Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.దానియేలు 2:28, దానియేలు 2:45
1. This book is the record of the events that Jesus Christ revealed. God gave him this revelation in order to show to his servants what must happen very soon. Christ made these things known to his servant John by sending his angel to him,
2. అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
2. and John has told all that he has seen. This is his report concerning the message from God and the truth revealed by Jesus Christ.
3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
3. Happy is the one who reads this book, and happy are those who listen to the words of this prophetic message and obey what is written in this book! For the time is near when all these things will happen.
4. యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,నిర్గమకాండము 3:14, యెషయా 41:4
4. From John to the seven churches in the province of Asia: Grace and peace be yours from God, who is, who was, and who is to come, and from the seven spirits in front of his throne,
5. నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.కీర్తనల గ్రంథము 89:27, కీర్తనల గ్రంథము 89:37, కీర్తనల గ్రంథము 130:8, యెషయా 40:2
5. and from Jesus Christ, the faithful witness, the first to be raised from death and who is also the ruler of the kings of the world. He loves us, and by his sacrificial death he has freed us from our sins
6. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.నిర్గమకాండము 19:6, యెషయా 61:6
6. and made us a kingdom of priests to serve his God and Father. To Jesus Christ be the glory and power forever and ever! Amen.
7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.యెషయా 19:1, దానియేలు 7:13, జెకర్యా 12:10, జెకర్యా 12:12
7. Look, he is coming on the clouds! Everyone will see him, including those who pierced him. All peoples on earth will mourn over him. So shall it be!
8. అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమోసు 4:13, నిర్గమకాండము 3:14, యెషయా 41:4
8. "I am the first and the last," says the Lord God Almighty, who is, who was, and who is to come.
9. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
9. I am John, your brother, and as a follower of Jesus I am your partner in patiently enduring the suffering that comes to those who belong to his Kingdom. I was put on the island of Patmos because I had proclaimed God's word and the truth that Jesus revealed.
10. ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
10. On the Lord's day the Spirit took control of me, and I heard a loud voice, that sounded like a trumpet, speaking behind me.
11. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.
11. It said, "Write down what you see, and send the book to the churches in these seven cities: Ephesus, Smyrna, Pergamum, Thyatira, Sardis, Philadelphia, and Laodicea."
12. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
12. I turned around to see who was talking to me, and I saw seven gold lampstands,
13. తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.కీర్తనల గ్రంథము 45:2, యెహెఙ్కేలు 1:26, యెహెఙ్కేలు 8:2, యెహెఙ్కేలు 9:2, యెహెఙ్కేలు 9:11, దానియేలు 10:5, దానియేలు 7:13
13. and among them there was what looked like a human being, wearing a robe that reached to his feet, and a gold band around his chest.
14. ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;దానియేలు 7:9, దానియేలు 10:6
14. His hair was white as wool, or as snow, and his eyes blazed like fire;
15. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.యెహెఙ్కేలు 1:24, యెహెఙ్కేలు 43:2
15. his feet shone like brass that has been refined and polished, and his voice sounded like a roaring waterfall.
16. ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.న్యాయాధిపతులు 5:31, యెషయా 49:2
16. He held seven stars in his right hand, and a sharp two-edged sword came out of his mouth. His face was as bright as the midday sun.
17. నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము; యెషయా 44:6, యెషయా 48:12, దానియేలు 10:19
17. When I saw him, I fell down at his feet like a dead man. He placed his right hand on me and said, "Don't be afraid! I am the first and the last.
18. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
18. I am the living one! I was dead, but now I am alive forever and ever. I have authority over death and the world of the dead.
19. కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, యెషయా 48:6, దానియేలు 2:29, దానియేలు 2:45
19. Write, then, the things you see, both the things that are now and the things that will happen afterward.
20. అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.
20. Here is the secret meaning of the seven stars that you see in my right hand, and of the seven gold lampstands: the seven stars are the angels of the seven churches, and the seven lampstands are the seven churches.