Jeremiah - యిర్మియా 29 | View All

1. రాజైన యెకోన్యా తల్లియగు రాణియు, రాజ పరివారమును,

1. బబులోనులో బందీలుగా వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే.

2. యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులును, శిల్పకారులును, కంసాలులును యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్తయైన యిర్మీయా పత్రికలో లిఖించి, యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశాచేతను,

2. (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది)

3. హిల్కీయా కుమారుడైన గెమర్యాచేతను, యెరూషలేములోనుండి చెర పట్టబడిపోయినవారి పెద్దలలో శేషించినవారికిని యాజకులకును ప్రవక్తలకును యెరూషలేమునుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికిని పంపించిన మాటలు ఇవె

3. బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.

4. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు

4. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు.

5. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి,

5. “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.

6. పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.

6. వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు.

7. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును.

7. నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.”

8. ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తలచేతనై నను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి.

8. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు.

9. వారు నా నామ మునుబట్టి అబద్ధ ప్రవచనము లను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు.

9. వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.

10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.

10. యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెర వేర్చుతాను.

11. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.

11. ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహరచన చేస్తాను.

12. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

12. అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను.

13. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,

13. మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు.

14. నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.

14. మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”

15. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించియున్నాడని మీరు చెప్పుకొంటిరే,

15. “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు.

16. సరే, దావీదు సింహాసనమందు కూర్చునియున్న రాజును గూర్చియు, మీతోకూడ చెరలోనికిపోక యీ పట్టణములో నివసించు ప్రజలనుగూర్చియు, మీ సహోదరులనుగూర్చియు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు

16. కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను.

17. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిమీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను; కుళ్లి కేవలము చెడిపోయి తినశక్యముకాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేనువారిని అప్పగించుచున్నాను;

17. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను.

18. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేతవారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.

18. యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభ వించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికీ జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు.

19. గనుక నేను ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును; నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయకారణముగాను అపహాస్యా స్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

19. యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు.

20. నేను యెరూషలేములోనుండి బబులోనునకు చెరగొని పోయిన వారలారా, మీరందరు యెహోవా ఆజ్ఞను ఆలకించుడి.

20. “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవల సిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”

21. నా నామమునుబట్టి మీకు అబద్ధప్రవచనములు ప్రక టించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు, మయశేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

21. సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజలుకు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు.

22. ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలో దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు, నేను వారి కాజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమునుబట్టి ప్రకటించుచువచ్చిరి, నేనే యీ సంగతిని తెలిసికొనిన వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోనురాజైన నెబుకద్రెజరుచేతికి వారిని అప్పగించుచున్నాను, మీరు చూచుచుండగా అతడు వారిని హతముచేయును;

22. యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’

23. చెర పట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.

23. ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

24. నెహెలామీయుడైన షెమయాకు నీవీమాట తెలియ జేయుము

24. షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు.

25. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

25. ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు.

26. వెఱ్ఱి వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారిని నీవు సంకెళ్లచేత బంధించి బొండలో వేయించినట్లుగా, యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించెనని యెరూషలేములో నున్న ప్రజలకందరికిని యాజకుడగు మయశేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికిని నీవు నీ పేరటనే పత్రిక లను పంపితివే.

26. షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు.

27. అనాతోతీయుడైన యిర్మీయాను నీవేల గద్దింపకపోతివి?

27. ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు?

28. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదా అదియుగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు, నివసించుటకై యిండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి, అని బబులోనులో నున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు,

28. బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి “బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.”‘

29. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త యైన యిర్మీయా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను

29. ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు.

30. అంతట యెహోవావాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

30. పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది.

31. చెరలోనున్న వారికందరికి నీవు పంపవలసిన వర్తమానమేమనగా యెహోవా నెహెలామీయుడైన షెమయానుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు నేను అతని పంపకపోయినను షెమయా మీకు ప్రవచింపుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేసెను గనుక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

31. “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు.

32. నెహెలా మీయుడైన షెమయా యెహోవామీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను; ఈ జనులలో కాపురముండు వాడొకడును అతనికి మిగిలియుండడు, నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు; ఇదే యెహోవా వాక్కు.

32. షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.” ఇదే యెహోవా వాక్కు “ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 29 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బాబిలోన్‌లోని బందీలకు రెండు లేఖలు; మొదటిది, వారు ఓపికగా మరియు కంపోజ్ చేయాలని సిఫార్సు చేస్తారు. (1-19) 
దేవుని వ్రాతపూర్వక వాక్యం, ఆయన మాట్లాడిన మాటలాగే, నిస్సందేహంగా దైవిక ప్రేరణ ద్వారా అందించబడుతుంది. ప్రభువును ఉత్సాహంగా సేవించే వారు, సమీపంలో ఉన్న వారికే కాకుండా దూరంగా ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూర్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తారు. వ్రాత నైపుణ్యం ఈ ప్రయోజనం కోసం చాలా ప్రయోజనకరంగా ఉందని రుజువు చేస్తుంది మరియు ప్రింటింగ్ కళ సహాయంతో, ఇది దేవుని బోధనలను సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి శక్తివంతమైన సాధనంగా మారుతుంది.
ఈ లేఖను బందీలకు పంపడం దేవుడు వారిని విడిచిపెట్టలేదని చూపిస్తుంది, అయినప్పటికీ అతని అసంతృప్తి వారి దిద్దుబాటుకు దారితీసింది. దేవుని పట్ల తమ భక్తిని కొనసాగించేవారికి, బాబిలోన్‌లో సంతృప్తికరమైన ఉనికికి అవకాశం ఉంది. మన జీవిత పరిస్థితులతో సంబంధం లేకుండా, మనం కోరుకునేది లోపించినందున, మనకు ఉన్న సౌకర్యాన్ని వదులుకోకుండా ఉండటం మన జ్ఞానం మరియు కర్తవ్యం.
తమను తాము బందీలుగా గుర్తించిన భూమి క్షేమం కోరాలని వారికి సూచించారు. బాబిలోనియన్ రాజు రక్షణలో ఉన్నప్పుడు, వారు నిజాయితీతో కూడిన సూత్రాలకు కట్టుబడి శాంతియుతమైన మరియు దైవిక జీవితాలను గడపాలి. వారి విమోచన కొరకు దేవుని సమయములో ఓపికగా విశ్వసించాలని వారు పిలుపునిచ్చారు.
మీ వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా వ్యక్తులను ప్రవక్తలుగా నియమించకుండా జాగ్రత్త వహించండి మరియు మీ స్వంత కల్పనలు మరియు కలలను దేవుని నుండి దైవిక ద్యోతకాలుగా పరిగణించేటప్పుడు జాగ్రత్త వహించండి. తప్పుడు ప్రవక్తలు తరచుగా ప్రజలను వారి పాపపు మార్గాల్లో మునిగిపోతారు ఎందుకంటే ప్రజలు ముఖస్తుతిలో ఆనందించడానికి మొగ్గు చూపుతారు. వారు తమతో ఓదార్పుగా మాట్లాడే ప్రవక్తలను వెతుకుతారు.
డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారు తిరిగి వస్తారని దేవుడు చేసిన వాగ్దానం ముఖ్యమైనది. డెబ్బై-సంవత్సరాల నిర్బంధ కాలాన్ని ఇటీవలి నిర్బంధం నుండి లెక్కించకూడదని ఇది సూచిస్తుంది, కానీ ప్రారంభ కాలం నుండి. ఇది వారికి దేవుని దయతో చేసిన ప్రతిజ్ఞ యొక్క నెరవేర్పును సూచిస్తుంది. ఇది దేవుని మార్పులేని ఉద్దేశాలకు అనుగుణంగా ఉంటుంది. మనం కొన్నిసార్లు మన స్వంత ఆలోచనలు మరియు ప్రణాళికల గురించి అనిశ్చితంగా ఉండవచ్చు, ప్రభువు ఎల్లప్పుడూ తన స్వంత ఉద్దేశాలను తెలుసుకుంటాడు. దేవుని ఉద్దేశాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయని మనం భయపడినప్పటికీ, ఆయన ఎంపిక చేసుకున్న ప్రజలకు, ప్రతికూలంగా కనిపించినది కూడా చివరికి వారి మేలుకే. అతను వారికి భయపడేవాటిని లేదా వారి ఇష్టానుసారంగా కోరుకునేదాన్ని కాదు, కానీ తన వాగ్దానాల ఆధారంగా వారు నమ్మకంగా ఆశించేవాటిని ఇస్తాడు-వారికి ఉత్తమ ఫలితం.
ప్రభువు ప్రార్థన యొక్క ప్రత్యేక స్ఫూర్తిని కురిపించినప్పుడు, అతని దయ మనకు దగ్గరవుతుందనడానికి ఇది సానుకూల సంకేతం. ప్రార్థనను ఉత్తేజపరిచేందుకు మరియు ప్రేరేపించడానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి మరియు "నన్ను వృధాగా వెతకండి" అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. యెరూషలేములో ఉండిపోయిన వారు పూర్తిగా నాశనాన్ని ఎదుర్కొంటారు, అబద్ధ ప్రవక్తలు దీనికి విరుద్ధంగా ఏమి చెప్పవచ్చు. ఈ ఫలితం పదేపదే వివరించబడింది మరియు పశ్చాత్తాపం చెందని పాపుల శాశ్వతమైన నాశనాన్ని సమర్థిస్తుంది ఎందుకంటే "వారు నా మాటలను వినలేదు; నేను పిలిచాను, కానీ వారు నిరాకరించారు."

రెండవదానిలో, వారిని మోసగించిన తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పులు ఖండించబడ్డాయి. (20-32)
బబులోనులోని యూదులను తప్పుదారి పట్టించిన తప్పుడు ప్రవక్తలకు రాబోయే తీర్పు గురించి యిర్మీయా ప్రవచించాడు. అబద్ధం చెప్పడం ఖండించదగినది అయితే, ప్రభువు ప్రజలకు అబద్ధం చెప్పడం, తప్పుడు ఆశతో వారిని తప్పుదారి పట్టించడం మరింత ఘోరమైనది. అయినప్పటికీ, వారి అబద్ధాలను సత్యదేవునికి ఆపాదించడానికి వారి సాహసోపేతమైన ప్రయత్నమే ఘోరమైన నేరం. వారు తమ పాపాలలో ఇతరులను మునిగిపోవడానికి ముఖస్తుతిలో పాల్గొంటారు ఎందుకంటే వారు తమను తాము చిక్కుకోకుండా వారిని సరిదిద్దలేరు. చాలా దాచిన పాపాలు కూడా దేవునికి తెలుసునని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం, మరియు అతను దాచిన తప్పులన్నింటినీ బహిర్గతం చేసే రోజు వస్తుంది.
షెమయా యిర్మీయాను హింసించమని యాజకులను ప్రోత్సహిస్తాడు, వారి హృదయాల యొక్క తీవ్ర కాఠిన్యాన్ని బహిర్గతం చేస్తాడు. తప్పు చేసే శక్తి తమకు ఉన్నందున తప్పును హేతుబద్ధం చేసే వారు తమను తాము దౌర్భాగ్య స్థితిలో చూస్తారు. వారి దుర్భరమైన బందిఖానాలో ఉన్నప్పటికీ, వారు ప్రభువు దూతలను ఎగతాళి చేయడం మరియు ఆయన ప్రవక్తలను అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా తీసుకురాబడినప్పటికీ, వారు తమ కష్టాలలో కూడా ప్రభువుకు వ్యతిరేకంగా అతిక్రమించడంలో పట్టుదలతో ఉన్నారు. బాధలు మాత్రమే వ్యక్తులను సంస్కరించలేవని గమనించడం ముఖ్యం; దానికి వారిలో పని చేసే దేవుని దయ అవసరం.
దేవుని ఆశీర్వాదాలను విస్మరించే వారు షెమయాకు జరిగినట్లే, ఆయన మాట యొక్క ప్రయోజనాలను కోల్పోవడానికి అర్హులు. చరిత్ర అంతటా చాలా మంది అంకితభావంతో ఉన్న క్రైస్తవులపై వచ్చిన ఆరోపణలు తరచుగా దీనికి తగ్గుముఖం పడతాయి: వారు దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఓపికగా ఎదురుచూస్తూ, వారి నిజమైన ఆసక్తులు మరియు విధులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు హృదయపూర్వకంగా ప్రజలకు సలహా ఇస్తారు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |