కీర్తనల గ్రంథము 82:4; యెషయా 58:6-7. అన్యాయాలూ హింసలూ జరుగుతున్న విషయం మాకేం తెలియదు అని ఎవరైనా తప్పించుకోజూస్తే దేవుడు ఒప్పుకోడు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారు, పేదలు, అవసరంలో ఉన్నవారు, అన్యాయంగా నేరాలను మోసేవారు, వీరందరి పట్ల కేవలం జాలిపడి ఊరుకుంటే కుదరదు. వారిపట్ల మనకున్న ఉద్దేశాలను బట్టి కాక, వారికి మనం చేసే పనులను బట్టీ, చెయ్యకుండా వదిలేసిన పనులను బట్టీ దేవుడు తీర్పు తీరుస్తాడు (మత్తయి 25:31-46; యాకోబు 4:17).