Isaiah - యెషయా 36 | View All

1. హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

2. అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైనహిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకి రేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా

3. హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.

4. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియ జెప్పుడిమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?

5. యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

6. నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.

7. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.

8. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండు వేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.

9. లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించు కొంటివే.

10. యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.

11. ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారుచిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాట లాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

12. రబ్షాకేఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి

13. గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెనుమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెల విచ్చునదేమనగా

14. హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

15. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించియెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

16. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు; అష్షూరురాజు సెలవిచ్చున దేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.

17. అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు.

18. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?

19. అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

20. యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.

21. అయితే అతనికి ప్రత్యుత్తర మియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.

22. గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.బైబిల్ అధ్యయనం - Study Bible
36:1 అది క్రీ.పూ.701. క్రీ.పూ. 722లో అష్బూరీయులు ఉత్తర రాజ్య మైన ఇశ్రాయేలును ఓడించారు, వారు యూదా మీదకు దాడిచేయకుండా యూదా

తమకు వార్షిక కప్పం చెల్లించే పరిస్థితి తెచ్చారు. క్రీ.పూ. 703లో సనైరీబు తన తండ్రియైన సళ్లాను. తర్వాత అష్నూరు సింహాసనాన్ని అధిష్టించాడు. యూదాతో సహా అనేక దేశాలు, అష్నూరు మీద తిరగబడడానికి దీన్నొక అవకాశంగా తీసుకున్నాయి. స్సరీబు తన సామ్రాజ్యంలో ఇతర చోట్ల తిరుగుబాట్ల నణచివేసి, క్రీ.పూ. 701లో యూదా మీద దృష్టిపెట్టాడు. అతడు యెరూషలేముకు మార్గమధ్యంలో ఉన్న ప్రాకారముగల పట్టణములన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకున్నాడు. వీటి వివరాలకు 2రాజులు 18-19 అధ్యాయాలు, 2దిన 32 అధ్యాయం చూడండి.. 

36:2 లాకీషు యెరూషలేముకు పడమరలో సుమారు ముప్పయి మైళ్ల దూరంలో సైనిక దళాలున్న ముఖ్యమైన స్థావరం. ఇది ఇతర పట్టణాలతో బాటు యెరూషలేముకు వెళ్లే మార్గానికి కావలిగా ఉంటుంది. అషూరు రాజు తన సైన్యాలతోబాటు లాకీషులోనే ఉండి, తుది హెచ్చరికగా యెరూషలేముకు రబాకే (రాజ ప్రతినిధి)ను బహు గొప్ప సేనతో పంపించాడు. గతంలో యెషయా ఆహాజును ఏ స్థలంలో ఎదుర్కొన్నాడో (7:3), అదే చోట ఆరబాకే ఇప్పుడు నిలబడ్డాడు. యూదానేలిన ఆ రాజు (ఆహాజు)కు అష్నూరు నాశ్రయించ కూడదని చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది, అయితే ఆహాజు ఈ యోచనను స్వీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది.

36:3 ఎల్యాకీము... షెబ్నా... యోవాహు మొదలైనవారు. - యూదాలో ప్రముఖులైన అధిపతులు, వీరు హిజ్కియా పక్షాన సంప్రదింపులు నడిపారు. షెబ్నా గురించి, ఎల్యాకీము గురించి 22:15-25 నోట్సు చూడండి. అయన 

36:4-5 అష్వూరు రాజప్రతినిధి (రబాకే) సంప్రదింపుల ఉద్దేశం హిజ్కియా లోబడేలా చేయడం. అతడు హిజ్కియా అష్నూరుకు లోబడడానికెందుకు తిరస్కరిస్తున్నాడో అడుగుతూ, హిజ్కియా ఎవరిని నమ్ముతున్నాడో, వారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. అష్నూరు - నెదిరించడానికి అసలు
యూదా సైన్యం సంసిద్ధంగా ఉన్నదా అని అతడు ముందుగా అడుగుతున్నాడు. 

36:6 యూదా తన మిత్రదేశంగా ఐగుప్తును నమ్ముకొనడం శ్రేయస్కరం కాదని రబాకే... చెబుతున్నాడు. అతడు ఐగుప్తును వర్ణించడానికి నలిగిన రెల్లు అనే సాదృశ్యాన్నుపయోగించాడు. ఎవరైనా ఆసరా కోసం కర్రమీద, దండం మీద ఆనుకుంటారు. అయితే, రెల్లు పుల్ల మనిషి బరువును ఆపలేదు. వాస్తవానికి, దేవుడు కూడా యెషయా ద్వారా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఐగుప్తు నమ్ముకొనదగిన నేస్తం కాదు. 

36:7 చివరకు, దేవుడు హిజ్కియాకు సహాయం చేయగలడా అని రబాకే అడుగుతున్నాడు. అతనికి యూదు మతం గురించి ఏమీ తెలియదని అతని మాటలే తెలియజేస్తున్నాయి. హిజ్కియా (సీయోను పర్వతం మీద ఉన్న బలిపీఠం మినహా, ఇతర స్థలాల్లో ఉన్న బలిపీఠాల్ని పడగొట్టించాడు. వాస్తవానికి ఇది ద్వితీయోపదేశకాండము అధ్యా. 12 ప్రకారమే ఉంది. అయితే, రబాకే అన్యమత దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, బలిపీఠాలెన్ని ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుడు సంతోషిస్తాడనీ, బలిపీఠాల సంఖ్య తక్కువగా ఉండడం దేవునికి అసంతృప్తినిస్తుందనీ అతని భావన. 

36:8-9 ఆ తర్వాత రబ్బాకే యూదాకు రెండువేల గుఱ్ఱముల నిస్తానని వ్యంగ్యంగా మాట్లాడాడు, వాటిని నడపడానికి అంతమంది రౌతులు యూదాలో లేరని ఈ మాటల్లోని అంతరార్థం. 

36:10 రబాకే ప్రకటన ప్రాచీన పశ్చిమాసియాలో ఓ అన్యమతాలకు సంబంధించిన నమ్మకాల్ని ప్రతిబింబిస్తుంది. ...ఇశ్రాయేలీయుల , దేవుడు నిజమైన దేవుడేనని అష్బూరీయుల నమ్మకం, అయితే ఆయన బలవంతుడైన దేవుడు కాడని వారనుకుంటున్నారు. యూదావారి దేవుడు యూదా నాశనాన్నే ఆజ్ఞాపించాడని రబాకే చెబుతున్నాడు. దేవుడు తన ప్రజల్ని శిక్షించడానికి అన్యజనులను ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి. అయితే ఈ సందర్భంలో బాకే తప్పుగా మాట్లాడుతున్నాడు. తరువాతి కాలంలో అష్నూరుకు ఇశ్రాయేలుకు మధ్య జరిగిన సంఘటనలు అతని మాటలు తప్పని తెలియ జేస్తున్నాయి. 

36:11 అష్వూరీయులు అక్కాడియన్ భాషలో మాట్లాడేవారు. అప్పటి కాలంలో యూదా ప్రజలు హెబ్రీలో (యూదుల భాష) మాట్లాడేవారు. రబ్పాకే యూదా తరపున వచ్చిన ప్రతినిధులతో బహుశా ప్రజల వినికిడిలో ఉన్న భాషలో మాట్లాడుతుండవచ్చు. యూదా ప్రజలు అషూరు రాజప్రతినిధి మాటలు విని భయపడతారేమోనని యూదా అధిపతుల ఆలోచన. యూదా ప్రజలకు సిరియా భాష (అరామిక్) తెలియదు కాబట్టి, యూదా ప్రతినిధులకు సిరియా భాష తెలుసు కాబట్టి, రబాకే సిరియా భాషలోనే మాట్లాడాలని యూదా అధిపతుల కోరిక. హెబ్రీ భాషను పోలిన సిరియా భాష ఇక్కడ ఈ సంభాషణ వింటున్న ప్రజల మధ్య తప్ప ప్రాచీన పశ్చిమాసియా అంతటా వాడుకలో ఉండేది.

36:12 అయితే, ప్రజలు ఏం - వినాలని అప్పూరు రాజప్రతినిధి కోరుకుంటున్నాడో దాన్నే ప్రచారం చేయాలనుకుంటున్నాడు, అష్నూరు సైన్యం దాడిచేయబోతోందనే సమాచారాన్ని యూదా ప్రజలు విని భయపడాలని రబాకే ఉద్దేశం. సుదీర్ఘ ముట్టడి ఫలితంగా పట్టణంలో ఆహారపదార్థాలు అడుగంటి యూదా ప్రజలు తమ మలము తినునట్లును, నీటి వసతి లోపించి తమ మూత్రమును త్రాగునట్లును జరగబోతోందని అష్నూరు రాజప్రతినిధి చెబుతున్నాడు.. 

36:13-14 సర్దారీబు “మహారాజైన అష్నూరు రాజు" అనే విషయం సరే, అయితే యెహోవా రాజులకు రాజు (దాని 2:37). 

36:15 యూదా అషూరు నుండి తప్పించుకోడానికి దేవుణ్ణి ఆశ్రయించడం గురించి రబాకే అపహాస్యం చేస్తున్నాడు. క్రిందటి అధ్యాయాలు పలుసార్లు ఖండితంగా చెప్పినట్టుగా, యూదా ప్రజలు ఈ సమయంలో చేయవలసినది కచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించడమే. 

36:16-17 అషూరుకు లోబడిన ప్రజల్ని తమ ప్రాంతానికి తీసుకొనిపోవడం అష్వూరు సామ్రాజ్యవాద విధానం. రబాకే యూదా ప్రజల్ని తమకు లోబడమని ప్రకటిస్తున్నాడు. కొంతకాలం వరకు, యూదా ప్రజలు వారి స్వంత దేశములోనే ఉంటారని, కొంత కాలం తర్వాత వేరొక దేశానికి తీసుకొనిపోబడడం జరుగుతుందని రబాకే చెబుతున్నాడు. క్రీ.పూ. 722లో అపూరీయులు. ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలును జయించినప్పుడు ఇదే జరిగింది, అష్బూరీయులు ఇశ్రాయేలులోని అనేకమందిని తమ దేశానికి తీసుకొని పోయి, ఇతర ప్రాంతాల్లోని అన్యజనుల్ని ఇశ్రాయేలులోకి తీసుకొని వచ్చి అక్కడ వారు స్థిరపడేలా చేశారు. దీని ఉద్దేశం దేశంలోని ప్రజలకు వారి జాతి దైవంతో సంబంధం లేకుండా చేయడం.

36:18-20 అష్వూరు ఓడించిన అన్యజనులను వారి పట్టణాల్ని ఆ యా జనముల దేవతలు అషూరు నుండి కాపాడలేకపోయాయి కాబట్టి, యూదా దేవుడైన యెహోవా యూదా ప్రజల్ని అషూరు నుండి కాపాడలేడని రబాకే వాదన. అష్యూరీయులు ఓడించిన మూడు ముఖ్యమైన పట్టణాల దేవతలు ఆ పట్టణాల్లోని ప్రజల్ని కాపాడలేకపోయారని రబ్దాకే మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది. హమాతు... అర్పాదు ఉత్తర సిరియాలోని పట్టణాలు, అష్యూరు ఇదివరకే వాటిని ఓడించింది. సెపర్వయీము నిర్దిష్ట ప్రదేశమేదో తెలియడం లేదు.

36:21-22 హిజ్కియా తన అధిపతులు అష్నూరుకు ప్రత్యుత్తరమివ్వడానికి వారికి అధికారాన్నివ్వలేదు. వారు కేవలం రబాకే ఏం ప్రకటించాడో దాన్నే రాజుకు తెలియజెప్పిరి. వారు బట్టలు చింపుకొని ఉండడం దుఃఖసూచన, ఇది వారిలోని తీవ్రమైన ఆవేదనను తెలియజేస్తుంది. 


Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |