Genesis - ఆదికాండము 37 | View All

1. యాకోబు తన తండ్రి పరదేశ వాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

1. Iacob dwelt in the land wherin his father was long a straunger, euen in ye lande of Chanaan.

2. యాకోబు వంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండు వాడు.

2. These are ye generations of Iacob: when Ioseph was seuenteen yeres olde, he kept sheepe with his brethren, and the ladde was with ye sonnes of Bilha, and with the sonnes of Zilpha, his fathers wyues. And Ioseph brought vnto his father their euyll report.

3. మరియయోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను.

3. But Israel loued Ioseph more then all his chyldren, because he begate hym in his olde age: and he made hym a coate of many colours.

4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి.

4. And when his brethren saw that their father loued hym more then all his brethren, they hated hym, and coulde not speake peaceably vnto hym.

5. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి.

5. Moreouer, when Ioseph had dreamed a dreame, he tolde it his brethren, which hated hym yet the more.

6. అతడు వారినిచూచి - నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.

6. And he said vnto them: Heare I pray you this dreame which I haue dreamed.

7. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.

7. Beholde, we were byndyng sheaues in the fielde: and lo, my sheafe arose and stoode vpright, & beholde, your sheaues stoode rounde about, and made obeysaunce to my sheafe.

8. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపట్టిరి.

8. To whom his brethren sayde: Shalt thou be a kyng in deede on vs? or shalt thou in deede haue dominion ouer vs? And they hated hym yet the more, because of his dreames and of his wordes.

9. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగ పడెనని చెప్పెను.

9. And he dreamed yet another dreame, and tolde it his brethren, saying: behold I haue had one dreame more, and beholde, the sunne, and the moone, & 11 starres made obeysaunce to me.

10. అతడు తన తండ్రితోను తన సహోదరుల తోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను.

10. And when he had tolde it to his father and his brethren, his father rebuked hym, and sayde vnto him: What is this dreame that thou hast dreamed? Shall I and thy mother and thy brethren in deede come to bowe to thee?

11. అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
అపో. కార్యములు 7:9

11. And his brethren enuied hym: but his father noted the saying.

12. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.

12. His brethren also went to kepe his fathers cattell in Sichem.

13. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి - నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు - మంచిదని అతనితో చెప్పెను.

13. And Israel sayde vnto Ioseph: do not thy brethren kepe in Sichem? come, and I wyll sende thee to them.

14. అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.

14. He aunswered: here am I. And he sayde vnto hym: Go [I praye thee] see whether it be well with thy brethren and the cattell, and bryng me worde agayne. And so he sent hym out of the vale of Hebron, & he came to Sichem.

15. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి - నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.

15. And a certayne man founde hym, and beholde he was wandryng out of his waye in the fielde, and the man asked hym: what sekest thou?

16. అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.

16. He aunswered: I seke my brethren, tell me I praye thee where they kepe [cattell]

17. అందుకు ఆ మనుష్యుడు - ఇక్కడనుండి వారు సాగి వెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.

17. And the man sayde, They are departed hence: for I haue hearde them say, let vs go vnto Dothan. Thus went Ioseph after his brethren, and founde them in Dothan.

18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

18. And when they sawe hym a farre of, before he came at them, they toke councell agaynst hym for to slea hym.

19. వారు - ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;

19. For one sayde to another: behold, this notable dreamer commeth.

20. వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

20. Come nowe therefore and let vs slaye hym, and cast hym into some pit, and we wyll say, some naughtie beast hath deuoured hym: and we shall see what wyll come of his dreames.

21. రూబేను ఆ మాట వినిమనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.

21. When Ruben hearde that, he ryd hym out of their handes, and sayde: let vs not kyll hym.

22. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచిరక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.

22. And Ruben sayde moreouer vnto the: shed no blood [but] cast hym into this pit that is in the wyldernesse, and laye no hande vppon hym: [this he sayde] namely that he myght ryd hym out of their handes, and delyuer hym to his father agayne.

23. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,

23. And when Ioseph was come vnto his brethren, they strypt hym out of his coate, his partie coloured coate that was vpon hym.

24. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

24. And they toke hym, and cast hym into an emptie pit, wherein was no water.

25. వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.

25. And they sate them downe to eate bread: and as they lyft vp their eyes and loked about, and behold there came a company of Ismaelites from Gilead, and their camelles laden with spicerie, bawlme, and mirrhe, and were goyng downe ta cary it to Egypt.

26. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము?

26. And Iuda sayde vnto his brethren: What auayleth it yf we slay our brother, and kepe his blood secrete?

27. ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

27. Come on, and let vs sell hym to the Ismaelites, and let not our hande be vpon him: for he is our brother and our fleshe. And his brethren were content.

28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
అపో. కార్యములు 7:9

28. Then as the Madianites marchaunt men passed by, they drewe and lyft Ioseph out of the pit, and solde him vnto the Ismaelites for twentie peeces of syluer. And they brought Ioseph into Egypt.

29. రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని

29. Then Ruben came agayne vnto the pit, and beholde, Ioseph [was] not in the pit: then he rent his clothes,

30. తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి - చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా

30. And went agayne vnto his brethren, saying: the lad is not [yonder] wo is me, whyther shall I go?

31. వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి

31. And they toke Iosephes coate, and kylled a kyd, and dipped the coate in the blood.

32. ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి - ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

32. And they sent that partie coloured coate, and caused it to be brought vnto their father, and sayde: This haue we founde, see whether it be thy sonnes coate, or no.

33. అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.

33. And he knewe it, saying: It is my sonnes coate, a naughtie beast hath deuoured hym, Ioseph is without doubt rent in peeces.

34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా

34. And Iacob rent his clothes, & put sackcloth about his loynes, and mourned for his sonne a long season.

35. అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.

35. But all his sonnes & all his daughters rose vp to comfort hym: neuerthelesse he woulde not be comforted, but sayde, I wyll go downe into the graue vnto my sonne, mournyng: And thus his father wept for hym.

36. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి.

36. And the Madianites solde hym in Egypt vnto Putiphar, chiefe officer of Pharaos, and his chiefe stewarde.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 37 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జోసెఫ్ యాకోబు‌ను ప్రేమిస్తాడు, కానీ అతని సోదరులచే ద్వేషించబడ్డాడు. (1-4) 
జోసెఫ్ కథ మొదట వినయపూర్వకంగా మరియు తరువాత గొప్పగా చేసిన యేసు గురించి కథలా ఉంటుంది. పరలోకానికి వెళ్లడానికి క్రైస్తవులు ఎలా కష్టతరమైన సమయాలను గడపవలసి ఉంటుందో అది చూపిస్తుంది. ఈ కథ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ప్రజల మనస్సులు మంచి మరియు చెడు రెండింటిలోనూ ఎలా పని చేయగలదో మరియు దేవుడు ప్రతిదానిని ఒక కారణం కోసం ఎలా ఉపయోగించగలడో చూపిస్తుంది. జోసెఫ్ తన తండ్రికి ఇష్టమైనవాడు అయినప్పటికీ, అతను చెడిపోలేదు మరియు చేయవలసిన పనులను అప్పగించాడు. ఎందుకంటే మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టపడి పనిచేయడం, సోమరితనం లేకుండా చేయడం నేర్పుతారు. యాకోబు యోసేపుకు మంచి బట్టలు ఇవ్వడం ద్వారా తన ప్రేమను చూపించాడు, కానీ అతను కష్టపడి పనిచేయడం కూడా నేర్పించాడు. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ సమానంగా చూడాలి, సరైన కారణం లేకపోతే తప్ప. తల్లిదండ్రులు అభిమానం చూపితే కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయి. ఒక కథలో, వారి తండ్రి చూడనప్పుడు యాకోబు కుమారులు చెడుగా ప్రవర్తించారు, కానీ జోసెఫ్ దాని గురించి అతనికి చెప్పాడు, తద్వారా అతను వారిని ఆపగలిగాడు. జోసెఫ్ ఒక మంచి సోదరుడు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించలేదు. 

జోసెఫ్ కలలు. (5-11) 
దేవుడు కొన్నిసార్లు జోసెఫ్‌కు తన కష్ట సమయాల్లో మంచి అనుభూతిని పొందడంలో సహాయం చేయడానికి భవిష్యత్తులో అతను ముఖ్యమైనవాడని చూపించాడు. జోసెఫ్‌కి తాను ముఖ్యమైనవాడిని కావాలని కలలు కన్నాడు, కానీ అతను జైలుకు వెళతాడని కలలో కూడా అనుకోలేదు. కొన్నిసార్లు ప్రజలు తమ జీవితాన్ని ప్రారంభించినప్పుడు, వారు మంచి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారు మరియు చెడు జరుగుతుందని ఆశించరు. జోసెఫ్ సోదరులకు అతని కల అంటే ఏమిటో తెలుసు, కానీ వారు దానిని ఇష్టపడలేదు. అది జరగకుండా ఆపడానికి వారు చెడు పనులు చేసారు, కానీ వారు దానిని నిజం చేయడానికి సహాయం చేసారు. కొంతమంది యేసుకు బాధ్యత వహించాలని కోరుకోలేదు, కాబట్టి వారు అతనిని చంపడానికి ప్రయత్నించారు, కానీ చివరికి, అతని మరణం అతనికి మరింత ముఖ్యమైనదిగా మారడానికి సహాయపడింది.

యాకోబు జోసెఫ్‌ను అతని సోదరులను సందర్శించడానికి పంపాడు, వారు అతని మరణానికి కుట్ర పన్నారు. (12-22) 
జోసెఫ్ తన తండ్రిని బాగా వింటున్నాడు! తల్లిదండ్రులు ఇష్టపడే పిల్లలు ఎల్లప్పుడూ వారు చెప్పినట్లు చేయాలి. జోసెఫ్ సోదరులు అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు మరియు అతనిని బాధపెట్టాలని కోరుకున్నారు. నీ అన్నను ద్వేషించడం మంచిది కాదు ఎందుకంటే అది హంతకుడిలా ఉంటుంది. 1 యోహాను 3:15 ఈ కథ చాలా మంది కొడుకులు ఉన్న కుటుంబానికి సంబంధించినది. కుమారులలో ఒకరైన జోసెఫ్‌ను వారి తండ్రి ఇతరులకన్నా ఎక్కువగా ప్రేమించేవారు. ఇది ఇతర సోదరులకు చాలా అసూయ కలిగించింది. జోసెఫ్‌కు ప్రత్యేకమైన కలలు వచ్చినప్పుడు వారు మరింత కోపంగా ఉన్నారు. చివరికి, సోదరులు జోసెఫ్‌ను బాధపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, చాలా మందికి సహాయం చేయడానికి యోసేపు కోసం దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. జోసెఫ్‌తో చెడుగా ప్రవర్తించినప్పటికీ, అతను తన తండ్రికి ప్రియమైనవాడు మరియు ఇతరులకు సహాయం చేయడానికి వచ్చాడు కాబట్టి అతను యేసులా ఉన్నాడు. యేసు మనల్ని కనుగొని రక్షించడానికి పరలోకం నుండి భూమికి వచ్చాడు, కానీ కొంతమంది ఆయనను బాధపెట్టాలని కోరుకున్నారు. అతని స్వంత స్నేహితులు కూడా అతనికి వ్యతిరేకంగా మారారు మరియు చనిపోవడానికి అతన్ని శిలువపై ఉంచారు. అతను మమ్మల్ని రక్షించాలని మరియు విషయాలను మెరుగుపర్చాలని కోరుకున్నాడు కాబట్టి అతను ఇలా జరగడానికి అనుమతించాడు. 

జోసెఫ్ సోదరులు అతన్ని అమ్మేస్తారు. (23-10) 
కొంతమంది అంటే ప్రజలు జోసెఫ్‌ను ఒక లోతైన రంధ్రంలోకి విసిరి, ఆహారం లేదా వెచ్చదనం లేకుండా అతన్ని అక్కడే వదిలేశారు. వారు అతని బాధలను పట్టించుకోలేదు మరియు అతను కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయలేదు. కీర్తనల గ్రంథము 76:10 జోసెఫ్ సోదరులు కోపంగా ఉన్నప్పటికీ అతన్ని బాధించలేదు మరియు వారు అతనిని అమ్మినప్పుడు, అది దేవుని ప్రణాళికకు మంచిది.

యాకోబు మోసపోయాడు, జోసెఫ్ పోతీఫరుకు అమ్మబడ్డాడు. (31-36)
సాతాను ప్రజలకు చెడ్డ పనులు చేయమని బోధిస్తాడు మరియు అబద్ధం చెప్పడం వంటి మరిన్ని చెడ్డ పనులు చేయడం ద్వారా వాటిని దాచిపెట్టమని బోధిస్తాడు. కానీ ఇది చివరికి బాగా వర్కవుట్ కాదు. జోసెఫ్ సోదరులు చాలా చెడ్డ పని చేసారు మరియు దానిని వారి తండ్రి నుండి దాచడానికి ప్రయత్నించారు, కానీ చివరికి, వారి రహస్యం బయటపడింది. జోసెఫ్ చనిపోయాడని భావించడానికి వారు రక్తంతో కప్పబడిన తమ తండ్రి జోసెఫ్ కోటును పంపారు. దీంతో వాళ్ళ నాన్నకు చాలా బాధ కలిగింది, కానీ వాళ్ళు అతనికి నిజం చెప్పకుండా, ఓదార్చేలా నటించారు. వారు నిజం చెప్పడం ద్వారా విషయాలను మెరుగుపరచవచ్చు, కానీ వారు చేయలేదు. చెడు పనులు చేయడం మన హృదయాలను కఠినతరం చేస్తుంది మరియు చివరికి మరింత నొప్పికి దారితీస్తుంది.  తమ పిల్లలను చాలా సున్నితంగా పెంచకూడదని తల్లిదండ్రులకు తెలుసు, ఎందుకంటే వారు జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారో వారికి తెలియదు. కొన్నిసార్లు నీచంగా లేదా అత్యాశతో ఉన్న వ్యక్తులు వారు కోరుకున్నది పొందినట్లు కనిపిస్తారు, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అది చివరికి మంచి విషయాలు జరిగేలా చేస్తుంది. చెడు జరిగినప్పుడు కూడా దేవుడు వాటిని మంచి కోసం ఉపయోగించగలడు.



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |