లలు కూడా ఉంటారు (10:28; ఎజ్రా 10:1 తో పోల్చండి)

8:3 ధర్మశాస్త్రము చదవడానికి మందిరం దగ్గర కాకుండా, నీటిగుమ్మము దగ్గర ఈ సమావేశం ఎజ్రా ఎందుకు ఎంచుకున్నాడో చెప్పలేదు (3:26-27 నోట్సు చూడండి). నెహెమ్యాకు, అమ్మోనీయుడైన టోబియాతో కలసివున్న కొందరు యాజకులకు మధ్య ఉన్న ఉద్రిక్తతలే (6:17-19) దీనికి కారణం అని కొందరు ఊహిస్తారు. అందువల్లనే, ఎజ్రా నెహెమ్యాలు మందిరానికి దూరంగా దీనిని ఏర్పాటు చేసివుంటారు. చేరవచ్చే జనసంఖ్య వేరే చోటికి వెళ్ళాల్సినంత ఉండి వుండవచ్చు అనే అవకాశం కూడా లేకపోలేదు. ధర్మశాస్త్ర గ్రంథము అంటే అందులో .. ఏమేమి ఉన్నాయి అనేది కూడా విపరీతమైన చర్చాంశమే. బహుశా ఎజ్రా ప్రస్తుతం మనకున్నదానిలా ఉన్న పంచకాండాలలోని చట్టముల భాగం చదివివుంటాడు. అది అంతా చదివాడని కాక దానినుండి చదివాడని అర్థంచేసుకోవాలి.

8:4 పీఠము (హెబ్రీ. మిగ్గల్) అనే మాటకు సాధారణంగా “గోపురం” అని అర్ధం. కానీ ఇక్కడతో పాటు 2దిన 6:13లో ఒక పీఠాన్ని సూచించడానికి దానిని ఉపయోగించారు. అతని కుడిపార్శ్వమందు... యెడమ పార్శ్వమందు నిలిచి వున్నవారిని గురించి మనకు ఎక్కువగా తెలియదు. సాధారణంగా
ఎజ్రా-నెహెమ్యా పుస్తకాలలో యాజకులు, లేవీయులు మిగిలిన సామాన్యుల నుండి వేరుగా చెప్పబడ్డారు. కాబట్టి వీరు బహుశా కుటుంబ పెద్దలనుండి ప్రతినిధులుగా ఎంచబడ్డ ప్రసిద్ధ ప్రజా నాయకులు కావచ్చు. 

8:5 ఎజ్రా... గ్రంథమును విప్పెను అనేమాటలు కొంచెం కాలం చెల్లినట్లుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ గ్రంథం రాత ప్రతులు ఆధునిక క్రైస్తవ యుగము వరకు లభించలేదు. అక్షరార్థంగా ఆ మాటలు “ఎజ్రా గ్రంథపు చుట్టను విప్పెను” అని వుండాలి. "నేను వచ్చువరకు (బహిరంగముగా) చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము” (1తిమోతి 4:13) అని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా సూచించాడు. దేవుని వాక్యాన్ని చదవడానికి నిలబడడం, ఎజ్రా కాలంలోనే కాక నేడు కూడా అంతే ప్రాముఖ్యం.

8:6 ప్రజలకు ఆరాధన అనేది కేవలం మానసిక వ్యాపకం మాత్రమే కాకూడదు. ఆరాధికుడు నిలబడి, మాట్లాడి, దీనత్వంతో దేవునియెదుట మోకరించి, పూర్తిగా పాల్గొనేదే ఆరాధన. 

8:7 ఎజ్రాకు సహకారులుగా ఉన్న పదమూడు మంది లేవీయులు తరువాతి అధ్యాయాలలో వివరించిన నిబంధనా పునరుద్ధరణ సమయంలో కూడా సహాయకులుగా ఉన్నారు. పదమూడు మందిలో ఎనిమిదిమంది బహిరంగ ఒప్పుకోలులో (9:3-5), తొమ్మిదిమంది నిబంధనా సాక్షుల జాబితాలో ఉన్నారు (10:9-13). 

8:8 అర్థము చెప్పిరి అని అనువదించిన హెబ్రీ పదం (ఐరాష్)ను అర్థం చేసుకోవడానికి అనేక అవకాశాలున్నాయి. ఈ క్రియాపదానికి ప్రాథమిక అర్థం “వేరుచేయడం" లేక "వ్యత్యాసాన్ని తెలియజేయడం”. ఇది హెబ్రీ బైబిలు పారాషోత్ అనే భాగాలుగా విభజించిన యూదుల మాసోరెట్స్ అభ్యాసాన్ని ప్రతిబింబించింది. ఆ విధంగా హెచ్.జి.ఎం.. విలియంసన్, వ.8 ను “వారు ధర్మశాస్త్ర గ్రంథం నుండి పేరా వెంబడి పేరా చదివారు" అని అనువదిస్తాడు. ఇదే క్రియా పదాన్ని “వివరించడం, స్పష్టం చేయడం" అని అనువదించే మరొక అవకాశం ఉంది. ఇది హెబ్రీ భాషలో అంత సాధారణం కాదు - (సంఖ్యా 15:34) కానీ మిగిలిన సెమెటిక్ భాషల్లో (అరామిక్, సిరియాక్, మాండ్యన్, నెబాటియన్) సామాన్యమైనదే. లేవీయులు చేసే పని "అర్థం చెప్పడం" అనే తర్జుమా భావాన్ని లేవీయులు హెబ్రీ లేఖనాన్ని చదివి, దాన్ని ప్రజలకు అర్థమయ్యే అరామిక్ భాషలోనికి అనువదిస్తున్నారు అనే ప్రాచీన యూదా సాంప్రదాయం సమర్థిస్తుంది. యూదుల తాల్ముద్ (బి. మెగిల్లా 3ఎ) ఈ వాక్యభాగాన్ని (నెహెమ్యా 8:8), టార్గం నుండి వచ్చినదిగా పేర్కొంటుంది (టార్గం అంటే హెబ్రీ భాషలో ఉన్న లేఖనాలను అరామిక్ లోని సులభమైన పదాలతో అనువాదం చేసినది. నాటి కాలంలో అనేకమంది యూదులు హెబ్రీ భాషను చదవలేకపోవడంతో ఈ అనువాదం మీదే వారు ఎక్కువగా ఆధారపడేవారు). పా.ని. పుస్తకాలన్నింటికీ టార్గంలు సిద్ధపరిచారు కానీ ఎజ్రా-నెహెమ్యా లేక దానియేలు గ్రంథాలకు ఆ పని చేయలేదు. 

8:9 ఈ వచనం నెహెమ్యా... ఎజ్రాల పరిచర్యను సంధానిస్తుంది కాబట్టి చాల ముఖ్యమైంది. ఈ ఇద్దరు నాయకులు సమకాలికులు కారు. కాబట్టి వారిద్దరిని ఒక్కచోట పేర్కొనడం ఇద్దరి పరిచర్యలను కలపడానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని అనేకమంది విమర్శకులు భావిస్తారు. అయినప్పటికీ లేఖనానుసారంగా గాని లేక చారిత్రకంగా గాని ఈ సంఘటన చారిత్రాత్మకతకు ఎలాంటి సమస్యలు రావు. అంత ప్రసిద్ధి చెందిన ఎజ్రాను ఈ పుస్తకంలో ఇంతవరకు నెహెమ్యా పేర్కొనకపోవడం కొంచెం చిత్రంగానే అనిపిస్తుంది. దీని అర్థం ఎజ్రా అక్కడ లేడని కాకపోవచ్చు. ప్రవక్తలైన హగ్గయి, జెకర్యాలు యెరూషలేము, యూదాలోని ప్రజలకు ప్రవచించిన సమకాలికులే. కానీ ఇద్దరిలో ఎవరూ రెండవవారిని ప్రస్తావించరు. ఇక్కడ రచయిత ఎజ్రా, నెహెమ్యాలు కలసి పనిచేశారని స్పష్టంగా ధృవీకరిస్తున్నాడు. వారిద్దరూ నిబంధనను పునరుద్ధరించడంలో (అధ్యా. 8-10), యెరూషలేము
ప్రాకారాలు ప్రతిష్టించడంలో, గొప్ప ఊరేగింపులో కలిసి పాల్గొన్నారు (12:27-43).
ప్రజలు విరిగినలిగి పశ్చాత్తాపం చెందడం సాధారణంగా నాయకులకు ప్రోత్సాహం కలిగిస్తుంది. కానీ ఇక్కడ దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు అని నెహెమ్యా (లేక ఎజ్రా?) ఇచ్చిన ఆజ్ఞ చిత్రంగా అనిపిస్తుంది. అయితే ఈ గోడ ప్రతిష్ఠ కొత్త సంవత్సర వేడుకల్లో, “ఏడవ నెల మొదటి దినమున" (వ.2) జరిగింది. పండుగ రోజులు సంతోషంగా ఉండాల్సిన రోజులే (లేవీ 23:24; ద్వితీ 12:12; 16:11) గానీ ఏడ్చే రోజులు కాకూడదు. 

8:10-12 దుఃఖపడకుండా, వారు వెళ్ళి క్రొవ్విన మాంసము భక్షించాలి, మధురమైనదాని పానము చేయాలి. క్రొవ్విన అనే మాట హెబ్రీ భాషలో (మష్మాన్నిం) పా.ని.లో ఇక్కడ ఈ వచనంలో మాత్రమే కనిపిస్తుంది, కానీ అది “బలిసిన” లేక “కొవ్వజేసిన” అనే క్రియాపదానికి సంబంధించినది. అది పండుగలో తినే ఇష్టమైన శ్రేష్ట పదార్థాలను సూచిస్తున్నది. “మధురమైన” పానీయం (హెబ్రీ. మమ టాక్కిం ) అని ఇక్కడ పేర్కొన్నది. బహుశా తేనెతో కలిపిన ద్రాక్షరసం కావచ్చు. ఇది క్రీస్తు కాలానికి ముందు చాలా ప్రసిద్ధి చెందిన పానీయం. ప్రజలు దుఃఖించడం మానాలి. ఎందుకంటే వారి బలం యెహోవాయందు ఆనందించుట వలన వస్తుంది. నాడైనా, నేడైనా నిజమైన సంరక్షణ ప్రభువు దగ్గరే దొరుకుతుంది. . 

8:13 ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత చాలమంది తమ ఇండ్లకు తిరిగివచ్చారని తరువాతి నేపథ్యాన్ని బట్టి స్పష్టమౌతుంది. (వ. 15). అది కోతకాలం, చేయాల్సిన పని కూడా చాలావుంది. అయితే చాలామంది నాయకులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని దాని గురించిన వివరాలు నేర్చుకోవడానికి యెరూషలేములో నిలిచారు. 

8:14-15 పర్ణశాలల పండుగ యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో నాలుగు పుస్తకాలలో (నిర్గమ 23:16; లేవీ 23:39-43; సంఖ్యా 29:1238; ద్వితీ 16:13-15) పేర్కొనబడింది. ఫలసంగ్రహపు పండుగ (హెబ్రీ. చఖాఖట్సిర్) అని కూడా దీన్ని పిలిచేవారు. ఇది ధాన్యం, ద్రాక్షల కోత కాలంలో ఏడవ నెల పదిహేనవ రోజున ఆరంభమయ్యే ఎనిమిది రోజుల వ్యవసాయ పండుగ (ద్వితీ 16:13). లేవీ 23:39-43లోని చట్టం రెండు విధాలుగా ప్రత్యేకమైంది: (1) ఈ వాక్యభాగంలో మాత్రమే ఇశ్రాయేలీయులు పండుగ ఏడురోజులు పర్ణశాలలో నివసించాలని ఆజ్ఞాపించబడింది. (2) ఈ వాక్యభాగంలో మాత్రమే వారు పర్ణశాలలో నివసించడం గురించిన వేదాంతపరమైన వివరణ చెప్పబడింది. "నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు...” (లేవీ 23:42).
పర్ణశాలల పండుగకు సిద్ధపాటు అవసరం కాబట్టి ఎజ్రాతో ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న నాయకులు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేశారు. పర్ణశాలలు కట్టడానికి ఒలీవ... గొంజి... కొమ్మలు వాడాలని పా.ని.లో ఇంకెక్కడా చెప్పబడలేదు. ఇది లేవీ 23:40లోఉన్న, ఈతమట్టలను, గొంజిచెట్ల కొమ్మలను, కాలువల యొద్దనుండు నిరవంజి చెట్ల...” నుండి కూర్చమని ఇచ్చిన ఆజ్ఞను అన్వయిస్తూ చెప్పిన వివరణలా అనిపిస్తుంది. 

8:16 యెరూషలేములో నివసిస్తున్నవారు ఈ పర్ణశాలలు (హెబ్రీ. సుక్కోత్) తమ యిండ్లమీద కట్టుకున్నారు. ఎందుకంటే వారి ఇళ్ళకు సమాంతరంగా ఉన్న పైకప్పులు ఉండేవి. యెరూషలేము బయటనుండి వచ్చినవారు, తాము రెండువారాల క్రితం ధర్మశాస్త్రాన్ని విన్న దేవమందిరపు ఆవరణములోను, నీటిగుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము - గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకున్నారు. ఎఫ్రాయిము గుమ్మమును అధ్యా. 3లోని ప్రాకారపు సమగ్ర వివరణలో పేర్కొనలేదు. అయితే 2రాజులు 14:13 లోని దాని వర్ణన, అది ప్రాకారానికి ఉత్తరంవైపు ఉందని సూచిస్తుంది. కాబట్టి రెండువైపుల నుండి దేవాలయానికి సులువుగా రావచ్చు.

8:17 పర్ణశాలల పండుగ మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే నూను కుమా రుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు. ఆలాగున చేసియుండలేదు అనే మాటలకు "అలా చేయలేదు” అని- అక్షరార్థం. ఆ పండుగ యెహోషువ కాలంనుండి ఆచరించలేదని అక్షరార్ధపు అనువాదం సూచిస్తుంది, కానీ అది సరికాదు, నెహెమ్యా కాలంలో ఎజ్రాతోపాటు యెరూషలేముకు వచ్చినవారు వచ్చిన వెంటనే పర్ణశాలల పండుగ చేసుకున్నారు కాబట్టి వారికి అర్థం అవుతుంది. (ఎజ్రా 3:4). కాబట్టి అధికశాతం వ్యాఖ్యాతలు, కొద్దిమంది అనువాదకులు పండుగ ఎలా చేసుకున్నారో అనేదాన్ని ఈ వ్యాఖ్య చెబుతోందని భావిస్తారు. ప్రస్తుత పండుగను భిన్నంగా చేసుకోవడానికి కారణం బహుశా ఆధ్యాత్మిక, వేదాంత ప్రభావం విస్తరించడమే కావచ్చు. ఇంతకు ముందైతే, కోత మీద, కృతజ్ఞత మీద పండుగ దృష్టిపెట్టి ఉండవచ్చు. కానీ ఎజ్రా నేతృత్వంలో అది, వారి పితరులు ఐగుప్తు దేశంనుండి తిరిగి వచ్చినపుడు దేవుడు చూపించిన శ్రద్ధ, పోషణను జాపకం చేస్తూ, నెహెమ్యా కాలంలో బబులోను నుండి తిరిగివచ్చిన వారిపట్ల దేవుని పోషణ, శ్రద్ధను బట్టి ఆనందించడం ద్వారా దాని అసలైన వేదాంత విధానానికి తిరిగివచ్చింది. ఎజ్రా నెహెమ్యాల రచయిత, పండుగలో ప్రజల అనుభవాన్ని చక్కగా వివరించాడు. వారికి బహు సంతోషము పుట్టెను. విమర్శకులు ఎజ్రా- నెహెమ్యా గ్రంథాలకు సాధారణమైన, నిర్జీవమైన, చట్టబద్ధమైన పుస్తకాలనే కళంకాన్ని అన్యాయంగా ఆపాదించారు. కానీ ఈ పుస్తకం ఇశ్రాయేలు దేవునితో నిబంధనా సంబంధంలో ఉంటే వచ్చే సంతోషాన్ని మరలా మరలా నొక్కి చెబుతుంది.


Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |