Numbers - సంఖ్యాకాండము 23 | View All

1. అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.

1. appudu bilaamu'ikkada nenu bali arpinchu taku edu balipeethamulanu kattinchi, ikkada edu kodelanu edu pottellanu siddhaparachumani baalaakuthoo cheppenu.

2. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.

2. bilaamu cheppinatlu baalaaku cheyagaa, baalaakunu bilaa munu prathi balipeethamumeeda oka kodenu oka pottelunu dahanabaligaa arpinchiri.

3. మరియబిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.

3. mariyu bilaamu baalaakuthoobalipeethamu meedi nee dahanabaliyoddha nilichiyundumu, nenu velledanu; okavela yehovaa nannu edurkonunemo; aayana naaku kanuparachunadhi neeku teliyachesedhanani cheppi mettayekkenu.

4. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడునేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,

4. dhevudu bilaamuku pratyakshamu kaagaa athadunenu edu balipeethamulanu siddhaparachi prathi daanimeedanu oka kodenu oka pottelunu arpinchithinani aayanathoo cheppagaa,

5. యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.

5. yehovaa okamaata bilaamu nota unchineevu baalaakunoddhaku thirigi velli yitlu cheppumanenu.

6. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.

6. athadu baalaakunoddhaku thirigi vellinappudu athadu moyaabu adhikaarulandarithoo thana dahanabali yoddha nilichiyundenu.

7. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకుతూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించిరమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

7. appudu bilaamu upamaana reethigaa itlanenu araamunundi baalaakuthoorpu parvathamulanundi moyaaburaaju nannurappinchirammu; naa nimitthamu yaakobunu shapimpumu rammu; ishraayelunu bhayapettavalenu anenu.

8. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

8. emani shapimpagalanu? dhevudu shapimpaledhe emani bhayapettagalanu? dhevudu bhayapettaledhe.

9. మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.

9. mettala shikharamunundi athani choochuchunnaanu kondalanundi athani kanugonuchunnaanu idigo aa janamu ontigaa nivasinchunu janamulalo lekkimpabadaru.

10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.

10. yaakobu renuvulanu evaru lekkinchedaru?Ishraayelu naalgavapaalunu evaru lekkapettagalaru? neethimanthula maranamuvanti maranamu naaku labhinchunu gaaka.Naa antyadasha vaari anthamuvanti dagunu gaaka anenu.

11. అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.

11. anthata baalaaku bilaamuthoo neevu naakemi chesithivi? Naa shatruvulanu shapinchutaku ninnu rappinchithini; ayithe neevu vaarini poorthigaa deevinchithivanenu.

12. అందు కతడుయెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రధ్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.

12. andu kathaduyehovaa naa nota unchinadaani nenu shradhdhagaa paluka vaddaa? Ani uttharamicchenu.

13. అప్పుడు బాలాకుదయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడును గాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి

13. appudu baalaakudayachesi naathookooda mariyoka chootiki rammu. Akkadanundi vaarini choodavachunu; vaari chivaramaatrame kanabadunu gaani vaarandaru neeku kanabadaru; akkadanundi naa nimitthamu vaarini shapimpavalenani athanithoo cheppi

14. పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.

14. pisgaa kona nunna kaavalivaari polamunaku athani thoodukonipoyi, yedu balipeethamulanu kattinchi, prathi balipeethamu meeda oka kodenu oka pottelunu arpinchenu.

15. అతడునీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,

15. athaduneevu ikkada nee dahanabaliyoddha nilichiyundumu; nenu akkada yehovaanu edurkondunani baalaakuthoo cheppagaa,

16. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచినీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.

16. yehovaa bilaamunu edurkoni oka maatanu athani nota unchineevu baalaakunoddhaku thirigi velli yitlu cheppumanenu.

17. అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు యెహోవా యేమి చెప్పెనని అడుగగా

17. athadu baalaaku noddhaku vellinappudu athadu thana dahanabaliyoddha nilichiyundenu. Moyaabu adhikaarulunu athaniyoddha nundiri. Baalaaku yehovaa yemi cheppenani adugagaa

18. బిలాము ఉపమానరీతిగా నిట్లనెను బాలాకూ, లేచి వినుము సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.

18. bilaamu upamaanareethigaa nitlanenu baalaakoo, lechi vinumu sipporu kumaarudaa, chevinoggi naa maata aalakinchumu.

19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
రోమీయులకు 9:6, 2 తిమోతికి 2:13, హెబ్రీయులకు 6:18

19. dhevudu abaddhamaadutaku aayana maanavudu kaadu pashchaatthaapapadutaku aayana naraputrudu kaadu aayana cheppi cheyakundunaa? aayana maata yichi sthaapimpakundunaa?

20. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.

20. idigo deevinchumani naaku selavaayenu aayana deevinchenu; nenu daani maarchalenu.

21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.

21. aayana yaakobulo e doshamunu kanugonaledu ishraayelulo e vankarathanamunu choodaledu athani dhevudaina yehovaa athaniki thoodaiyunnaadu.

22. రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.

22. raajuyokka jayadhvani vaarilo nunnadhi dhevudu aigupthulonundi vaarini rappinchenu gurupothu vegamuvanti vegamu vaariki kaladu.

23. నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును.

23. nijamugaa yaakobulo mantramu ledu ishraayelulo shakunamu ledu aayaakaalamulandu dhevuni kaaryamulu yaakobu vanshasthulagu ishraayeleeyulaku teliyacheppabadunu.

24. ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.

24. idigo aa janamu aadusimhamuvale lechunu adhi simhamuvale nikki niluchunu adhi vetanu thini champabadina vaati rakthamu traagu varaku pandukonadu.

25. అంతట బాలాకు నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా

25. anthata baalaakuneevu e maatramunu vaarini shapimpanu vaddu, deevimpanu vaddu ani bilaamuthoo cheppagaa

26. బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా

26. bilaamu yehovaa cheppinadanthayu nenu cheyavalenani nenu neethoo cheppaledaa? Ani baalaakuku uttharamiyyagaa

27. బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను.

27. baalaaku neevu dayachesi rammu; nenu verokachootiki ninnu thoodukoni poyedanu; akkada nundi naa nimitthamu neevu vaarini shapinchuta dhevuni drushtiki anukoolamagunemo ani bilaamuthoo cheppenu.

28. బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత

28. baalaaku edaariki edurugaa nunna peyoru shikharamunaku bilaamunu thoodukoni poyina tharuvaatha

29. బిలాము ఇక్కడ నాకు ఏడు బలి పీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.

29. bilaamu'ikkada naaku edu bali peethamulanu kattinchi, yikkada edu kodelanu edu pottellanu siddhaparachumani baalaakuthoo cheppenu.

30. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.

30. bilaamu cheppinatlu baalaaku chesi prathi balipeethamu meeda oka kodenu oka pottelunu arpinchenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
బాలాక్ త్యాగం, బిలామ్ శాపానికి బదులుగా ఆశీర్వాదం పలుకుతాడు. (1-10) 
బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించాలనుకున్నాడు, కానీ దేవుడు దానిని ఆశీర్వాదంగా మార్చాడు. బిలాము ఏడు బలిపీఠాలు కట్టాడు మరియు జంతువులను బలి ఇచ్చాడు, కానీ దేవునికి వేరే ప్రణాళిక ఉంది కాబట్టి అది పని చేయలేదు. ఎవరైనా చెడ్డ మాటలు చెప్పాలనుకున్నా, దేవుడు మంచి మాటలు చెప్పాలనుకున్నా. తనను సంతోషపెట్టాలని మరియు ఇతరులకు సహాయం చేయాలని కోరుకునే వారికి దేవుడు సహాయం చేస్తాడు. చాలా కాలం క్రితం బిలాము అనే వ్యక్తి చాలా చెడ్డవాడు. గతంలో దేవుడు గాడిదను ఎలా మాట్లాడాడో అలానే దేవుడు చెప్పాలనుకున్న దానికి విరుద్ధంగా చెప్పేలా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని బిలాము చెప్పాడు. మంచివాళ్లైనా చావు గురించి ఆలోచించడం మంచిదన్నారు. మంచి వ్యక్తులు జీవితంలోనూ, మరణానంతరం కూడా ఆశీర్వదించబడతారని అన్నారు. బతకడం కంటే చావడమే మేలని కొందరు అనుకుంటారు, ప్రత్యేకించి మంచి మనిషిలా చనిపోతే. అయితే వీరిలో కొందరు జీవించి ఉండగా మంచిగా ఉండేందుకు ప్రయత్నించరు. వారు స్వర్గంలో పరిశుద్ధులు కావాలని కోరుకుంటారు, కానీ భూమిపై కాదు. ఇది కేవలం కోరిక మాత్రమే, వారు పని చేసేది కాదు. కొందరు వ్యక్తులు తాము తర్వాత విషయాలను సరిదిద్దగలమని అనుకుంటారు, కానీ వారు మంచి వ్యక్తులుగా ఉండేందుకు ఇప్పుడు చేయవలసిన పనిని చేయడం లేదు. వారు దేవుని దృష్టిలో చెడుగా ఉండకుండా కాపాడే మార్గాన్ని అనుసరించాలి. 

బాలాకు నిరాశ, మరియు రెండవ త్యాగం, బిలాము మళ్లీ ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. (11-30)
బాలాకు బిలాముతో చాలా కలత చెందాడు. కానీ బిలాము చాలా మంచి వ్యక్తి కానప్పటికీ, దేవుడు చాలా శక్తిమంతుడని అతను ఇప్పటికీ అంగీకరించాడు. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ప్రయత్నించాడు, కానీ దేవుడు బిలాము వారిని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం మొదటిదాని కంటే కూడా మెరుగ్గా ఉంది. ప్రజలు కొన్నిసార్లు తమ మనసు మార్చుకుంటారు, కానీ దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేసినప్పటికీ, దేవుడు వారిని ప్రేమిస్తూ వారికి సహాయం చేయాలనుకున్నాడు. మనం దేవునిపై నమ్మకం ఉంచి, ఆయన సహాయాన్ని స్వీకరిస్తే, ఆయన ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. మనం రహస్యంగా చెడ్డపనులు చేయకుండా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తే, యేసు వల్ల దేవుడు మన తప్పులను క్షమిస్తాడనే నమ్మకం ఉంటుంది. దేవుడు మనల్ని ఎలా చూసుకుంటాడు మరియు మంచిగా మారడానికి మనకు ఎలా సహాయం చేస్తాడు అనేది ఆశ్చర్యంగా ఉంది. తాను ఇశ్రాయేలీయులను ఓడించగలనని బాలాకు అనుకోలేదు, బిలాము కూడా వారిని చూసి భయపడ్డాడు. బాలాకు కోరుకున్నట్లు బిలాము ఇశ్రాయేలు గురించి చెడుగా మాట్లాడలేకపోయినప్పటికీ, వారు మళ్లీ ప్రయత్నించాలని కోరుకున్నారు. కానీ దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు, కాబట్టి మనం ప్రార్థిస్తూ మరియు ఆయనపై నమ్మకం ఉంచాలి. Luk 18:1 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |