తనకు ఎంత కష్టం, బాధ, హింస వచ్చినా ప్రతి వ్యక్తీ క్రీస్తు శుభవార్త వినే అవకాశం కలగాలని అతడు నిశ్చయించుకొన్నాడు. వారు బహిరంగ సభలకు రాకపోతే అతడు వారిదగ్గరికి వెళ్ళాడు. పాపవిముక్తి, రక్షణ పొందగోరేవారికి తప్పక ఉండవలసినవి రెండు – పశ్చాత్తాపం, విశ్వాసం (అసలు, ఈ రెండు ఒకటే. నిజ విశ్వాసం, పశ్చాత్తాపం వేరుచేయ సాధ్యంకాని విధంగా కలిసి ఉన్నాయన్నమాట). ఈ రెంటిని పౌలు ఎప్పుడూ ప్రకటించేవాడు. పశ్చాత్తాపం గురించి అపో. కార్యములు 2:38; అపో. కార్యములు 17:30; మత్తయి 3:2; మత్తయి 4:17; లూకా 13:1-5; లూకా 24:47 చూడండి.