Genesis - ఆదికాండము 40 | View All

1. అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి

1. And it chaunced after this that the chefe butlar of the kynge of Egipte and his chefe baker had offended there lorde the kynge of Egypte.

2. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి

2. And Pharao was angrie with them and put the in warde in his chefe marshals house:

3. వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము.

3. euen in ye preson where Ioseph was bownd.

4. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలో నుండిన తరువాత

4. And the chefe marshall gaue Ioseph a charge with them and he serued them. And they contynued a season in warde.

5. వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలకనెను.

5. And they dreamed ether of them in one nyghte: both the butlar and the baker of the kynge of Egipte which were bownde in the preson house ether of them his dreame and eche manes dreame of a sondrie interpretation

6. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి.

6. When Ioseph came in vnto them in the mornynge and loked apon them: beholde they were sadd.

7. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను.

7. And he asked them saynge wherfore loke ye so sadly to daye?

8. అందుకు వారుమేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.

8. They answered him we haue dreamed a dreame and haue no man to declare it. And Ioseph sayde vnto the. Interpretynge belongeth to God but tel me yet.

9. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను;

9. And the chefe butlar tolde his dreame to Ioseph and sayde vnto him. In my dreame me thought there stode a vyne before me

10. ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను.

10. and in the vyne were .iij. braunches and it was as though it budded and her blossos shottforth: and ye grapes there of waxed rype.

11. మరియఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను.

11. And I had Pharaos cuppe in my hande and toke of the grapes and wronge them in to Pharaos cuppe and delyvered Pharaos cuppe into his hande.

12. అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;

12. And Ioseph sayde vnto him this is the interpretation of it.

13. ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు

13. The .iij. braunches ar thre dayes: for within thre dayes shall Pharao lyft vp thine heade and restore the vnto thyne office agayne and thou shalt delyuer Pharaos cuppe in to his hade after the old maner even as thou dydest when thou wast his butlar.

14. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.

14. But thinke on me with the when thou art in good case and shewe mercie vnto me. And make mencion of me to Pharao and helpe to brynge me out of this house:

15. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

15. for I was stollen out of the lande of the Hebrues and here also haue I done nothige at all wherfore they shulde haue put me in to this dongeon.

16. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను - నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తలమీద ఉండెను.

16. When the chefe baker sawe that he had well interpretate it he sayde vnto Ioseph me thought also in my dreame yt I had. iij. wyker baskettes on my heade?

17. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.

17. And in ye vppermost basket of all maner bakemeates for Pharao. And the byrdes ate them out of the basket apon my heade

18. అందుకు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు

18. Ioseph answered and sayde: this is the interpretation therof. The .iij. baskettes are .iij. dayes

19. ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.

19. for this daye .iij. dayes shall Pharao take thy heade from the and shall hange the on a tree and the byrdes shall eate thy flesh from of the.

20. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి

20. And it came to passe the thyrde daye which was Pharaos byrth daye that he made a feast vnto all his servauntes. And he lyfted vpp the head of the chefe buttelar and of the chefe baker amonge his servauntes.

21. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.

21. And restored the chefe buttelar vnto his buttelarshipe agayne and he reched the cuppe in to Pharaos hande

22. మరియయోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.

22. ad hanged the chefe baker: eue as Ioseph had interpretated vnto the.

23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

23. Notwithstonding the chefe buttelar remembred not Ioseph but forgat hym.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 40 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జైలులో ఉన్న ఫారో యొక్క ప్రధాన బట్లర్ మరియు బేకర్, వారి కలలను జోసెఫ్ వివరించాడు. (1-19) 
బట్లర్ మరియు బేకర్ విచారంగా ఉన్నారు, వారు జైలులో ఉన్నందున మాత్రమే కాదు, వారి కలల వల్ల కూడా. జోసెఫ్ వారి పట్ల జాలిపడి సహాయం చేయాలనుకున్నాడు. మన స్నేహితులు విచారంగా ఉన్నప్పుడు వారి గురించి కూడా శ్రద్ధ వహించాలి మరియు మన స్వంత విచారానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జోసెఫ్ బట్లర్‌కు సహాయం చేసినందుకు దేవునికి క్రెడిట్ ఇచ్చాడు మరియు అతని కోసం మంచి విషయాలను ఊహించాడు, కానీ దురదృష్టవశాత్తు, బేకర్ కల అతను చనిపోతాడని అర్థం. బేకర్ కోసం జోసెఫ్‌కు శుభవార్త లేదు, కానీ అది అతని తప్పు కాదు. సందేశాన్ని అర్థం చేసుకున్న మంత్రులు దానిని మరింత మెరుగ్గా మార్చలేకపోయారు. జోసెఫ్ తనను అమ్మినందుకు తన సోదరులను నిందించలేదు, లేదా అతని యజమానురాలు మరియు యజమాని అతనితో చెడుగా ప్రవర్తించినందుకు నిందించలేదు. తానేమీ తప్పు చేయలేదని మాత్రమే చెప్పాడు. మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలి. ఇతరుల తప్పులకు వారిని నిందించే బదులు మనం అమాయకులమని చూపించడంపై దృష్టి పెట్టాలి. 

ప్రధాన బట్లర్ యొక్క కృతఘ్నత. (20-23)
కలల గురించి జోసెఫ్ అంచనాలు అతను చెప్పిన ఖచ్చితమైన రోజున నిజమయ్యాయి. రాజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోజున, అతని సహాయకులందరూ అతనిని చూడటానికి వచ్చారు మరియు వారు ఈ రెండు కేసుల గురించి మాట్లాడుకున్నారు. మనం పుట్టిన రోజును గుర్తుపెట్టుకోవడం, పుట్టినందుకు కృతజ్ఞతలు చెప్పడం, మనం చేసిన తప్పులకు క్షమించడం మరియు మనం చనిపోయిన రోజు కంటే మనం చనిపోయే రోజు కోసం సిద్ధంగా ఉండటం మంచిది. జీవితాన్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులు తమ చిన్న జీవితానికి ఒక సంవత్సరం ముగియగానే సంతోషంగా ఉండటమే విచిత్రం. క్రైస్తవులు సంతోషంగా ఉండటానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే వారు జన్మించారు, వారు తమ బాధలు మరియు పాపాల ముగింపుకు దగ్గరగా ఉన్నారు మరియు వారి శాశ్వతమైన ఆనందానికి దగ్గరగా ఉన్నారు. జోసెఫ్ చీఫ్ బట్లర్‌కి సహాయం చేసాడు కానీ అతను అతని గురించి మరచిపోయాడు మరియు అతనికి కృతజ్ఞతలు చెప్పలేదు. కొంతమంది ప్రేమకు బదులుగా ద్వేషాన్ని చూపించే ప్రపంచంలో ఇది జరగవచ్చు. మనం నిరాశకు గురైనప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. మనం మనుషుల నుండి ఎక్కువగా ఆశించలేము కానీ దేవుని నుండి చాలా ఆశించవచ్చు. యేసు యొక్క బాధలను, వాగ్దానాలను మరియు ప్రేమను మనం గుర్తుంచుకోవాలి. ప్రధాన బట్లర్ యోసేపును ఎలా మరచిపోయాడో, అతను మనకు సహాయం చేసినప్పటికీ మనం కూడా యేసు గురించి మరచిపోతాము. ఇది మంచిది కాదు మరియు మనం మరింత కృతజ్ఞతతో ఉండాలి. 




Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |