Psalms - కీర్తనల గ్రంథము 59 | View All

1. నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.

2. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.

3. నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాపమునుబట్టికాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి యున్నారు.

4. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.

5. సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)

6. సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు.

7. వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి.

8. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరిని నీవు అపహసించుదువు.

9. నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.

10. నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.

11. వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము.

12. వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.

13. కోపముచేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము.(సెలా.)

14. సాయంకాలమున వారు మరల వచ్చెదరు కుక్కవలె మొరుగుచు పట్టణముచుట్టు తిరుగుదురు

15. తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.

16. నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీకృపనుగూర్చి ఉత్సాహగానము చేసెదను

17. దేవుడు నాకు ఎత్తయిన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా, నిన్నే కీర్తించెదను.



బైబిల్ అధ్యయనం - Study Bible
కీర్తన-59. అడవి కుక్కలు తమ ఎరకోసం వెంటాడినట్టుగా సౌలు పంపిన సైనికులు తన స్వగృహంలోనే తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు తృటిలో వారినుండి తప్పించుకొని నమ్మదగిన దేవుని కాపుదలను బట్టి ఆయనను స్తుతించే కీర్తన.
శీర్షిక: అల్తప్పేతు - కీర్తన 57 శీర్షిక నోట్సు చూడండి. ఈ కీర్తన నేపథ్యాన్ని 1సమూ 19:11 లో చూడగలం. అనుపదగీతము - కీర్తన 22 శీర్షిక నోట్సు చూడండి. 

59:1-2 రక్తాపరాధులు అనే పదం ఇతరుల్ని పీడించి హింసించేవారిని సూచిస్తున్నది (5:6; 26:9; 55:23). వారు కీర్తనకారుని మరణాన్ని కోరుకుంటున్నారని ఈ వచనం సూచిస్తున్నది. 

59:3-4 కీర్తనకారుడు నాయందు ఏ అక్రమమును లేదు అని తన నిర్దోషత్వాన్ని ప్రకటిస్తున్నాడు. తన శత్రువులు తన మీద దాడిచేసేలా వారిని పురికొల్పే పనులేవీ తాను చేయలేదని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు (7:3-5 నోట్సు చూడండి). 

59:6-7 ప్రాచీన పశ్చిమాసియాలో కుక్కల్ని మచ్చిక చేసేవారు కాదు, పైగా వాటి గురించి నిషిద్ధాభిప్రాయాలుండేవి. ఇతర వన్యమృగాల్ని క్రూరజంతువుల్ని పరిగణించినట్లే కుక్కల్ని కూడా పరిగణించేవారు. తిండి వెతుక్కుంటూ మొరుగుచు అటూ ఇటూ తిరగడం కుక్కల నైజం. ఇదే వర్ణనను వ.14-15 లలో చూడండి. కుక్కల నోటినుండి కారే నురగ (దొంగ) లాగా దుష్టులు తమ నోట నుండి మాటలు వెళ్లగ్రక్కుతూ ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడతారనేది ఇక్కడి వర్ణన. 

59:9 ఇశ్రాయేలు ప్రవక్తలు కావలివారిలాగా కనిపెట్టారు. కీర్తనకారుడు కూడా కనిపెట్టుచున్నాను అని చెప్తూ తనను కావలివానిలాగా వర్ణించుకుంటున్నాడు (యెషయా 21:11-12; యెహె 3:17; 33:2-9). కావలివాడు శత్రువు రాక గురించి ఊరి ప్రజలకు హెచ్చరిక చేయడమే కాక, స్నేహితులు తమను సమీపించడాన్ని కూడా పరిశీలించేవాడు (2 సమూ 18:27; యెషయా 52:8). 

59:11 దుష్టుల్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పే ఇతర కీర్తనల్లాగా కాక, ఈ కీర్తనలో వారిని చంపవద్దనే మనవి కనబడుతుంది. ప్రజలు దుష్టుల్ని విస్మరించకుండా ఉండడం కోసం (మరచిపోదురేమో అని) దుష్టులను చంపకుండా వారిని అణగగొట్టి, వారికి పట్టిన ఆ గతిని ప్రజలకు పాఠంగా కనపరచాలనేది కీర్తనకారుని మనవి. ఇది వ.9 లోని కావలివాని దృష్టాంతాన్ని మరింతగా విశదీకరిస్తున్నది. దేవుడు వారిని శిక్షించడం కేవలం ప్రజలకు హెచ్చరికగా మాత్రమే కాక (నిర్గమ 9:16; 1సమూ 17:46), ఆయన శక్తి, ఆయన మహత్కార్యాలు లోకమంతటా వెల్లడి కావడానికి కూడా ఉద్దేశించబడ్డాయి.

59:12 దుష్టులు తమ గర్వములో చిక్కుబడుదురు గాక అనే విన్నపం శత్రువులు తాము పన్నిన ఉచ్చుల్లో వారే చిక్కుకోవాలనే కోరికను వ్యక్తపరుస్తుంది (7:14-16 నోట్సు చూడండి). గర్వం (గ్రీకు. హుబ్రిస్) పతనానికి నడిపిస్తుందనే భావన తదుపరి శతాబ్దాల్లో గ్రీక్ విషాదాంత నాటకాల్లో సర్వసాధారణమైన రచనావస్తువైంది.

59:16-17 ఉదయమున , యెహోవాను స్తుతించడం కు కీర్తనల్లో సర్వసాధారణం (5:3; 30:5) 


Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |