Isaiah - యెషయా 44 | View All

1. అయినను నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము

2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

3. నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.
యోహాను 7:39

4. నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.

5. ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.

6. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.
ప్రకటన గ్రంథం 1:17, ప్రకటన గ్రంథం 2:8, ప్రకటన గ్రంథం 21:6, ప్రకటన గ్రంథం 22:13

7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

8. మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవు డున్నాడా? నేను తప్ప ఆశ్రయ దుర్గమేదియు లేదు, ఉన్నట్టు నే నెరుగను.

9. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు.

10. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?
అపో. కార్యములు 17:29

11. ఇదిగో దాని పూజించువారందరు సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాత్రులేగదా? వారందరు పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు.

12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తెతో దానిని రూపించి తన బాహుబలముచేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మసిల్లును

13. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రిక లతో దాని చక్కచేయును కర్కాటకములతో గురుతుపెట్టి దాని రూపించును మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును.

14. ఒకడు దేవదారుచెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళవృక్షమును గాని సింధూరవృక్షములనుగాని అడవి వృక్షములలో ఏదో ఒకదానిని తీసికొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును

15. ఒకడు పొయ్యికట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంతతీసికొని చలి కాచుకొనును నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసికొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహముచేసి దానికి సాగిలపడును.

16. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు

17. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును దానియెదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును.

18. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయ బడెను.

19. ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు.

20. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.

21. యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను.

22. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

23. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించునుఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
ప్రకటన గ్రంథం 12:12, ప్రకటన గ్రంథం 18:20

24. గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

25. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయు వాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.
1 కోరింథీయులకు 1:20

26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.

27. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను
ప్రకటన గ్రంథం 16:12

28. కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.
అపో. కార్యములు 13:22బైబిల్ అధ్యయనం - Study Bible
44:1 మళ్లీ ఇక్కడ యాకోబును లేదా ఇశ్రాయేలును చాలా స్పష్టంగా దేవుని సేవకుడని (నా సేవకుడవగు యాకోబూ... ఇశ్రాయేలూ) పేర్కొనడం జరిగింది. (వ.21; 41:8-10; 42:19; 43:1). దేవుడు తనకు ప్రతిష్టిత ప్రజగా ఉండడం కోసం ఇశ్రాయేలును అన్యజనులనుండి ప్రత్యేకపరచుకున్నాడు (ద్వితీ 7:7-11). దేవుడు ఈ ప్రకారంగా ఇశ్రాయేలును సృష్టించాడు. 

44:2-3 గర్భములో నిన్ను నిర్మించి అనే పదజాలం దేవుడే ఇశ్రాయేలును. కనినట్టుగా అలంకారిక వర్ణనలో తెలియజేస్తుంది. యెషూరూనూ అనే పదం ప్రేమపూర్వకంగా పిలిచే సందర్భాలలో ఇశ్రాయేలుకు ఇవ్వబడిన పేరు (ద్వితీ 32:15; 33:5,26). ఈ పదానికి అర్థం స్పష్టంగా తెలియకపోయినా, ఇది
బహుశా “గుణవంతుడు” అనే అర్థాన్నిచ్చే యాషార్ అనే హెబ్రీ పదానికి సంబంధించినదై ఉండవచ్చు. ఎండిన భూమిని సారవంతమైన నేలగా మార్చడమనే అంశం భౌతిక, ఆధ్యాత్మిక పరివర్తనకు సాదృశ్యం. దీని ఫలితం అభివృద్ధి, ఈ సందర్భంలో దేవుని ప్రజల సంతతి అభివృద్ధి చెందడం. 

44:4 దేవునికి ఆయన ప్రజలకు మధ్య సదాకాలం నిలిచి ఉండే సంబంధం ఉంటుంది. 

44:5 ఒకరి చేతితో పేరు వ్రాయబడడం అన్యోన్య సంబంధాన్ని సూచిస్తుంది. అయితే కొందరు. దీన్ని దాసుడు తనకు చెందినవాడని తెలియజేయడానికి యజమానుడు దాసుని చేతిలో తన గుర్తు వేయడమని సూచించారు (జాన్ వాల్టన్). ఏదేమైనప్పటికీ, ఆ ప్రజలు దేవునికి చెందినవారిగా, ఆయనతో సంబంధంలో ఉండగోరుతారని తెలిపే భావమిది. 

44:6 విగ్రహాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన వాదన దేవుని అసాధారణమైన విశిష్టతను దృఢంగా తెలియజేయడంతో ప్రారంభమవుతుంది. నేను మొదటివాడను కడపటివాడను అనే మాటల్ని ప్రక. 1:18; 2:8; 21:6; 22:13 వచనాల్లో క్రీస్తు కుపయోగించడం జరిగింది. 

44:7 దేవుడు మాత్రమే తన ప్రవక్తల ద్వారా భవిష్యద్విషయమును వెల్లడిజేయగలడు (41:22; 42:9 తో పోల్చండి) 

44:8 సాక్షులు గురించి ప్రస్తావన ఈ వచనాన్ని న్యాయస్థానం నేపథ్యంలో చూపిస్తుంది. ఈ సాక్షులు దేవుడు తప్ప తమకు ఆశ్రయదుర్గమేదియు లేదని సాక్ష్యమిస్తారు, "దుర్గం” సంరక్షణకు స్థిరత్వానికి ప్రతీక. ఇది అన్య జనుల కల్పితదైవాలకు భిన్నమైన భావన. 

44:9-11 సత్యం వెల్లడైనప్పుడు విగ్రహాల్ని రూపొందించేవారు సిగ్గుపాలవు తారు. వారి చేతిపని ఇక నష్ట దాయకమే. 

44:12-20 ఈ వచనాలు ప్రతిమా నిర్మాణాన్ని, దాని ఆరాధనను వర్ణిస్తు న్నాయి. విగ్రహాల తయారీ, వాటి నిర్వహణ గురించి ప్రాచీన గ్రంథాలు చెప్పే విషయాలు ఈ ప్రక్రియను ధృవపరుస్తున్నాయి. ప్రాచీన పశ్చిమాసియాకు చెందిన అన్య మత నాయకులు విగ్రహాన్ని నిజంగా దేవునిగా నమ్మి ఉండకపోవచ్చు గానీ ఆ భౌతిక వస్తువులో వారి దేవత శక్తి, ఉనికి ఉండేదని వారు నమ్మేవారు. ఆ విధంగా విగ్రహాన్ని దేవతా ప్రతినిధిగా చూసేవారు. మరొకవైపు. సామాన్య ప్రజలు విగ్రహాలకు, దేవతలకు మధ్య బలమైన సంబంధాన్ని చూస్తూ, మలచబడిన లోహాన్ని లేదా చెక్కబడిన కొయ్యను నిజమైన దైవంగా భావించేవారు. ఏదేమైనా, యెషయా వినిపించిన వాదన విగ్రహారాధనలోని అర్థరహిత మూలాన్ని ఎండగట్టింది. ఈ

44:12-13 ప్రాచీనకాలంలో విగ్రహాల్ని లోహంతోను, కలపతోను చేసేవారు. వీటి తయారీ గురించి వర్ణన ఇవి మనుషుల కల్పనలని నొక్కి చెబుతున్నది. 

44:14 యెషయా ఈ వచనంలో విగ్రహం తయారీ ప్రారంభదశ నుండి, అంటే చెట్టును నాటి పెంచడం దగ్గర నుండి చెబుతున్నాడు. 

44:15-19 ఈ వచనాలు విగ్రహారాధన పూర్తిగా అపహాస్యాస్పదమైందని వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహాన్ని చెక్కడానికి ఉపయోగించిన చెట్టు కలపనే వంటపొయ్యిలోకి, చలికాచుకోడానికి నిప్పు రగిలించడానికి ఉపయోగిస్తారు. ప్రాచీన కాలంలో ఈ విధంగా చేసిన విగ్రహాల్నే దేవతామూర్తులుగా ఆవాహన చేసేవారు. మోసపోతమియాలో వీటిని “నోటిని తెరవడం” అనే క్రతువుగా చేసేవారు. చెక్క బొమ్మ దాని నోటిని తెరచినప్పుడు దానిలోకి దైవాంశ ప్రవేశిస్తుందని వీరి నమ్మకం. యిర్మీయా 10:1-5 వచనాలు కూడా ఇటువంటి భావననే తెలియజేస్తున్నాయి.

44:20. ఒక వ్యక్తి కుడిచేతిలో అబద్ధము ఉండడం కల్పితదైవానికి ప్రతీకగా ఉన్న విగ్రహాన్ని సూచిస్తుంది, నిజంగా అది వట్టిదని తెలియజేస్తుంది.

44:21 విగ్రహారాధన ఎంత అపహాస్యాస్పదమైనదో ఇశ్రాయేలు గుర్తుచేసు కొనడం వలన మేలు పొందగలదు, ఇది దేవుని ప్రజల్ని అసత్యమైన ఆరాధనకు దూరం చేస్తుంది. విగ్రహారాధకులు తమ దైవాన్ని నిర్మించుకున్నట్టుగా ఇశ్రాయేలు తన దేవుణ్ణి నిర్మించుకొనలేదు. దేవుడు తన ప్రజల్ని నిర్మించి, వారిని నా సేవకుడవు అని పిలుస్తున్నాడు (వ.1; 41:8-9; 42:19; 43:1). 

44:22 ఇది క్షమాగుణం గల తమ దేవుణ్ణి నమ్మాలని, ఆయనలో ఆనందించాలనే హెచ్చరిక. 

44:23 విగ్రహారాధన అంటే చెక్క ముక్కను, ఒక రకంగా ప్రకృతిలోని ఒక పదార్థాన్ని ఆరాధించడమే అవుతుంది. అయితే ఇక్కడ అరణ్యమూ అందులోని ప్రతి వృక్షమూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. 

44:24-28 ఈ వచనాలు సృష్టి మీద, భవిష్యత్తు మీద దేవుని సర్వాధిపత్యాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు ప్రగల్భాలు పలికి వంచించిన అబద్ద ప్రవక్తల మీద తన నిజప్రవక్తల్ని హెచ్చిస్తున్నాడు. 

44:24 దేవుడు ఆకాశమును విశాలపర్చడం గురించి, భూమిని పరచడం గురించి 42:5 నోట్సు చూడండి. ఈ వర్ణన విశ్వం ఆయన నియంత్రణలో ఉందని తెలియజేస్తుంది. ఎడారి ప్రాంతపు సంచార జీవులు గుడారాన్ని పరచినంత సుళువుగా దేవుడు భూమ్యాకాశాల్ని పరుస్తాడు. 

44:25 భవిష్యత్తు గురించి తెలియజేయగలమని ప్రగల్భాలు పలికేవారిని దేవుడు కలవరపర్చి నాశనం చేస్తాడు. వీరు శిక్షార్హులు, నిజప్రవక్తలకు విరోధులుగా ద్వితీ 18:9-22లో చూపించబడ్డారు. ఈ వచనం వీరికి సోదెకాండ్రను అనే పదాన్నుపయోగిస్తుంది, వీరికి నిజప్రవక్తలకు ఏ సంబంధమూ లేదు. సోదెగాళ్లు జంతువుల కాలేయాల్ని, మేఘాలను, నక్షత్రాలను చూసి భవిష్యత్తును నిర్ణయించేవారు. ,

44:26 అబద్ద ప్రవక్తలకు భిన్నంగా దేవుని నిజమైన ప్రవక్తలు యెరూషలేము పునర్నిర్మాణం జరుగుతుందనీ, అది మళ్లీ నివాసస్థలంగా మారుతుందనీ ప్రకటించారు. 

44:27 దేవునికి ప్రకృతి మీద ఉన్న పూర్తి నియంత్రణ ఆయన యెరూషలేమును పునరుద్ధరించగలడని రూఢిగా తెలియజేస్తుంది. ఆయన నదుల్ని ఎండిపోజేయగలడు. జలం అల్లకల్లోలాన్ని సృష్టించే శక్తులకు సూచన కాబట్టి, బహుశా ఈ వచనానికి అర్థం యూదా ప్రజల్ని చెరలోకి తీసుకొని వెళ్లే అరాచక శక్తుల్ని దేవుడు నియంత్రించడం అయ్యుండవచ్చు. 

44:28 చెరలో ఉన్న తన ప్రజల్ని విడిపించే తన ప్రతినిధి గురించి యెహోవా ప్రకటిస్తున్నాడు - అతడే కోరెషు. ఈ ప్రకారంగా క్రీ.పూ. 742 నుండి 686 వరకు నలుగురు యూదా రాజుల కాలంలో ప్రవక్తగా ఉన్న యెషయా అప్పటికింకా జన్మించని రాజుకు పేరు పెడుతున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం క్రీ. పూ. 539లో పారసీక రాజు బబులోనును ఓడించడాన్ని సూచిస్తుంది, ఈ సంఘటన యూదులు తమ స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతి పొంది, యెరూషలేమును పునర్నిర్మించుకోడానికి దారితీసింది. కోరెషును మందకాపరీ అనడం గమనార్హం, ఈ పదం రాజును సూచించే విశేషమైన సాదృశ్యం. యెరూషలేము పునర్నిర్మాణమంటే అందులోనే దేవాలయము పునర్నిర్మాణం కూడా ఉంది. ఈ నిరీక్షణ క్రీ.పూ. 515లో వాస్తవరూపం దాల్చింది. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |